ఒక ప్రేమ కథ – 4

Posted on

“ఏమ్మ్ చెప్పనూ.. ఆయన నన్ను వాళ్ళ అమ్మలా చుస్కుంటారు.నాకు suggestions ఇస్తారు….గైడ్ చెస్తారూ…..నేను చెప్పేవి ఎంత సిల్లీగా ఉన్న వింటారు..నేను అన్న ఒక్కోసారి ఈ కాలేజీ….క్లాసు….ఎగ్జామ్స్…రికార్డ్స్…ప్రాజెక్ట్స్…వీటి వాళ్ళ ఆయన్ని చిరాకు పడతా…విసుకుంటా…ఒక్కోసారి కోపం లో తనపి అరిచేస్తా …..కాని తను నన్ను ఎప్పడు విసుక్కోరు…..కోప్పడరు….మా ఫ్రెండ్స్ అంత chepparu….వాళ్ళ నాన్న ఒక్కసారన్న కొట్టారు అని….నన్ను ఇంట వరకు ఎపడు కొట్టలేదు…. నన్ను ఇంతవరకు ఆయన ఒక్కసారి కూడా కోపం గా చూడనుకూడా లేదు……ఎంత బిజీ గా ఉన్న …నాకోసం అంటే ఆ పనులన్నీ పక్కన పెతేస్తారు …..నీకు తెలుసా మా నాన్నకు మా అమ్మ కన్నా నేనే ఎక్కువ ఇష్టం……తన లైఫ్ లో నా తర్వాత నే ఎవరన్న……ఇంకా….నాకు నచ్చిన సినిమాలు…..పాటలు..అన్నినాతొపాటు ఎంజాయ్ చేస్తారు.నాకు ఏం కావాలన్నా నిమిషాలలో ముందుంచుతారు…ఇవన్ని ఒకటి నా లైఫ్ లో తను నాకు ఇచ్చే సపోర్ట్ ఎవ్వరు ఇవ్వలేరు….నేను ఏం చెయ్యాలి అనకుంటే అది చెయ్యమంటారు…. ఇంకా Late night నాకు నా బాల్కనీలో కుర్చుని old bollywood songs వింటూ,నాన్నతో కబుర్లు చెప్పడం అంటే చాలా ఇష్టం..”
“తను నా వైపు అలా చూస్తూ హ్మ్మ్.. ఇంకా..”అన్నాడు ఆర్యన్..
“తెలుసా, అప్పాకి వంట చెయ్యడం రాదు,కాని నేను అడిగానని ఒకసారి అమ్మని వెనుక వుంచి ఆయనే ఫ్రైడ్ రైస్ చేసారు.ఇంకా ఆయన రోజు నాకోసం పెట్టె ఫిల్టర్ కాఫీ world’s best తెల్సా…..నేను మా నాన్న కూతుర్నిఅని మా అమ్మ అస్తమాను ఉదుక్కున్తూ ఉంటాది..కాఫీ పిచ్చి నాకు ఆయన నుంచే వచ్చింది ..నాకు ఆయన చెప్పే good మార్నింగ్ తో నే రోజు మొదలయ్యి good night,తో నే రోజు పూర్తవుతుంది .నా కళ్ళలో నీరు వస్తే చాలు ఆయన తట్టుకోలేరు.ఇంకా అలా చెప్తూపొతే ఎన్నిరోజులు అయినా చాలావ్ మా అప్ప గురించి…… అని లేచి చేతులు చాపుతూ….చిత్తూ tirugutoo He is my king and I’m his princess” ……..he is my best friend………….i lovu you Appaa అని గట్టిగ అరుస్తూ చుట్టూ తిరుగుతూన్న….నవ్వుతు గర్వంగా.
తను నన్ను అలా చూస్తూ ఉండడం చూసి ఆగిపోయ…..నవ్వుతూ తన పక్కన కూర్చిని “హ్మ్మ్……ఇప్పుడు నీకు మీ డాడీ కి ఉన్న బాండింగ్ చెప్పు”అడిగాను నేను .
తను అలా చుట్టూ చుటూ “హ పద చీకటి పడింది…..లేట్ అవ్తుంది,బైల్దేరదాం ఇంకా ” అంటూ లేచాడు తను……..నేను మొబైల్ లో టైం చూసేసరికి around 9:30 అయింది….సరేలే అని లేచాను నేను కూడా ఇద్దరం అలా నడుస్తూ ఉన్నాం….తను ఎప్పటిలానే సైలెంట్ గా ఉన్నాడు “నువ్వు ఎందుకు ఎప్పుడు సైలెంట్గ ఉంటావ్….అసలెల ఏమీ మాటాడకుండా ఉండగాల్గుతున్నావ్?!నీకు బోరింగ్ గా ఉండద అలా ఉంటె? నేను మాత్రం కోట్లు ఇస్తా అన్న సరే 2నిముశలు కూడా సైలెంట్గ ఉండలేను.”అన్నాను నేను తన పక్కన నడుస్తూ…….
“You know…..నువ్వు చాలా plain hearted” అన్నాడు తను నవ్వుతు…….
“హ్మ్మ్..!? “questioning face తో chusa తనని….
“నాకు పెద్దగా ఎవరు ఫ్రెండ్స్ లేరు శిశిర………. నా ప్రపంచం చాలా చిన్నది………ఒంటరిగా ఉండటం కొత్త కాదు నాకు..”అన్నాడు తను.
నాకు,తన మాటలు అర్ధం కాలేదు కాని ఏదో తెలియని బాధ మాత్రం ఉందని అనిపించింది.
“ఏమయింది?నువ్వు బానే ఉన్నావా? “అడిగాను నేను.
“హా..బానే ఉన్ననే.. నాకేమయ్యింది…iam perfectly allright ” అన్నాడు తను.
“ఏమో..నీ మాటలు బాధగా అన్పించాయి నాకు..” అన్నాను.
“హ్మ్మ్ Ice cream తిందామా? “అడిగాడు తను మాటమారుస్తూ ..
“హ్మ్మ్.. సరే అన్నాను. ”
ఇద్దరం ఐస్ క్రీం తిన్నాం……నేను butterscotch …. tanu venella …..
“Food తినలేను ఇంకా” అన్నాను ఐస్ క్రీం కంప్లీట్ చేస్తూ..
“ఇప్పుడు అలానే ఉంటుంది….రూం కేల్లక పడుకుంన్నప్డు ఆకలేస్తుంది…..కొంచెం తిను”అన్నాడు తను.
తను అలా అంటుంటే నాకు,మా నాన్నే మాట్లాడుతున్నట్టు అన్పించింది………ఇంకేం అనలేదింక…నేను.. ఇద్దరం అలా అక్షయ కాంటీన్ కి వెళ్ళాం.తనే ఆర్డర్ చెప్పాడు,నేను సైలెంట్గా కూర్చున్నా…..4 idly ఆర్డర్…..వచ్చింది…..
“తిను”అన్నాడు ప్లేట్ నా వైపు తోసి.”మరి నువ్వు?”అడిగాను నేను.”నాకు ఆకలి లేదు”అన్నాడు తను.
“ఓహో..నీతులు నాకు చెప్పడానికేన…….అదేం కుదరదు బాబు..నువ్వు తినాలి అన్నాను…..లేదు శిశిర….వద్దు అన్నాడు…..పోనీ Half-half తిందాం”అన్నాను….తను అలా ఆలోచిస్తూ జవాబిచ్చేలోపు వెయిటర్ని ఖాలీ ప్లేట్ తెమ్మని చెప్పేస.
“హే….వద్దు……నిజంగా ప్లీజ్ అంటూ…..ఏదో చెప్తున్నాడు “….తను.నేనేం మాట్లాడకుండా..అలా కూచుని ఉన్న..ఈ లోపు వెయిటర్ తెచ్చిన ప్లేట్లో 2 ఇడ్లీ కొంచెం చట్నీ వేసి తన ముందు పెట్టి..తిను ఇంకా….. మారం చెయ్యకు”అన్నాను.
తను ఏమీ అనలేదు….ఇంకేమి మాటాడకుండా సైలెంట్గా తినేసాడు….నేను కూడా తినేస…..నేను బిల్ ఇస్తున్న…తనే బిల్ పే చేసాడు.ఇద్దరం బైటకి వచ్చేసాం……..అలా Hostel వైపు నడుస్తున్నాం..
“థాంక్యు” అన్నాను నేను.తను నా వ్య్పి చూస్తూ ” for what ?”అడిగాడు తను….” for forcing that idly “అని నవ్వుతు చెప్పా.
“అలాగ.. ఐతే thank you and same to you ” అని తను కూడా నవ్వుతూ చెప్పాడు.
“నేను ఆశ్చర్యంగా చూసా ….తను నవ్వడం నేను ఎప్పుడు చూడలేదు ……..ఆర్యన్ నీకు నవ్వటం కూడా వచ్చా ……నువ్వు ఇలా నవ్వడం నేను ఎప్పుడు చూడలేదు…..”అన్నాను నేను.
తను అదోల చూస్తూ “May be ఇంత హాయిగా ఎప్పుడు నవ్వలేదేమో నేను”అన్నాడు తను నా వైపు చూస్తూ.
నేను జవాబిచ్చేలోపే నా hostel వచేసింది………”see you tomorrow” అన్నాను నేను.
“You know something shishira, I’m verymuch jealous of you Shishira “అనేసి నవ్వుతు వేల్పోయాడు.
నేనేమి మాట్లాడలేదు..తను వెళ్ళేవరకు,తనవైపే చూస్తూ ఉన్నాను….తను నాకు ఇక కనపడలేదు..వాళ్ళ హాస్టల్ వైపు వెళ్ళిపోయాడు….May be for few సెకండ్స్ అలానే తను వెళ్ళిన దారి వైపే చూస్తూ ఉన్న ..తర్వాత నా రూంకి వేల్పోయ……
రూంకి వెళ్ళాక నాన్నకు ఫోన్ చేశా …ఇంకా ఆ రోజు జరిగిన విషయాలు చెప్పి…క్లాస్స్లు టైమింగ్ అవి చెప్పి….గుడ్ నైట్ చెప్పి ….fresh అయ్యాను…..నా నైట్ డ్రెస్ కి చేంజ్ అయ్యా….అలా బెడ్ మీద నిద్రపోవడానికి చూస్తున్న కాని నాకు తను అన్న”You know something shishira, I’m verymuch jealous of you Shishira ” ఆ మాటలే గుర్తొస్తున్నాయి……. తను నన్నుచూసి ఈర్ష్య పడ్తున్నాడ?
ఏ విష్యంలో.. తను అన్నిట్లోనూ నాకన్నా బెటర్గా perform చేస్తాడుకదా…….పైగా వీడు అంటే మా కాలేజీ ప్రోఫ్ఫెసోర్స్ అంతా మెచ్చుకుంటారు….పైగా వేడిని చూపించి మీరంతా ఆర్యన్ ని చూసి నేర్చుకొంది…అంటారు ఎప్పుడూ……మరి వీడు ఎందుకల అన్నాడు……కాని తన మాటలు ఎంతో బాధతో నిండినట్టు ఎందుకనిపిస్తున్నాయి నాకు.. అని ఆలోచిస్తూ……ఎప్పుడు నిద్రపోయానో కూడా తెలియలేదు……..
అలారం కొట్టింది,కళ్ళు నలుపుకుంటూ లేచాను.టైం 6am అయ్యింది…. నాన్న గుడ్ మార్నింగ్ కాల్ వచ్చింది,కొంతసేపు మాట్లాడేసి,గబగబా రెడీ అయ్యాను… రూంలాక్ చేస్కుని,1st డే క్లాసు అటెండ్ అవ్వడానికి ఎంతో ఉత్సాహంగా బైల్దేరాను.అక్షయ కాంటీన్ దగ్గర ఆర్యన్ వెయిట్ చేస్తుంటాడు అని,అక్కడికి బైల్దేరాను.
నేను వెళ్లి చూసేప్పటికి,తను ఇంకా రాలేదు……సరేలే ఇంకా 15మినిత్స్ టైం ఉందిగా అనుకుని కాంటీన్లో వెయిట్ చేస్తున్నా.చెన్నైఫేమస్ ఫిల్టర్ కాఫీ ఆర్డర్ చెప్పి, మొబైల్లో FM ఆన్ చేశా.తమిళ్ పాటలు వస్తున్నాయి,సంగీతాన్ని ఆస్వాదించడానికి భాషతో పనిలేదుగా,సో అర్ధం కాకపోయినా కొన్ని పాటలు మజాగా ఉన్నాయి ….ఇంతలో నేను ఆర్డర్ చేసిన కాఫీ…ఇంకా ఆర్యన్ ఒకేసారి వచ్చారు.
“good morning Shishira “విష్ చేస్తూ నా ఎదురు కుర్చీలో కూర్చున్నాడు తను.
” Gooooood mooooooorninnnggg Aaaaryyannnnn ” అని FM లో RJ లాగ విష్ చేశా తనని……
తను నా చేష్టలకి ఏమనాలో తెలియక నవ్వాడు……నా కాఫీ నేను ఎంజాయ్ చేస్తున్న…తను బ్రెడ్…….. జామ్ అండ్ బట్టర్ తెచ్చుకుని తింటున్నాడు……..నేను చపాతీ రోల్స్ ఆర్డర్ చెప్పాను………తను తినేసాక ఇద్దరం స్టార్ట్ అయ్యాం…..అక్కడనుంచి………..
“అదేంటి,రోల్స్ ఆర్డర్ చెప్పవ్గా,తినవా”అడిగాడు ఆర్యన్.
“దార్లో తింటానులే,ఇక్కడే కుర్చుని తింటే బస్సు మిస్ అవుతాం మనం……….నాకు 1st డే నే లేట్ అవ్వడం ఇష్టంలేదు”….ani వెయిటర్ తెచిన రోల్స్లో కెచప్ ఆడ్ చేస్కుని,పేపర్ నాప్కిన్లో ఫోల్డ్ చేసి తింటూ బైటకి వచ్చేసా…..ఇద్దరం bus stop దగ్గర వెయిట్ చేస్తున్నాం……..
“ఏం సాంగ్స్ వింటున్నావ్?”అడిగాడు తను.
“FM వింటున్నా..”రోల్ నముల్తూ చెప్పా నేను.
“తమిళ్ పాటలు కూడా వింటావా నువ్వు? “అడిగాడు తను .
“స్పెసిఫిక్గా ఇవే పాటలు వినాలని ఏముంది,ట్యూన్ నచితే వింటాను.. “అని casual గా చెప్పాను.
“నేను అలా వినలేను తెల్సా” అన్నాడు తను……..ఈ లోపు Bus వచ్చింది..ఇద్దరం ఎక్కాం……”Window నాది…….”అన్నాను నేను.. తను చిన్నగా నవ్వుతూ సరేలే తీస్కో అని విండో సీట్ నాకిచ్చేసి తను నా పక్కన కూర్చున్నాడు.
“హ్మ్మ్..ఏదో చెప్తున్నావ్…చెప్పు”అన్నాను నేను.
“నేనా…..ఏం చెప్తున్నాను? “అడిగాడు తను”…..
అరేయ్,ఇప్పుడే కదా నేను అలా వినలేను పాటలు అన్నావ్……అలా అంటే ఎలా అని ?……..ఇంతలోనే మర్చిపోయావ……….అసలెలా గుర్తు ఉంటాయి బాబు… నీకు చదివినవి, అసలుఎలా వస్తోంది నీకు 1st పోసిషన్…..హా? “అని వెటకారంగా అన్నాను.
“ఓహో……..అదా……నేను పాటలు అర్ధం తెలియకుండా ఆస్వాదించలేను.నాకు ముందు లిరిక్స్ నచ్చాలి…ఆ తర్వాతే పాట నచ్చుతుంది…….అయినా…. గుర్తుపెట్టుకోవలసినవి గుర్తుంటాయి నాకు….అందుకే 1st “అని తను జవాబిచ్చాడు.
“హ్మ్మ్…..parledu,నీకు మాట్లాడం వచ్చే…..నువ్వేదో సైలెంట్ అనుకున్న,మాటకి మాట సమాధానం బాగానే చెప్తున్నావ్ గా ” అన్నాను నేను.
ఇంతలో మేము దిగాల్సిన స్టాప్ వచ్చింది….ఇద్దరం వెళ్లి మా ప్రోగ్రాం హెడ్ ని కలిసాం.
Mrs. Janaki Raman,మిడిల్ ఏజ్ లేడీ.Cream colour కలంకారి డిజైన్ ఉన్న శారీ కట్టుకున్నారు……….చాలా హుందాగా ఉన్నారు……….
చూస్తేనే చాలా స్ట్రిక్ట్ అని తెలుస్తోంది.మేము నవ్వుతూ విష్ చేసి,మమ్మల్ని మేము ఇంట్రడ్యూస్ చేస్కున్నం. ఆవిడ మా internship లో చెయ్యాల్సిన project details and related documents…..మాకు ఇచ్చారు…..Attender ని పిల్చి మమ్మల్ని ల్యాబ్ కి తీస్కెళ్ళి అజయ్కి పరచియం చెయ్యమని చెప్పారు.మేము ఆవిడకి థాంక్స్ చెప్పేసి ల్యాబ్కి వెళ్ళాం……………….
______________________________
Sindhu

4840612cookie-checkఒక ప్రేమ కథ – 4

1 comment

  1. Your story is really good, I really like this story. I don’t know why you stopped writing this story. I request you to continue the story and complete it please. I became a fan of this story.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *