కలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 20

Posted on

మేము మెల్లగా ఆ కిటికీ వదిలి ఇంకో కిటికీ దగ్గరకు వెళ్లి అక్కడ నుంచి వచ్చే శబ్దాలు విన సాగాము.
ఓ వ్యక్తీ బూట్ల శబ్దం వినిపించింది ఆ తరువాత మాటలు వినిపించాయి
“చూడండి , ఇంకో రెండు మూడు గంటల్లో మా బాసు వస్తాడు , ఆ తరువాత అందరిని ఇక్కడ నుంచి పంపిచ్చేస్తారు , మా బాస్ వచ్చేంత వరకు ఎటువంటి గొడవా చేయకండి , ఒకవేళ ఎవరైనా గొడవ చేస్తే ఆ తరువాత వాళ్ళను పక్క రూమ్ లోకి తిసుకొల్లి అక్కడ ఉంచు తాము అక్కడ ఎం జరుగుతుంది అనేది నన్ను అడక్కండి ” అంటూ అక్కడ నుంచి వెళ్లి నట్లు అనిపించింది ఆ తరువాత ఆ రూమ్ తలుపు వేసి గొళ్ళెం పెట్టిన సౌండ్ వినిపించింది.

కొన్ని నిమిషాలు ఆగి ఆ తరువాత ఆ కిటికీ కి ఉన్న ఉచలు పికడానికి ట్రై చేసాను , నేను చేసేది చూసి మంగి కూడా నాతొ పాటు ఓ పట్టు పట్టింది. మా ఇద్దరి శక్తికి, ఎప్పుడో 50 , 60 years బ్యాక్ కట్టింది కావున , వెంటనే ఆ ఉచలు మా చేతుల్లోకి వచ్చేశాయి , రెండు ఉచలు పీకే కొద్దీ మనిషి దూరే సందు ఏర్పడింది. కానీ తలుపులు లోపల నుంచి బిగించ బడ్డవి.

లోపల నుంచి ఎవరైనా తీస్తే గానీ లోపలి వెల్ల దానికి వీలు కాదు. దీపాలి ఫోన్ కు మెసేజ్ పెట్టాను, నేను కిటికీ పక్కనే ఉన్నాను , కిటికీ తలుపులు తీయమని , తన ఫోన్ సైలెంట్ మోడ్ లో పెట్టుకోమని చెప్పాను మరి చూస్తుందో లేదో అని డౌట్.

ఓ నిమిషం తరువాత కిటికీ దగ్గర సౌండ్ వచ్చింది. ఆ తరువాత కిటికీ రెక్కలు లోపలి వైపు తెరుచుకొన్నాయి. మొదట నేను లోపలి వెళ్లి ఆ తరువాత మంగి ని లోపలి లాక్కోన్నాను. అక్కడున్న అమ్మాయిల్లో సగం మందికి మెలుకవ వచ్చింది కానీ మగతగా ఉన్నారు. అక్కడ ఎం జరుగుతుందో వాళ్ళకు తెలియడం లేదు. వాళ్ళల్లో ఒక అమ్మాయి దిపాలి దగ్గరికి వచ్చి , “తను ఎవరు , ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని అడిగింది “
దీపాలి వెంటనే ఆ అమ్మాయి నోటి మీద చేయి వేసి మాట్లాడవద్దని సైగ చేసింది.

“నాకు తెలిసి మీతో పాటు వచ్చింది ఇద్దరు, బండిలో మిమ్మల్ని తెచ్చినప్పుడు ఎంతమంది వచ్చారో ఏమైనా గుర్తుకు ఉన్నదా నీకు ” అని అడిగాను దీపాలి వైపు చూస్తూ

“ఇద్దరు కాదు , ముగ్గురు ఉన్నారు ఇద్దరి చేతుల్లో పెద్ద గన్స్ ఉన్నాయి , మూడో వాని చేతిలో చిన్న పిస్టల్ లాంటిది చూసాను ” అంది.

వాళ్ళు మాట్లాడు కొన్నది తనకు చెప్పను. ఇంకా మూడు గంటల్లో వీళ్ళ తలకాయ ఎవరో ఇక్కడికి వచ్చి అందరిని ఎవరికో అమ్మేస్తారంట , ఈ లోపున మనం ఇక్కడ ఉన్న వాళ్ళను మన అధినం లోకి తెచ్చుకొని వచ్చే వాళ్ళ కోసం ఎదురు చూద్దాం. ఈ లోపున నేను పోలీస్ ఫోర్సు వచ్చే ఏర్పాట్లు కూడా చూస్తా అంటూ. వాళ్ళను లోపలి పిలిచే ప్లాన్ చెప్పాను.

మేము గూడెం నుంచి బయలు దేరినప్పుడు దారిలో నడవడానికి వీలుగా మంచి చేవదేలిన బడిత లాంటి కట్టే చేరోకటి తెచ్చుకోన్నాము , మంగి డోరు కు కొద్దిగా చాటుగా ఉండమని చెప్పి ఆ కట్టెతో నేను వాకిలి దగ్గర రడీగా ఉన్నాను. మొదటి వేటుకే వాళ్ళను మడత పెట్టాలి లేకుంటే వాళ్ళ చేతిలో గన్స్ ఉన్నాయి అవి ఒక్కటి పేలినా మిగిలిన వాళ్ళు alert అవుతారు అనుకొంటూ. ఆ రూమ్ అంతా వెతుకలాడి ములన కొన్ని పాత గుడ్డలు ఉంటే తన దగ్గర పట్టుకొంది మంగి కింద పడ్డవాడికి మాట్లాడకుండా నోట్లో గుడ్డలు కుక్కడానికి.

నేను ముందే చెప్పినట్లు దీపాలి గట్టిగా కేకలేసి పడుకోండి పోయింది. తను కేకలేసిన ఓ ఐదు నిమిషాలకు తలుపు తీసి ఓ గడ్డపోడు లోపలి వచ్చాడు చంకన గన్నేసుకొని. వాడు లోపలి వచ్చి తలపు వేయగానే వాడి నెత్తి మీద బడితే పూజ చేసాను వాడు కింద పడీ పడగానే వాడి నోట్లో గుడ్డలు కుక్కి పక్కకు ఈడ్చేశారు. వాన్ని ఓ మూలకు పీకేసి ఇంతకూ మునుపు అరిచిన దానికంటే రెండు రెట్లు కేకలేసింది దీపాలి. రెండో వాడు వెంటనే వచ్చాడు వాడు కూడా ముందు పడుకొన్న వాడికి జతగా పక్కన చేరాడు.

మూడో వాడు ఎంతసేపటికి లోపలికి రాలేదు. వాడు రాక ముందే వాళ్ళ బాసు వస్తే గొడవ అయిపోతుంది అనుకొంటూ వాడి కోసం ఎదురుచూడ సాగాము. ఇందాక మేము లోపలికి వచ్చినప్పుడు మాతో మాట్లాడడానికి ట్రై చేసిన అమ్మాయి పడుకొన్నది లేచి ” ఇంకోడు రాలేదే వాడి చేతిలో కూడా గన్ ఉంది , వాడు వచ్చి మనల్ని కాల్చేస్తాడు” అంటూ భయం భయం గా కొద్దిగా పైకి లేచి మావైపు చూడ సాగింది.

“ఎవ్వరు ఆ అమ్మాయి , ఇందాక వచ్చిన దగ్గరనుంచి చాలా హైపర్ గా ఉంది” అంటూ దీపాలిని అడిగాను తన చెవిలో

“ఈ పిల్ల పేరు సాహితీ అంట ఇంటర్ చదివింది , EMCET కు ప్రిపేర్ అవడానికి కాలేజికి వెళ్లి వస్తుంటే, ఎత్తుకోచ్చారంట వాళ్ళ నాయన జిల్లా చైర్మన్ కూతురు అంట, ఈ పిల్లకు ఇచ్చిన ఇంజక్షన్ ఎందుకో అంతగా పని చేయలేదు, ఎద్దుల బండ్లో ఎక్కన దగ్గిరి నుంచి నా చెవిలో అదే పనిగా వాగుతుంది , వాళ్ళ నాన్న పెద్ద తోపు , తురుము అంటూ ఎదో పెద్ద బిల్డప్ ఇస్తుంది , కానీ పాపం తనకే చాన్స్ దొరక లేదు.” అంటూ నా చెవిలో సన్నగా గొనిగింది.

“దాన్ని కొంత సేపు అన్నీ మూసుకొని కూచోమని చెప్పు, ఇక్కడ నుంచి వెళ్ళిన తరువాత , వాళ్ళ నాయన ఎంత తోపో , ఎంత తురుమో అప్పుడు చుపిచ్చమను” అన్నాను. దీపాలి వెళ్లి దాన్ని సముదాయించి వచ్చింది.

ఈ లోపుల వాళ్ళ దగ్గరున్న్ ఫోన్ లు రెండు స్వాధీనం చేసుకొన్నాము.

ఓ పది నిమిషాలు వెయిటే చేసిన తరువాత తనతో ఉండాల్సిన వాళ్ళు కనబడలేదని , “ఇంత సేపు ఎం చేస్తున్నార్రా” అనుకొంటూ లోనకు వచ్చాడు చేతిలోని పిస్టల్ ను పోసిషన్ లో పట్టుకొంటు. వాడిని వెనుక నుంచి బడిత పూజ చేద్దామని వాడి తలమీద వేటు వేసేకొద్దీ సరిగ్గా అప్పుడే వాడు వెనక్కు తిరిగాడు , వాడి తలమీద పడాల్సిన బడితే వాడి బుజం మీద పడింది. ఆ దెబ్బకు వాడు “చచ్చాను బాబోయ్ ” అంటూ గన్ నా వైపు గురిపెట్టాడు. నెత్తిమీద పడాల్సిన బడితే భుజం మీద పడగానే , వెంటనే రియాక్ట్ అవుతూ అదే బడితేను వాడి చేతి మీద వేసాను. వాడి చేతిలోని పిస్టల్ ఎగిరి పోయింది. బడితే వాడి మీద ప్రయోగిస్తూనే కాలితో వాడి పిక్కల మీద సైడ్ కిక్క్ ప్రయేగించాను. ఆ దెబ్బకు వాడి జాయింట్లు ఊడిపోయినట్లు అక్కడే కూలబడి పోయాడు. మిగిలిన ఇద్దరు ఎటువంటి బాధ లేకుండా తెలివి తప్పి పోయారు , కానీ వీడికి మాత్రం కొన్ని జాయింట్లు ఉదితే గానీ దారిలోకి రాలేదు.

వాడి దగ్గర ఉన్న సెల్ ఫోన్ కూడా తెసేసుకొని వాడిని కూడా వాళ్ళ స్నేహితుల జతకు చేర్పించాము.

వాళ్ళ బాస్ కోసం వెయిట్ చేయడం ఒక్కటే మిగిలింది. వాడి రాకకు తగిన సత్కారం చేయడానికి తగిన ఏర్పాట్లు చేయడానికి అన్నట్లు నీరజ వాల్ల నాన్నకు , మల్లికార్జునకు ఫోన్ చేసి అంతా వివరించాను. వాళ్ళు కు నీరజముందే చెప్పడం వలన నా ఫోన్ కోసం అన్నీ రెడీ చేసుకొని ఎదురు చూస్తున్నారు. నా ఫోన్ లో GPS లొకేషన్ వాళ్లకు పంపిచ్చి కొద్ది దూరంలో నా కాల్ కోసం వెయిట్ చేయమని చెప్పాను.

మేము ఎంతో సేపు వెయిట్ చేయకుండా నే మాకు మోటారు సౌండ్ వినబడ్డది , అది మేము వెయిట్ చేసే వారిదా , లేక వెయిట్ చేసే వారికోసం వచ్చే వాళ్లదా అని తెలుసు కోవడం కోసం బయటకు వచ్చా.

దూరంగా తీరం వైపు వస్తున్న బోటు కనిపించింది. అయితే కావలసిన వల్లే వస్తున్నారు అనుకొంటూ వాళ్ళ కోసం ఎదురు చూడసాగాను. బోటు సౌండ్ కాకుండా ఇంకేదో సౌండ్ వినబడ సాగింది , బిల్డింగ్ వెనక్కు వెళ్లి చుస్తే కొద్ది దూరం లో చెట్లకు వెనక కిందకు దిగుతున్న హెలికాప్టర్ కనిపించింది. నీరజ వాళ్ళ నాన్న పలుకుబడి బాగా పనిచేసినట్లుఉంది అందుకే వెంటనే force వచ్చేసింది అనుకొంటూ , వాళ్ళు నా కాల్ కోసం వెయిట్ చేస్తుంటారు అనుకొంటూ బిల్డింగ్ ముందు వైపుకు వచ్చాను బోటు లో వచ్చే వాళ్ళకు welcome చెప్పడానికి.

నేను ముందు వైపుకు వెళ్ళగానే , వాళ్ళ దగ్గర తీసుకొన్న ఫోన్ లలో ఒకటి మోగింది, ఆన్సర్ చేయగానే అటువైపు నుంచి

“హలో జేమ్స్ , అంతా రెడినా , వాళ్ళను బయటకు తీసుకోని రా , నాకు టైం ఎక్కువ లేదు అంటూ ఫోన్ పెట్టేసాడు”

లోపలికి వెళ్లి మెలుకవ ఉన్న వాళ్ళను తీసుకోని బిల్డింగ్ ముందుకు వచ్చి బోటు లో వచ్చే వాళ్ళకోసం వెయిట్ చెస్తుండగా, సాహితీ వచ్చి నా చేతిని గట్టిగా పట్టుకొని

“నన్ను ఇక్కడే వదిలి పెట్టి పోకు , నన్ను ఇంటికి సరిగ్గా చేర్చండి , మా నాన్నకు చెప్పి నీకు బోలెడు డబ్బులు ఇప్పిస్తా ” అంటూ నా కేసి అతుక్కొని పోయింది.

“నీకేం భయం లేదు , నేను నిన్ను మీ ఇంటికి చేరుస్తాలే ” అంటుండగా

మా ఎదురుగ్గా బోటు వచ్చి సముద్రం లో కొద్ది దూరంలో ఆగింది , అందులోంచి ఓ చిన్న బోటు బయటకు వచ్చి అందులోంచి ఇద్దరు వ్యక్తులు వడ్డుకు వచ్చారు. రెండు నిమిషాలలో వాళ్ళు మా ఎదురుగా ఉన్నారు. వాళ్ళల్లో ఒకన్ని చూసి షాక్ అయ్యాను.

150042cookie-checkకలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 20

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *