కలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 31

Posted on

“ఈ సాయంత్ర మే మనకు ఎ విషయం తెలిసేది , అంత వరకు మనం ఇక్కడే ,కావాలంటే ఓ కునుకు తీయండి నడిచి అలిసిపోయారు కదా”
“వాళ్ళు మనల్ని ఎం చేస్తారో అని ఓ పక్కా టెన్షన్ గా ఉంటే , నీకు నిద్ర వస్తుందా ఇప్పుడు ” అంది వర్షా
“మీరు కావాలంటే ఆలోచిస్తూ ఉండండి నాకు ఛాన్స్ దొరికింది ఓ నిద్ర వేస్తా ” అంటూ అక్కడే ఓ వైపు కు ఒత్తి గిలా పడి నిద్రలోకి జారుకున్నాను.

దాదాపు ఓ రెండు గంటలు పడుకున్నాను ఏమో “శివా ఎవరో , వస్తు ఉన్నట్లు ఉన్నారు లే ” అంటూ నా భుజాలు పట్టుకొని ఊపుతుండగా మేలుకవ వచ్చింది.

నారి తెచ్చిన పండ్లు బాగున్న ట్లు ఉన్నాయి ఇద్దరు కలిసి ఆ చేటలో ఉన్నవి మొత్తం లాగించారు. నేను లేచి ఆ కొట్టం కట్టడానికి నిలువుగా పాతిని గుంజకు అనుకొంటూ ఉండగా నారి తో పాటు ఇద్దరు బలంగా ఉన్న వారు వచ్చి మమ్మల్ని గూడెం మధ్యలోకి తీసుకెళ్లారు.

వాళ్ళ కుల దైవం అనుకుంటా ఓ పెద్ద రాతికి అలంకరణ చేసారు , ఆ పక్కనే పెద్ద అరుగు లాగా బండలు వేసారు వాటి మీద గూడెం పెద్దతో పాటు ఆ గూడెం లో వయసైన వాళ్ళు కూచుని ఉన్నారు . కింద బాగా చదును చేసి ఉన్నట్లు ఉన్నారు , గూడెం లో జనాలు అందరూ అక్కడ కుచోన్నారు
మమ్మల్ని అక్కడికి తీసుకొని రాగానే , వాళ్లలో వాళ్ళు మాట్లోకోంటు ఉన్న వాళ్ళంతా calm అయిపోయి మా వైపు , గూడెం పెద్దల వైపు చూడ సాగారు.
“ఈ అడవిలోకి వీళ్లతో ఎం పని మీద వచ్చావు ” అని అడిగాడు గూడెం పెద్ద.
“పొద్దుననుంచి ఈ చేతులు కట్టేశారు , కొద్దిగా కట్లు విప్పుతారా చుట్టూ మీ వాళ్ళు ఉన్నారు గా నేను ఎక్కడికీ పారు పోను లే ” అంటూ చేతులు చంపించాను.

తన వాళ్లతో కొద్దిగా తర్జన బర్జన పడ్డాక , నా చేతులకు కట్టిన తీగెలు తెమ్పెసారు. ఓ మూడు నిమిషాలు చేతుల్లో రక్తప్రసరణ వచ్చేంత వరకు వాటిని కొద్దిగా అటు ఇటూ తిప్పి, అవి కంట్రోల్ లోకి రాగానే. అడివిలో ఓ కోట ఉంది అది చూడడానికి వచ్చాము అని చెప్పాను.
“మా శ్మశానం పైకి ఎక్కి దాన్ని అపవిత్రం చేసారు , మా గూడెం దేవతకు ఆగ్రహం తెప్పించారు, నువ్వు ఒక్కడి వే ఉంటే అక్కడే చంపి ఆ బండ మీదే నిన్ను అడివి దేవతకు ఆహారం వేసే వాళ్లం , నీతో పాటు ఆడపిల్లలు వచ్చారు , వాళ్ళను చూసి నిన్ను ఇంత వరకు ప్రాణం తో వదిలేసాము” అన్నాడు.

“రాత్రిళ్లు అడవిలో జంతువుల బాద పల్లెక ఆ బండ ఎక్కాము గానీ అది మీ అడివి తల్లి ప్రదేశం అని మాకు తెలియదు , ఈ పారికి మా తప్పు కాయండి రెండో సారి ఇటూ వైపు రాము ” అన్నాను

“తీర్పు చెప్పాల్సింది మా నాయన నువ్వు కాదు ” అంటూ గట్టిగా హుంకరించాడు గూడెం పెద్ద పక్కన కుచున్న నల్లగా తుమ్మ మొద్దు లాగ ఉన్న ఓ మొరటోడు.

“గూడెం పెద్ద అట్టే ఉన్నట్లే అయన కొడుకు, ఏంది రంకే లేస్తున్నాడే” అంటూ గుస గుస లు వినిపించ సాగాయి
“ఆ అమ్మాయిల మీద కన్నేసి నాడు , వాన్ని తప్పిస్తే వాళ్ళ నిద్దర్నీ , ఎలుకోవచ్చని ఈడి ఆశ “అంటూ ఇంకో మూల నుంచి ఇంకొందరు గుస గుసలు.
“పాపం వాడి పెళ్ళాం మొన్నే కదరా దోర లాంటి బిడ్డని కంది ఆ బిడ్డను చూసి మన గూడెం అంతా , మనకో వారసుడు వచ్చాడని అనుకున్నాం కదరా , ఈడు ఇప్పుడు అల్ల ఎంబడి పడితే ఆ పిల్లా,బిడ్డ సంగతి ఏందిరా ” అన్నాడు నా పక్కన ఉన్న ఇంకొక డు.
కూచున్న వారిలో ముందు వరుసలో ఓ చంటోడికి పాలు పట్టిస్తున్న ఓ ముద్దు గుమ్మ కనిపించింది బహు శా ఆమె కావచ్చు ఆ గుడెపు పెద్దాయన కోడలు. చంటోడికి ఓ 8 నెలలో 9 నెలలో ఉండవచ్చు అనుకుంటా

ఆ బండ మీదున్న పెద్దలు వాళ్లలో వాళ్ళు మాట్లాడుకొని ఓ కొలిక్కి వచ్చినట్లు ఉన్నారు , ఆ గూడెం పెద్ద చేయి ఎత్తగానే అందరూ మాట్లాడం ఆపి అయన వైపు చూసారు ఎం చెప్తారో అని.

“మన గూడెం జనాలు తప్ప వేరే ఎవ్వరు చూడని , ఎక్కడి ప్రదేశం లో ఎక్కినందుకు వీల్ల ను చంపుడు పున్నం రోజున మన గంగమ్మ తల్లికి బలి ఇవ్వాలి , కానీ జంతు బలులు తప్ప జనాల్ని బలులు ఇచ్చేది మన గూడెం పెద్దలు ఎప్పుడో ఆపేశారు. అందుచేత ఈ మగోడికి 100 కొరడా దెబ్బలు శిక్ష విధిస్తున్నాను. ఈ శిక్ష మొన్నాడు పున్నమి రోజున అమలు చేయబడుతుంది. ఆ నూరు కొరడా దెబ్బలు తరువాత వాడు ఇంకా బతికుంటే అడివి బయటకు పంపుతాము లే కుంటే ఎ బండ మీదకు బతికుండగా ఎక్కాడో అదే బండ మీద ఈడి శవాన్ని పడుకోబెట్టి మన వన దేవతకు ఆహారంగా వదిలేద్దాం .

ఈ అమ్మాయిలు ఇద్దరి నీ గూడెం ఆచారం ప్రకారం అదే పున్నం రోజున జరిగే పోటీల్లో ఎవరు గెలుస్తారు వాళ్ళు ఈళ్ళను సొంతం చేసుకోవచ్చు.

“తెలియని తప్పుకు , ఇంత పెద్ద శిక్ష వేయడం మంచిది కాదు ” అంటూ గట్టిగా అరిచాను.

“తెలిసినా , తెలియక పోయినా తప్పు తప్పే” మన్నాడు వరకు నీ ఇష్టం వచ్చినట్లు తిని తాగు, కానీ ఇక్కడ నుంచి తప్పించు కోవాలని చూడుకు , తప్పించు కొంటూ ఎవరి కంట పడ్డా అక్కడే చంపేస్తారు గూడెం లో జనాలు.

వాళ్ళు ఇద్దరు నీతోనే ఉంటారు మొన్నాటి వరకు , పోటిలలో ఎవరు గెలిస్తే వాళ్ళు సొంతం చేసుకుంటారు మొన్నాడు అంత వరకు ఎం మాట్లాడు కొంటా వో మాట్లాడుకో

“మేము ఇక్కడ నుంచి వెళ్ళక పొతే మా వాళ్ళు వస్తారు, మీరు చేసింది వాళ్ళకు తెలిస్తే వాళ్ళు మిమ్మల్ని వదిలి పెట్టారు.”
“మా గూడెం ఇంత వరకు పరాయి వాళ్ళ కంట పడలేదు, ఒక వేల మీ వాళ్ళు వస్తే అప్పుడు చూసుకుందాము లే ” అంటూ వెళ్ళాను తీసుకెళ్లి లోపల గుడిసెలో వదలండి, ఆ గుడిసెకు గట్టిగా కాపలా పెట్టండి అంటూ తన వాళ్ళకు ఆదేశించాడు.
మమ్మల్ని గుడిసెలో తోసి ఆ గుడిసె ద్వారానికి అడ్డం గా తడికను పెట్టారు.
“ఎం చేయాలన్నా మనకు రెండ్రోజులు మాత్రమే టైం ఉంది ఆ తరువాత ఎం చేయడానికి లేదు” అంది వర్షా
“పోనీ ఎం చేద్దాం నువ్వే చెప్పు వర్షా ? ఎలా తప్పించు కొందాము” శ్రీ
“ఏమో నక్కా నాకు ఇప్పుడు భయం వేస్తుంది , అనవసరం గా ఇందులోకి నిన్ను లాగానే అని బాధగా ఉంది”
“నువ్వు బలవంతం చేస్తే రా లేదుగా , ఇష్టం అయ్యే వచ్చాలే , నువ్వు ఎం బాధ పడకు శివా ఉన్నా డుగా ఎదో ఒకటి చేస్తాడు లే, నువ్వు టెన్షన్ పెట్టకు” అంది శ్రీ.
రాత్రికి మరో మారు పండ్లతో వచ్చింది నారి, గూడెం లో కొద్దిగా చీకటి పడగానే , కాగడాలు వెలిగించారు
తనతో పాటు ఓ కాగడా తెచ్చింది మేము తినడానికి.
సాయంత్రం నుంచి నా కట్లు కట్ట లేదు, నా పక్కన వచ్చి తీరికగా కూచుని మాకు పండ్లు సర్వ్ చేసింది. నా వైపు చూస్తూ అదో తన్మయత్వం లోకి జారుకో సాగింది.
తన చూపులో కోరికను వర్షా గమనించి నట్లు ఉంది. “అక్కా దాని వాలకం చూసావా , అది శివా పక్కన పెళ్ళాం లాగా కుచోంది , ఈ యనేమో ఇదే ఛాన్స్ లే అని దాన్ని ఎలా చూస్తున్నాడు చూడు అంది” దానికి అర్థం కాకుండా.
“దాని ద్వారా అన్నా మనకు పారిపోయే చాన్స్ వస్తుందేమో శివా ట్రై చేస్తున్నాడు ,నువ్వు నీ సోది ఆపి ఈ పండ్లు తిను” అంది శ్రీ
“నీకు మనువయ్యిందా ?” అన్నాను నా వైపు చూస్తున్న నారిని
“ఇంకా లేదు , గూడెం లో 4 కుర్రాళ్ళు నాకోసం ఈ పున్నం రోజున పోటీ పడతా ఉండారు , వాళ్లలో ఎవరు గెలిస్తే వాళ్లతో నా మనువు”
“నువ్వు చాల అందంగా ఉంటావు నీకోసం నలుగురే నా పోటీ పడతా ఉండేది,”
“నువ్వు కూడా పోటీ పడతా వా , మానాయనకు చెప్పి నీ శిక్ష రద్దు చేయమంటాను” అంది తన శరీరాన్ని నా కేసి రుద్దుతూ.
“నువ్వు చెపితే వింటాడా ?”
“ఏమో తెలవదు , కానీ అడుగుతా నువ్వు పోటీ పడతానంటే”
“అడిగి చూడు , కానీ వీళ్ళ కోసం ఎవరు పోటీ పడతారు ?”

151994cookie-checkకలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 31

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *