కలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 31

Posted on

“మరి వీళ్ళ ఇద్దరి సంగతి ఏంటి ? “
“వాళ్ళు కోసం కూడా గూడెం లో పోటీలు జరుగుతాయి వాళ్ళను ఎవరు గెలుచు కుంటే వాళ్లతో వీళ్ళకు పెళ్ళిళ్ళు చేస్తాము , మాతో పాటు ఇక్కడే ఉంటారు. “

“నేను గూడెం లో వాళ్లతో పోటీ కి రెడీ నారి కోసం ” అంటూ నా సమ్మతం చెప్పాను

పోటీలు ఫ్రీ స్టైల్ లో జరుగుతాయి, బాక్సింగ్ రింగ్ లాగా ఓ తాడును కట్టి ఇద్దరినీ లోపలి కి వదులు తారు, అందులో ఎవరో ఒకరు పోటీ నుంచి తప్పుకోనేంత వరకు కొట్టుకోవచ్చు.

ఓ 10 మంది పోటిలో ఉంటే వారిని 5 జతలుగా విడగొట్టి పోటీ పెడతారు అందులో గెలిచిన వాళ్లకు మాత్రమే మల్లి పోటీ ఉంటుంది చివరికి ఎవరు నెగ్గుతారు వాళ్ళను వరిస్తుంది కోరుకున్న అమ్మాయి.

గూడెం కూతురు , వర్షా , శ్రీ వీల్లు ముగ్గురే కాకుండా ఇంకో ముగ్గరికి పోటీ ఉంది మొత్తం 6 మంది అమ్మాయిలకు స్వయం వరం అన్నట్లు ఉంది. కాకుంటే మామూలు స్వయం వరం లో అమ్మాయి నచ్చిన వాడికి దండ వేసి వాళ్ళను చేసుకుంటుంది. కానీ ఇక్కడ అమ్మాయి కోసం పోటీ పడ్డ వాళ్ళల్లో గెలిచిన వాన్ని వరిస్తుంది.
రచ్చ బండ దగ్గర నుంచి మా గుడిసె లోకి రాగానే వర్షా ఏడుపు మొదలు పెట్టింది. “నా జీవితం ఈ అడవిలోనే ముగిసేటట్లు ఉంది, వీళ్ళల్లో ఎవరికో ఒకడికి పెళ్ళాం గా ఉండాల్సి వస్తుంది. ఎన్ని అనుకోని వచ్చాను , ఎం జరుగుతుంది ఇక్కడ మనల్ని రక్షించే వాల్లే లేరా ? ” అంటూ ఏడవ సాగింది.

“అవును శివా , ఇంకో రెండు గంటల్లో పోటీలు జరుగుతాయి ఆ తరువాత మనం చేసే ది ఎమీ లేదు , ఎదో ఒకటి చెయ్యి , నాకు కుడా ఇప్పుడు భయంగా ఉంది ” అంటూ తనకు వత్తాసు పలికింది శ్రీ

“పోటీలు జరగ నీ , ఎదో ఒక దారి దొరుకుతుంది , మనం పారిపోవాలంటే ఇక్కడ వీళ్ళు కాదు , వాళ్లకు తెలిసినట్లు మనకు అడివి తెలియదు తొందరగా దొరికి పోతాము , ఆ తరువాత శిక్ష మరణమే , దాని కంటే ఎదో ఒక దారి దొరుకుతుంది అంత వరకు ఓపికగా ఎదురు చూడాలి”

“ఎన్ని రోజులు ఎదురు చూడాలి , ఈ లోపునా మాకు వీళ్లతో పెళ్లి అయ్యి పిల్లలు కూడా పుట్టే ట్లు ఉన్నారు.”

“అంత వరకు అవసరం లేదు ఈ పోటీలు కానీ , ఈ లోపున ఎదో దారి దొరకక పొతే అప్పుడు గన్ కి పని చెప్దాం” అంటూ పడకేసాను. రాత్రి మేలుకోవడం వలన వెంటనే నిద్రలోకి జారుకున్నాను.

ఓ రెండు గంటల సేపు నిద్రపోయా క నారి వచ్చి “పోటీలు జరిగే సమయం అయ్యింది పదండి అక్కడికి వెళ్దాం అంటూ మమ్మల్ని తొందర పెట్ట సాగింది.”

మేము తెచ్చిన రంగు రంగుల పూసలు , మిగిలిన వాటిని ఒక బ్యాగ్ లో పెట్టి శ్రీ కి ఇచ్చి తన దగ్గర పెట్టుకొని పోటిల దగ్గరకు తీసుకొని రమ్మన్నాను.

ముగ్గురం తన వెంట అక్కడికి వెళ్ళాము.

రచ్చ బండ పక్కన ఓ చిన్న బాక్సింగ్ ఏరినా లా తయారు చేసారు , చుట్టూ తాడు కట్టారు , కింద పడినా తగలకుండా ఇసుక వేసారు.

గూడెం లో జనం అంతా అక్కడే ఉన్నారు. పెళ్లి కోసం వచ్చిన అమ్మాయిలు కొద్దిగా ప్రత్యేకంగా రెడీ అయ్యారు. వీళ్ళు ఇద్దరినీ నారీ తనతో పాటు తీసుకొని వెళ్లి వాళ్ళ ఆచారం ప్రకారం మొహానికి ఏవో రంగులు పూసి తయారు చేసింది , వీళ్ళు వేసుకున్న బట్టలు మాత్రం టచ్ చేయలేదు.

మొత్తం 6 గురికి పోటీ , వాళ్లలో మొదటి ముగ్గరికి పెద్ద పోటీ లేనట్లు ఉంది. అందులో ఒక అమ్మాయి చాలా సన్నగా ఉంది ఆ అమ్మాయి కోసం ఇద్దరు మాత్రమే పోటికి వచ్చారు. ఇంకో టి మద్య రకంగా ఉంది తన కోసం 6 మంది పోటీ లో ఉన్నారు , ఇంకో అమ్మాయి కొద్దిగా లావుగా ఉంది తన కోసం ఎవ్వరు పోటీలో లేరు ఒక్కడే అబ్బాయి , వాడికి పోటీ లేకుండా అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు.

వారి తరువాత గూడెం కూతురు కోసం దాదాపు 12 మంది పోటిలో ఉన్నారు నాతొ కలిపి. గూడెం పెద్దలు నిర్ణయిస్తారు ఎవరు ఎవరు ఎరినాలోకి దిగాలి అనేది. వర్షా కోసం , శ్రీ కోసం ఎంత మంది వస్తా రో ఇంకా తెలియడం లేదు , బహు శా వీళ్ళ పోటీలు ముగిసిన తరువాత ఈ ఇద్దరి కోసం ప్రత్యేకంగా పోటీలు నిర్వహించే టట్లు ఉన్నారు.

మొదటి పోటీ కి రెడీ అయ్యారు , గోదాలోకి దిగే ముందు అక్కడ ఓ పెద్దాయన ఉన్నాడు రెఫరీ అన్నట్లు గా. వాళ్ళను ఇద్దరినీ లోపలి పంపాడు. ఇద్దరు దాదాపు ఒకే వయసులో , ఒకే సైజులు ఉన్నారు. చిన్న బెల్ లాంటిది కొట్టి స్టార్ట్ చేసాడు.

వాల్లు ఏవిధంగా పోటీ పడతారు అని చూడ సాగాను.

ఒకరి కొకరు పట్టుకొని కింద పడే వేయడానికి చూస్తున్నారు , మద్యలో ఒకరి కొకరు ముష్టి ఘాతాలు విసురు కో సాగారు.

ఓ 10 నిమిషాలు ఒకరు కొకరు ముష్టి ఘాతాలు విసురు కొని , అందులో ఒకడు టెక్నిక్ గా రెండో వాడిని కింద పడేసి వాడి మీద కుచోన్నాడు భూమికి అనగ బట్టి. రెండో వాడు వొడి పోయినట్లు చేయి ఎత్తగానే పోటీ అయిపోయినట్లు ప్రకటించారు.

గెలిచిన వాన్ని అందరూ పొగుడుతూ ఉండగా , వాడిని వరించే అమ్మాయి వాడి దగ్గరకు వచ్చి అడివి పూలతో చేసిన దండ వాడి మేడలో వేసి తన వెంట తీసుకెళ్లింది.

ఆ తరువాత batch రింగ్ లోకి దిగింది. బెల్ కొట్టిన రెండో నిమిషం లో అందులో ఒకడు రెండో వాడిని తన వీపు మీద వేసుకొని గిర గిరా రింగు అంతా తిప్పి నెల విసిరేశాడు. కింద పడ్డ వాడు తిరిగి లేయలేదు.

తరువాత బ్యాచ్ వచ్చింది ఇద్దరు హోరా హోరిన కొట్టు కొన్నారు ఓ 8 నిమిషాలు సేపు. 9 నిమిషం లో ఒకడు రెండో వాడిని రెజ్లింగ్ లో లా భూమికి నొక్కి పట్టి వాడి కాళ్లు చేతులు రెంటిని తన అదుపులో పెట్టుకొని వాడి వీపు మీద తిష్ట వేసాడు. ఓ నిమిషం పాటు గమనించిన రెఫరీ పడుకున్న వాడికి ఓడిపోయినట్లు ప్రకటించాడు.

ఆ బ్యాచ్ లో చివరికి 3 మిగిలారు , పెద్దలతో మాట్లాడి వాళ్లలో ఇద్దరినీ లోపలికి పంపారు వాళ్లలో గెలిచిన వాడు బయట ఉన్న వాడితో పోటీ పడతాడు. , కానీ లోపల గెలిచిన వాడికి కొద్దిగా టైం ఇవ్వబడుతుంది పోటికి.

లోనకు వెళ్ళిన వాళ్లలో ఒకడు తొందరగా లొంగి పోయి బయటికి వచ్చేశాడు. చివరలో మిగిలింది ఇద్దరే వాళ్ళకు ఇద్దరికీ ఇంకో గంట తరువాత పోటీ పెడతారు .

151994cookie-checkకలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 31

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *