కలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 26

Posted on

“ఇంతకీ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది ” అని అడిగాను
“టాంజానియా నేషనల్ స్టేడియం”
“సరే సర్ , పొద్దున్నే దిగబేడతా 10 గంటలకి ” అంటూ ఇద్దరం వాళ్లకు బాయ్ చెప్పి కింద కు వచ్చాము.

“అన్నా అప్పుడే హోటల్ కి వెళ్ళాలా , ఎక్కడైనా కొద్ది సేపు వెళ్దాం అంది”

ఇక్కడికి రావాలని తెలియగానే , ఈ సిటీ గురించి కొద్దిగా తెలుసుకున్నా , తను ఆ మాట చెప్పగానే టౌన్ కు కొద్ది దూరం లో ఉన్న పెద్ద మాల్ కు కాబ్ బుక్ చేసుకొని వెళ్ళాము.

“నేను చాలా సిటిలకు వెళ్ళాను ,కానీ ఎప్పుడు , హోటల్ నుంచి స్టేడియం కు , అక్కడ నుంచి హోటల్ కు అంతే , నాకు బాగా గుర్తు ఒక్కసారి అనుకుంటా ఓ మేడం తో వెళ్ళాము అప్పుడు ఆ మేడం బయటకు తీసుకొని వెళ్ళింది. అంతే “
“ఈ దేశం లో ఫాక్టరీస్ తక్కువ , వీళ్ళు ఎక్కువగా అన్నీ దిగుమతి చేసుకుంటారు అందుకే మనకంటే రెట్లు ఎక్కువుగా ఉంటాయి , కానీ కొన్ని వస్తువులు మాత్రమే ఇక్కడ తక్కువ రేటుకు దొరుకుతాయి”

“అంటే బట్టలు అలాంటివి ఇక్కడ రేటు ఎక్కువా ?”
“అవును , ఇక్కడ మసాలాలు , చెక్కతో చేసిన వస్తువులు తక్కువ ధరకు దొరుకుతాయి , మిగిలినవి అన్నీ మనకంటే ఎక్కువ రెట్లు.”
నా మాటకు నవ్వేస్తూ , “మరి వీళ్ళు బట్టలు ఎలా కొనుక్కోంటారు , అంత రెట్లు పెట్టి కొంటారు.”
“బాగా డబ్బున్న వాళ్ళే కొత్త బట్టలు కొంటారు , డబ్బు లేని వాళ్ళకు ఇక్కడ సెకండ్ హ్యాండ్ బట్టలు దొరుకుతాయి , వేరే దేశాల నుంచి బట్టలు , బూట్లు ఇక్కడి కి వస్తాయి వాటిని ఇక్కడ విటుంబా అని అంటారు”

మాల్ లోని అన్ని షాప్ లు తిరిగి అలిసిపోయాము. రాత్రి 8.30 అవుతుంది హోటల్ కి వెళ్దాం అనగానే. “అన్నా ఇక్కడే తిని వెళ్దాం నాకు KFC లో తినాలని ఉంది “

తన కోరిక మేరకు అక్కడే తిని 9.30 కి వెళ్ళాము. ఇద్దరం వాళ్ళ రూమ్ కు వెళ్లి , కరుణా వాళ్ళ అమ్మకు మేము బయలు దేరిన దగ్గర నుంచి ఎం జరిగిందో అంతా లైవ్ టెలి కాస్ట్ చేసినట్లు చెప్పసాగింది.

“నీకు , చాలా శ్రమ ఇస్తున్నాను బాబు , ఎం అనుకోవద్దు”
“ఇందులో శ్రమ ది ఏముంది లెండి , కరుణా లాంటి gifted పిల్లలకు హెల్ప్ చేసాను అనే త్రుపి ఉండ నీయండి. నాకు ఇక్కడ వారం రోజులు పని ఉంది , మీకేం ఇబ్బంది వచ్చినా నా హెల్ప్ తీసుకోవచ్చు.”
“ఈ పిచ్చి ది ఈ పోటిలలో గెలిస్తే చాలు బాబు , నేను ఎక్కువ గా తిరగ లేను ,నీలాంటి వాళ్ళు తోడూ ఉంటె నేను దాన్ని మీతోనే పంపేదాన్నీ , ఒక్క దాన్నే పంపలేక తన వెంట వచ్చాను”
“మీకేం భయం లేదు , వెళ్ళాలి అనుకుంటే కరుణా తో పాటు స్టేడియం కు వెళ్ళండి లేదంటే ఇక్కడే ఉండండి, ఈ వారం రోజులు బాగా రెస్ట్ తీసుకోండి” అన్నాను.

“రేపు వేల తాను, ఆ తరువాత చూస్తా వెళ్ళాలా వద్దా అని”
“మీకు ఎలా వీలు అయితే అలాగే కానీయండి.”
“మీరు పడుకోండి , రేపు 8 గంటలకు బ్రేక్ ఫాస్ట్ కు కింద కు వెళ్దాం , అక్కడ నుంచి వాళ్ళ దగ్గరకు వెళ్దాం “
“అన్నా , రేపు మ్యాచ్ కు నువ్వు కూడా రాకూడదు”
“రేపు వస్తాలే , ఆ తరువాత చెప్పలేను “
“ఆ తరువాత మ్యాచ్ లో టైం మాత్రం రేపు చెప్తారు , కానీ ఎవరితో అనేది మాత్రం గెలిచే దాన్ని బట్టి ఉంటుంది.”
“సరే పడుకోండి , గుడ్ నైట్ ” అని వాళ్ళకు బాయ్ చెప్పి నా రూమ్ కు వచ్చి పడుకోండి పోయాను.

ఉదయం అలారం కి మెలకువ వచ్చింది. రెడీ అవుతుండగా కరుణ ఫోన్ చేసి , నేను రావచ్చా అని అడిగి నేను ok చెప్పగానే వచ్చి “నువ్వు ఇంకా రెడీ కాలేదా” అంది టవల్ మీద ఉన్న నన్ను చూసి
“ఇప్పుడే స్నానం అయ్యింది , రెడీ అవుతున్నా , మీరు రెడీనా”
“ఎప్పుడో రెడీ అయిపోయాము , నువ్వు ఇంకా లేచి ఉండవు అని అమ్మ నన్ను రానీయలేదు.”
తనేమో స్పోర్ట్స్ డ్రెస్ లో ఉంది , ట్రాక్ ప్యాంట్ దాని పైన స్పోర్ట్స్ జాకెట్.
నేను తనను కీన్ గా గమనిస్తున్నాను అని చూసి.
“డ్రెస్ బాలే దా”
“డ్రెస్ , బాగుంది డ్రెస్ లోపల బాడీ కూడా బాగుంది , అందుకే చూస్తున్నా”
“లోపల బాడీ నువ్వెప్పుడు చూసావు ?” అంది నవ్వుతూ
“కనబడుతుంది గా డ్రెస్ మీద , బయటకు బాగానే కనబడుతుంది గా అంటే లోపల కూడా బాగుందనే కదా అర్థం”
“నాకు ఆకలిగా ఉంది తొందరగా వెళ్దాం”
“వచ్చేస్తున్నా , ఇంతకీ నాకో డౌట్ , నీకు టెన్షన్ గా లేదా ఈ రోజు మ్యాచ్ కదా ?”
“ఇండియాలో టెన్షన్ లేదు ఎమీ లేదు , ఇక్కడ కొత్త వాళ్ళు కదా , వాళ్లను చూస్తే ఏమైనా టెన్షన్ వస్తుందేమో , ఇప్పటి వరకు ఎటువంటి టెన్షన్స్ లేవు”
అంటూ ఇంకా ఏవో వాగుతూ ఉంది. ఈ లోపుల నేను రెడీ అయ్యి తనతో పాటు బయటకు వచ్చాను. తను వెళ్లి వాళ్ళ అమ్మను తీసుకొని కింద కు వచ్చింది.
బ్రేక్ ఫాస్ట్ తిని వాళ్ళ కోచ్ ఉన్నా హోటల్ కు వెళ్ళాము , హోటల్ పార్కింగ్ ఓ వ్యాన్ ఉంది , దాని మీద బ్యానర్ చూసి అది డైరెక్ట్ గా స్టేడియం కు వెళుతుంది అని ఎక్కి కుచోన్నాము.
ఓ 15 నిమిషాలలో బస్సు మొత్తం నిండి పోయింది , వాళ్ళ కోచ్ వచ్చి అందరినీ ఓ మారు చెక్ చేసుకొగానే బస్సు స్టేడియం కు బయలు దేరింది.

ఆ రోజు మ్యాచ్ ల లిస్టు లో 5 వ మ్యాచ్ కరుణ vs మరియా ( ఉగాండా) అని ఉంది ఇద్దరు 48 kg – 51kg బరువు catogery కింద పోటీ పడుతున్నారు.

5 వ మ్యాచ్ అంటే మద్యానం లంచ్ తరువాత ఉంటా ది. కరుణా స్టేడియం లోకి రాగానే వాళ్ళ టీం తో కలసి లోపలి వెళ్ళింది , వాళ్ళ అమ్మా నేను audiance కుచోనే చోట కుచోన్నాము.

151003cookie-checkకలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 26

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *