కలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 25

Posted on

మల్లికార్జునుకు ఫోన్ చేస్తే తను ఆఫీస్ లోనే ఉన్నాడు. నేను వస్తున్నా ఉండమని చెప్పి బైక్ ను స్టేషన్ వైపుకు తిప్పాను.
తను దొరకడం , ఆఫీస్ కి తీసుకేల్లడం , నూర్ తో వాళ్ళ ఇంట్లో ఉంచడం నూర్ ద్వారా తన నెంబర్ కనుక్కోవడం అన్నీ డీటెయిల్డా గా చెప్పి ఆ నెంబర్ తనకు ఇచ్చాను.
“నీ దగ్గరే ఉంచు మనం ఇప్పుడు సైబర్ సెల్ దగ్గరకు వెళ్దాం అక్కడ అన్ని డీటెయిల్స్ దొరుకుతాయి” అంటూ తన జీప్ లో ఇంకో స్టేషన్ కు తీసుకొని వెళ్ళాడు.

ఎప్పుడో పేపర్లో చదివాను ఈ మద్య పోలీస్ వాళ్ళు అత్యాధునిక పరికరాలతో సైబర్ కేసులు ఛేదిస్తున్నారు అని. వాళ్ళ దగ్గరున్న ల్యాబ్ చూసే కొద్ది నిజమే అనిపించింది.

మేము వెళ్ళిన ఓ 20 నిమిషాలకు ఆ నెంబర్ నుంచి ఎ ఎ నంబర్స్ కి కాల్స్ వెళ్ళాయి , ఈ నెంబర్ ఎక్కువగా ఎ ఎ ప్రదేశాలలో ఉందొ వాటి వివరాలు అన్నీ ప్రింట్ చేసి ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన ప్రింట్స్ లోంచి కొన్ని నంబర్స్ రౌండ్ చేసి వాటి వివరాలు అడగమన్నాను.

ఇంకో గంట ఓపికగా ఎదురు చూసే కొద్దీ అన్ని డీటెయిల్స్ ఇచ్చారు వాటి పేర్లు , ఫొటోలతో సహా.

ఈ విషయం కొద్దిగా ఎవరికీ పొక్కకుండా చూడమని C.I కి చెప్పాను.
నా వైపు నవ్వుతూ చూసి “శివా, వాడు నా బెస్ట్ ఫ్రెండ్ అందుకే ఇలా వచ్చా లేదంటే రేపు రమ్మని చెప్పి అఫిషియల్ గా కనుక్కునే వాళ్ళ ము గా, మన ముగ్గరికి తప్ప వేరే వాళ్ళకు ఎవ్వరికీ తెలియదు నువ్వు వర్రీ కాకుండా నెక్స్ట్ స్టెప్ ఏంటో ఆలోచించు.”
“రెండు రోజుల్లో తేలిపోతుంది సర్, కొద్దిగా ఓపిక పట్టాలి అంతే” అంటూ తనతో కలిసి రిటర్న్ లో నా బైక్ collect చేసుకొని ఇంటికి వచ్చాను.

తను ఇచ్చని ఓ 40 దాకా పేపర్లు ముందు వేసుకొని, నా ఫోన్ లో దుకాణాల నుంచి collect చేసిన వీడియో క్లిప్ ల లోని పేస్ లతో మ్యాచ్ అయ్యే పేస్ ల కోసం వెతక సాగాను.

యాదవ్ , అమానుల్లా ల పేర్లు ఫొటోలు మ్యాచ్ అయ్యాయి. కానీ వాళ్లలో ఉన్న నల్ల జాతీయుడి నెంబర్ ఇందులో లేదు , ఒక వేల ఉంటే వాడు వేరే వారి పేరు మీద ఫోన్ తీసుకొని ఉండాలి అనుకొంటూ. వీళ్ళ ఇద్దరి ఫోన్ ల నుంచి పోయిన , వచ్చిన కాల్స్ పరిశీలించ సాగాను.
యాదవ్ ఫోన్ కు దొంగ తనం జరగడానికి ముందు 10 రోజుల రొజూ రాత్రి 10.00 గంటల పైన ఓ ఫోన్ వచ్చేది ఓ 15 , 20 నిమిషాల పాటు వాళ్ళ సంభాషణ సాగినట్లు ఆ డీటెయిల్స్ లో ఉంది. ఆ నెంబర్ యొక్క డీటెయిల్స్ లేవు , రేపు ఆ నెంబర్ డీటెయిల్స్ కనుక్కోవాలని చెప్పి అది నోట్ చేసుకున్నాను.
ఈ రెండు నంబర్స్ రెండు రోజుల నుంచి ఆఫ్ లో ఉన్నాయి. చివరగా అవి ఆగిపోయిన ప్లేస్ సిటికి ఓ 400 కిమీ దూరంలో ఉన్న అడివి.
ఎలాగైనా జాకీ తో మాట్లాడించాలి అప్పుడే అన్ని చిక్కు ముడులు విడిపోతాయి అనుకొంటూ పడుకున్నాను.

మరుసటి రోజు యధా విధిగా ఆఫీస్ కు వెళ్లాను , అక్కడ నూర్ కొనిచ్చిన కొత్త డ్రెస్ వేసుకొని వచ్చింది జాకీ , నేను ఆఫీస్ లోకి రాగానే ఇద్దరూ నా రూమ్ లోకి వచ్చారు.
“ఎలా ఉంది జాకీ , ఈ కొత్త ప్లేస్ , నీకు నచ్చిందా “
“బాగానే ఉంది సారూ , నేను ఇక్కడ ఎం పని చేయాలి “
“ఇంతకు నువ్వు ఎం చదువుకున్నావు “
“10 తరగతి మధ్యలో వదిలేసాను సర్”
“సరే అయితే , ప్రయివేట్ గా చదివి పరీక్షలు రాస్తా వా, నీకు కావలసిన హెల్ప్ చేస్తుంది నూర్”
“ఈ వయస్సులో , రాయచ్చా సారూ “
“నీ కు చదువుకోవాలని ఉంటే ఎ వయస్సులో నైనా రాయవచ్చు , ఇక్కడ పని చేస్తూ చదువుకో , 10 పాస్ అవ్వగానే డిగ్రీ చదవచ్చు అప్పుడు నీ జీవితం బాగు పడుతుంది “
“అవన్నీ జరిగే పనేనా సారూ ? “
“ఏమో నువ్వు కావాలను కొంటే జరుగుతాయి లేదంటే లేదు, కొన్ని రోజులు ఇక్కడే ఉండు నీకు నచ్చిన పని చేస్తూ ఉండు , ఓ నెల రోజుల తరువాత నువ్వు డిసైడ్ చేసుకో ఎం చేయాలనే ది”
“నీకు టీ చేయడం వచ్చా, నూర్ చూపిస్తుంది కిచెన్ ఎక్కడుందో , అందరికి టీ తయారు చేసి తీసుకొని రా” అంటూ నూర్ వైపు చూసాను.

తనతో పాటు కిచెన్ లోకి వెళ్లి తనకు కిచెన్ పరిచయం చేసి నా రూమ్ కు వచ్చింది
“నూర్ , తను అంత తొందరగా బైట పడదు, కానీ మనము ఓ రెండు రోజుల్లో తను నుంచి మొత్తం అంతా రాబట్టాలి, ఈ రోజుకు ఎం పనీ చెప్పక కొద్దిగా ఫ్రీ గా వదిలై , మనల్ని నమ్మాలి అప్పుడే మనం ఎం అడిగినా చెప్తాది, నేను సాయంత్రం తనను తీసుకొని బయటకు వెళతాను , వీలయితే అప్పుడు బయట పాడుతుందేమో చూద్దాము.” అన్నాను

“అలాగే బాసు, మా దగ్గర కంటే మీ దగ్గరే ఎక్కువ మాట్లాడే ఛాన్స్ ఉంది”
“సరే చూద్దాం సాయంత్రం ” అంటూ ఆఫీస్ వర్క్ లో మునిగి పోయాను.

జాకీ మా అందరికి టి ఇచ్చి కిచెన్ క్లీన్ చేసింది. సాయంత్రం వరకు తనకు ఎ పనీ చెప్పలేదు , తను మాత్రం ఆఫీస్ మొత్తం ఓ సారి తిరిగి వచ్చింది. సాయంత్రం అందరూ ఇళ్లకు వెళ్ళేటప్పుడు నూర్ జాకి తో అంది “నాకు బయట కొద్దిగా పనుంది ,బాసు నిన్ను ఇంటి దగ్గర దింపుతారు బాసు తో పాటు వచ్చేయ్ “అని చెప్పి తను వెళ్లి పోయింది.

ఆఫీసు లో అందరూ వెళ్ళిన ఓ గంటకి నా రూమ్ క్లోజ్ చేసి బయటికి వస్తుంటే , జాకీ నాతొ పాటు బయటకు వస్తూ
“సారూ , అక్క మీతో పాటు రమ్మంది తనకు వేరే పని ఏదో ఉందంట ముందే పెళ్లి పోయింది “
“సరే , పద వెళ్దాం ” అంటూ తనతో పాటు బైక్ మీద ఇంటి దారి పట్టాము
“జాకీ , తొందరగా ఇంటికి వెళ్ళాలా ఏంటి ? “
“ఇంట్లో బోరు సారూ , అంత తొందరగా వెళ్లి చేసేది ఎం ఉంది ఇంట్లో “
“అయితే అలా బయటకు వెళ్లి ఆ తరువాత ఇట్లో దిగబెట్టనా “
“సరే సారూ “

బైక్ ను ఓ ప్రైవేటు క్యాబిన్స్ ఉన్న ఫోష్ బారు కు తీసుకొని వెళ్లాను. ఇద్దరం క్యాబిన్ కు వెళ్లి బీర్స్ ఆర్డర్ చేసి తినడానికి తన కు ఎం కావాలో ఆర్డర్ చేయమన్నాను.
“నాకేం తెలుసు సారూ , ఇలాంటి ప్లేస్ కు రావడం మొదటి సారి , మీరే చెప్పండి ఏమైనా” అంది
ఇద్దరికీ రెండు మూడు రకాల చికెన్ ఐటెమ్స్ ఆర్డర్ చేసి తనను మెల్లిగా మాటల్లో దింపాను.

150982cookie-checkకలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 25

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *