కలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 42

Posted on

“నువ్వు జాగ్రత్త జయంతి , ఈ విషయం మాకు చెప్పినట్లు అని ఎవ్వరికీ చెప్పక “
“నేనేం చెప్పను , సర్, మీరే ఎవ్వరికీ చెప్పకండి , నాకు డేంజర్ బయట మన హాస్పిటల్ లో తెలిస్తే “
“మేము ఎవ్వరికి చెప్పాము లే , నువ్వు ఎం వర్రీ కాకు ” అంటూ అక్కడ నుంచి డాక్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము , జయంతి నెంబర్ నోట్ చేసుకున్నాను తనకు వీడ్కోలు చెపుతూ.

తీరిక దొరికినప్పుడు వచ్చి కలవమంది, వచ్చే ముందు ఫోన్ చేసి రా అని చెప్పింది , ఈ కేసు సద్దు మనగ గానే కలుస్తా అని చెప్పి వచ్చాను.

ఆ రాత్రి అక్కడే డిన్నర్ చేసి, అదే రాత్రి వాళ్ళ స్టోర్ మేనేజర్ ఇంటికి వెళ్ళాము. డాక్టర్ కొన్ని ఫోన్ కాల్స్ చేసి స్టోర్ మేనేజర్ యొక్క అడ్రస్ కనుక్కున్నాడు.

మేము స్టోర్ మేనేజర్ ఇల్లు ఉన్న వీధిలోకి వెళ్ళే సరికి అక్కడ చాల మంది జనాలు గుమి కుడి ఉన్నారు. బైక్ ముందుకు వెళ్ళడానికి వీలు లేకుండా ఉంది గుంపు
“ఏమైంది ” అంటూ నేను బైక్ నుంచి దిగి ఆ గుంపు లోకి వెళ్లాను , అక్కడ ఓ వ్యక్తీ రక్తపు మడుగులో పడి ఉన్నాడు , అప్పుడే లారీ వచ్చి గుద్ది వెళ్ళింది అని చెప్తున్నారు అక్కడ జనాలు, కొద్ది దూరం లో ఆగిన లారీ ఉంది , కానీ డ్రైవర్ అక్కడ నుంచి పారి పోయాడు అని చెప్పారు. నా వెనుక బైక్ ను పార్క్ చేసి వచ్చిన డాక్టర్ అక్కడ ఆక్సిడెంట్ అయిన వ్యక్తిని చూసి షాక్ తిన్నాడు.
“శివా , మనం ఎవరి కోసం వచ్చామో , ఆ స్టోర్ మేనేజర్ వీడే రా , కావాలనే ఎవరో వీడిని చంపేశారు” అంటూ అతని దగ్గరి కి వెళ్లి నాడిని పట్టుకొని చూసి, “లాభం లేదురా పోయి ఓ 5 నిమిషాలు అవుతూ ఉన్నట్లు ఉంది ” అన్నాడు.

వెంటనే మల్లి కార్డునకు ఫోన్ చేసి విషయం చెప్పాను , ఆ లోకల్ స్టేషన్ కి కాల్ చేసి force పంపుతున్నా మీరు అక్కడే ఉండండి అని చెప్పి కాల్ కట్ చేసాడు.

ఓ 10 నిమిషాలకు అంబులెన్సు తో పాటు పోలీస్ లు వచ్చి అక్కడున్న బాడీ ని క్లియర్ చేసారు.

“ఇదేంటి రా , ఎదో ఒక దారి దొరికింది అనుకుంటే దాన్ని కూడా మూసేశారు , ఇప్పుడు ఎలా మూవ్ కావాలి “
“చూద్దాం ఎదో ఒక లింక్ దొరకక పోదు , ఇంతకూ మీకు ఈ మెడిసిన్స్ ఎక్కడ నుంచి వస్తాయో ఆ రికార్డ్స్ ఉంటాయి గా. అవి తెలిస్తే బాగుండు”
“ఆఫీస్ లో కంప్యూటర్ లో ఉంటాయి ఆ డీటెయిల్స్ , కానీ అవన్నీ originals, ఈ ఫేక్ రీప్లేస్ చేసేది స్టోర్స్ వాళ్ళే తెలిస్తే అక్కడే తెలియాలి “
“సరే , రేపు ఓ సారి ఆఫీస్ కి వెళ్దాం , అక్కడ మరో మారు అడుగుదాం ,ఏమైనా తెలుస్తుంది ఏమో ”

ఇద్దరం డాక్టర్ ఇంటికి వచ్చాము , రేపు వాళ్ళ హాస్పిటల్ లో 10 గంటలకు కలుద్దాం అని చెప్పి నేను ఇంటికి బయలు దేరాను.

సింపుల్ గా అయిపోతుంది అను కొన్నది complicated గా మారుతుంది , లెట్ చేస్తే వాడికి జైలు తప్పదు , దీని వెనుక పెద్ద గ్యాంగ్ ఉన్నట్లు ఉంది , దొరికిన ఒక్క ఆధారాన్ని చంపేశారు , అంటే చనిపోయిన వాడికి వాళ్ళ గురించి అన్నీ తెలిసే ఉంటాయి. అందుకే వాడు ఎప్పటికైనా problem కలిగిస్తాడు అని చంపారు.

ఆలోచిస్తూ ఇంటికి చేసుకున్నాను. అక్కడే తిని రావడం వళ్ళ డైరెక్ట్ గా బెడ్ రూమ్ కి వెళ్లి డ్రెస్ మార్చు కొని బెడ్ ఎక్కాను. కేసు గురించి ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాను.
ఏవో కలలు ఈ కేసు కు సంబంధించిన ఆధారాలు ఎవరి దగ్గర ఉన్నాయి, వెళ్లి తెచ్చుకో అన్నట్లు కానీ ఆ ఎవరు, ఎవరో తెలియడం లేదు. ఆ కలల్లో స్టోర్ మేనేజర్ ఇల్లు కనబడ్డది.

ఉదయం బాగా లేట్ గా నిద్ర లేచాను . అది కూడా డాక్టర్ ఫోన్ కాల్ తో
“రేయ్ , నేను హాస్పిటల్ లో ఉన్నా, నువ్వు బయలు దే రావా ?? “
“నేను ఇప్పుడే నిద్ర లేచా , ఇంకో గంటలో అక్కడ ఉంటా ” అని చెప్పి లేచి రెడీ అయ్యి హాస్పిటల్ కు వెళ్లాను. వాడు అక్కడ నా కోసం కాంటీన్ లో వెయిట్ చేస్తూ ఉన్నాడు.

ఇద్దరం కలిసి స్టోర్ రూమ్ కు వెళ్ళాము. అక్కడ స్టోర్ మేనేజర్ ప్లేస్ లో స్టోర్ supervisor ఉన్నాడు. వాడికి విషయం చెప్పి ఆ డూప్లికేట్ మెడిసిన్ గురించి అడిగాము , వాడు నాకు వాటి గురించి ఎం తెలియదు సారూ అని చెప్పాడు. అక్కడ నుంచి కాంటీన్ కు వచ్చాము.

“ఏంటో రా , ఎక్కడ మొదలు పెట్టాము అక్కడే ఆగి పోయాము ? ఎం అవుతుందో ఏంటో ” అన్నాడు డాక్టర్

“ఎం కాదులే ,ఎ దో ఒక క్లూ దొరుకుతుంది , నువ్వు ఇంటికి వెళ్ళు నేను మేనేజర్ వాళ్ళ ఇంటికి వెళ్లి వస్తాను ఓ సారి “
“నేను కూడా రానా ? “
“వద్దు లే , నేను వెళ్లి వస్తా, అక్కడ ఏమన్నా న్యూస్ ఉంటె నీకు చెప్తాలే “
“సరే , అయితే నువ్వు వెళ్ళు , నేను ఇంటికి వెళతా ” అంటూ వాడు ఇంటి వైపు వెళ్ళగా, నేను నిన్న మేము ఇద్దరం వెళ్ళిన మేనేజర్ ఇంటి వైపు బయలు దేరాను.

ఇలాంటి సమయం లో వాళ్ళ ఇంటికి వెళ్ళడం మంచిది కాదు అని మనస్సు ఒక వైపు పీకుతూ ఉన్నా వేరే మార్గం లేక వెళ్లాను. వాళ్ళ ఇంట్లో ఇంకా బంధువులు ఉన్నారు .

నేను వెళ్ళగానే , “ఎవరు కావాలి ” అంటూ ఓ అబ్బాయి వచ్చాడు బహు శా ఎ 7 లేక 8 చదువుతూ ఉండవచ్చు
“నేను హాస్పిటల్ నుంచి వచ్చాను” అన్నాను
“అయితే ఉండండి , మా అక్కను పిలుస్తాను ” అంటూ లోపలి వెళ్లి ఓ అమ్మాయితో వచ్చాడు

“నా పేరు శివా , నేను మీ నాన్న గారు పని చేసే హాస్పిటల్ నుంచి వచ్చాను , మీతో కొద్దిగా ప్రైవేటు గా మాట్లాడాలి”
“ఇంట్లో ఇంకా బంధువులు ఉన్నారు , మీరు ఈ రోడ్డుకు corner లో ఉన్న రెస్టారెంట్ లో ఉండండి నేను వీలు ఉన్నంత తొందరగా వచ్చి కలుస్తాను , నా పేరు శివాని ” అని చెప్పి లోపలి కి వెళ్ళింది.
“థేంక్స్ శివాని , నేను మీకోసం అక్కడ ఎదురు చూస్తూ ఉంటాను ” అంటూ బాయ్ చెప్పి వాళ్ళ ఇంట్లోంచి బయటికి వచ్చాను.

ఆ వీది చివర్లో ఉన్నా హోటల్ లో కూచొని ఓ 3 చాయ్ లు 4 సిగరెట్లు తగులపెట్ట సరికి శివాని వచ్చింది.

“థేంక్స్ శివాని, సారీ ఫర్ యువర్ ఫాదర్ లాస్ “
“మీ పేరు ఎదో చెప్పారు , నాకు గుర్తు రావడం లేదు “
“శివ “
“ఓ శివ , థేంక్స్ “
“మీ నాన్న ఆక్సిడెంట్ లో పోలేదు , ఎవరో కావాలని ఆక్సిడెంట్ అనుకోనట్లు మర్డర్ ప్లాన్ చేసారు “
“మీరు పోలీస్ డిపార్టుమెంటు నుంచి వచ్చారా ఏంటి ? “
“కాదు , నేను పోలీస్ కు నుంచి కాదు , హాస్పిటల్ నుంచి కూడా కాదు మీకు చిన్న అబద్దం చెప్పాను , కానీ నాకు కచ్చితంగా తెలుసు మీ నాన్నని ఆక్సిడెంట్ చేసి మర్డర్ చేసారు”
“పోలీస్ వాళ్ళు వచ్చి ఆక్సిడెంట్ కేసు అని చెప్పి , ఆ కేసు ను క్లోజ్ కూడా చేసారు , మరి మీరే మో అది ఆక్సిడెంట్ కాదు మర్డర్ అని కచ్చితంగా చెప్తున్నారు , ఇంతకూ ఎవ్వరు మీరు ?? , మా నాన్న చావుకు మీకు ఎం సంబందం ఉంది ”

153562cookie-checkకలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 42

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *