కలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 20

Posted on

“దీపాలి మీ అమ్మాయా , ఇక్కడికి రాక ముందే నేను ఆఫీస్ లో చూచాను కదా , నిన్న ఇంటికి రాక పోవడం ఏంటి ?? “
“మా దీపాలి నీకు తెలుసా “
“నేను పని చేసే కంపెనీ లోనే దీపాలి కూడా పని చేస్తుంది”
“మీ దగ్గర పని చేసే ది దీపాలి , కానీ ఈ ఫొటోలో ఉన్నది రుపాలి “
“రుపాలి , ఏంటి ఈ ఫోటో అచ్చు గుద్ది నట్లు దీ పాలే అవుతుంటే ” అన్నాను.

“అవును బాబు అది దీపాలి లాగే ఉంది కానీ అంది రుపాలి , దిపాలి అక్క అనుకోండి” అన్నారు. అప్పుడు అర్థం అయ్యింది అంటే వీల్లు ఇద్దరూ కవల పిల్లలా .

“అవును బాబు , నెనూ నాభార్య తప్ప ఎవ్వరు కూడా వాళ్ళు ఎవ్వరో అని గుర్తు పట్ట లేనంత గా అచ్చు గుద్దినట్లు గా ఉండే ఇద్దరు అమ్మాయిలు దీపాలి , రూపాలి . చిన్నది ఎంత నేమ్మదో పెద్దది అంత రాలు గాయి , ఇద్దరు 5 నిమిషాల తేడాతో పుట్టారు, పెద్దది మేడిసన్ లో చేరింది , కానీ చిన్నది B.Tech చేసి మీ కంపనీ లో జాబ్ లో జాయిన్ అయ్యింది. ఇంట్లో ఎవ్వరికీ తెలియదు ఈ విషయం, తెలిస్తే అది ఎక్కడ బయటకు పోక్కుతుందో అని ఎవ్వరికీ చెప్పలేదు , ఇంకా నీరజా బేటి అం టావా , వాళ్ళు ఇద్దరు చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్ లో చదువుకున్నారు. తనతో ఎదో పని ఉంది అని రాత్రి మా ఇంటికి వచ్చింది. సరిగ్గా తనతో మాట్లాడేటప్పుడే వాళ్ళ నుంచి ఫోన్ వచ్చింది , అందుకే తను నీ పేరు చెప్పగానే ఇక్కడికి వచ్చాను, నా కూతురు ని ఎలాగైనా కాపాడు బాబు.”

“మనం పోలీస్ హెల్ప్ తీసుకొంటే మంచిదే మో “
“వాళ్ళకు తెలిసిన వాళ్ళు పోలీస్ లో కూడా ఉన్నారు అంట , మనం వాళ్ళ హెల్ప్ తీసుకొంటే వాళ్ళకు ఈజీ గా తెలుస్తుంది అని నిన్న ఫోన్ చేసినప్పుడు చెప్పారు ” అంది నీరజా.

“నిజంగా ఉంటా రం టావా ?” అన్నాను తన వైపు చూస్తూ.
“ఏమో ఒక వేల ఉంటే తన లైఫ్ రిస్క్ లో పెట్టి నట్లు అవుతుంది గా ” అంది నీరజా
“మొదట అమ్మాయిని సేఫ్ గా తీసుకోని రావాలి , అది మన మొదటి కర్తవ్యం , ఆ తరువాత ఏమైనా “
“వాళ్ళు అడిగిన డబ్బు రడి చేశాను , అంటు తన కుర్చీ పక్కనే ఉన్న ట్రావెల్స్ బ్యాగ్ చూపించాడు.”
“కొద్దిగా రిస్క్ తో కూడు కొన్న పనే , కానీ తప్పదు ఇందులో దీపాలి ని కూడా involve చెయ్యాలి మరి ” అంటు నా ప్లాన్ వాళ్ళకు చెప్పాను.

“నువ్వు పక్కనే ఉంటావు గా బాబు , అలాగయితే నా రెండో కూతురిని ఇక్కడికి రమ్మంటాను , తనకు ఇంతవరకు తెలియదు”
“నేను తన పక్కనే ఉంటాను మీరు భయపడాల్సిన అవసరం లేదు “
“అయితే తనను ఇక్కడికి రమ్మంటాను ” అంటు తన కూతురికి ఫోన్ చేసి మేము ఉన్న చోటుకు రమ్మన్నాడు.

ఈ ఆపరేషన్ successful గా కంప్లీట్ చేయడానికి కావలసిన కొన్ని ఎలెక్ట్రానిక్ ఐటెమ్స్ కోసం తెలిసిన ఫ్రెండ్ కు ఫోన్ చేసి , కావలిసినవి చెప్పి మేము ఉన్న చోటుకు డెలివరి చేయమన్నాను. అలాగే మల్లికార్జునుకు ఫోన్ చేసి వీలు ఐతే మేము ఉన్న హోటల్ పేరు చెప్పి అక్కడ కలవమన్నాను . తన ఇప్పుడే డ్యూటీ దిగి ఇంటికి వెళుతున్నా డు అంట వస్తాను అని చెప్పాడు.
మేము ఇంకో సారి కాపీ తాగిన కొద్దిసేపటి దీపాలి వచ్చింది, నన్ను చూసి
“మీరు ఏంటి సార్ ఇక్కడ ” అంటు “ఏంటి పప్పా ఇక్కడికి రమ్మన్నారు ” అంది
“దా కుచో , ఎమ్మన్నా తాగుతావా “
“నాకు ఎం వద్దు కానీ, ఇంతకూ ఎందుకు రమ్మన్నావు ” అంది మరో మారు. రుపాలి నిన్నటి నుంచి ఎందుకు ఇంటికి రాలేదో చెప్పాడు. ఆ విషయం చెప్పగానే
“వాళ్ళు అడిగిన డబ్బులు ఇచ్చేసి రూపాలి ని వదిలి పెట్టమను” అంటు కళ్ల నిండా నీటితో మొహం పక్కకు తిప్పుకుంది

డబ్బులు ఇవ్వడానికి రెడీ గానే ఉన్నాము, అందుకే కాష్ తో వచ్చాను అంటు తన తెచ్చిన కాష్ బ్యాగ్ చూపించాడు.
“మరి ఇక ఆలస్యం ఎందుకు “
“వాళ్ళు కాల్ చేసి ఎక్కడ డబ్బులు ఇవ్వాలో చెప్తారంటే , అంత వరకు మనం చేసే ది ఎం లేదు”.
“మరి నన్ను ఎందుకు రమ్మన్నారు ” అంది.
“ఇది డబ్బుల సమస్య కాదు , ఒకవేళ డబ్బులు తీసుకోని రు పాలిని వదలక పొతే, అందుకే శివ సహాయం తీసుకుందాము అని నీరజ చెపితే ఇక్కడికి వచ్చాము , శివా దగ్గర ఓ ప్లాన్ ఉంది కానీ కొద్దిగా రిస్క్ తో కూడు కొన్నది , ఆ ప్లాన్ లో నువ్వు కూడా ఉన్నావు అందుకే నిన్ను ఇక్కడికి రమ్మన్నాము” అంటు నేను వాళ్ళకు చెప్పిన ప్లాన్ తనకు డీటైల్డ్ గా చెప్పాడు.

“నేను ok పప్పా” అంటు తన సంసిద్ధతను తెలియ చేసింది.

ఇంతలో మా ఫ్రెండ్ నేను చెప్పిన సామాను ఓ ప్యాకెట్ లో పెట్టుకొని వచ్చి ఇస్తూ , “నా అవసరం ఏమైనా ఉందా చెప్పు” అని అడిగాడు. “అవసరం అయితే కాల్ చేస్తా అప్పుడు వస్తువులే అంటు వాడిని చంపించేసాను. “

నా ఫ్రెండ్ వెళ్ళిన ఓ నిమిషానికి మల్లికార్జున వచ్చాడు అక్కడున్న మా అందర్నీ చూసి “ఏంటి శివా అమ్మాయి గారు ఇక్కడ ఉన్నారు , మల్లీ ఏదైనా గొడవ లో ఇరుక్కుందా ఏంటి ” అంటు నీరజ వైపు చుసాడు.

“అలాంటిదే , కానీ నీరజ విషయం కాదు ఇదిగో వీళ్ళ అమ్మాయి విషయం ” అంటు జరిగింది అంతా తనకు చెప్పాను.

“ఎప్పుడు, ఎక్కడ జరిగింది” అంటు ఆశ్చర్యంగా అడిగాడు. దీపాలి వాళ్ళ నాన్న టైం , ప్లేస్ చెప్పగానే “అంటే అక్కడ జరిగింది ఒక్క అమ్మాయి కిడ్నాప్ కాదన్న మాట , మీ అమ్మాయిని కూడా కిడ్నాప్ చేపారా అన్నారు ” తనలో తను మాట్లాడు కొంటున్నట్లు.

“ఇంకో అమ్మాయి ఎవరు సారూ , వీల్ల అమ్మాయి ఒక్కటే కదా కిడ్నాప్ అయ్యింది”

నా వైపు చూస్తూ , “శివా , అక్కడ అదే టైం లో వీల్ల అమ్మాయితో పాటు మన స్టేట్ మినిస్టర్ కూతురు కూడా ఉంది , కానీ కిడ్నాప్ చేసిన వాళ్ళకు ఆ అమ్మాయి మినిస్టర్ కూతురు అని తెలియదు, మా ఆఫీస్ లో పెద్ద తల కాయలు ఈ కేసు ను serious గా తీసుకోని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు”

“అంటే, కేవలం డబ్బుల కోసమే వీళ్ళ ను కిడ్నాప్ చేస్తున్నారా , లేక వేరే మోటివ్ ఏమైనా ఉందా ఇందులో “
“ఏమో శివా , ప్రస్తుతానికి చూస్తుంటే కిడ్నాప్ మాత్రమే అని తెలుస్తుంది”

“రుపాలి , దీపాలి ఇద్దరు అచ్చు గుద్ది నట్లు ఉండే ఇద్దరు కవల పిల్లలు , దీపాలి ని ఉపయోగించి వాళ్లను ట్రేస్ చేద్దాం అనుకుంటున్నాను” అంటు నా ప్లాన్ చెప్పి తను హెల్ప్ ఉంటే బాగుంటుంది అన్నాను.

“నేను డైరెక్ట్ గా involve కాలేను కానీ బ్యాక్ గ్రౌండ్ లో ఏదైనా హెల్ప్ కావాలంటే చేస్తా” అంటు కొన్ని జాగ్రత్తలు చెప్పి వెళ్ళాడు.

ఎయిర్ టెల్ లో పని చేస్తున్న ఓ ఫ్రెండ్ కు కాల్ చేసి , దీపాలి వాళ్ళ నాన్న నెంబర్ ఇచ్చి దాన్ని నుంచి వచ్చే కాల్స్ ఎ లొకేషన్ నుంచి వస్తున్నాయే ట్రేస్ చేయమని చెప్పాను.

మేము చేయాల్సింది అల్లా , తనకు వచ్చే కాల్ కోసం ఎదురు చూడడమే.

150042cookie-checkకలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 20

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *