అంతే ఆనందబాస్పాలతో లవ్ యు రా అని అమాంతం వాడిని కౌగిలించుకున్నాను .
రేయ్ మహేష్ , నువ్వేమి భయపడకు అక్కయ్య సేఫ్ అనిచెప్పడంతో ,
గుండెలపై చేతినివేసుకొని అక్కయ్యనే తలుచుకుంటూ కళ్ళుమూసుకుని వాడి భుజం పై వాలిపోయాను .
వెహికల్ ఆగడం మాఇద్దరినీ స్టేషన్ లోకి తీసుకెళ్లి , కానిస్టేబుల్ పిల్లలను లాకప్ లో ఉంచండి అని పెద్ద పోలీస్ చెప్పారు .
సర్ చిన్నపిల్లలను ………..లాకప్ లో ,
వాళ్ళ సేఫ్టీ కోసమే మూర్తి గారు , చనిపోయినది MP బావమరిది ……….
సర్ వాడేనా కాన్ఫర్మా ………….. అని ఆనందంతో పొంగిపోతూ మాఇద్దరి చేతులు అందుకొని థాంక్స్ చెప్పారు . సర్ వాడిచావుకోసం ఎంతమంది ఎదురుచూస్తున్నారో తెలుసుకదా సర్ , వాడి వలన అత్యాచారాలకు గురయ్యి అభాగ్యులై కంప్లైంట్ ఇచ్చిన ఫైల్ లో ఒక్కొక్క కంప్లైంట్ పెరుగుతుందే తప్ప మనం ఏమీ చేయలేకపోయాము . ఈ చిన్నపిల్లలు వాడి ప్రాణం తీసినా ఇంతమంది సంతోషాలను కారనడం అవుతారు అని పెద్ద ఫైల్ చూపించాడు .
కానీ వాడి ఫ్యామిలీ అలా ఆలోచించరు కదా ……….., ఖచ్చితంగా పిల్లలను ఏమైనా చెయ్యడానికి తెగించవచ్చు . కోర్ట్ లో సబ్మిట్ చేసేంతవరకూ మనమే పిల్లలను జాగ్రత్తగా కాపాడుకోవాలి అందుకే లాకప్ లో ఉంచమని చెప్పాను . అందులోనూ వాళ్ళ ఇంట్లో రేపు జరగబోతున్న పెళ్లికూడా ఆపేస్తారు , ఆ కోపం కూడా పిల్లలపై చూపించవచ్చు . అందుబాటులో ఉన్న పోలీసులను , హోమ్ గార్డ్స్ ను పిలిపించండి అని అక్కడే కూర్చున్నారు .
Yes సర్ అని సెల్యూట్ చేసి పిల్లలూ మీ క్షేమం కోసమే రండి అని లాకప్ లో కూర్చోబెట్టి , తాగడానికి నీళ్లు అందించి సెల్ కు ఏకంగా రెండు తాళాలను వేసి , ఏమీ భయపడకండి సర్ చాలా మంచివారు అనిచెప్పి ల్యాండ్ లైన్ దగ్గరికివెళ్లి కానిస్టేబుల్స్ హోమ్ గార్డ్స్ అందరినీ వెంటనే స్టేషన్ కు రమ్మన్నారు .
అక్కడ ఇంటిలో కానిస్టేబుల్స్ శవం చుట్టూ మార్క్ వేసి ఫార్మాలిటీస్ పూర్తిచేసి , అంబులెన్స్ లో శవాన్ని పోస్టుమార్టం కోసం హాస్పిటల్ కు పంపించి , ఫైల్ తోపాటు నాన్న దగ్గరకువెళ్లి మీరే కదా మొదట చూసి కాల్ చేసింది . పిల్లలకు మీరేమవుతారు అని అడిగారు .
భయంతో వణుకుతూ ఏమీ కాము సర్ …………, రూంలో స్పృహకోల్పోయిన అక్కయ్య ప్రక్కనే కూర్చున్న అమ్మ నాన్న మాటలకు కోపంతో రగిలిపోతూ , మమ్మల్నే తలుచుకుంటూ బాధపడుతోంది .
సరే ఏమిజరిగిందో , ఏమిచూసారో చెప్పండి అని కానిస్టేబుల్ అడిగారు .
మాది ప్రక్క ఇల్లు సర్ టౌన్ లో ఫంక్షన్ కు అటెండ్ అయ్యి బైకులో ఇంటికి వెళ్తోంటే గట్టిగా కేకలు వినిపించడంతో ఆగి పరుగునవచ్చిచూస్తే ఇద్దరు పిల్లలు అతికిరాతకంగా చంపేశారు సర్ ……….
మీ పేరు ……….
పేరు పేరు ……….మల్లన్న సర్ అని మాఇంటి ప్రక్కనే ఉన్న వాళ్ళ పేరు చెప్పాడు.
అయితే సాక్షిగా మీరువచ్చి కోర్ట్ లో సాక్ష్యం చెప్పాలి మల్లన్న ఇక్కడ సంతకం చెయ్యండి అని ఫైల్ చూపించారు .
సర్ పోలీసులు , కోర్ట్ అంటే మాకు చచ్చేంత భయం మమ్మల్ని ఇందులో involve చేయకండి . ఏదో మా మంచితనం వలన మీకు కాల్ చేసి విషయం చెప్పాను అని రెండు చేతులతో నటించడంతో ,
సరే చూద్దాము అని ఇద్దరు కానిస్టేబుల్స్ బైకులో వెళ్లిపోయారు .
ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా ఫోన్ నుండి ట్రాన్స్పోర్ట్ కు కాల్ చేసి పెద్ద లారీ , కార్ మరియు ఎంతమంది ఉంటే అంతమంది పనివాళ్లను పంపించండి అని అడ్రస్ చెప్పారు .
సర్ అర్ధరాత్రి అయ్యింది కుదరదు సర్ ………
హెలో హెలో బాస్ మీరు ఎంత అడిగితే అంత అమౌంట్ డబల్ త్రిబుల్ ఇస్తాను please please ………….అని బ్రతిమాలడంతో ,
సరే సర్ అర గంటలో ఉంటాము అని బదులివ్వడంతో , థాంక్యూ థాంక్యూ soooooo మచ్ అని , వాళ్లకు కనిపించకుండా శవపు మార్క్ పై దుప్పటి కప్పి , రూంలోకివెళ్లి కంగారుపడుతూ బ్యాగు అందుకొని బీరువాలో సేఫ్టీ గా ఉంచిన నగలను , డబ్బుని అందులోకి మార్చేస్తూ , జానకి తొందరగా విలువైన వస్తువులను తీసుకొచ్చి బ్యాగులలోకి మార్చేయ్ .
ఎందుకండీ …………
చెబుతాను త్వరగా త్వరగా ……….అని ఇల్లుమొత్తం తిరుగుతూ ఎక్కడా ఒక్క ఫోటోకూడా లేకుండా ఒక పెద్ద బాక్స్ లో నింపేశారు .
ఈ బ్యాగు పైకి తీసుకెళ్లి నీ కూతురి బట్టలను ఇందులోకి మార్చేయ్ ………ఇంకా అలా చూస్తున్నావే వెళ్లు త్వరగా అని తోసారు .
ఏమీ అర్థం కాని అమ్మ పైకివెళ్లింది .
ఇంతలో లారీ ఆగినట్లు సౌండ్ రావడంతో , గుమ్మం దగ్గరకువెళ్లి కారుతోపాటు చాలామందిని చూసి హమ్మయ్యా అనుకుని ఇది అడ్వాన్స్ మాత్రమే అంటూ పెద్ద అమౌంట్ చేతిలో ఉంచి , మొత్తం సామానులను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మార్చేయ్యాలి , ఏమాత్రం సౌండ్ చేయకూడదు నా కూతురు నిద్రపోతోంది అనిచెప్పారు .
వాడి పెదాలపై చిరునవ్వుతో మీరే చూస్తారు కదా సర్ అని మొత్తం అన్నట్లు సైగచెయ్యడం ఆలస్యం , పనివాళ్ళు వాళ్లపని వాళ్ళు చకచకా పూర్తిచేసేశారు .
అమ్మ ఆశ్చర్యపోతూ నాన్నను అడిగినా రిప్లై ఇవ్వకపోవడంతో కొప్పడటం చూసి , నాన్న నేరుగా వంట గదిలోకివెళ్లి జ్యూస్ లో నిద్రమాత్రలు కలిపి టెన్షన్ తగ్గుతుంది తాగమని వద్దన్నా నోటికి అందించడంతో అమ్మ కొప్పుడుతూనే తాగేసింది .
కొద్దిసేపట్లోనే కళ్ళు మూతలు పడుతుండటంతో , నాన్న నడిపించుకుంటూ వెళ్లి అక్కయ్య ప్రక్కనే పడుకోబెట్టి , మొదట అక్కయ్యను ఎత్తుకొనివెల్లి కారులో వెనుక పడుకోబెట్టారు , నగలు డబ్బు బ్యాగుని తీసుకెళ్లి కారులో ఉంచి , మత్తుగా నిద్రపోతున్న అమ్మను కూడా ఎత్తుకుని వెళుతూ మీరు ఒప్పుకోరు కాబట్టే ఇలాచెయ్యాల్సి వచ్చింది అని కారులో అక్కయ్య ప్రక్కనే పడుకోబెట్టి , చుట్టూచూసి హమ్మయ్యా ………..అందరూ పొలం పనులు చేసి దున్నపోతుల్లా నిద్రపోతుండటం వలన అనుకున్నది అనుకున్నట్లు పూర్తయ్యింది అని చివరగా రూంలోని వస్తువులను కూడా లారీలోకి మార్చెయ్యడంతో , మీరు కోరిన అమౌంట్ unload అయ్యాక ఇచ్చేస్తాను మరొక్క క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు అని నాన్న కారులో ఎక్కి పోనివ్వమనడంతో లారీ వెనుకే ఫాలో అయ్యింది .
ఫంక్షన్ పూర్తిచేసుకుని ఇంటికిచేరుకున్న కుటుంబసభ్యులకు తెలపాలనుకుని స్టేషన్ లో తగినంతమంది లేకపోవడంతో , పిల్లల సేఫ్టీ ముఖ్యం అనుకుని తెల్లవారేంతవరకూ గోప్యన్గా ఉంచి , సూర్యోదయం అయ్యాక కానిస్టేబుల్స్ వెళ్లి షాకింగ్ న్యూస్ చెప్పడంతో , అందరూ శోకసంద్రంలో మునిగిపోయి హాస్పిటల్ చేరుకుని బాడీ చూసి , ఎలాజరిగిందో తెలుసుకుని నెక్స్ట్ మినిట్ అంబులెన్స్ లో ఇంటికి పంపించేసి స్టేషన్ లాకప్ లో ఉన్న వాళ్ళు మల్కీ సూర్యుణ్ణి చూడరాదు అని కోపంతో చెప్పడంతో , yes సర్ అంటూ తన అనుచరులు పెద్దమొత్తంలో స్టేషన్ వైపు కదలడం చూసిన కానిస్టేబుల్స్ వెంటనే హాస్పిటల్లోని ల్యాండ్ లైన్ నుండి స్టేషన్ కు సమాచారం అందించి వెనుకే స్టేషన్ కు బయలుదేరారు .
తెల్లవారుఘామునే వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పి ఫ్రెష్ అయ్యి మహేష్ దగ్గరికి పరుగున వెళ్లే తనకొడుకు తెల్లవారినా రాకపోవడంతో , నన్ను అక్కయ్యను అమ్మను పలకరించినట్లు ఉంటుందని అమ్మ ఇంటికిచేరుకుని తలుపులు పూర్తిగా తెరుచుకుని ఉండటంతో లోపలికివచ్చి ఒక్కవస్తువూ లేకపోవడంతో ఆశ్చర్యపోయి , వాసంతి జానకి …………. అనిపిలుస్తూ కంగారుపడుతూ కొన్ని అడుగులువేసి మెట్ల ప్రక్కనే శవపు మార్క్ చూసి భయంతో వణికిపోయి పరుగున ఇంటికిచేరుకుని వొళ్ళంతా చెమటతో నోట్లో మాటరానట్లు బా……..మహే……….అంటూ అంకుల్ మరియు అన్నయ్యకు చెప్పడానికి try చేస్తోంది .
అమ్మా ……….ఏమైంది అలా భయపడుతున్నారు . ఇలా కూర్చుని శాంతించండి అని వాళ్ళుకూడా కంగారుపడుతూ నాన్న తొందరగా వెళ్లి నీళ్లు తీసుకురండి అనిచెప్పాడు అన్నయ్య .
నీల్లువద్దు ఏమీవద్దు అని అంకుల్ , అన్నయ్యల చేతులనుపట్టుకుని వడివడిగా ఇంటికీపిలుచుకునివచ్చి ఇల్లుమొత్తం ఖాళీ అని సైగ చేసి మార్క్ దగ్గరకు పిలుచుకొనివెళ్లి చూపించింది . అమ్మలానే ఇద్దరూకూడా ఆశ్చర్యం షాక్ తో మహేష్ , కృష్ణ ………..అని కేకలువేస్తూ పైకివెళ్లికూడా చూసొచ్చి ఎక్కడా ఎవ్వరూ లేరు , ఒక్కసామాను కూడా లేదు .
తొందరగా నువ్వెళ్ళి పెద్దయ్యను పీలుచుకొనిరా అని అంకుల్ చెప్పడంతో అన్నయ్య టెన్షన్ పెడుతూనే పరుగునవెళ్లి పెద్దయ్యతోపాటు ఊరిజనాలను పిలుచుకునివచ్చాడు .
చూసి ఏమీ అర్థం కానట్లు బాబు మహేష్ , తల్లీ వాసంతి అంటూ కళ్ళల్లో నీళ్లతో అందరూ ఇల్లుమొత్తం మరియు ఇంటిచుట్టూ కాంపౌండ్ లో మరొకసారి అణువణువూ చూసి ఎక్కడా లేకపోవడం , శవపు మార్కు ఉండటం చూసి ఊరిజనమంతా మాకు ఏమైందో అన్న బాధలో ఒక్కొక్కరూ ఒక్కొక్క విధంగా గుసగుసలాడుతోంటే ,
మనవాళ్లకు ఏమీ అయి ఉండదు ఈ శవపు మార్క్ 51/2 అడుగులకు పైనే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరో మగవాళ్ళది అని పెద్దయ్య కాన్ఫిడెంట్ గా చెప్పడంతో , అందరూ ఊపిరిపీల్చుకుని , మరి మనవాళ్ళు ఎక్కడ , సామానులన్నీ ఏమైపోయాయి రాత్రికిరాత్రి అని మళ్ళీ కంగారుపడుతూ ఏమీకాకూడదు అని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు .
ఈ మార్క్ వేశారంటే ఖచ్చితంగా రాత్రి పోలిసులు వచ్చారు . కాబట్టి స్టేషన్ కు వెలితే ఏమిజరిగిందో తెలుస్తుంది అని పెద్దయ్య అనడం ఆలస్యం , రేయ్ ట్రాక్టర్లు తియ్యండి అందరమూ వెళదాము అని , అమ్మకు ధైర్యం చెప్పి ఊరిలోని మగవాళ్ళంతా టౌన్ కు బయలుదేరి స్టేషన్ చేరుకున్నారు .
స్టేషన్ బయట వీపు వెనుక కర్రలు కత్తులు దాచిపెట్టుకున్న ఒక 20 -25 మంది తెల్లచొక్కాలు వేసుకుని కోపంతో గుంటకాడ నక్కల్లా ఎదురుచూస్తున్నట్లు అందరూ గమనించారు .
ఒకేసారి అంతపెద్ద మొత్తంలో ట్రాక్టర్లలో దిగేసరికి ఇద్దరు కానిస్టేబుళ్లు వచ్చి పెద్దయ్యతోపాటు అందరినీ స్టేషన్ బయటే ఆపేశారు .
లోపలకు వెళ్లిన మన అన్నయ్య ఎలాగోలా ఆ పిల్లనాయాళ్లను లాక్కొనివస్తారు ఇక్కడే కత్తికి కండగా నరికి మన సర్ బాధను కొద్దిగానైనా తగ్గించాలిరా అని తెల్లచొక్కాలవాళ్ళు మాట్లాడుతోంటే , మేమని తెలియని పెద్దయ్య , అందరూ విని కానిస్టేబుళ్లతో SI గారిని కలవడానికి వచ్చాము అన్నారు .
ఇంతమంది కలవడానికి వీలుకుదరదు ఏవైరానా ఇద్దరు ముగ్గరు అయితే ok అని బదులివ్వడంతో ,
సరే సర్ అని పెద్దయ్యతోపాటు ముగ్గురు లోపలకు వెళుతోంటే , ఇంతకుముందు లోపలకు వెళ్లిన తెల్లచొక్కావాళ్లను కానిస్టేబుల్స్ బయటకు లాగేస్తున్నారు .
ఏయ్ SI మమ్మల్నే బయటకు తోసేస్తావా ………..మా సర్ తో పెట్టుకుంటున్నావు ట్రాన్స్ఫర్ అయిపోతావు అని వేలితో బెదిరిస్తూ , ఆ పిల్లలను నువ్వుకాదు కదా ఆ భగవంతుడు కూడా రక్షించలేడు , ఏక్షణమైనా వాళ్ళ అంతుచూస్తాము అని కోపంతో మాట్లాడుతోంటే ,
ఏమి చేసుకుంటావో , ఎవరిని పిలుచుకునివస్తావో పీలుచుకొనిరా ఆ పిల్లలను కోర్ట్ లో సబ్మిట్ చెయ్యడం నా కర్తవ్యం . నా డ్యూటీ నేను నిర్వర్తిస్తున్నాను ఎవ్వడికీ భయపడను అని చల్ రే నీలాంటివాళ్లను నా సర్వీస్ లో చాలామందిని చూసాను అని లోపలికివెళ్లిపోయారు .
వాడు కోపంతో ఊగిపోయి రేయ్ కాయిన్ బాక్స్ లోనుండి కాల్ చేసి మనవాళ్ళందరినీ రమ్మని చెప్పరా …………. స్టేషన్ కూల్చయినా పిల్లల అంతు చూడాల్సిందే , ఆ న్యూస్ తో కానీ మనం సర్ దగ్గరకు వెళ్లకపోతే మన ప్రాణాలు తీసేస్తారు మన సర్ అనిచెప్పగానే , ఒకడు స్టేషన్ కాంపౌండ్ బయటకువెళ్లి కాయిన్ బాక్స్ నుండి కాల్ చేసి అందరినీ రమ్మని చెప్పాడు .
కానిస్టేబుల్స్ , హోంగార్డ్స్ ……….. అందరూ అలెర్ట్ గా ఉండండి మన ప్రాణాలు ఫణంగా పెట్టైనా పిల్లలను కాపాడాలి , మనం చేయలేని మంచిపనిని చేసి అతని బారి నుండి పడబోయే ఎంతోమందిని రక్షించారు అని చెప్పడంతో ,
Yes సర్ అంటూ లాఠీలు పట్టుకుని రెడీ అయిపోయారు .
స్టేషన్ బయట తెల్లచొక్కాల వాళ్ళు పోలీసులపై కోపంతో ఊగిపోతూ ఆయుధాలను రెడీ చేసుకుంటున్నారు .
పెద్దయ్యా , అన్నయ్యావాళ్ళు ఏమీ పట్టించుకోకుండా మాకు ఏమైందోనని కంగారుపడుతోయి లోపలకు వెళ్లి సర్ ………….
పెద్దయ్యా ………..అని కృష్ణగాడి పిలుపుకు ,
పెద్దయ్యా మరియు కృష్ణగాడి నాన్నగారు కృష్ణ అంటూ లాకప్ దగ్గరకు పరిగెత్తి బాబు మహేష్ ……….ఎంత కంగారుపడ్డామో తెలుసా ఇంటిలోని శవపు మార్క్ ను చూసి హమ్మయ్యా ……….. మీరు కనిపించారు అదిచాలు అని మా బుగ్గలను ప్రాణంలా స్పృశించి , మీరు లాకప్ లో అని కోపంతో లాగెయ్యబోయారు .
కానిస్టేబుల్స్ పెద్దయ్యా , అంకుల్ వీపుపై రెండు దెబ్బలు వేసి బయటకు లాగెయ్యబోతుంటే ,
సర్ సర్ ………… వాళ్ళు అమాయకులు సర్ , మా ప్రాణం , వాళ్ళు లాకప్ లో ఉండటం చూసి తట్టుకోలేకపోతున్నాము కావాలంటే మమ్మల్ని వేసి వాళ్ళను వదిలెయ్యండి అని బాధతో చెబుతోంటే ,
SI గారు తన గదిలోనుండి బయటకువచ్చి కానిస్టేబుల్స్ అంటూ ఆపారు .
సర్ సర్ మా పిల్లలను ఎందుకు లాకప్ లో వేశారు అని అడిగారు .
రాత్రి ఆ పిల్లలు పెద్ద రాజకీయనాయకుడి బావమరిదిని చంపేశారు అనిచెప్పగానే ,
నలుగురూ షాక్ తో మహేష్ , కృష్ణ ………
అవును పెద్దయ్యా ………… మేమే మాచేతులతో చంపేసాము .
ష్ ష్ ……….. మళ్లీ మీ నోటి నుండి ఆమాట రాకూడదు అని చేతులతో మా నోటిని మూసేసి , సర్ ఆ హత్యను చేసింది ఆ పిల్లలు కాదు నేను అని పెద్దయ్య ,
నేను అని కృష్ణగాడి నాన్నగారు …….
నేను , నేను అని వెనుక ఉన్న అన్నయ్యలు చెప్పడం చూసి , SI గారు ఆశ్చర్యపోతున్నారు .
పెద్దయ్యా , పెద్దయ్యా ……….. అని ఆపకుండా పిలుస్తుంటే ,
మీరు మాప్రాణం మా ప్రాణాలైనా అర్పించి కాపాడుకుంటాము అని మాదగ్గరికి వచ్చారు .
పెద్దయ్యా ………. ఆ హత్య గురించి మరొక్కమాట మాట్లాడితే మీ బుజ్జి దేవుడినైన నామీద ఒట్టు అని చేతుని తలపై పెట్టుకున్నాను .
బాబు ……..మహేష్ …….. సంవత్సరాలపాటు జైల్లో వేస్తారు ……… మీరు ఉండలేరు నామీద వేసుకుని నేను అంటోంటే ,
మళ్లీ నాచేతిపై చేతినివేసుకున్నాను . అంతే ఒక్కసారిగా పెద్దయ్య కళ్ళల్లో కన్నీళ్లు …………
పెద్దయ్యా ……… అంటూ చేతులుపట్టుకొని , మీరు ఇలా చేస్తే హత్య ఎవరు చేశారో ఎంక్విరీ వేస్తారని బుక్స్ లో చదువుకున్నాము . అలా జరుగనే జరగకూడదు . ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకోండి అని కన్నీళ్ళతో చెప్పాను .
అంటే ఆ హత్య ……….. నా కన్నీళ్లను తుడిచి అర్థమైంది మహేష్ అర్థమైంది మొత్తం ఇప్పుడే అర్థమైంది . అక్కయ్య ………… తప్పంతా మాది వాడు వెంటపడుతున్నాడని తెలిసికూడా మా బుజ్జి దేవుడికి కాపలా ఉండాల్సినవాళ్ళమ ఇంట్లో నిద్రపోయాము . ఆపాపం మాది మాది అని ఊసలకు తలను కొట్టుకున్నారు .
పెద్దయ్యా పెద్దయ్యా ……….అని ఇద్దరమూ మా చేతులను అడ్డుపెట్టాము .
కానిస్టేబుల్స్ ఆపి వెనక్కు లాక్కెళ్లారు .
మేమంతా బ్రతికి ఉన్నా శవాలకిందే లెక్క మహేష్ , మమ్మల్ని క్షమించు అని కన్నీళ్లను ధారలా వదులుతూ మోకాళ్లపై కూర్చుని రెండు చేతులనూ జోడించారు .
పెద్దయ్యా ……….ఏమంటున్నారు .
అవునురా మనం ఇంతమంది ఉండి మన ప్రాణాన్ని కాపాడుకోలేకపోయాము అని కానిస్టేబుల్ చేతిలోని లాఠీ అందుకొని తనని తాను కొట్టుకున్నారు .
అంకుల్ , అన్నయ్యలు కూడా పెద్దయ్య చెప్పినది నిజమేనని లాఠీలు అందుకోబోతుంటే కానిస్టేబుల్స్ ఆపారు .
SI గారు బాధతో కళ్ళల్లో చెమ్మను తుడుచుకుని కానిస్టేబుల్స్ అని సైగ చెయ్యడంతో అందరినీ ఆపి పొడవాటి స్టూల్ పై కూర్చోబెట్టారు .
మేమిద్దరమూ పెద్దయ్యా , నాన్న , అన్నయ్యా ……….. అంటూ ఏడుస్తూ ఆపడానికి ప్రయత్నించాము .
సర్ వాళ్ళు అమాయ………..
పెద్దయ్యా …………. మీరు మరొక్కమాట మాట్లాడితే ఈ లాకప్ లో మా చావులను చూస్తారు అనిచెప్పడంతో ,
మహేష్ అంతమాట అని అక్కడితో ఆగిపోయారు .
చూడండి నేనుకూడా రాత్రన్తా ఇదేవిషయమై పిల్లలను ఒప్పించడానికి ప్రయత్నించాను కానీ ఈ హత్యను మేమే చేసాము అని చెబుతూనే ఉన్నారు . మనం చెయ్యడానికి ఏమీలేదు ఇక కోర్ట్ వాళ్ళ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది . నా వంతుగా పిల్లలను కాపాడుకుంటున్నాను .
మేము చెయ్యవలసినది చేయక ఇప్పుడు బాధపడుతున్నాము . మమ్మల్ని ఆ అమ్మవారుకూడా క్షమించరు , ఏమీకాని మీరు ఎంతో చేస్తున్నారు అని లేచి SI గారి పాదాలకు నమస్కరించారు .
అంతలో ఇద్దరు స్టేషన్ మెట్లదగ్గరకువచ్చి ఏయ్ SI ఈ టౌన్ మొత్తం మా సారు అండర్ కంట్రోల్ మరొక్కసారి చెబుతున్నాము పిల్లలను మాకు అప్పచెప్పి రాసిన FIR చింపేయ్యండి . కొద్దినిమిషాల్లో మా రౌడీలు మొత్తం ఇక్కడకు చేరుకుంటున్నారు , పిల్లలతోపాటు మీప్రాణాలు కూడా మిగలవు అని వార్నింగ్ ఇస్తుంటే ,
సర్ పోలీస్ కంట్రోల్ రూమ్ కు కాల్ చెయ్యడం మంచిది సర్ మనమంతా కలిపి 8 మందిమే ఉన్నాము . ఇప్పటికే బయట 30 మంది ఆయుధాలతో ఉన్నారు ఇంకెంతమంది వస్తారో అని ఒక కానిస్టేబుల్ భయపడుతోంటే ,
కానిస్టేబుల్స్ మనం పోలీసులం వాళ్ళు ఆఫ్ట్రాల్ వీధి రౌడీలు …….. భయపడేవాళ్ళు ఉన్నఫలంగా వెళ్లిపోవచ్చు నేనేమీ అనుకోను అనిచెప్పి వెనుకకు తిరిగారు .
అందరూ ఒకరిముఖాలను మరొకరు చూసుకుని సర్ ముందుకువెళ్లి మీరే మాకు ఇన్స్పిరేషన్ సర్ ఇలాంటి పిల్లలను రక్షిస్తూ ప్రాణాలుపోయినా పర్లేదు మీతోపాటే ఉంటాము సర్ అనిచెప్పారు .
అయితే lets టేక్ పొజిషన్స్ అని ధైర్యంతో కేకవేయ్యడంతో లాఠీలతో నిలబడ్డారు .
అందివచ్చిన అవకాశాన్ని వదులుకున్నారు పోలీసులు ఇక అంటూ చేతితో గొంతుకోసినట్లు సైగచేసి బెదిరిస్తుండటం చూసి , మన పిల్లలను కాపాడుతున్న దేవుడిలాంటి పోలీసులనే బెదిరిస్తారా …….. రేయ్ రంగన్నా అని పెద్దయ్య సైగచెయ్యడం ఆలస్యం ముగ్గురూ కోదమ సింహాల్లా పరుగుపెట్టి వాళ్ళిద్దరిమీదకు దూకి చేతులు కాళ్ళను వెనక్కు విరిచేసి నోటిలోనుండి మాటరానట్లు చేసి ప్రక్కకు పడేసారు .
వాళ్ళ అరుపులు కిలోమీటర్ వరకూ వినిపించినట్లు బయట ఉన్న తెల్ల చొక్కాలలోనివాళ్ళు రేయ్ మనవాళ్లను కొడుతున్నారురా ఆయుధాలు అందుకోండి వాళ్ళందరినీ నరికేయ్యాలి అని కేకవేసి పరుగున వస్తుంటే , ప్రక్కనే ఉన్న మా ఊరి జనమంతా చుట్టుముట్టేసి క్షణాల్లో నెలరోజులపాటు కదలలేనట్లు కుమ్మేసి వదిలారు .
వాళ్ళ అరుపులు ఊరంతా వినిపించినట్లు ఫోన్ చేసి వినిపించినవాళ్ళు అప్పుడే స్టేషన్ చేరుకుని వాళ్ళ వాళ్ళ పరిస్థితిని , మా ఊరి జనం కోపాన్ని చూసి చేతిలోని ఆయుధాలను వదిలి ఎలావచ్చారో అంతకు డబల్ వేగంతో తుర్రుమన్నారు .
ఊరిజనమంతా SI గారితోపాటు బయటకువచ్చిన పెద్దయ్య దగ్గరకు చేరుకుని విషయం తెలుసుకుని , మన బుజ్జి దేవుడు లోపల ఉన్నాడా అని అందరూ లోపలకు దూరి చూడబోతుంటే ,
కానిస్టేబుల్స్ సర్ సర్ ……….
వదలమని సైగచెయ్యడంతో అడ్డుతప్పి వదిలారు . బాబు బాబు ……..అంటూ వచ్చి బాధతో పలకరించి , హత్యను నామీద నామీద నామీద………. వేసుకుంటాము అని మాట్లాడుతోంటే , పెద్దయ్య లోపలికివచ్చి అందరినీ ఆపేశారు .
పెద్దయ్యా ……… ఇంత చిన్నపిల్లలకోసం ఇంతమంది ప్రాణాలివ్వడానికి సిద్ధపడటం చూస్తుంటే ఖచ్చితంగా పిల్లలు ఏదో గొప్పదే సాధించి ఉంటారు.
అవును సర్ మేమంతా ఒక ఊరివాళ్ళమే , ఈ విషయం తెలిస్తే మరొక ఊరు మొత్తం వచ్చేస్తుంది అని పెద్దయ్య మొత్తం వివరించారు .
మహేష్ అని నా కురులపై స్పృశించి నేను కూడా నీ అభిమానిని అయిపోయాను అన్నారు .
ఇంతలో స్టేషన్ బయట వరుసబెట్టి వెహికల్స్ ఆగడం , అందులోనుండి స్వయంగా MP గారే స్వయంగా రావడంతో , SI గారు డ్యూటీలో భాగంగా వెళ్లి నమస్కరించి లోపలకు పిలుచుకునివచ్చారు .
సర్ వీల్లే అని కొందరు ఊరి జనాన్ని చూపించి భయంతో వెనుక దాక్కున్నారు .
అందరి మధ్యనే లోపలకు వెళ్లి కుర్చీలో కూర్చుని , కానిస్టేబుల్స్ తాళం తీసి ఆ పిల్లలను తీసుకురండి అని చెప్పారు .
Sir sir ………..
ఏంటి సర్ సమయం లేదు , బావమరిది చనిపోయాడు , పెళ్లి ఆగిపోయింది , పరువు పోయింది …………. నిమిషంలో పిల్లలిద్దరూ నా వెహికల్లో ఉండాలి .
No సర్ క్షమించండి , FIR రాసేసాము పిల్లలిద్దరినీ కోర్ట్ లో సబ్మిట్ చేసేంతవరకూ మా స్టేషన్ కంట్రోల్ లోనే ఉంటారు అని SI సర్ సమాధానమిచ్చారు .
రేయ్ లాకప్ పగలగొట్టి పిల్లలను లాక్కొని రండి అని కేకవేశాడు .
సర్ మీకు తెలుసో తెలియదో మీ బావమరిది మీరనుకున్నంత మంచివాడు కాదు . చుట్టుప్రక్కల డిస్ట్రిక్ట్ మొత్తం లెక్కలేనన్ని కేసులు ఉన్నాయి . త్వరలోనే మేమే ఎన్కౌంటర్లో లేపేయాలని పైనుండి ఆర్డర్స్ వచ్చాయి ఇంతలో ఆ పిల్లలే మా శ్రమను తగ్గించారు అని చెప్పారు .
అవన్నీ నేను ఆలోచించే పరిస్థితుల్లో లేను SI , ప్రాణానికి ప్రాణం అంతే రేయ్ చూస్తారేంటి లాక్కుని రండి అని కోపంతో అరిచాడు .
వెనుక ఉన్నవాళ్ళంతా ఊరిజనాన్ని చూసి భయపడి అడుగువెయ్యకపోవడం చూసి వెనుక ఉన్న కానిస్టేబుల్స్ నవ్వుకున్నారు .
వీళ్ళకి భయపడతారా ………అని వాళ్ళ మనుషుల చెంపలపై కొట్టి , అయితే నేనే లాక్కొనివస్తాను అని అడుగుముందుకెయ్యడం ,
మొదట SI గారు ఆయన వెనుక పెద్దయ్యా ఊరిజనమంతా అడ్డు నిలబడ్డారు .
నేను మీ అందరికీ నాయకుడిని నాకే అడ్డుపడతారా ……….
ముందు మీరు ప్రజా సేవకులు సర్ , మీరు చెయ్యనివి మా పిల్లలు మాకు అందించారు . వాళ్లకోసం మాప్రాణాలైనా అర్పిస్తాము అని బదులిచ్చారు .
నన్నే ఎదిరిస్తారా ……….. నా బావమరిది కట్టె కాలేలోపు నా పవర్ ఏంటో చూపిస్తాను అని కోపంతో వెళ్లిపోయారు .
పైనుండి ఆర్డర్స్ వచ్చేలోపు జడ్జిగారిని రిక్వెస్ట్ చేసి ఈరోజే కోర్ట్ లో సబ్మిట్ చేసేలా చూస్తాను అని SI గారు కాల్స్ చేయబోతే ,
సర్ పెద్దమనసుతో మాపిల్లలను వదిలి మమ్మల్ని ,
పెద్దయ్యా ………. మీరు నామాట వినడం లేదుకాదూ అంటూ ఊసలకు బలంగా తలతో కొట్టాను .
బాబు బాబు అని అందరూ కన్నీళ్ళతో బాధపడటం , పెద్దయ్య మౌనంగా ఉండిపోవడంతో ఆపాను .
SI గారు కాల్స్ చేసి మధ్యాహ్నం 12 గంటలకు పర్మిషన్ ఇచ్చారు అంతవరకూ జాగ్రత్తగా చూసుకోవాలి .
మేముకూడా ఇక్కడే ఉండి కాపలా కాస్తాము సర్ అని స్టేషన్ చుట్టూ నిలబడ్డారు .
పెద్దయ్యను , కృష్ణగాడి నాన్నను పిలిపించి ముందు కృష్ణగాడి అమ్మ ఎలాఉన్నారు అని అడిగాను .
ఈ విషయం తెలియక మీరెక్కడ అని ఉదయం చాలా కంగారుపడుతున్నారు మీ అన్నయ్యతో కబురుపంపాము అని బదులిచ్చారు .
మరి వాసంతి అక్క , అమ్మ చాలా బాధపడుతుంటారు కదా పెద్దయ్యా ………అని కృష్ణగాడు నాచేతిని పట్టుకుని ధైర్యాన్నిస్తూ అడిగాడు .
మహేష్ నువ్వు మాకు దేవుడిచ్చిన వరప్రసాదం , నీతో అపద్దo చెప్పలేము . రాత్రికి రాత్రే మొత్తం ఇంటిసమానులతో సహా ఎక్కడికో వెళ్లిపోయారు మహేష్ .
పెద్దయ్యా ………. ఏమంటున్నారు .
అవును మహేష్ వంట గదిలో ఈ నిద్రమాత్రలు బాటిల్ కనిపించింది . అంటే మీ అక్కయ్యా , అమ్మలను ఒప్పించలేనని వారికి నిద్రమాత్రలు ఇచ్చి పడుకున్నాక తీసుకెళ్లిపోయినట్లున్నాడు మీనాన్న . మీ నాన్న గురించి తెలుసుకదా అనిచెప్పారు .
ఒక్కసారిగా నాకళ్ళల్లో నీళ్లతో స్పృహకోల్పోయినట్లు కిందపడిపోతుంటే కృష్ణగాడు పట్టుకుని నెమ్మదిగా కూర్చోబెట్టాడు .
కానిస్టేబుల్ లాకప్ తెరవండి అని సర్ చెప్పడంతో , తెరవగానే పెద్దయ్యా , అంకుల్ లోపలికివచ్చి బాబు మహేష్ మహేష్ అంటూ నీళ్లతో మేల్కొలిపి నీళ్లు తాగించారు .
పెద్దయ్యా ………అని హృదయం నుండి తన్నుకొస్తున్న బాధతో , తడబడుతూ వణుకుతూ ఎక్క……డికి వెళ్ళా……రో తెలిసిందా అని అడిగాను .
క్షమించు మహేష్ అందరమూ మా కర్తవ్యాన్ని మరిచిపోయి ఆదమరిచి నిద్రలోఉన్నాము అని బాధపడుతూ బదులిచ్చారు .
వెంటనే కన్నీళ్లను తుడుచుకుని ఇప్పటికి అక్కయ్య ఎవ్వరికీ తెలియని దగ్గర సేఫ్ గా ఉండటమే మంచిది అనిచెప్పాను . నాన్న గురించి తెలిసినా తప్పకుండా అక్కయ్య వస్తుందని నమ్మకంతో ఉన్నాను .
అన్నయ్య లోపలికి వచ్చి తమ్ముళ్లూ అంటూ కౌగిలించుకుని , మీరు స్టేషన్ లో ఉన్నారని విషయం మొత్తం అమ్మకు చెప్పాను .
అమ్మ నామీద కోప్పడి………….
తమ్ముడూ మహేష్ కు అనుక్షణం ఆపదలోకూడా తోడుగా ఉన్నందుకు అమ్మ చాలా చాలా సంతోషించి గర్వపడింది తమ్ముడూ ………
చెప్పాను కదరా అమ్మకు నాకంటే నువ్వంటేనే ప్రాణం అని అని భుజం చుట్టూ చేతినివేశాడు .
లవ్ యు అమ్మా ………అని రెండుచేతులతో అంకుల్ కు నమస్కరించాను .
మేము లేకపోయినా కృష్ణ నీప్రక్కన ఉన్నందుకు నెనుకూడా చాలా చాలా సంతోషిస్తున్నాను మహేష్ .
తమ్ముళ్లూ………. మీకోసం అమ్మ అప్పటికప్పుడు మ్యాగీ చేసిచ్చింది అని అందించాడు .
అన్నయ్యా …………. వాడికి తినడం రాదు , తినిపించాలి అనిచెప్పడంతో , పెద్దయ్య తినిపించబోతే అక్కయ్య ఎక్కడికీ వెళ్లిందో అనే బాధతో తినకపోవడంతో ,
ఎవ్వరికీ తెలియకుండా సీక్రెట్ గా మీ అక్కయ్య , అమ్మ ఎక్కడుందో కనుక్కునే బాధ్యత మాది మహేష్ , 12 గంటలకు కోర్ట్ కు వెళితే ఎంత సమయం అవుతుందో తిను నాన్నా అని పెద్దయ్య బాధపడటం చూసి , కన్నీళ్లను తుడిచి తిన్నాను . కృష్ణగాడికి అన్నయ్య తినిపించాడు