కలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 26

Posted on

గూగుల్ మ్యాప్ ఆ లొకేషన్ మాకు 1 కిలో మీటర్ దూరం లో ఉంది అని చూపిస్తుంది. అక్కడ నుంచి వీల్లు ఎక్కడ ఉన్నారో అని వెతకాలి అనుకుంటుండగా హమీద్ లేశాడు.

“మనం ఇంకో గంటలో యాక్షన్ లోకి దిగాలి అంత వరకు కొద్దిగా రెస్టు తీసుకోండి” అంటూ తను లేచి వ్యాన్ లో నీళ్ళు వంపుకొని మొహం కనుక్కున్నారు. వస్తు వస్తూ ప్లాస్క్ లో పోయించు కొన్న టి ని రెండు కప్పుల్లో నింపుకొని ఒకటి నా కిచ్చి రెండోది తను తీసుకున్నాడు.

ఆ అడవిలో చెట్ల మద్య నుంచి మా మీద పడుతున్న లేత సూర్యకిరణాలు నును వెచ్చని వేడి మా శరీరాల లోంచి చలిని బయటికి పంపాలని ప్రయత్నిస్తుండగా. దానికి తోడూ రాత్రి తెచ్చుకున్న టి ఇంకొద్దిగా సహాయ పడింది శరీరం వేడెక్కడానికి.

ముందే అనుకున్న ప్లాన్ ప్రకారం ఇద్దరం ఫారెస్టు గార్డ్స్ uniform లోకి దిగిపోయాము , కావలసిన ఆయుధాలు అన్నీ సర్దుకొని మెల్లగా మ్యాప్ లో ఉన్న ప్రదేశం వైపు కదల సాగాము.

ఆ మ్యాప్ ఉన్న ప్రదేశానికి చేరుకోగానే , అక్కడ నుంచి తనకు ఎదో బాగా తెలిసినట్లు , అడవిలో ఓ దిశలో స్పీడ్ గా తన వాచ్ చూసుకోం టు నడవ సాగాడు.

దాదాపు ఓ ౩౦ నిమిషాలు నడిచిన తరువాత , “సర్ , యాక్షన్ కు టైం అయ్యింది , రెడీ గా ఉండండి ” అంటూ మా ముందున్న గుబురు పొదల్లోంచి బయటకు చూసాడు.
అంత వరకు ప్రశాంతంగా , పక్షుల కిల కిల రావాలతో ఉన్న ప్రదేశం ఉన్నట్లు ఉండి ” పట్టుకోండి రా , కొడుకుల్ని , ఒక్కరినీ వదలొద్దు, సారూ చెప్పినట్లు ముగ్గురు ఉంటారు చూడండి ” అంటూ కేకలు , అరుపులతో ఓ 5 మంది మా ముందు వైపున అలజడి చేయసాగారు

“సార్ , లెట్స్ ఎటాక్ ” అంటూ హామీదు ఒక్క సారిగా ముందుకు దూకాడు.

మా ముందు కొద్ది దూరంలో ఓ చిన్న కొట్టం లాంటి ప్లేస్ ఉంది , దాని ముందు ముగ్గరిని ఇందాకా అరుపుల అరిచిన తాలుకా వ్యక్తులు చుట్టూ ముట్టారు , వాళ్ళ చేతుల్లో కత్తులు కొడవళ్ళు ఉన్నాయి.

వెనుక నుంచి హామీదు, నేను వాళ్ళ మీద కు దాడి చేశాము.

“రేయ్ , వీళ్లతో పాటు వాళ్లను కూడా వేసేయండి రా ఓ పని అయిపోతుంది , మధ్యలో పానకం లో పుడక లాగా వచ్చారు ” అన్నాడు వాళ్ళల్లో లీడర్ లాగా వాళ్లను కమాండ్ చేస్తున్న వ్యక్తీ.

నా ముందున్న వాడి భుజం మీద ఓ కిక్ ఇస్తూ , ఆ కమాండ్ ఇచ్చిన వాడి వైపు చేయి విసిరాను. నా ముష్టి ఘాతం వాడి ముఖానికి తాకినట్లుంది.
“చచ్చాను రోయ్ ” అంటూ తన రెండు చేతులతో ముక్కు మూసుకోం టు కింద పడిపోయాడు.

హామీదు కొట్టిన దెబ్బలకు ఇద్దరు కింద కు దోర్లారు , మిగిలిన ఇద్దరు మా చేతులకు దొరకకుండా అక్కడ నుంచి పారిపోయారు. మా ముందు నిలుచున్న ముగ్గురు బిక్కు మొహం వేసుకొని బతికి పోయాం రా దేవుడా అనుకొంటూ ఉండగా

“ఎవ్వర్రా మీరు ఇక్కడ ఎం చేస్తున్నారు , వీళ్ళు ఎవ్వరు , మిమ్మల్ని ఎందుకు చంపాలని అనుకొంటుండారు” అన్నాడు హామీదు కొద్దిగా కమాండింగ్ వాయిస్ తో

హమీద్ డ్రెస్ , వాయిస్ చూసి వాళ్ళకు కొద్దిగా ధైర్యం , ఇంకొద్దిగా భయం కల గలిపి నోట్లోంచి మాటలు బయటికి రానట్లు నోటిలోనే ఆగి పోయాయి.
“ఏంటి భే , చూస్తుంటే అడవిలో ఎర్ర చందనం దొంగ లించడానికి వచ్చినట్లు ఉన్నారు, ఇంతకీ ఈ నా కొడుకులు ఎవ్వరు మిమ్మల్ని ఎసేయడానికి రెడీ గా వచ్చారు , ఆ సారూ ఎవరు వాళ్లను పంపింది , ఇందాకా వాళ్ళల్లో ఎవడో అరుస్తున్నాడు సారూ చెప్పినట్లు అని , ఇంతకీ ఆ సారూ ఎవరు , మీరు ఎం చేసారు ఆ సార్ కు ? వాడు మిమ్మల్ని ఎందుకు లేపేయాలి అనుకుంటున్నాడు”

“వీళ్ళ ను సారూ పంపాడా ? మనల్ని లేపేయడానికి ?” అన్నాడు వాళ్ళల్లో ఒకడు
“ఇందాకా వాళ్ళల్లో ఒకడు అరుస్తున్నా డుగా ,భే , మీరు విన లేదా ” అంటూ కింద పడ్డ వాడిని లేపి , “ఎవర్రా మిమ్మల్ని పంపింది ఇంతకీ వీళ్ళ ను ఎందుకు చంపాలను కొంటున్నారు ?” అంటూ కాళితో వాడి పిర్రల మీద తన్నాడు.

వాడు కొద్దిగా ముందుకు ఎగిరి పడి , “కొట్టకండి సార్ , అన్నీ చెప్పేస్తా , వాళ్ళు ఇచ్చింది తక్కువ ఇక్కడ తన్ను లు తినింది ఎక్కువ” అన్నాడు.

“నీ సొల్లు అపు భే, ఇంతకీ వీళ్ళ ను ఎందుకు చంపాలను కొన్నారు “

“డబ్బులు ఇచ్చారు సార్ వీళ్ళ ను లేపేయమని , ఇక్కడ ఎవ్వరు ఉండరు , ముగ్గురే ఉంటారు , వాళ్ళ దగ్గర ఎమీ ఉండవు , ఇలా వెళ్లి అలా ఫినిష్ చేసి వచ్చేయండి అని పంపాడు పెద్ద సారూ , ఇంతకీ మీరెవ్వరు సారూ ? “

“మేము ఎవ్వరో తరువాత చెప్తాము కానీ , ఆ సారూ ఎవ్వరు ? అది చెప్పు ”
“ఏమో సారూ అయన పేరు తెలియదు , కానీ పెద్ద పొలిసు ఆఫీసర్ “
“మరి మీకు డబ్బులు ఎవరు ఇస్తా మన్నారు ?”
“వీళ్ళ ను వేసేసి వచ్చి కనబడ మన్నాడు సారూ , వచ్చాక డబ్బులు ఇస్తానన్నాడు”
“అయితే నీకు సు పారి ఇచ్చినాయన పేరు తెలవదు”
“అంత పెద్ద పోస్ట్ లో ఉండే అయన , డైరెక్ట్ గా ఎందుకు వస్తారు సారూ”
“ఆయన ఎవ్వరో నాకు తెలుసు సారూ ” అన్నాడు ఆ ముగ్గరిలో ఒక్కరు.
“ఏయ్ , నువ్వు ఉండు నీ సంగతి తెలుస్తాము , మాట్లాడ కుండా కుచోండి ముగ్గురు, సార్ ఈ నా కొడుకుల్ని నేను జీప్ లో కట్టేసి వస్తా మీరు వీళ్ళ ను చూసుకోండి” అంటూ

కింద పడ్డ మిగిలిన ఇద్దరినీ పట్టుకొని జీపు వైపు వెళ్ళాడు. నేను అక్కడున్న ముగ్గరిని తీసుకొని ఆ గుడిసె లాంటి దాని లోనకు వెళ్లాను

“ఇప్పుడు చెప్పండి ఎవ్వరు మీరు , ఇక్కడ ఎందుకు వచ్చారు ? , ఆ సారూ ఎవ్వరు , అయన మిమ్మల్ని ఎందుకు చంపాలని చూస్తున్నాడు ? చూస్తుంటే చదువు కొన్న వాల్ల లాగా ఉన్నారు ” అన్నాను.

“నా పేరు రామ కృష్ణ , వాడి పేరు యాదవ్ , వీడి పేరు అమానుల్లా ” అంటూ తన ఫ్రెండ్స్ ని పరిచయం చేసాడు రామ కృష్ణ

“ఇంతకీ టౌన్ వదిలి ఇంత దూరం ఎందుకు వచ్చారు , అక్కడ ఏదైనా గొడవల్లో ఇరుక్కున్నారా ఏంటి ?? , మిమ్మల్ని చూస్తుంటే ఈ అడవుల్లో ఉండే వాళ్ళ లాగా కనబడ లేదే ? “

151003cookie-checkకలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 26

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *