కలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 31

Posted on

అంత వరకు ఎప్పుడు ఎం జరుగు తుందో అనే టెన్షన్ ఓ వైపు , మా భవిష్యత్ ఏంటి అనే భయం తో ఉన్న వాళ్ళ మొహం లో చిరునవ్వు గమనించాను నేను కూడా పోటిలోకి రావడం.

మేము ఇద్దరం మాత్రమే మిగిలాము పోటిలో . అంతకు ముందే గూడెం పెద్ద కొడుకు గురించి తెలిసిన వాళ్ళు ఆ పోటికి వెనకడుగు వేయగా , మిగిలిన వాళ్ళు నేను కుడా పోటిలోకి దిగే సరికి మమ్మల్ని ఇద్దరిని పోటికి సరియైన అర్హత గల వెళ్ళమని నిర్ణయించి అందరూ తప్పుకున్నారు.

నారి కోసం పోరాడడం ఒక ఎత్తై తే వీళ్ళ కోసం పోరాడడం ఇంకో ఎత్తు అసలు పోటీ ఇక్కడే , వీళ్ళు గెలవాలంటే నేను గూడెం లో ఒకడిని అయితే గానీ పోటికి రాలేను.

ఆ అర్హత పొంద దానికే నారి ని లైన్ లో పెట్టి వాళ్ళ నాన్న వైపు నుంచి ఎటువంటి ఆటంకం లేకుండా నారి ని గెలుచు కొన్నాను. ఎప్పుడైతే నారి పెనిమిటిగా నేగ్గానో గూడెం లో ఒకడిని అయిపోయాను. గూడెం లో ఒకరి కంటే ఇద్దరినీ చేసుకోవడం ఆచారం కాబట్టి వీళ్ళ కోసం పోటిలో పాల్గొనడం తప్పు కాదు , దానికి తోడూ నారి నే స్వయంగా నన్ను అక్కడికి పంపడం అందరికి బాగా నచ్చింది.

గూడెం పెద్ద కొడుకు గురించి అందరికి తెలియడం వళ్ళ వాడికి పట్నం చిలకలు దక్క కుండా ఉంటే బాగుండు అని కోరుకునే చాలా మంది గూడెం వాసులు ఉండడం వలన వారి కళ్ళు అన్నీ నా మీదే ఉన్నాయి.

ఇద్దరం ఎరినాలో కి రాగానే రెఫరీ బెల్ కొట్టి మా ఇద్దరినీ పోటికి సిద్దం చేసాడు.

బెల్లు కొట్టగానే వాడు నా మీదకు దూకాడు. అంతకు ముందు రోజు భల్లూకం గుర్తుకు వచ్చింది వాడి దూకిన విధానం చూడగానే. ఆ ఎలుగు ను అగ్గి చూపి భయపెట్టి నట్లు వీడిని ఎం చూపి భయపెట్టాలి అనుకొంటూ వాడి నుంచి తప్పించు కొన్నాను.

వాడి చేతికి దొరికితే ద్రుతరాస్ట్రుని కోగిట్లోకి వెళ్లి నట్లే , వాడు తీవ్రంగా నన్ను తన కోగిట్లోకి లాక్కోవాలని నా వెంట పడ సాగాడు , వాడికి దొరకకుండా ఏరినా లోపల రౌండ్లు కొట్టసాగాను.

ఇంతకు ముందు ఓ ప్రత్యర్థిని అలా రౌండ్లు కొట్టించి అలసిపోయే ట్లు చేసి ఓడించిన విధానం వాడికి గుర్తుకు వచ్చి నట్లు ఉంది , ఆగిపోయి మీదకు రాసాగాడు. ఇంక లాభం లేదనుకొని ఎదురు దాడికి దిగాను.

151994cookie-checkకలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 31

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *