తప్పెవరిది – 69

Posted on

ఆటో వాడికి డబ్బులు ఇచ్చి పంపి ఇటు తిరిగిన శ్రీ వారు రాజారాం గారితో మాట్లాడుతూ మా వైపే వస్తున్న విశ్వనాధం అన్నయ్యని చూసి.. “అరె రె! బావ గారూ మీరు ఎప్పుడు వచ్చారు?” అంటూ తనకు ఎదురు వెళ్ళి తన చేతిలోని సంచిని అందుకున్నారు.
“ఒక అర గంట అయ్యిందయ్యా నేను వచ్చి. మీరు ఊరు వెళ్ళి ఉన్నారు, ఏ నిమిషమైనా తిరిగి రావచ్చు అని రాజారాం గారు చెబితే అది గో వాళ్ళింట్లో కూర్చుని మీ కోసం ఎదురు చూస్తున్నాను” అంటూ మాతో పాటు అడుగులు వేసారు తను.
నేను అప్పటికే ఇంటి తాళం తీసి ఇంట్లోకి అడుగు పెట్టాను. శ్రీవారు, రాజారాం గారికి థాంక్స్ చెప్పి వాళ్ళ బావ గారితో కలసి ఇంట్లోకి అడుగు పెట్టారు. త్వరగా వెళ్ళి స్నానం చేసి వచ్చి ఆయన కు టిఫిన్ వగైరా చెయ్యాలి కనుక స్నానం చేసేందుకు వెళ్తామని మా పడక గదిలోకి వెళ్ళి బట్టలు తీసుకుంటున్నాను.
“ఏమిటి సడెన్ గా వైజాగ్ ప్రయాణం పెట్టుకున్నట్లున్నారు. కస్తూరి ఈ విషయం నాతో అనలేదే?” హాల్ లో విశ్వనాధం అన్నయ్య గారు అడుగుతున్న ప్రశ్న మా గదిలో ఉన్న నాకు వినపడుతుంది.
సడెన్ గా అంటే ఆఫీసులో కొంచెం అర్జెంట్ పని ఉండి వైజాగ్ వెళ్ళమన్నారు. ఎటూ పిల్లలు కూడా లేరు కదా, తను ఇంట్లో ఒక్కటే ఎందుకని లలితని కూడా తీసుకుని వెళ్ళాను బావ గారూ” మా వారి సంజాయిషీ నాకు వినపడుతుంది.
మా వారి సమాధానం విన్న ఆయన ఏమీ అన్నట్లు లేరు. తిరిగి మా వారే ”
కాఫీ అదీ ఏమన్నా తీసుకుంటారా” అని అడుగుతున్నారు.
ఇక నేను త్వరగా వెళ్ళి స్నానం చేసి వస్తే మంచిదని బీరు వాలొని బట్టలు తీసుకుని, టవల్ భుజాన వేసుకుని బాత్రూం లోకి జారుకున్నాను. నేను స్నానం పూర్తి చేసుకుని తిరిగి వచ్చే సరికి శాస్త్రి పక్కింటి వాళ్ళు తీసి పెట్టి ఉన్న పాల పాకెట్స్ తెచ్చి పాలు వేడి చేస్తున్నారు.
స్నానం ముగించిన నేను హడావిడిగా వెళ్ళి పూజ పూర్తి చేసి, అప్పటికే వచ్చి ఇల్లు ఊడుస్తున్న పని మనిషిని పిలిచి డబ్బులిచ్చి ముందు వెళ్ళి ఏవన్నా కూర గాయలు కొనుక్కురమ్మని చెప్పి టిఫిన్ ఏదన్నా చేద్దామని వంట గది వైపుకు నడిచాను.
నేను వంట గదిలో టిఫిన్ రెడీ చేస్తున్నప్పుడే ఇటు శ్రీవారు, అటు విశ్వనాధం అన్నయ్య గారు ఇద్దరూ స్నానాలు ముగించినట్లున్నారు. “ఇంత కూ ఊరు ములూ, మెరుపులూ లేని పిడుగులా ఈయన ఎందుకు వచ్చారో?” అన్న ప్రశ్న నన్ను వేధిస్తూనే ఉంది. అన్నయ్య గారు, శ్రీవారు ఇద్ద రూ స్నానాలు, పూజలు పూర్తి చేసుకుని వచ్చే సరికి టేబుల్ మీద వేడి వేడి గా టిఫిన్ రెడీగా ఉంచాను. ఇద్దరూ వచ్చి కూర్చుని టిఫిన్ తినడం మొదలు పెట్టారు.
“పిల్లలు ఎలా ఉన్నారు అన్నయ్య గారు, కస్తూరి వదిన కు ఇబ్బంది కలిగించడం లేదు కదా?” అన్నాను.
“అబ్బే.. అదే మీ లేద మ్మా. చక్కగా ఆడుకుంటున్నారు. ఇంకో నాలుగు రోజుల్లో శలవలు అయిపోతాయని దిగులు పడుతున్నారు. బుధవారం రాత్రి ట్రైనుకు వాళ్ళను తీసుకుని కస్తూరి వస్తుంది” అన్నారు ఆయన.
ఆయన తో మరే మీ మాటలాడాలో తెలియక మంచి నీళ్ళు తెచ్చే నెపం తో వంట గదిలోకి వచ్చాను.
“మీకు ఏదో పని ఉందన్నారు కదా? నన్ను శెలవు పెట్ట మంటారా బావ గారూ?” మా వారు అడు గుతున్న ప్రశ్న నాకు వంట గదిలోకి వినపడుతుంది.
“అయ్యో ఎందుకు లే వయ్యా, నువ్వు ఈరోజే కాంప్ నుంచి వచ్చావు కదా. పని కూడా ఎక్కువ ఉంటుందేమో.. నువ్వు వెళ్ళి రా. నేను కలెక్టర్ ఆఫీసు వరకూ వెళ్ళి, నా పని చూసుకుని ఈ రోజు సాయంత్రం బస్సుకే తిరిగి వెళ్ళిపోతాను” విశ్వనాధం అన్నయ్య గారి జవాబు.
“ఆయన రాక కి కారణం ఏమయ్యుంటుందా?” అని ఉదయం నుంచి నన్ను వేధిస్తున్న ప్రశ్నకు సమాధానం దొరికింది. తను కలెక్టర్ ఆఫీసులో ఏదో పని మీద వచ్చినట్లున్నారు. విశ్వనాధం అన్నయ్య గారు అంటే వాళ్ళ ఊరిలొ చాలా మంచి పేరు ఉందని కస్తూరి వదిన చెబితే విన్నాను. మనిషి చూడడానికి ఎంతో గంభీరంగా చూడ గానే గౌరవంగా రెండు చేతులతో నమస్కరించాలని పించేలా ఉంటారు.
పెద్దల నుంచి వచ్చిన 50 ఎకరాల మాగాణి భూ మిలో తనే సొంతంగా సాగు చెయ్యించు కోవడమే కాక, వాళ్ళ ఊరిలోని ఆలయంలో ఆయనే ప్రధాన పూజారి కావడంతో వాళ్ళ ఊరిలోని ప్రజలందరికీ తనంటే ఒక విధమైన అభిమానం, గౌరవం ఉన్నాయని విన్నాను.
ఎక్కడన్నా ఏవన్నా తగాదాలు వస్తే పరిష్కారానికి విశ్వనాధం అన్నయ్య గారి వద్దకే వస్తారని కస్తూరి వదిన చెప్పేది. విశ్వనాధం అన్నయ్య గారు ఏది చెబితే వాళ్ళ ఊరిలో అదే వేద వాక్కు అనీ, తన మాట మీద అందరికీ గౌరవంతో పాటు భయం కూడా అని కస్తూరి వదిన చెప్పింది గుర్తుకు వచ్చింది.
ఇక పోతే ఆ ఊరి త గాదాల్లో దేనినో మధ్యస్తం చేసేందుకో, లేదా ఊరి కి కావల్సిన విషయం గురించి ఏదో మాట్లాడేందుకో తను కలెక్టర్ ఆఫీసులో పని ఉండి వచ్చినట్లున్నారు కాబోలు అనుకున్నాను. కలెక్టర్ ఆఫీసుకి ఎలా వెళతారు, పోనీ నేను మా ఆఫీసుకు వెళ్ళి, మానేజర్ తో మాట్లాడి పర్మిషన్ తీసుకుని రానా, మిమ్మల్ని నా స్కూటర్ మీద కలెక్టర్ ఆఫీసుకు తీసుకెళ్ళాచ్చు” మా వారి గొంతు.
“అయ్యో అదేంటయ్యా శాస్త్రి, నేనే మన్నా చిన్న పిల్లాడినా తప్పి పోవడానికి. నేను ఆటో తీసుకుని వెళ్ళి పని చూసుకుంటాను కానీ నువ్వు ఇక దాని గురించి ఆలోచించకుండా ఆఫీసుకు బయలుదేరు” అన్నయ్యా గారు అంటున్నారు.
“అలాగే, మీ ఇష్టం బావ గారూ” అంటూ మా వారు మొత్తానికి ఒప్పుకుంటున్నట్లున్నారు. అయినా మా వారి చోద్యం కాకపోతే అంత మాత్రం ఆయన కలెక్టర్ ఆఫీస్ వరకూ వెళ్ళలే రూ? అదే ఆలోచిస్తూ మంచి నీళ్ళు తీసుకుని తిరిగి డైనింగ్ టేబుల్ వైపు నడిచాను. ఇద్దరి గ్లాసుల్లో మంచి నీళ్ళు పోసి తిరిగి వంట గదిలోకి నదిచి స్టవ్ మీద బియ్యం పడేసి, అంతకు ముందే పని మనిషి తీసుకొచ్చిన కూర గాయలు తీసి తరగడం మొదలు పెట్టాను.
శాస్త్రి మామూలు గా ఉదయం వెళ్ళేప్పుడే లంచ్ బాక్స్ పట్టుకెళ్తారు. ఈ రోజు వాళ్ళ బావ గారు ఉన్నారు కాబట్టి ఇంటికి వస్తారేమో తెలియదు. అయినా ఎందుకైనా మంచిదని వంట కార్యక మం మొదలు పెట్టాను. మరో గంట తరువాత ఆఫీసుకు వెళ్ళేందుకు తయారయి హాల్ లోకి వచ్చిన శ్రీ వారితో “లంచ్ బాక్స్ పాక్ చేసి ఇవ్వ మంటారా” అని అడిగాను.
“వద్దులే, బావ గారు కూడా ఉన్నారు కదా భోజనానికి ఇంటికి వస్తాను” అన్నారు.
ఆయన మాటలు విన్న విశ్వనాధం అన్నయ్య గారు “అది గో ఆ మర్యాదలే వద్దు. నాకు కలెక్టర్ ఆఫీసులో పని ఎప్పటి కి అవుతుందో ఏమో. అందుకని, ఒక గంట తరువాత ఒకే సారి భోజనం పూర్తి చేసుకునే వెళ్తాను. నువ్వు హాయిగా నీ భోజనం పాక్ చెయ్యించుకుని వెళ్ళు” అనడంతో..
శ్రీవారు న వైపు తిరిగి “సరే అయితే.. అలాగే పాక్ చేసి ఇవ్వు” అన్నారు. వెంటనే వంట గదిలోకి వెళ్ళి శ్రీవారికి భోజనం పాక్ చేసి తీసుకొచ్చాను.
“ఇక నేను బయలుదేరుతాను అయితే ” అని నాతో అని పక్కనే కూరుచ్ని టి వి చూస్తున్న విశ్వనాధం అన్నయ్య గారి వైపు తిరిగి “మరి నేను బయలుదేరుతాను బావ గారు. మీకు ఏమన్నా అవసరం అయితే మా ఆఫీసుకి ఫోన్ చెయ్యండి” అని చెప్పి బయలుదేరారు. శ్రీవారు.
తనని అలా పంపించి తలుపు వేసి నేను కూడా ఏమన్నా తిందా మని వంట గదిలోకి వెళ్ళి ఇందాక మగ వాళ్ళు ఇద్దరూ తినగా మిగిలిన టిఫిన్ కొంచెం తీసి పని మనిషికి ఇచ్చి మిగిలింది ఒక ప్లేటులో వేసుకుని తినసాగాను. అంత వరకూ హాల్ లో కూర్చుని టి వి చూస్తున్న విశ్వనాధం అన్నయ్య గారు లేచి వంట గది వాకిలి వద్దకు వచ్చి “ఇది గో అమ్మా, కాసేపు అలా నడుము వాలుస్తాను. ఒక గంట తరువాత లేపు” అని చెప్పి పిల్లల బెడ్రూం వైపు నడిచారు.
“అలాగే అన్నయ్య గారు” అని తనతొ అని, పని మనిషికి ఉతికేందుకు బట్టలు వేద్దామని మా పడక గది వైపు నడిచాను. అప్పటికే మధ్యాన్నం భోజనానికి కూడా వంట చెయ్యడం పూర్తి అవడంతో, పని మనిషికి బట్టలు ఇచ్చి నేను కూడా కాసేపు అలా నడుము వాలుద్దా మని మా రూంలోకి వెళ్ళి పరుపు మీద వాలి పోయాను.
అలా ఎంత సేపు గడిచిందో తెలియదు కానీ “అమ్మగారూ, నెను ఇక వెళ్తున్నా..లేచి తలుపు వేసుకోండి అంటు పని మనిషి వచ్చి లేపే వరకూ మెలకువ లేదు. లేచి టైం చూస్తే 11 గంటలు కావొస్తుంది. “అయ్యో అన్నయ్య గారు లేపమన్నారే” అను కుంటూ లేచి పరుగెడుతున్నట్లు గా వెళ్ళి పిల్లల బెడ్ రూం డోర్ దగ్గర నుంచి “అన్నయ్య గారూ” అంటు పిలిచాను.
నేను చేస్తున్న పని చూసిన పని మనిషి “అయ్య గారు ఇందాకే లేచార మ్మ, బాత్రూం లో ఉన్నారు” అని చెప్పింది.
“ఓహ్.. అలాగా. ఆయన గంట తరువాత లేప మన్నారు. నా మతి మండ. అలా పడుకున్నానో లేదో నిద్ర పట్టేసింది” అని దానితో అని హడావిడిగా వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద కంచాలు పెట్ట సాగాను.
“మరి నేను వెళ్తున్నాన మ్మాగారూ, తలుపు వేసుకోండి” అని చెప్పి తని వెళ్ళిపోయింది.
అది అటు వెళ్ళిందో లేదో బాత్రూం లోనుంచి బయటకు వచ్చారు విశ్వనాధం అన్నయ్య గారు. అప్పటికే డైనింగ్ టేబుల్ మీద అన్ని సర్దుతున్న నేను “ఒక్క నిమిషంలో వడ్డించేస్తాను అన్నయ్య గారు” అన్నాను.
“తొందరే మీ లేదు నిదానంగానే కానీ అమ్మా” అంటూ తను హాల్ లోకి నడిచారు. అక్కడ తలుపు తీసి ఉండడం గమనించారే మో.. “ఇదేంటమ్మా.. వీధి వాకిలి ఇలా తెరిచి ఉంది” అంటూ హాల్ లోంచే అరిచారు.
“అయ్యో, పని మనిషి ఇప్పుడే వెళ్ళింది అన్నయ్య గారు. నేను వచ్చి వేసుకుంటాను” అన్నాను స్టవ్ మీద అప్పుడే వేడి పెట్టిన పప్పుచారు గిన్నెలోకి వంచుతూ..
“నేను వేస్తానులే” అంటూ ఆయన సమాధానం వినపడడంతో, తేబుల్ మీద మిగిలిన కూర అవీ సర్ద సాగాను. మరొ 5 నిమిషాల్లో తనకు భోజనానికి అన్నీ సిద్ధం చేసి పిల్లల గది ముందుకు వెళ్ళి గుమ్మం దగ్గర నుంచే…
“భోజనం సిద్ధంగా ఉంది అన్నయ్య గారు, మీరు ఎప్పుడు వడ్డించ మంటే అప్పుడు వడ్డిస్తాను” అన్నాను.
“అలాగే వడ్డిద్దువు కానీ ఒక సారి ఇలా రామ్మా!” అన్నారు తను లోపల నుంచే.
“చెప్పండి” అంటూ గదిలోకి అడుగుపెట్టాను. అక్కడ వంటి మీద షర్ట్ లేకుండా మంచం మీద కూర్చుని ఉన్నారు తను. అలా వంటి మీద షర్ట్ లేకుండా తిరగడం మా ఇంట్లో అల వాటే కాబట్టి నేను దాని గురించి పెద్ద గా పట్టించుకోలేదు.
“ఏ మిటి పిలిచారు?” అన్నాను.
“పని మనిషి వెళ్ళిపోయిందా” అన్నారు.
“ఆ వెళ్ళిపోయింది. మిరే కదా తను వెళ్ళాక తలుపు కూడా వేసారు” అన్నాను.
తను ఏమీ మాటలాడలేదు. మళ్ళీ నేనే “రండి భోజనం వడ్డిస్తాను” అన్నాను.

479627cookie-checkతప్పెవరిది – 69

1 comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *