ఖర్కోటఖుడు – Part 6

Posted on

“మిషన్ అకంప్లిష్డ్..” అంటూ హర్ధిక్ ని వదిలేసిన విషయం దాచిపెట్టి తాను తెచ్చిన వస్తువులను టేబుల్ మీద పరిచింది.
స్టీఫెన్ వాటిని ఒకసారి పరిశీలించి రిచర్డ్స్ కి కాల్ చేసాడు.
రిచర్డ్స్ కాల్ అటెండ్ చేసి ” ఏమైనా చెప్పాలా?” అన్నాడు.
“నో సర్.. ఎవ్రిథింగ్ ఫైన్”
“కానీ తను సౌరవ్ కొడుకును ఎందుకు కలిసాడు?”
“అదొక్కటే డౌట్ సర్. నథింగ్ సస్పిషియస్”
“ఓకే ఏమైనా అప్డేట్స్ ఉంటే ఇమ్మిడియట్ గా ఇంఫార్మ్ చెయ్.” అంటూ ఫోన్ పెట్టేసాడు రిచర్డ్స్.
హర్ధిక్ కొంచెం సేపటికి కళ్ళు తెరిచి స్పృహలోకి వచ్చాడు. చుట్టూ చూసాడు. రూమ్ మొత్తం చిందరవందర గందరగోళంగా ఉంది. మెల్లిగా పైకి లేవడానికి ప్రయత్నించాడు. తల మొత్తం దిమ్ముగా అనిపించింది.
“పూకు ముండ ఎంత దెబ్బ కొట్టింది. దొరికితే చెప్తాను దాని సంగతి” అనుకుంటూ పైకి లేచి సోఫాలో కూలబడి ఒక దమ్ము వెలిగించాడు. టీపాయ్ మీద స్కాచ్ బాటిల్ నా సంగతి ఏంటి అన్నట్టు వెక్కిరిస్తూ నిలబడింది.
వెంటనే దాన్ని తీసి రెండు పెగ్గులు లోపలికి పోనిచ్చాడు. ఇప్పుడు కొంచెం బెటర్ గా అనిపిస్తుంది హర్ధిక్ కి.
ఎవరో తనని ఫాలో అవుతున్నారన్న విషయం హర్ధిక్ కి అర్ధం అయ్యింది. ఎలా అయినా ఇక్కడి నుంచి బయట పడాలి అనుకున్నాడు. కానీ తను సేఫ్ గా ఉండాలంటే ఎక్కువ సేపు ప్రయాణం చెయ్యకూడదు.

ఎందుకో హర్ధిక్ కి ఇందులో తనకి తెలియని విషయాలు, వలయాలు చాలా ఉన్నాయ్ అనిపించింది. ఇక నుంచి ఏం ప్లాన్ చేసినా పకడ్బందీగా అమలు చేయాలని మాత్రమే అనుకున్నాడు.
అతని మనసులో ఉన్నది ఒకటే విషయం. అమ్మాయిని పనిలో కలపకూడదు. ఒక్కసారి సేఫ్టీ లాకర్ ఓపెన్ చేసి తాను భద్రం చేసిన వస్తువులను చూసుకున్నాడు. అన్నీ సేఫ్ అనుకుని లాకర్ క్లోజ్ చేసి కొంచెం మందు కొట్టి పడుకున్నాడు. పొద్దున్నే లేవాలి అనుకుంటూ.
*********
మల్హోత్రా ఉదయాన్నే ఢిల్లీలో ఫ్లైట్ దిగి తన స్వస్థలమైన నోయిడా పక్కనే ఉన్న ఒక చిన్న పల్లెటూరికి ప్రయాణమయ్యాడు.
ఎయిర్పోర్టు బయట ఉన్న ఒక టాక్సీలో తన ఊరికి చేరుకున్నాడు.
చాలా సంవత్సరాల క్రితం వదిలేసిన ఊరు..
బాగా మారింది అనుకుంటూ ఊరి పరిసరాలను గమనిస్తూ ఊళ్ళోకి ప్రయాణిస్తున్నాడు. తాను అక్కడ ఉండేటప్పుడు అక్కడ కనిపించే ప్రదేశాలన్నీ ఇప్పుడు చాలా కొత్తగా ఉన్నాయి.
ఎంత ప్రయత్నిస్తున్నా తను ఉండే ప్లేస్ గుర్తురావడంలేదు. డ్రైవర్ కూడా ఊరి చుట్టూ చక్కర్లు కొట్టి కొట్టి విసుగ్గా మల్హోత్రా వైపు చూసాడు.
అతనిలో వస్తున్న విసుగు గమనించిన మల్హోత్రా ఒక సెంటర్ దగ్గర ఆపమని దిగి డబ్బులిచ్చి పంపించేసాడు.
ఆ ఊరి జనం మల్హోత్రా ఎవరా అని చూడసాగారు.
మల్హోత్రాకి అక్కడ ఎవరిని ఏమని అడగాలో కూడా తెలియట్లేదు. నిలబడి చూస్తున్నాడు. ఇంతలో వెనక నుంచి “రహీమ్ చాచా..” అని పిల్లలు అరుస్తున్నారు.
మల్హోత్రా బుర్రలో జ్ఞాపకాల దొంతర మెదిలింది.
రహీమ్ చాచా. అవును అది తనకి బాగా పరిచయమున్న పేరు. తన బడి రోజుల్లో ప్రతి రోజూ తన తండ్రి అక్కడి నుంచి చిరుతిళ్ళు తీసుకురాకపోతే బడికి పోనని మారాం చేసేవాడు.
అది గుర్తొచ్చి వెనక్కి తిరిగి చూసాడు. అక్కడ ఒక ముసలివాడు పిల్లలకు మిఠాయిలు పంచుతూ కనిపించాడు.
అతన్ని చూడగానే మొహం లీలగా గుర్తుకు వచ్చింది.
“ఏంటి రహీమ్ చాచా ఇంత ముసలివాడు అయిపోయాడు? తనకే నడి వయసు దాటేసింది. అంతేలే రహీమ్ చాచా బతికి ఉండటమే గొప్ప” అని తనలో తానే అనుకున్నాడు.
ఇంతలో సడన్ గా అతని మస్తిష్కంలో మెరుపులా ఒక జ్ఞాపకం కదలాడింది. మల్హోత్రాకి తన ఇంటికి దారి దొరికినట్టయ్యింది.
మళ్ళీ మర్చిపోతాడని వడివడిగా అడుగులు వేస్తూ చిన్నప్పుడు రహీమ్ చాచా కొట్టు దగ్గర్నుంచి ఇంటికి ఎలా వెళ్ళేవాడో గుర్తు తెచ్చుకుంటూ ఎలా అయితేనే.. వచ్చేశాడు.
కానీ ఇప్పుడు అక్కడ మొత్తం మారిపోయింది. తన చుట్టుపక్కల ఇళ్ళు మొత్తం భవంతులు అయ్యాయి. కానీ వాటి మధ్యలో తన గుడిసెలాంటి ఇల్లు కనిపించింది. బీర్ల మధ్యలో అరలీటర్ థంబ్సప్ బాటిల్ లాగా.
ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఇంటి దగ్గరకి వచ్చేశాడు. బాగా బూజు పట్టి ఉంది.
************
హర్ధిక్ కి డోర్ బెల్ మోగటంతో మెలకువ వచ్చింది.
లేచి చూస్తే టైం 8దాటింది.
లేచి ఎవరా అని డోర్ సన్నగా ఓపెన్ చేసి చూసాడు.
బయట వెయిటర్ నిలబడి ఉన్నాడు. హర్ధిక్ ని చూడగానే “యువర్ ఆర్డర్ సర్” అన్నాడు వినయంగా.
హర్ధిక్ ఏమీ వద్దని చెప్పి టిప్స్ కింద చేతికి అందిన వెయ్యి నోట్లు వెయిటర్ కి ఇచ్చేసాడు.
ఒక గంటలో తనకి సంబంధించిన వస్తువులు తీసుకుని కిందకి వచ్చి చెక్కౌట్ చేసేసాడు.
ఎయిర్పోర్ట్ కి వచ్చి కలకత్తా వెళ్లే ఫ్లైట్ వివరాలు కనుక్కుని ఫ్లైట్ లో బయల్దేరాడు.
తన లాపీ ఓపెన్ చేసి మల్హోత్రా పంపించిన ప్రాజెక్టుకి సంబంధించిన వివరాలు చూస్తున్నాడు. చూడబోతే ఇది చాలా పెద్ద ప్రాజెక్టులా ఉంది.
దానిని చూసే సమయంలో అతను కలకత్తా ఎప్పుడు వచ్చాడో కూడా చూసుకోలేదు.
బయటకి వచ్చి ముందు తన తండ్రికి ఫోన్ చేశాడు.
సౌరవ్ కాల్ రిసీవ్ చేసుకుని “హలో” అన్నాడు.
“డాడీ మీ ఫ్రెండ్ ని కలిసి అతను ఇచ్చినవి తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలి” అన్నాడు హర్ధిక్.
“ష్.. ఇప్పుడేం మాట్లాడకు. ఇంటికి వెళ్ళాక నేను కాల్ చేస్తాను” అని కాల్ కట్ చేసాడు సౌరవ్ మల్హోత్రా. ఇంకొక్క 45నిమిషాల్లో ఠాగూర్స్ అనే వాళ్ళ సొంత భవంతి ముందు ఆగింది హర్ధిక్ ఎక్కిన క్యాబ్.
అక్కడ దిగీదిగ్గానే వడివడిగా తన సీక్రెట్ రూమ్ లోకి వెళ్ళిపోయాడు హర్ధిక్. తన పర్సనల్ లాకర్ లో ఆ వస్తువులు భద్రం చేసి కడుపు కాల్తుంటే లంచ్ చెయ్యడానికి డైనింగ్ హాల్ లోకి వచ్చాడు.
ఇంతలో ఫోన్ మోగుతోంది ఎక్కడో మూల నుంచి. ఎక్కడా అని వెతుక్కుంటూ వెళ్తుంటే ఒక పిల్లో కింద బ్లాక్బెర్రీ పాస్పోర్ట్ ఫోన్ గిర్రున మోగుతోంది.

171071cookie-checkఖర్కోటఖుడు – Part 6

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *