కలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 20

Posted on

“నాయనా , నాయనా ” అంటూ వాళ్ళ నాయన చెంపలు తడమ సాగింది. చావు చివరి అంచుల వరకు వెళ్లి వచ్చిన అతను తన కూతురు మాట వినగానే నీరసంగా కళ్ళు తెరిచి కూతురు వైపు చూసాడు. తన తండ్రి చూపుల లోని భావం అర్తం అయినట్లు తను నా వైపుకు తిరిగి
“నాయనను గూడెం లోకి తీసుకపోయ్యి ముసలయ్యకు చుపాల ” అంటూ వాళ్ళ నాన్నను ఎత్తడానికి ట్రై చేయ సాగింది. అలా మోసుకొని పోవడం కాని పని అనుకొంటూ ఆమెను అక్కడే కుచోమని పక్కన్నే పొదల్లో దూరి పొడవాటి రెండు కట్టెలు విరుచు కొని వచ్చి , అక్కడుగ్గా తెగలతో పాడే లాగా తయారు చేసి వాటి దాని మీద ఆకులున్న తీగలు పరిచి అతన్ని దాని మీద పడుకో బెట్టి ముందు వైపు కట్టెలను ఆమె భుజాల మీదకు ఎత్తి వెనుక వైపు నేను ఎత్తుకొని ఆమె ముందు వైపు వాళ్ళ దారి చూపుతుండగా వాళ్ళ గూడేనికి బయలు దేరాము.
అతన్ని కాపాడే హడావిడిలో ఆమెను అంతగా గమనించ లేదు, ఇప్పుడిప్పుడే వికసిస్తున్నట్లు ఉంది. శరీరం పసి ఛాయను వదిలి పరువానికి వస్తున్నట్లు ఉంది. కాయా కష్టం చేయడం శరీరం అటు నలుపు కాకుండా , ఇటు తెలుపు కాకుండా మధ్యస్థం గా ఉంది.

లంగా మీద పొడవు జాకెట్ వేసుకొని ఉంది, తను ముందు నడుస్తుంటే లయబద్దంగా కదిలే ఊరువులు , టౌన్ లో రాంప్ మీద నడిచే మోడల్ నడకకు ఏమాత్రం తిసిపోనట్లు ఉంది. బహు శా అడివి లో వాళ్ళకు సహజంగా అబ్బి ఉండవచ్చు.

వాళ్ళ నాయనా తనూ , కుంకుడు కాయలు కోసం అడివి కి వచ్చారు , గూడెం లో చాలా మంది పని అదే , అడివి లో దొరికే వాటిని సేకరించి ప్రతి ఆదివారం పక్క టౌన్ లో జరిగే వారాంతం సంతలో అమ్ముకొని ఇంటికి కావాల్సిన సరుకులు తెచ్చుకోవడం వాళ్ళ పని.

తన పేరు మంగి అని వాళ్ళ నాన్న పేరు వెంకటప్ప , వాళ్ళ అమ్మ మంగి చిన్నగా ఉన్నప్పుడే చనిపోయింది అంట. తనకు పెళ్లి చేయాలంటే 10 ఆవులు 20 గొర్రెలు ఇస్తే పెళ్లి చేసుకోవడానికి వాళ్ళ గూడెం లో అబ్బాయిలు రెడీగా ఉన్నారు అంట కానీ వాళ్ళ నాయన దగ్గర అన్ని లేవట అందుకే డబ్బులు కూడబెట్టి వచ్చే ఏడాదైనా తనకు పెళ్లి చేయాలని డబ్బులు కూడబెడుతున్నారు అంట.

వాళ్ళ గూడెం లో జరిగే అన్ని విషయాలు చెప్పసాగింది. దాదాపు రెండు గంటలు నడిచే సరికి వాళ్ళ గూడెం కనబడింది. ఓ 40 గడపలు ఉంటాయి, రాత్రిపూట జంతువులు రాకుండా గూడెం చుట్టూ కంపలతో గోడలాగా నిర్మించారు, రెండు వైపులా దారి పెట్టుకున్నారు మేము ఆ దారి గుండా లోన కు వెళ్లి వాళ్ళ నాన్నని డైరెక్ట్ గా మంగి చెపుతున్న ముసలయ్య అనే ఆ గూడెం డాక్టర్ దగ్గర కి తీసుకోని వెళ్లి అక్కడ నులక మంచం పైన పడుకోబెట్టాము.

తన ఇంటిముందు మనుషుల అలికిడి విని ఆ ముసలయ్య బయటకు వచ్చాడు 70, 75 వయస్సు ఉండే ఓ వ్యక్తీ ఎవరూ అంటు బయటకు వచ్చాడు. 6 అడుగుల పొడుగు, దృఢంగా అడివి తల్లి అనుంగ పుత్రుడు అనిపించే ట్లు చావదేరిన కలర్ తో, వడలి పోయిన కండలతో , తెల్లటి శిరోజాలు తల వెనుక ముడి పెట్టిన సన్నని పిలకతో , ఛాతీ వరకు పెరిగిన తెల్లటి గడ్డం తో చూస్తూనే గౌరవం ఉట్టిపడే ఆకారం తో అగుపించాడు.

వస్తూనే మంగి వాళ్ళ నాన్న నాడి పట్టుకొని చూసి , “ఏమైంది మంగి మీ నాన్నకు చుత్తాంటే , బాగానే కష్టపడ్డాడే” అంటు లోపలి వెళ్లి ఎదో అకురసం తెచ్చి వాళ్ళ మంచం పైన పడుకున్న మంగి వాళ్ళ నాన్న నోట్లో పోసి “ఇప్పుడు చెప్పు ఎం జరిగిందే ” అంటు నా వైపు చూసి “ఈయన ఎవరు , గూడెం లో ఎం పని ఈయనకు “అన్నాడు.

“ఆయనే , నాయన్ను కాపాడాడు , నల్ల గుండు పక్కన కాయలు ఏరుకోవడానికి నేను పోయాను, నాన్న ఆ పక్కనే చేట్టు మీద కాయలు దులప డానికి వెళ్ళినాడు, పెద్ద కొండచిలువ నాయన్ను చుట్టే సి తినేదానికి చూసింది , ఈయన ఆడికి దేని కో వచ్చి నాడంట, నాన్న మూలగడం చూసి ఒక్కేటుతో దాని తలకాయ నరికేసినాడు” అని గుక్క తిప్పుకోకుండా చెప్పింది

తన మాటలు విని ముసలయ్య వాళ్ళ నాన్న పొట్ట , పక్కల తడుముతూ , ఎముకలు ఏమైనా విరిగాయా అని చూసి , ” మీ నాయన ఆయుస్సు గట్టి ది, ఈయన బెగిన రాబట్టి , అది మీ నాయన ఎముకలు విరచలా , లేకుంటే బర్రేముక ఒక్కటి ఉండేది గాదు” అంటు మెల్లగా మంచం మీద ఉన్న అతని చెంపలు తట్టాడు.

మంగి వాళ్ళ నాన్న మెల్లగా కళ్ళు తెరిచి , ఎదురుగా ఉన్న ముసలయ్య ను చూసి “నేను బతికే ఉన్నా నా ఇంకా ” అన్నాడు

“ఆ , టయానికి ఇదిగో ఈయన రాబట్టి , కొండచిలువకు ఆహరం కాకుండా తప్పించు కొన్నావు , అయన , నీ కూతురు నిన్ను ఇక్కడికి మోసుకొని వచ్చి నారు” అని చెప్పాడు. ఆ మాట విని మంగి వాళ్ళ నాన్న పైకి లేవబోతుంటే ముసలయ్య అయన బుజం మీద చెయ్యి వేసి, “నువ్వు రేపటి వరకు లేవకూడదు, ఇక్కడే పడుకో” అంటు, నేను హెల్ప్ చేయగా మంచాన్ని ఇంట్లోకి తీసుకోని వెళ్ళాము. మంగి వైపు చూస్తూ

“మీ నాయన రేపటి వరకు ఇక్కడే ఉంటాడు” అని , నా వైపు తిరిగి “నీ సంగతి ఏంటి ” అని అడిగాడు.

నేను అడవిలోకి బొటానికల్ రీసెర్చ్ కోసం వచ్చాను , చూసుకోకుండా కొద్దిగా లోపలి వచ్చాను , దారి తప్పి పోయాను , వెనక్కు వెళ్ళడానికి దారి వెతుకుతుంటే ఈయన మూలుగు వినిపించింది. ఆ తరువాత మీరు విన్న దే”

“రాత్రికి మంగి వాళ్ళ ఇంట్లో నే పడుకో , రేపు పొద్దున్నే ఎవరి నైనా తోడూ ఇచ్చి పంపు తా రోడ్డు మీద కు” అంటు , ఆ అమ్మాయి వైపుకు తిరిగి తీసుకోని వేల్ల మన్నట్లు సైగ చేసారు.

తను ముందు నడవగా , తన వెంట ఒక గుడిసె లోకి వెళ్ళాము. లోపల స్థలం కొద్దిగా ఉన్నా పొందికగా సర్దుకొంది. కొద్ది సేపు ఉంటె అన్నం వండేత్తా ను తిందురు గానీ, అంటు కట్టెల పొయ్యి వెలిగించి వంట చేయడం మొదలు పెట్టింది.

బ్యాగులోని ట్రాకర్ బయటకు తీసి చుస్తే , అక్కడికి 10 కిమీ దూరంలో ట్రాకర్ లోని డాట్ ఆగింది అంటే వాళ్ళు అక్కడే ఆగి ఉన్నారు అన్న మాట, ఈ గూడెం లోంచి బయటికి వెళితే గానీ వాళ్ళు ఉన్న చోట కు చేరుకోలేము అనుకుంటూ తనని అడిగాను

“మీ గూడేనికి దగ్గర లో ఏమైనా కట్టడాలు ఉన్నాయా అటు వైపున ” అన్నాను ట్రాకర్ లోని డాట్ ఉన్న వైపు చెయ్యి చూపెడుతూ.

“అక్కడ ఎక్కడో దూరంగా సముద్రం పక్కన , ఇంగ్లీష్ దొరలూ కట్టిచ్చిన ఓ బంగళా ఉంది అంట మేము ఎప్పుడు చూళ్ళేదు , కానీ మా అయ్య చెప్తుంటే విన్నా” అంటు వంట పనిలో పడింది.

కొట్తోచ్చి నట్లు కనబడుతున్న తన అందాలను కన్నులతో ఆస్వాదిస్తూ , తన చెప్పిన బంగళా నే ఎక్స్ఛేంజి పాయింట్ ఉండవచ్చు అనుకుంటూ, అక్కడికి ఎలా వెళ్ళడం అని ఆలోచించసాగాను.

150043cookie-checkకలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 20

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *