కలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 26

Posted on

రామ కృష్ణ మాత్రం చెప్పాలా వద్దా అని దిక్కులు చూస్తున్నాడు అది చుసిన హామీదు
“వాడికి ఓ కాలో చెయ్య తీసేసెంత వరకు మనము ఆగాల్సింది సారూ , ఈ నా కొడుక్కి ఇంకా వాళ్ళ సారూ భూతము దిగినట్లు లేదు”
“అది మన డిపార్టుమెంటు కాదు హామీదు , మనం తీసుకెళ్లి దారిలో పోలీస్ స్టేషన్ లో అప్పగిద్దాము , ఇందాకా వాళ్లను పంపినట్లు ఈ సారి ఆ స్టేషన్ వాళ్ళే ఇదే అడివిలోకి తెచ్చి ఎన్‌కౌంటర్ చేస్తారు , మనకెందుకు గొడవ , పదండి పోదాము ” అంటూ మా కారు ఉన్న వైపుకు నడక సాగించాను.

నేను హామీదు ముందు వెళ్తుండగా మా వెనుక వాళ్ళు ఇద్దరు రామకృష్ణ తో మాట్లాడ సాగారు.
“అన్నా , సారూ చెప్పినట్లు ఆ మినిస్టర్ దగ్గరకు వెళ్లి లొంగి పోదాము , లేదంటే ఆ నా కొడుకు మనల్ని లేపేస్తాడు ” అంటూ తన మీద వత్తిడి తె సాగారు.

ఎట్టకేలకు రామ కృష్ణ వాళ్ళ ఇద్దరి వత్తిడికి లొంగి “మమ్మల్ని మినిస్టర్ దగ్గరి కే తీసుకెళ్లండి సర్ , అక్కడే ఆ పోలీస్ ఆఫీసర్ పేరు బైట పెడతాను. మేము వచ్చేటప్పుడు , జీప్ లో వచ్చాము , ఆ జీప్ కూడా మాతో పాటు తీసుకొని వెళదాము”

“ఎక్కడుందో చెప్తే , మా హామీదు తీసుకొని వస్తాడు “
“మెయిన్ రోడ్డు మీద ఓ మైలు రాయికి అర కిలోమీటర్ దూరంలో ఓ పొదలో దాపెట్టాము, రోడ్డు మీద నేను చూపిస్తా ఆ మైలు రాయి” అంటూ మాతో పాటు నడవ సాగాడు వేగంగా.
“మీరు ఎవ్వరు ఫోన్స్ అన్ చేయకండి , మీ సారూ మీ ఫోన్స్ ట్రాక్ చేసే ఆస్కారం ఉంది ” అంటూ వాళ్ళ వద్ద ఉన్న ఫోన్స్ collect తీసుకున్నాడు.

అందరూ మా వాహనం దగ్గరకు చేరుకోని రోడ్డు మీద కు వచ్చాము. మెయిన్ రోడ్డు మీద సిటీ వైపు కొద్ది దూరం వెళ్లగానే రామకృష్ణ మా వెహికల్ ను ఆపమని చెప్పి హామీదు తో వెళ్లి వాళ్ళ జీప్ తీసుకొని వచ్చాడు. హామీదు వాళ్ళ వెహికల్ నడుపుతూ రాగా నేను వీళ్ళ ముగ్గరితో కలిసి టౌన్ కు బయలు దేరాము.

దారిలో నీరజ వాళ్ళ నాన్నతో మాట్లాడి “వీళ్లతో వస్తున్నాను ఈ విషయం టాప్ సీక్రెట్ గా ఉంచండి , వీళ్ళు మీ దగ్గరే లొంగి పోతారు ” అని చెప్పాను. మరో కాల్ మల్లికార్జునుకు చేసి , ఆ ఆఫీసర్ పేరు బైటకు రాగానే స్పెషల్ force తో వాడి ఇంటి మీద , మిగిలిన ప్లేస్ లలో దాడి చేయాలి మీరు స్పెషల్ టీం తో రెడీ గా ఉండండి , మరియు కావలసిన ఫార్మాలిటీస్ ముగించుకోండి లెట్ లేకుండా అని చెప్పి , రఫ్ గా మేము అక్కడికి చేరుకునే టైం చెప్పి ఫోన్ పెట్టాను.

మధ్యలో ఓ మూడు సార్లు మాత్రము వాహనాన్ని అపినాము. సాయంత్రం 9.30 కి టౌన్ కు చేరుకున్నాము. మా బండిని డైరెక్ట్ గా మినిస్టర్ ఇంటికి తీసుకొని వెళ్లాను.
వాళ్ళు తెచ్చిన జీప్ ను ఇచ్చేసి , హామీదు మాతో పాటు వచ్చాడు మినిస్టర్ ఇంటికి.

అక్కడ మినిస్టర్ తో పాటు , ఓ హైకోర్ట్ జడ్జి , మల్లికార్జున తన స్పెషల్ టీం తో రెడీ గా ఉన్నారు.

==

ఆ తరువాత పనులు చాలా వేగంగా జరిగాయి

రామకృష్ణ చెప్పిన పేరు విని అక్కడున్న వారందరూ నోళ్లు వెల్ల బెట్టా రు అయన హైదరాబాదు లో ఓ డిప్యూటీ commissioner, దొంగలించిన వన్నీ , బహు శా ఆయనకు ఉన్న ఫాం హౌస్ లో ఉండొచ్చు అని కూడా చెప్పాడు.

అన్ని డీటెయిల్స్ అందగానే మల్లి కార్జున తన దగ్గర ఉన్న వాళ్లను రెండు టీం లు గా విడగొట్టి ఒకటి తను లీడ్ చేస్తూ , ఇంకో టీం ను ఇంకో ఆఫీసర్ కు అప్పగిస్తూ, తన టీం తో తోట మీద , వేరే టీం తో అతని ఇంటి మీద దాడి చేసారు.

రాత్రి అంతా వెతికినా తోట లో దొంగలించిన డబ్బు, లాకర్‌లోని నగలు ఎక్కడా దొరకలేదు . వాళ్ళు తిరిగి వచ్చేద్దాము అనుకోంటు ఉండగా వాళ్లతో పాటు వెళ్ళిన హమీద్ తోటలో ఉన్న ఓ పాడు బడ్డ బావిలో తడవ కుండా పేపర్ బ్యాగ్ లో చుట్టి దిగేసిన రెండు సంచులు కనుగొన్నాడు.

అవన్నీ తీసుకొని స్టేషన్ కు వచ్చి పొద్దున్నే 10 గంటల వరకు ప్రతి ఒక్క ఐటం ను విడివిడిగా తీసి చెక్ చేసుకుంటూ నోట్ చేసుకోసాగారు. డబ్బులు , నగలు అన్నీ దొరికాయి కానీ మంత్రి గారు కావాలనుకున్న పెట్టె మాత్రం కనబడలేదు.

commissioner ఇంటికి వెళ్ళిన టీం కు అక్కడ ఎమీ దొరక లేదు , కానీ బాత్రుం కు వెళతాను అని లోపలి వెళ్ళిన పెద్దాయన తిరిగి రాని లోకాలకు వెళ్ళాడు బాత్రుం లోని పిస్టల్ తో పేల్చు కొని.

నా మటుకు నేను షాదన్ కాలేజికి వెళ్లి అక్కడ చదువుతున్న విదేశీ స్టూడెంట్స్ డీటెయిల్స్ తీసుకొని అందులో లుట్టాయా అడ్రస్ , ఫోన్ నంబర్స్ వాళ్ళ పేరెంట్స్ డీటెయిల్స్ తీసుకున్నా. అంత కంటే ఎక్కువ వివరాలు దొరక లేదు వాళ్ళ దగ్గర.

అదేదో హాస్పిటల్ లో సామెత లాగా అయ్యింది నాకు అప్పగించిన పని అదేనండి బాబు, “ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ డెడ్” అన్న ట్లు.

మరో మారు రామ కృష్ణ ను కలిసి లాకర్లలో ని సా మాన్ల గురించి అడిగాను. ప్రత్యేకంగా డాక్టర్ గారి లాకర్ లో ఉన్న బాక్స్ గురించి అడిగాను.

“లాకర్లో సామాన్లు అన్నీ, సంచుల్లో వేసి కార్ లో కి షిఫ్ట్ చేశాము. అందులో ఎం ఉన్నాయి అనేది మేము ఎవ్వరూ చూడ లేదు, వాళ్ళు సంచుల్లోంచి వేరే వాటిలోకి షిఫ్ట్ చేసి దాపెట్టారే మో , అప్పుడు ఎవరైనా తీసి ఉండొచ్చు “

“ఒకడు చచ్చాడు ఇంకొకరు చూస్తుంటే దేశం నుంచి జంప్ చేసినట్లు ఉన్నాడు, వీళ్ళు ఇద్దరే కాక ఇంకెవరన్నా ఉండొచ్చా దీని వెనుక”
“నాకు తెలిసి ఇంకెవరు లేరు , వేరే వారి గురించి నాతొ ఎప్పుడూ చెప్పలేదు, వీళ్ళు ఇంకో చొటకి మార్చే టప్పుడు , ఎవరన్నా తీసారేమో మరి”

151003cookie-checkకలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 26

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *