ఒక ప్రేమ కథ – 5

Posted on

ఫుట్వేర్ తీసి లోపలికి వెళ్ళాం,ల్యాబ్ చాలా పెద్దది……ovel shape లో seperate చాంబర్స్ ఉన్నాయి,ఒక్కో ఛాంబర్లో ఒక్కో ప్రాజెక్ట్ మీద వర్క్ జరుగుతోంది. మా టీం లీడర్ Mr.Ajay.తను మాకు 2years సీనియర్.చాలా ఫ్రెండ్లీగా రిసీవ్ చేస్కున్నాడు మమ్మల్ని. తను ముంబై నుంచి వచ్చాడు అని చెప్పాడు.అక్కడ మేము ఇద్దరం,అజయ్ కాకుండ ఇంకో 2 అబ్బాయిలు సెల్వమణి,కృష్ణన్ ani…వాళ్ళది చెన్నైఅని introduce చేసాడు అజయ్.వాళ్ళు హాయ్ అని చెప్పి వాల్ పన్లో మునిగిపోయారు….టోటల్ 5 మెంబెర్స్ మా ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నది.తర్వాత వాళ్ళు కూడా బానే మాట్లాడారు మాతో ……. వర్కింగ్ ambitious అంతా చాలా బావుంది……అందరం వర్క్ చేస్తున్నాం…ఆర్యన్ నా రైట్ సిస్టం అండ్ నా లెఫ్ట్ సిస్టంలో అజయ్ వర్క్ చేస్తున్నాడు.నేను కొంచెంసేపు ప్రోగ్రామింగ్ చేశా,తర్వాత బోర్ కొట్టింది ….సో మొబైల్లో పాటలు ప్లే చేశా……వాల్యూం మీడియంలో పెట్టా……అవి ఇంగ్లీష్ పాప్ సాంగ్స్ కాబట్టి అందరు ఎంజాయ్ చేస్తున్నారు.ఇంతలో మాప్రాజెక్ట్ హెడ్ మా ఛాంబర్కి వచ్చారు,సాంగ్స్ ప్లే అవ్తున్నాయి కదా వెంటనే సీరియస్ అయ్యారు.ఎవరు సాంగ్స్ ప్లే చేస్తున్నారు ఇక్కడ,వర్క్ టైంలో ఎంటర్టైన్మెంట్ నాకు అస్సలు నచ్చదు,మీకు వర్క్ మీద ఇంట్రెస్ట్ లేకపోతె వెళ్లిపోవచ్చు…… అని కళ్ళు ఎర్రచేసి ఇంగ్లీష్లో అరిచారు ఆవిడ…..ఈలోపు మెల్లగా మొబైల్ తెస్కుని సాంగ్స్ ఆఫ్ చేసేసా.ఎవరు సాంగ్స్ ప్లే చేస్తున్నారు …common stand-అప్ అని చాలా కోపంగా అన్నారు……నేను సైలెంట్గ లేవబోతున్నా…ఇంతలో ఆర్యన్ నా చేతిలో ఫోన్ లాక్కుని,నిల్చోపోతున్న నన్ను చెయ్యి పెట్టి ఆపేసి తను నిల్చున్నాడు….. ఆవిడ నువ్వేనా అయితే సాంగ్స్ ప్లే చేసింది?తను ఏమీ మాట్లాడకుండా తల దించుకుని Iam Sorry Madam”అని అన్నాడు.ఆవిడ కోపం బద్దలయ్యి ఆవిడ కోపాన్నంతా ఆర్యన్ మీద చూపించేసి వెళ్ళిపోయారు.ఒక 15మిన్ తర్వాత వచ్చి ఒక 4 డాకుమెంట్స్ ఆర్యన్ కి ఇచ్చి ఈవెనింగ్ లోపు కోడింగ్ చేసెయ్యమని చెప్పి వెళ్ళిపోయింది.ఆవిడ కోపం ధాటికి మా ఛాంబర్ మొత్తం నిశ్శబ్దంతో నిండిపోయింది,కొంతసేపటికి అందరు నార్మల్ స్టేజికి వచ్చారు.ఆర్యన్ మొహంలో ఎలాంటి మార్పులేదు, నవ్వుకానీ కోపం కానీ బాధకానీ..అస్సలు ఎలాంటి expression లేదు మౌనంగా కుర్చుని కోడింగ్ చేస్తున్నాడు.మిగతా ముగ్గురు లంచ్కి వెళ్లారు,నేను ఆర్యన్ మాత్రం వెళ్ళలేదు
.”ఐ అం సారీ ఆర్యన్” అని తన దగ్గరగ నా చైర్ జర్పుకున్నానునేను.తను ఏమీ మాట్లాడలేదు.
“కోపమా?”అని అడిగాను నేను..తను ఏమీ మాట్లాడలేదు,
కనీసం నా వైపు చూడను కూడా చూడలేదు.”నాకు ఆకలేస్తోంది,తినేసి వాడడం రావా ప్లీజ్”అని అన్నాను……
తనలో ఏమాత్రం చలనం లేదు.తన మౌనం నాకు ఏదో తెలీని gulty ఫీలింగ్ ల వచ్చింది…….ఏదో తెలియని బాధ….అంతే,ఇంకా నా కళ్ళలో నీళ్ళు తిరిగిపోయాయి..
“చూడు నేకు నా మీద కోపముంటే తిట్టు కానీ ఇలా ఒక మాట కూడా మాట్లాడకపోతే నావల్ల కాదు,అయినా నేనేమి నిన్ను హెల్ప్ చెయ్యమని అడగ లేదుకదా,ఎందుకు పెద్ద నువ్వు హీరోల nee పేరు చెప్పావ్? తిడితే తిట్టేది నన్ను..నీకేంటి మధ్యలో”అని ఏడుస్తూ అన్నాను.నా కన్నీళ్లు చూసిగాని కరగలేదు తను..
“హే, చిన్నపిల్లలా ఏడుస్తున్నావ్ ఏంటి………. నేను కోడింగ్ చేస్తున్న కదా,నాకేం నీ మీద కోపం లేదు..”అన్నాడు తను.
“అబద్దాలు చెప్పకు,నీకు నన్ను కొట్టేయాలి అన్నంత కోపంగా ఉంది కదా “అన్నాను నేను.
“ఛ..ఛా……..పిచ్చి పిల్ల అదేమీ లేదు…..,ముందు నువ్వు కళ్ళు తుడుచుకో నిన్ను ఇలా చూడకూడదు అనే నేను అలా చేశా…మల్ల నువ్వు ఏడిస్తే ఎలా చెప్పు” అంటూ తన రుమాలు నా చేతికిచ్చాడు.
“నాకేం అక్కర్లేదు……నేను మార్గదర్శిలో చేరాను,ఒక రుమాలు కొనుక్కున్నాను”అన్నాను నేను నా కళ్ళు తుడ్చుకుంటూ…….అప్పటిదాక చెట్టు లా చలనం లేని ఆర్యన్ ఫక్కుమని నవ్వేసాడు.
“హమ్మయ……. నవ్వేసావ…!!ఇంకా పద…తినేసి వద్దాం…. “అని తన చెయ్యి పట్టుకుని లాగాను నేను.”నాకు పనుంది శిశిర,నువ్వెళ్ళు”అన్నాడు ……
తను నా చెయ్యి వదిలించుకుంటూ…..
“మల్లి మొదటికి రాకు మహానుభావ,ప్లీజ్…..కొంచెం తినేసి వచ్చి వర్క్ చేస్కుందాం…”అని బుంగమూతి పెట్టి అడిగాను……ఏమనుకున్నాడో ఏమోమరి లేచి వచ్చాడు…………..నాతొ …………………………
______________________________
ఇద్దరం వెళ్లి Cafteria లో లంచ్ తినేసి మళ్లీ వెనక్కి వచ్చి వర్క్ స్టార్ట్ చేశాం.ఈవెనింగ్ 6 అయ్యింది……నా వర్క్ కంప్లీట్ అయింది కాని ఆర్యన్ తన చైర్ లోంచి ఇంచ్ కూడా కదలకుండా వర్క్ చేస్తూనే ఉన్నాడు,మిగతా వాళ్ళు అయిన అజయ్,సెల్వమణి,కృష్ణన్ అందరూ వాళ్ళ వర్క్ కంప్లీట్ అయ్యాక వెళ్ళిపోయారు.ఆర్యన్ నన్ను కూడా ఆ ఇద్దరు తమిళ్ తంబిలతో పాటు వేల్లిపోమన్నాడు కాని నేను మాత్రం వెళ్లనని ఉండిపోయాను.
“శిశిర నాకు చాలా వర్క్ ఉంది చూసావుగా…..నువ్వు హాస్టల్కి వెళ్ళిపో,నీకు లేట్ అవుతోంది…”అన్నాడు తను తల కూడా నా వైపు తిప్పకుండా.
“పర్వాలేదు,నేను కూడా ఉంటాను..అయినా నీకు ఈ పనిష్మెంట్ నా వల్లనేగా.. నువ్వు వర్క్ చేస్కుంటుంటే నేను ఎలా వెళ్లిపోతాను చెప్పు,నాకు చాలా గిల్టీగ ఉంటుంది”అని చెప్పను.
“మొండిదానివి శిశిర,సరే నీ ఇష్టం ఉండు….”అన్నాడు తను.”
నేను కూడా తన పనిష్మెంట్ వర్క్లో షేర్ తీస్కున్న,ఎంతైనా నా మూలంగానే కదా పాపం మొదటిరోజే తిట్లు తిన్నాడు….కాలేజీ లో ఎవ్వరి చేతా ఒక్క మాట కూడా అన్పించుకోలేదు ఇంతవరకు…కానీ ఇక్కడ నేను బాడ్ అవ్వకూడదు…ఏడవకూడదు అని తిట్లు కాసాడు….అని బాధేసింది నాకు.”
ఫైనల్లీ వర్క్ అంతా కంప్లీట్ చేశాం,ల్యాబ్ లాక్ చేసి attender కి కీస్ ఇద్దామని వచేప్పటికి atender కూడా వెల్పోయాడు.ఇంకా చేసేదేం లేక డైరెక్ట్ గా మేడం రూమ్కి వెళ్ళాం……
మేము వెళ్లేసరికి ఆవిడ ఏదో ఫైల్ చూస్తున్నారు.
“May we get in Madam “అన్నాం ఇద్దరం…..ఆవిడ తలెత్తి మమ్మల్ని చూశారు..లోపలికి రండి అన్నట్టు చేత్తో సైగ చేశారు. ఆవిడ మొహంలో కోపం ఇంకా తగ్గినట్టు నాకు అనిపించలేదు..అలా గుండెని అరిచేతుల్లో పెట్టుకుని ఇద్దరం మేడం రూంలోకి అడుగుపెట్టాం.
” Good evening madam ..!! “అని విష్ చేశాం.
“Keys madam .. attender already left , so we came to give the lab keys..”అని ఆర్యన్ కీస్ ఆవిడ టేబుల్ మీద పెడుతూ అన్నాడు.
“Hmm…..okay , so, you completed all the work then “అంది ఆవిడ.
“Yes, mam “అని ఆర్యన్ అని తల దించుకున్నాడు.
“Good .. don’t repeat the mistake again . It’s your 1st mistake so I’m sparing you . You may leave now “అంది ఆవిడ.
“sorry mam “అనేసి బైటకి వచ్చేసాం మేము.
“ఆవిడ అసలు నవ్వాదా?! ఎందుకు మూతి ములక్కాడలా పెట్టుకుంది…..అయ్యో పాపం ఇంతసేపు ఉండి వర్క్ చేసారుఅని కూడా లేదు..ఃఉహ్హ్..!!” అన్నాను నేను తన పక్కన నడుస్తూ….
“శిశిర..తప్పు మనది,వర్క్ టైంలో పాటలు పెట్టాం…అందుకే ఆవిడ కోప్పడ్డారు,ఇంకా వదెలెయ్.. అయిపొయింది కదా “అన్నాడు తను.
“హ్మ్మ్.. సరేలే బాబు పదా..!!నువ్వు చాల స్ట్రైన్ అయ్యావ్కదా..అంత వర్క్ చేసావ్,1minute కూడా రెస్ట్ లేకుండా..సారీ “అన్నాను నేను.
“అరేయ్ బాబా,it’s okay..అయినా నాకు వర్క్ చేస్తుంటే స్ట్రైన్ అనిపించదు…..అందులోనే ఆనందాన్ని వెతుక్కోవడం నాకు నా చిన్ననాటి నుంచి అలవాటు అయ్పోయింది”అన్నాడు తను.
“సరే పద,నేను ట్రీట్ ఇస్తా.. వేడి వేడి కాఫీ అండ్ దోస.. సరేనా?”అడిగా నేను.
“హ్మ్మ్.. దోస సరే కానీ,కాఫీ నాట్ ఒకే …చెప్పానుగా నాకు కాఫీ నచదు..”అన్నాడు తను .
“అరేయ్,ఒక్కసారి తాగిచూడు……ఒక hectic day of work తర్వాత ఒక వేడి వేడి కప్ కాఫీ స్ట్రెస్ బస్టర్ తెలుసా..”అన్నాను .
అప్పటికి బయటకు వచ్చేసాం మేము…అక్కడ ఒక్క వెహికల్ లేదు ……
“ట్రీట్ సంగతి తర్వాత …..ముందు ఇక్కడ్నుంచి ఎలా వేళ్ళలో చూదు..బస్సు టైం ఎప్పుడో దాటిపోయింది.. ఇక్కడ్నుంచి మనకి ట్రాన్స్పోర్ట్ ఎలా ..”అంటూ అటు ఇటు చూస్తున్నాడు ఆర్యన్…
అప్పటిదాకా గమనించలేదు కాని,టైం చుస్తే 9:30దాతుతొన్ది….ఇంచుమించు అందరు వేల్పోయారు,మేము మా డిపార్టుమెంటు బిల్డింగ్ దగ్గర నించుని ఏదయినా వెహికల్ లిఫ్ట్ దోర్కుతుందేమో అని చూస్తున్నాం…….
ఒక పావుగంట చూసామ్…ఏది కన్పించ్లా…ఇంకా అల్లా నడుస్తూ వెళ్ళడమే అని అంకున్తూ…ఉన్నాం..ఇన్తలో మా మేడం బైటకి వచ్చారు,మేము వెయిట్ చెయ్యడం చూసారు.ఆవిడ ఫోన్ లో మాట్లాడతూ మమ్మల్ని రండి అన్నటు సైగ చేసారు…మేము ఆవిడా దగ్గరకు వెళ్ళాం…ఆవిడ ఫోన్ మాట్లాడడం అయ్యేసరికి ఒక కార్ మా దగ్గర వచ్చి ఆగింది.. ఆవిడ కార్లో ఎక్కి కూర్చున్నారు.
“హమ్మయా”అనుకుంటూ మేము వెళ్లి ఆవిడ కార్లో కూర్చున్నాం.ఆర్యన్ ఫ్రంట్ సీట్లో,నేను మేడం బ్యాక్ సీట్లో….బ్లాకు కలర్ మెర్సిడెస్ బెంజ్.. ఆవిడ లాగే చాల డాంబికంగా ఉండి……
“Where do you want me to drop you ? “అంది ఆవిడ.
“Akshaya canteen Madam “అని ఇద్దరం ఒకేసరి జవాబిచ్చం….ఆవిడ దానికి నవ్వుతు…
“Ramana..drop them at Akshaya canteen and take off for today “అని…మాతో మాములుగా మాటాడ్డం మొదలుపెట్టారు …నవ్వుతూ….మాకోసం అడిగారు..తర్వాత మాకు కొన్ని టిప్స్ చెప్పారు….మంచి బుక్స్ సజెస్ట్ చేశారు….కొంత దూరం వచ్చాక,స్టాఫ్ రెసిడెన్స్ దగ్గర దిగిపోయారు.
“Thank you madam “అన్నాంమేము.ఆవిడ నవ్వుతు…”aaryan tommorrow bring some good songs for me bur dont play at your work time okey good night kids” అనేసి వెళ్ళిపోయారు.
మేడం కార్ లోనుంచి దిగిపోయాక అనుకున్నమనస్సులో ఈవిడ మాతో..ఇలా కూడా ఉంటారా అని
“మేడం అంత చెడ్డవారు ఏమికాదు కదా..”అన్నాను నేను ఆర్యన్ తో.
“హ్మ్మ్….”అన్నాడు తను.
“మీరు తెలుగు వాళ్ళ?”అడిగాడు డ్రైవర్.
“అవను..మీరు కూడా తెలుగేన?”అడిగా నేను ఉత్సాహంగా.
“హా..అవను.. కాని 15years అయిపొయింది చెన్నైకి వచేసి”అన్నారు రమణ.
“మేడం చాల మంచివారు…..ఆవిడకి పిల్లలంటే చాలా ఇష్టం..కొంచెం కటువుగా మాట్లాడినా వెంటనే కరిగిపోతారు “అని చెప్పారు ఆయన.తర్వాత ఆయన కోసం చెప్తున్నారు..వాళ్ళ ఉరు ఇక్కడ సంగతులు అలా చెప్తునారు….మేము ఆయన మాటలు వింటూ “ఊ”కొడుతున్నాం……
కొంచెంసేపటికి మమ్మల్ని అక్షయ కాంటీన్ దగ్గర దింపేసి వెళ్ళిపోయారు ఆయన.
“పద ట్రీట్ ఇస్తాను”అన్నాను నేను ………ఆర్యన్ “సరే పద,నాక్కూడా చాలా ఆకలేస్తోంది”అన్నాడు.ఇద్దరం వెళ్లి కూర్చున్నాం.దోస అండ్ కాఫీ ఆర్డర్ చెప్పను.
“మనం అనుకున్నట్టుగా జనాలుండరు కదా “…..అన్నాను నేను.
“అదేం అలా అన్నావ్?”అడిగాడు ఆర్యన్.
“ఊహూ…..లెదూ..జనరల్ గా అన్నాను.మేడం చాలా కోపిస్టి అనుకున్న కాని అంత చెడ్డవారేమి కాదు అనిపించింది”అన్నాను నేను.
“ఓహో….అదా….అందరు మనం అనుకునేట్టుగా ఉండరు శిశిర”అన్నాడుతను.
“అవను……నాకది ఇప్పుడు ఇప్పుడే అర్ధం అవ్తునాది”అన్నాను.
“అవనా..అదేంటి?”అడిగాడు తను…….
“తెలుసా…..నువ్వంటే నాకు చాలా చిరాకు,కోపం…..నిన్ను తిట్టుకొని రోజుండేది కాదు….కాని ఇప్పుడు మంచివాడివే అనిపిస్తున్నావ్ నాకు”అన్నాను.
నేను అల చెప్తుంటే తను నా వైపే వింతగా చూస్తున్నాడు…
“అవునా….నేనేం చేశాను నిన్ను,నన్ను రోజు తిట్టుకునేంతగా?”ఆశ్చర్యంగా అడిగాడు తను.
ఇంతలో ఆర్డర్ వచ్చింది….ఇద్దరం ఇంకా తినడం స్టార్ట్ చేశాం……
“కోపం గా అరేయ్,ఏమ్చేసావా….నువ్వు అన్నిట్లోనూ 1st మరి…. చిన్నపట్నుంచి నేను అన్నిట్లో 1st కాని ఇప్పుడు naa 1st నువ్వు తీసేస్కున్నావ్..నేను నా 1st మల్లా నీ నుంచి తీస్కోడానికి ఎంత ట్రై చేసిన ఒక్కసారి కూడా నిన్ను ఓడించాలేకపోయాను… అందుకే నాకు నీ మీద కోపం..ఇంకా కాలేజీ లో ఫాకల్టీ అంటా నిన్ను మేచ్చుకోడమే…నిన్ను చూసి మమ్మల్ని నీల ఉండమనేవర్రు…అందుకే నాకు నువ్వంటే చాల చిరాకు..”అన్నాను నేను దోస కంప్లీట్ చేస్తూ……
తనేమి మాట్లాడలేదు..దోస తినేసాడు..నాకు ఇంకేం మాట్లాడాలో అర్ధం కాలేదు..నా కాఫీ నేను తాగేసి బిల్ ఇచ్చా….తను మౌనంగా కుర్చుని అటుఇటు చూస్తున్నాడు…….
తన మొహంలో కోపంఅయితే కనిపించలేదు కాని….మౌనంగా ఉన్నాడుకదా సో నాకు కొంచెం awkward గా అనిపించింది…….ఇద్దరం బయటికి వచ్చాం కాంటీన్ నుంచి,అల నడుస్తునాం…తను మాత్రం తన మౌనాన్ని వీడలేదు…..నాకు ఇంకేం మాట్లాడాలో అర్ధంకావట్ల…..అలా సైలెంట్ గానే మా నడక సాగిస్తున్నాం……నా హాస్టల్ కి కొంచెం ముందున్న లాన్ దగ్గరకి వచ్చాం…..
“కొంచెంసేపు ఇక్కడ కుర్చున్దామా”అన్నాడు తను……..
“సరే “అని జవాబిచ్చాను…..
ఇద్దరం వెళ్లి లాన్లో కూర్చున్నాం…….కానీ మా మద్య ఎలాంటి సంభాషనా లేదు…….ఇంకా నేను అలా ఉండలేకపోయ….
“నేను అన్న మాటలు నిన్నుహర్ట్ చేసుంటే సారీ”అన్నాను నేను.
“Shishira I admire you “అన్నాడు తను….
“నాకేం అర్ధం కాలేదు…..You admire me?but,why?”అన్నాను నేను…..
“శిశిర….నీలా చాలా తక్కువమంది ఉంటారు తెలుసా..ఏం అనాలంటే అది అంటావ్….ఎలా ఉండాలంటే అలా ఉంటావ్….నువ్వు జెలసి కూడా తెలియనంత నిర్మలంగా పెరిగావు…..నీకు నామీద ఉన్నది కోపంకాదు తెలుసా……ఒక విదంగా చెప్పాలంటే అది ఈర్ష్య,కాని నీకు అది కూడా తెలియలేదు……ఈరోజుల్లో అసలెవరు నాకు నువ్వంటే చాలా కోపం,ఎప్పుడు తిట్టుకునేదాన్ని అని డైరెక్ట్ గా ఆ తిట్టే వ్యక్తి కే చెప్తారు చెప్పు?మనసులో వాళ్ళని తిటుకున్న..పైకి మాత్రం నవ్వుతూ సంమధానం చెప్తారు ” అన్నాడు తను నావైపు చూస్తూ …………..
నాకు తను అన్నదానికి ఎలా react అవ్వాలో తెలియలేదు…అలా సైలెంట్గా కూర్చున్నాను……..
“నువ్వు నవ్వలంటేనే నవ్తావు,ఏడుపు వస్తే చిన్న పిల్లలా ఏడుస్తావు..అసలెల ఇంత pure hearted గా ఉన్నావు?”అడిగాడు తను.
“నువ్వు చెప్పేదంతా ఫిలాసఫీలా ఉంది,మరీ అంత పెద్ద పెద్ద మాటలు నాకు తెలియవు “అనేసి కాళ్ళు చాపుకుని ఆకాశంలోకి చూస్తున్నాను నేను.
“నాకు నీలా ఉండాలని ఉంది శిశిర…..లైఫ్ లో ఏమాత్రం regrets లేకుండా..”అని తను కూడా నాలా కాళ్ళుచాపుకుని పైకి చూస్తూ అన్నాడు……
“నాలా ఏంటి,నేను నీలా ఉండాలని కాలేజీ అంతా అంటుంటే ..”అని తన భుజం మీద సరదాగా కొడుతూ అన్నాను……
“సరే లే…నువ్వు నాలా,నేను నీలా ఉండాలి సరేనా ఇంకా ..”అన్నాడు తనునవ్వుతూ.
“హ్మ్మ్..బెటర్..”అన్నాను నేను.
కొంచెం సేపు FM లో పాటలు విన్నాం..ఇంకా టైం 11అవ్తొన్దని,ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయాం……
నాన్నకి కాల్ చేసి కాసేపు మాటాడ…good night చెప్పేసి..నా మంచం మీద వాలి కళ్ళు ముస్కున్నాను……నవ్వుతున్న ఆర్యన్ మొహం కనిపించింది నాకు,వెంటనే ఉలిక్కిపడి కళ్ళు తెరిచేస.. ఇన్నాళ్ళు చిరాకు పడుతున్నప్డు ఎప్పుడు కనిపించని తన మొహం ఇప్పుడెందుకు నా కళ్ళ ముందుకు వచ్చిందో…..అర్ధంకాలేదు..ఈ కొత్త మార్పుకి కారణం ఏంటో ,,,ఇన్నాళ్ళు శత్రువులా భావించిన ఆర్యన్.. నాకు ఆప్తుడిలా అనిపిస్తున్నాడు……నాగురించి ఇంతగా తెల్సుకున్న తను కొత్తగా కన్పిస్తూన్నాడు నాకు…..నాకు మాత్రం తన గురించి ఏమి తెలీదు.. తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాను నేను అని ఆలోచిస్తూ నిద్రపోయాను….. ……మెలుకువ వచ్చి టైం చూసా 5 అయ్యింది…..అలారం కన్నా ముందే లేచాను నేను……..
అప్పుడే సూర్యోదయం అవ్తోంది..మార్నింగ్ వాక్కి వెళ్ళడం అలవాటు లేదుకాని,ఎప్పుడైనా ఇలా వేరం లేస్తే తెల్లవారుఝామున వీచే ఆ చల్లగాలిలో అల నడవటం అంటే చాల ఇష్టం నాకు……
సో,కొంచెంసేపు అలా నడుద్దామని,నేను నా హాస్టల్ నుంచి బయటకి వచ్చి అలా నడుస్తూ ఉనా…నిన్న నైట్ మేము కోచుని మాటలడుకున్న ప్లేస్ దగ్గరకి వచ్చా….రాత్రి మా ఇదారి సంభాషణ అంట గుర్తువస్తోంది…..నట నేను తనకోసం పద్కునే అప్పుడ్ ఆలోచించింది …పద్కునే అప్పుడు తన నవ్వు మొహం గుర్తు వచ్చి నేను ఉలిక్కిపడి లేవడం……ఎందుకు ఇలా అనిపిస్తుంది అని ఆలోచిస్తూ అలా పాటలు వింటూ నడుస్తున్న……అలా నడుస్తూ ..ఉన్న…మ్ప్3 ప్లేయర్ లో మంచి సాంగ్స్ ని….తెల్లవారి వీచే ఆ చల్ల గాలిని ఆస్వాదిస్తూ అలా పరిసరాలను చూస్తు ఉన్న ఇంతలో ఆర్యన్ వాళ్ళ హాస్టల్ కనిపించింది…….అలా నడుస్తూ ఏం చేస్తున్నాడో వీడు…..నిద్ర లేచాడ….లేచే ఉంటాడు……లేచిన వెంటనే ఏ పుస్తకమో పట్టుకుని చదువ్తుంటాడు ఈ మహానుభావుడు……హ్మ్మ్మ్ ఫోన్ చేసి చూద్దమ్ ఏం చేస్తున్నాడో అని ఫోన్ కోసం చూస…..అబ్బ ఫోన్ తేలేదు….సరే ఏం చేస్తాం…అని నడుస్తూ ఉన్నా…..
______________________________
Sindhu

485187cookie-checkఒక ప్రేమ కథ – 5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *