కలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 30

Posted on

నేను బ్యాగ్ లు పెట్టిన బండ వైపు రెగ్యులర్ గా మనుషులు వెళుతున్నట్లు బాట లాంటిది ఇంతకూ ముందే ఉన్నట్లు ఉంది అందుకే నాకు ఆ కాలువ వడ్డు ఎక్కగానే నా కళ్ళు ఆ దారి వెంట వెళ్లి ఆ బండ మీదకు వెల్ల గలిగాను

“నా ఆలోచనలను భంగం చేస్తూ , నువ్వు కూడా పర్లేదులే, ఎండకు వాళ్ళంతా చికాకుగా ఉంటుంది” అంది శ్రీ

రెండో ఆలోచన లేకుండా నేను కుడా నీళ్ళలోకి దిగాను , అంత వరకు నీళ్ళతో ఆడుకొంటున్న వర్షా , నేను నీళ్ళలో దిగగానే నా మీద నీళ్ళు చల్లడం మొదలు పెట్టింది. తన చల్లు తున్న నీళ్ళు నా మీద పడకుండా , నిటి లోపలి చేరుకొని తన వెనుక వైపున లేచాను.

అప్పటికే సూర్యుడు కొండల్లోకి వెళ్ళడం వలన కొద్దిగా చీకటి ఆవరించుకోంది. దానికి తోడూ తన నీళ్ళు తో ఆడడం వలన నేను లోపల ఎటూ వేలుతున్నానో కనుక్కోవడం కొద్దిగా ఇబ్బందిగా ఉంది , నేను లేస్తే నా మీద నీళ్ళు చల్లడానికి రెడీ గా ముందు వైపు చూస్తుంది , కానీ నేను తన వెనుక చేరడం తను గమనించ లేదు.

తన పక్కనే ఉన్న శ్రీ కూడా కొద్దిగా ఆశ్చర్యంగా చూడ సాగింది , అంతసేపు నేను నీళ్ళలో ఎలా ఉండ గలిగానా అని. కొద్దిసేపటికి శ్రీ ఎందుకో వర్షా వైపు చూసి వెనుక ఉన్న నన్ను గమనించి నవ్వ సాగింది. అటూ ఇటూ చుసిన వర్షా, శ్రీ నవ్వడం చూసి నా వెనక్కు తిరిగింది. ఈ లోపల నేను మరో మారు నీళ్ళల్లోకి మునిగాను.
అలాగే కొద్దిగా లోపలి వెళ్లి తన కాళ్లు పట్టుకొని నీళ్ళల్లోకి లాగాను. అక్కడ నిలబడ లేక కిందకు పడిపోయింది.
నేను అక్కడే ఉండడం వలన సరిగ్గా నా మీద పడ్డది. టి షర్టు లోంచి పొడుచు కొచ్చిన తన రొమ్ములు నా ఛాతి కి గుచ్చు తుండగా.
“నువ్వు కాలు పట్టి లాగ కూడదు” అంటూ లేచి నిలబడింది.
తన పక్కనే పైకి లేచి వడ్డుకు వచ్చాను.
మరో పది నిమిషాలు ఇద్దరూ నీళ్ళల్లో ఆడి బయటకు వచ్చారు.
తెచ్చుకున్న టవల్స్ తో తుడుచుకొని బ్యాగ్ లు ఉన్న చోటుకు వచ్చాము.
నేను పైకి వెళ్లి బ్యాగ్ లు తీసుకొని కిందకు రాగా ఇద్దరు వాళ్ళ బ్యాగ్ లు తీసుకొని పక్కనే ఉన్న ఇంకో బండ చాటుకు వెళ్లి డ్రెస్ మార్చు కొని వాళ్ళు విప్పిన డ్రెస్ లు అక్కడే బండ మీద ఆ రేసి వచ్చారు.

“ఆకలిగా ఉంది” అంటూ బ్యాగ్ లో ఉన్న రొట్టెలు ఓపెన్ చేసి తలా రెండు తిని నీళ్ళు తాగి బ్యాగ్ లను బండ మీదకు పెట్టి , ఒక్కరొక్కరే బండ మీదకు ఎక్కాము.
స్లీపింగ్ బ్యాగ్స్ తెచ్చుకోవడం వలన పడుకోవడానికి ఇబ్బంది లేకుండా ఎవరి బ్యాగ్స్ లో వాళ్ళు దురిపోయాము. బండకు చివరి వైపున నేను , నా తరువాత వర్షా , తన పక్కన శ్రీ పడుకున్నాము.

ఇంకో 5 రోజుల్లో పౌర్ణమి అనుకుంటా , పడుకున్న కొద్ది సేపటికి ఆకాశంలో చంద్రుడు తన చల్లని కిరణాలతో అరణ్యాన్ని చల్ల బరుస్తున్నాడు.
అలవాటు లేని ప్రాణులు , రోజంతా నడిచి అలిసి పోయి బ్యాగ్ లో దూరిన వెంటనే నిద్ర లోకి జారుకున్నారు.
అడివిలొంచి వచ్చే చల్లని గాలికి శరీరం సేద తీరుతుండగా , బండ పక్కనుంచి వచ్చే వాసన ఏమై ఉంటుందా అని బుర్ర ఆలోచిస్తుండగా నిద్ర లోకి జారుకున్నాను.
తీక్షణమైన సూర్య కిరణాలు శరీరాన్ని తాకుతుండగా మెలకువ వచ్చింది , దానికి తోడూ ఎదో సవ్వడి చెవులకు చేరుతుంటే, అడవిలో ఈ సందడి ఎక్కడ నుంచి అనుకొంటూ టక్కున లేచి కుచోన్నాను స్లీపింగ్ బ్యాగ్ తో సహా.

నా కర్నబెరిని చేరిన సవ్వడి ఎక్కడినుంచి వస్తుందా అని బండ కింద వైపు చూసాను.
ఎ సౌండ్ కైతే నిద్ర లేచాను అదో సౌండ్ నా పక్కన పవళించిన ఇద్దరు సుందరాంగులను కుడా నిద్ర లేపినట్లు ఉంది , నేను లేచిన ఓ ౩౦ సెకండ్స్ కు నాతొ పాటు లేచి నేను చుసిన వైపే చూసి భయం తో కూడిన ఆశ్చర్యం తో నోరెళ్ళ బెట్టా రు.

దాదాపు ఓ ౩౦ మంది దాకా కోయవాళ్లు తమ బల్లెంతో బండ కింద నిలబడి ఎదో గుస గుస లాడ సాగారు. మేము లేచి కూచోవడం చూసి వాళ్ళల్లో పెద్దగా ఉన్న వ్యక్తీ చేతి కర్రతో మమ్మల్ని కిందకు దిగ మని సైగ చేసాడు.

“శివా , వీళ్ళు ఎవరు , ఇక్కడెం చేస్తున్నారు , మనలని ఎం చేయరు కదా ఇప్పుడు ” అంది వర్సా
“వీళ్ళ గూడెం ఇక్కడే ఎక్కడో కొద్ది దూరం లో ఉన్నట్లు ఉంది , వాళ్లకు అపకారం చేయనంత వరకు మనల్ని ఏమీ అనరు , కిందకు దిగండి చూద్దాం” అంటూ స్లీపింగ్ బ్యాగ్ లోంచి బయటకు వచ్చి దాన్ని ఫోల్డ్ చేసి నా బ్యాగ్ లో పెట్టాను.

వర్షా , శ్రీ ఇద్దరు కూడా వాల్లు పడుకున్న బ్యాగ్ లు సర్దే సి నాతొ పాటు కిందకు దిగారు.

మేము కిందకు దిగీ దిగగానే వాళ్ళల్లో దృఢంగా ఉన్న ఓ నలుగురు వచ్చి నా చేతులు వెనక్కు విరిచి కట్టారు. అడ పిల్లల్ని ఇద్దరినీ జతగా వాళ్ళ చేతులు కట్టేశారు.

వాళ్ళు మాట్లేడేది గోండుల భాష కొద్దిగా అర్థం అవుతుంది , దానికి తోడూ కొద్దిగా సైగల చేయడం వలన కమ్యూనికేషన్ కి ప్రాబ్లమే లేకుండా పోయింది , కానీ సౌలభ్యం కోసం ఇక్కడ యధా విధిగా మాట్లాడినట్లు రాస్తున్నాను
“ఎందుకు కట్టేశారు అని అడుగుతూ చేతులతో సైగ చేసాను“
వాళ్ళల్లో పెద్దగా ఉన్న వ్యక్తీ నా ముందుకు వచ్చి
“మీరు చేసిన తప్పుకు ఇక్కడే నరికేయాలని , కానీ వచ్చే రెండు రోజుల్లో పున్నం వస్తుంది , అంత వరకు మిమ్మల్ని మా గూడెం లో కట్టేస్తాం” అంటూ చంద్రుడి వైపు చంపించాడు
“ఇంతకీ మేము చేసిన తప్పేంటి “
“ఈ బండ ఏంటో తెలుసా” అంటూ బండ వైపు చుపించాడు
“తెలియదు ” అన్నట్లు తల ఊపాను.

151972cookie-checkకలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 30

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *