అరగంట తర్వాత ఫైట్ అనౌన్స్ చేయగానే ఇద్దరం డిపార్చర్ గేట్ కి వెళ్లి ఫ్లైట్ ఎక్కి కూర్చున్నాం….రమ్య కి విండో వైపు సీట్ ఇచ్చాను…ఎందుకంటే తాను ఉన్న కోపం కి ఇప్పుడు ఎవరు పొరపాటున తనకి తగిలిన కొట్టేస్తుంది…అందుకే….ఫ్లైట్ స్టార్ట్ అయి ఎయిర్ బోన్ అవగానే కాక్పిట్ నుంచి విల్సన్ బయటకి వచ్చి వాష్ రూమ్ కి వెళుతూ నన్ను చూసి ఆనందం గా నా వైపు వచ్చాడు….
నేను తనని చూసి లేచి నుంచుని తనకి ఎదురు వెళ్లి “హాయ్ డ్యూడ్….హౌ అర్ యు…..”అని అంటూ వాడిని వాటేసుకున్న….కాసేపు మాట్లాడిన తర్వాత రమ్య ని పరిచయం చేస….తాను కూర్చునే విల్సన్ కి హాయ్ చెప్పి అలానే ఆశ్చర్యం గా చూస్తూ ఉంది మా ఇద్దరిని…రమ్య ని చూడగానే విల్సన్ కూడా అప్పటివరకు నవ్వుతూ వున్నవాడు కొంచం షాక్ లోకి వెళ్ళిపోయాడు….నేను విల్సన్ ని “వాట్ హ్యాపీఎన్డ్….”అని అనగానే ఈలోకం లోకి వచ్చి “నోథింగ్…. ఐ గాట్ టు గో డ్యూడ్…..హావే నైస్ జర్నీ…సీ యు నెక్స్ట్ వీక్ …బై…” అంటూ కొంచం కంగారుగా వెళ్ళిపోయాడు…రమ్య కూడా నా వైపు చూడకుండా విండో వైపు చూస్తూ కూర్చుంది సైలెంట్ గా..