జనం మెచ్చిన రాజు – Part 5

Posted on

ఎంత ప్రాణం అయితే వీరా వీరా …… అంటూ అంతులేని బాధతో విలపిస్తూ నా వెనుకే లోయలోకి దూకబోయింది మహి …….
కన్నీళ్లు కారుస్తున్న కృష్ణ వెంటనే స్పందించి అడ్డుపడ్డాడు .
మహీ మహీ …… నీకేమైనా అయితే అంటూ ప్రేమతో కౌగిలిలోకితీసుకుని ఓదార్చారు స్నేహితులు …….
మహి : ఇక బ్రతికి ఏమి ప్రయోజనం , మనకోసం మనల్ని రక్షించడం కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన దేవుడు అంటూ ఏడుస్తూనే ఉంది .
స్నేహితులు : మహీ మహీ …… ఇక్కడ ఉండటం అపాయం – ఏక్షణంలోనైనా మిగిలిన బందిపోట్లు రావచ్చు .
మహి : నేను రాను ……..
స్నేహితులు : మహీ ……. అలాజరిగితే నీ దేవుడి త్యాగానికి విలువలేకుండా పోతుంది , వెళదాము ……..
మిత్రుడిని దేవుడితో పోల్చడం విని కృష్ణ ఆనందించింది – దేవుడు అంటే గుర్తుకువచ్చింది తన మిత్రుడినైన నేను పడినది గంగమ్మ ఒడిలోకి అని , ఆ గంగమ్మ తల్లే చూసుకుంటుంది అని మనసులో ధైర్యం చెప్పుకున్నాడు .

మహిని …… తన స్నేహితులు లోయ నుండి దూరంగా పిలిపించుకురావడం చూసి , ఈ దాడిలో భయంతో బండిని వదిలి పారిపోయిన గుర్రాల స్థానంలోకి కృష్ణ చేరి లాక్కునివెళ్లింది .
మహి – అమ్మాయిలు వద్దని నడుచుకుంటూ వెళదామని చెప్పినా ……. , కృష్ణ వదలకుండా బండిలోకి ఎక్కించుకుని వారి గమ్యస్థానానికి తీసుకెళ్లాడు ) .
************

కృష్ణ అనుకున్నదే జరిగింది , అంత ఎత్తులోనుండి చేరినది ఎక్కడికి – నదీ దేవత అమ్మ ఒడిలోకి , నీళ్ళల్లోకి చేరగానే నన్ను చుట్టేసిన బందిపోట్లను చెల్లాచెదురుచేసేసింది .
ప్రాణంలా తన ఒడిలోకి చేర్చుకుంది , అప్పటివరకూ కలిగిన విపరీతమైన నొప్పిస్థానంలో హాయిగా అనిపించింది – కళ్ళు మూతలుపడ్డాయి .
కొన్ని మైళ్ళ దూరం తన ప్రవాహంలో జాగ్రత్తగా తీసుకెళ్లి ఒడ్డుకుచేర్చింది .

ప్రవాహపు ఒడ్డులో ఆడుకుంటున్న పిల్లలు చూసి , గుర్తుపట్టినట్లు అన్నయ్యా అన్నయ్యా …… అంటూ వచ్చారు , నేను స్పృహలో లేకపోవడం – రక్తం కారుతుండటం చూసి , అమ్మా – అయ్యా …… అంటూ బిగ్గరగా కేకలువేశారు .
పొలం పనులు చేసుకుంటున్నవాళ్ళు బిడ్డలూ బిడ్డలూ …… ఏమిజరిగింది అంటూ ఆతృతతో వచ్చారు . ఏనుగు దాడి నుండి పిల్లలను – పశువుల నుండి మనల్ని కాపాడిన దేవుడు దేవుడు …… అంటూ వెంటనే జాగ్రత్తగా ఎత్తుకుని అడవిలోని తమ గూడెం కు తీసుకెళ్లి మూలికలతో వైద్యంచేసి కాపాడారు .
*************

( మహీవాళ్ళు …… కృష్ణను ఎక్కడికి తీసుకువెళ్లారో చూసి ఆశ్చర్యపోయాడు .
కృష్ణను తమ దగ్గరే ఉంచుకుని ఆప్యాయంగా చూసుకున్నారు .
సమయం గడుస్తున్నా …… మహి బాధ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు .
స్నేహితులు ఎంత ఓదార్చినా ప్రయోజనం లేకపోయింది .
మహేష్ కు మీ దేవుడికి ఏమీకాదు అని ఎలాచెప్పాలో తెలియక కృష్ణకూడా బాధపడుతున్నాడు
మహి తల్లిదండ్రులు …… బందిపోట్ల దాడిని తెలుసుకుని వాళ్లపై చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప మహి బాధకు కారణం ఏమిటో తెలుసుకోవడం లేదు .
తెలుసుకున్నా …… పరువు గురించి ఆలోచిస్తారు తప్ప , వీరధివీరుడైన దేవుడిని ఆహ్వానించి ఉండరు అని లోలోపలే బాధపడుతోంది ) .
*****************

స్పృహలోకివచ్చేసరికి కుటీరంలో మంచంపై ఉన్నాను . నొప్పి ఉన్నా లేచి కూర్చున్నాను – బయట చీకటిగా ఉంది .
అన్నయ్యా అన్నయ్యా ……. , అమ్మా – అయ్యా …… అన్నయ్య లేచారు అంటూ పిలుచుకునివచ్చారు .
బాబూ బాబూ ……. లేవకు లేవకు గాయాలు మానడానికి మరొకరోజైనా విశ్రాంతి తీసుకోవాలి అంటూ లోపలికివచ్చారు .
మరొక రోజైనానా ….. ? , అయ్యా – అమ్మా …… ఇక్కడకు ఎలా వచ్చాను ? , వచ్చి ఎన్నిరోజులయ్యింది ? .
ప్రవాహంలో కొట్టుకుని రావడం పిల్లలు చూడటంతో రక్షించగలిగాము .
మీరుణం తీర్చుకోలేనిది – ఇంతకూ ఎన్నిరోజులవుతోంది అమ్మా …….
రెండు రోజులు అవుతోంది బాబూ ……. , కాసేపట్లో తెల్లారుతుంది , మా పిల్లలు ఇలా ప్రాణాలతో ఉన్నారంటే నీవల్లనే …….
రెండు రోజులయ్యిందా …… ? , నేను వెంటనే వెళ్ళాలి అంటూ పైకిలేచి స్స్స్ అన్నాను .
బాబూ …….. , నొప్పితో నడవటం కష్టం …….
వెళ్ళక తప్పదు అమ్మలూ ……. , సమయం లేదు ( ఇక ఐదురోజులు మాత్రమే ఉన్నాయి ) నా బట్టలు …….
అవి చిరిగిపోయాయి బాబూ …… , వీటిని నీకోసమే తయారుచేసాము అని కొత్త బట్టలు అందించారు .
సంతోషం అమ్మా …… , మీరుణం తీర్చుకోలేనిది …….
మీరెక్కడికి వెళుతున్నారో తెలుసుకోవచ్చా ….. ? .
” నంది ” రాజ్యానికి అమ్మలూ ……..
బాబూ ……. అంతదూరం ఈ పరిస్థితులలో వెళ్లడం అసాధ్యం – మాకొక అవకాశం ఇస్తే తెప్పలలో జాగ్రత్తగా చేర్చుతాము .
ఇంతవరకూ చేసిందానికే మీకు ఋణపడిపోయాను – ఒకపని చెయ్యండి ఆ తెప్పల దగ్గరికి తీసుకెళ్లండి – నేను ఒంటరిగా వెళతాను .
మీ గురించి నిన్ననే చూసాము కానీ కానీ …… సరే బాబూ అంటూ ఆహారం – మూలికలతోపాటు ఒడ్డుకు తీసుకెళ్లారు . నాతోపాటు కాస్త దూరం వరకూ వేరు వేరు తెప్పలలో వచ్చి మీరు నిజంగా దేవుడే జాగ్రత్త అనిచెప్పి వెనుతిరిగారు .

నేనేమీ చేయకపోయినా నదీ దేవత అమ్మే ప్రవాహానికి వ్యతిరేకంగా గమ్యం వైపుకు తీసుకెళుతోంది .
అంతలో సూర్యోదయం అవ్వడంతో అమ్మ ఓడిలోకిచేరి సూర్య నమస్కారం చేసుకున్నాను , అంతవరకూ ఉన్న నొప్పి నీళ్ళల్లోకి దిగగానే క్షణాలలో మాయమైపోయింది
గురువుగారు చెప్పినది నిజమే ” మహేష్ …… నీకు ఏకష్టం వచ్చినా నదీ దేవత దగ్గరికి వెళ్లు అని చెప్పడం ” .
ఎందుకమ్మా …… నేనంటే అంత ఇష్టం మీకు అంటూ నీటిని సేవించి ప్రయాణం సాగించాను .
సగం రోజుకుపైగా పట్టాల్సిన ప్రయాణ సమయాన్ని కొన్ని ఘడియలలోనే చేర్చారు .

తెప్పలోనుండే రాజ్యాన్ని ఎటుచూసినా పచ్చని పంటలను చూసి ఆశ్చర్యపోయాను . నా ఏడు రోజుల ప్రయాణంలో ఇంతపెద్ద రాజ్యాన్ని చూడనేలేదు – మహీవాళ్ళు సామంత రాజ్యం నుండి ఈ రాజ్యం వైపే ప్రయాణించారు మధ్యలో ఏ రాజ్యం కానీ గ్రామం కానీ లేదుకాబట్టి , ఇంత పెద్ద రాజ్యంలో దృష్టిలో పడకుండా మొదట నా మిత్రుడిని ఎలా వెతకడం అటుపై కట్టుదిట్టమైన భద్రతలో ఉన్న యువరాణిని ఎలా కలవడం …… , ముందు అయితే నా మిత్రుడిని కలుసుకోవాలి అంటూ ఒడ్డుకు చేరుకున్నాను , అమ్మా ….. వెళ్ళొస్తాను అని నీటిని స్పృశించి రాజ్యంలోకి వెళ్ళాను – మధ్యాహ్నం వరకూ మాఇద్దరికీ తెలిసిన శబ్దాలతో వెతికినా ప్రయోజనం లేకపోయింది – అసలు నా మిత్రుడు ఇక్కడే ఉన్నాడా అన్న అనుమానం కలిగింది

ప్రతీ వీధిలో యువరాణీ గురించే మాట్లాడుకుంటున్నారు , రెండు రోజులుగా యువరాణి పెద్ద జ్వరంతో బాధపడుతున్నదని – ఏడుస్తూనే ఉన్నదని , రాజ్యపు వైద్యుడితోపాటు రాజ్యంలోని పెద్ద పెద్ద వైద్యులు చుట్టుప్రక్కల సామంతరాజ్యం నుండి వచ్చిన వైద్యులు వైద్యం చేసినా ప్రయోజనం లేకపోయిందని , ఇంతపెద్ద జ్వరం అయినా మందులతో నయం అయిపోయేది కానీ తగ్గడం లేదు అంటే వేరే బలమైన కోరిక ఉందేమోనని , యువరాణి చాలా చాలా మంచివారు రాజు – రాణిలలా కాదు త్వరగా నయమవ్వాలని ప్రతీఒక్కరూ ప్రార్థిస్తున్నారు .

యువరాణికి జ్వరమా …… అంటూ బాధవేసింది , తొందరగా నయమవ్వాలని అమ్మవారిని – పరమ శివుడిని ప్రార్థించాను .
గురువుగారు ఇచ్చిన మూలికలతో ఘడియలలో నయమైపోతుంది – ఆ మూలికలన్నీ మిత్రుడి దగ్గరే ఉన్నాయే ఇప్పుడెలా …….
అంతలో ఒక ఆలోచన వచ్చింది రాజ్యానికి ప్రక్కనే రాజ్యం కంటే ఎత్తులో ఉన్న కొండ మీదనుండి ప్రతీ గృహపు ఖాళీస్థలాలలోకి చూస్తే మిత్రుడు ఎక్కడ ఉన్నాడో కనిపిస్తుంది అనుకుంటూనే వేగంగా కొండమీదకు చేరాను .

ఆలోచన సరైనదే కొండ పైభాగం నుండి అంత పెద్ద రాజ్యం మొత్తం నా కనుచూపు పరిధిలోనే ఉంది .
మొదట నా మిత్రుడు ఎక్కడ ఎక్కడ అంటూ అల్లంత దూరంలో ఉన్న నదీప్రవాహం ఒడ్డున ఉన్న చిన్న చిన్న ఇళ్ల దగ్గర నుండి మొదలెట్టి కొండ పాదం వరకూ గల రాజ్యంలోని ప్రతీ ఇంటి ఖాళీస్థలాలవైపు రెండుమూడుసార్లు చూసినా ప్రయోజనం లేకపోయింది – ఇక మిగిలినది కేవలం రాజ్యం మధ్యలోఉన్న రాజమందిరం మాత్రమే , అయినా అక్కడ ఎందుకు ఉంటాడులే అని నిరుత్సాహంతోనే చూసాను.
అనితరసాధ్యమైన చుట్టూ ప్రహరీగోడలతో అద్భుతమైన రాజాప్రసాదాలు అంతకుమించి అక్కడక్కడా మహాద్భుతమైన ఉద్యానవనాలు కనుచూపు తిప్పుకోకుండా చేస్తున్నాయి , ఎటుచూసినా అందంగా పచ్చదనం – రంగురంగుల పూలమొక్కలు – ఈతకొలనులు …….. , రాజుల విలాసాలు ఇలా ఉంటాయా అని ఆశ్చర్యపోయాను .

అంతలోనే ఉద్యానవనంలో రాజసంగా అటూ ఇటూ తిరుగుతున్న నా మిత్రుడు తారసపడ్డాడు – మిత్రమా …… అంటూ పెదాలపై ఆనందం , నిన్నుచూసి రెండు రోజులోవుతోంది మిత్రమా ……. ఇదిగో ఇప్పుడే వచ్చేస్తున్నాను అంటూ ఆతృతతో దిగబోయి ఆగిపోయాను .
ఏదో గురుకులంలో కనిపించినట్లు వెళ్లిపోతున్నావు రేయ్ అక్కడచూడు ఉద్యానవనంలో తప్ప లోపల మరియు రక్షణ గోడపై అడుగుకొక భటుడు కాపలా కాస్తున్నారు అందుకేనెమో ఉద్యానవనంలో దర్జాగా తిరుగుతున్నాడు , భటులకు దొరికితే ఇక అంతే కారాగారమే …… స్వయంవరం లేదు రాజ్యం లేదు ఇప్పుడెలా ……. మరొక ఆలోచన చీకటిపడేంతవరకూ వేచిచూడాల్సిందే ……. , అంతవరకూ యువరాణికి ఎటువంటి అపాయం కలుగకూడదు అని అమ్మవారిని ప్రార్థించాను .

శిఖరాగ్రాన కూర్చున్నాను – ఆహా ….. నాకంటే ముందుగానే రాజ్యంలోకి అడుగుపెట్టి రాజసంగా తిరుగుతున్న నా మిత్రుడిని చూస్తూ ఒకవైపు సంతోషిస్తూనే మరొకవైపు అసూయ చెంది నవ్వుకుంటున్నాను . ఇంతకూ అసలువిషయం …… నా మిత్రుడు అక్కడికెలా వెళ్లాడబ్బా , ఉద్యానవనంలో అటూ ఇటూ వెళుతున్న స్త్రీలు అయితే మిత్రుడిని ఆప్యాయంగా చూసుకుంటున్నారు – ఆహారం అందిస్తున్నారు , ఎంతైనా నా మిత్రుడు మహాద్భుతం కదా …… చూడగానే నచ్చేసి ఉంటాడు రాజాధికారంతో తీసుకెళ్లిపోయి ఉంటారు .
నా మిత్రుడిని ఎలా బయటకు తీసుకురావడం అంటూ ఉద్యానవనం వెంబడి రక్షణగొడవైపు జాగ్రత్తగా పరిశీలించాను . ఆశ్చర్యం ఉద్యానవనం వైపు ఒక్క భటుడు కూడా కాపలా కాయడం లేదు అంటే ఆ ఉద్యానవనం ఖచ్చితంగా రాణి గారిదైనా లేదా యువరాణీ దైనా అయి ఉంటుంది , అది మనకు సహాయం చేసేదే ……. , చీకటిపడ్డాక అనితరసాధ్యమైన రక్షణగోడను దాటి లోపలికివెళ్లి ఎలాగోలా మిత్రుడితోపాటు బయటపడి , గురువుగారి మూలికలను యువరాణికి చేరేలా చూడాలి . నువ్వు ఆడుకో ఆడుకో మిత్రమా …… ఉద్యానవనం మొత్తం నీదేకదా అంటూ ఆనందిస్తూనే ఉన్నాను – అయినా నీ కనుచూపు నాకంటే శక్తిమంతం కదా నన్ను చూడొచ్చుకదా , అయినా ఎలా చూస్తావులే రెండురోజులుగా విలాసాలు ఆస్వాధిస్తున్నావుకదా ……. ఆడుకో ఆడుకో తిను కడుపునిండా తిను అంటూ బుంగమూతిపెట్టుకుని చూసి సంతోషిస్తున్నాను .

ఎప్పుడు తిన్నానో నాకే తెలియదు – గూడెం అమ్మలు ఇచ్చిన ఆహారం కూడా మిత్రుడిని కలవాలన్న ఆత్రంలో తెప్పలోనే మరిచిపోయాను – నా చుట్టూ కొండ అంతా పళ్ళ చెట్లు నోరూరిస్తున్నప్పటికీ యువరాణికి నయమవ్వాలని తినకుండా ఉండిపోయాను . రక్షణగోడను ఎక్కడానికి అవసరమైన తీగలను సమకూర్చుకున్నాను .

చీకటిపడేంతవరకూ వేచిచూసి , మిత్రమా వస్తున్నాను అంటూ వేగంగా కిందకుదిగాను – రాజ్యంలో తిరుగుతున్న సైనికులకు ఏమాత్రం అనుమానం రాకుండా ఎలాగోలా ఉద్యానవనపు ప్రహరీగోడను చేరుకున్నాను .
కొండపైనుండి చూస్తేనే అనితరసాధ్యమైన గోడ ఎదురుగా చూసేసరికి గుండె ధడ పుట్టింది అంత ఎత్తులో ఉంది .
తీగలు ఎక్కువ తీసుకురావడం మంచికే అయ్యింది – తెగిపోకుండా బలంగా ముడివేసి , బయట గోడ చుట్టూ ఉన్న అఖాతాన్ని అవలీలగా దాటి గోడప్రక్కనే ఏపుగా పెరిగిన పొదలలోకి చేరాను , ఎవరూ లేకపోవడం చూసి రెండు మూడు ప్రయత్నాలలో గోడ శిఖరాగ్రాన బలంగా పట్టుకునేలా విసిరి అంతే బలంగా లాగాను , తట్టుకోగలదని తెలుసుకుని సులభంగానే చకచకా ఎక్కేసాను .

ఉద్యానవనంలో అక్కడక్కడా కాగడాలు వెలుగుతున్నా చీకటిగానే ఉండటం మనకు అనుకూలించే అంశమే , అంత చీకటిలోకూడా తెల్లనైన నా మిత్రుడు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాడు .
ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యక గోడవరకూ పెరిగిన చెట్టు ద్వారా అతి సులభంగా ( అంతెత్తు గోడపైనుండి కిందకు అవలీలగా దూకగలను కానీ ముందు ముందు చేయాల్సిన సాహసాలు చాలానే ఉన్నాయని తెలిసి ఆగిపోయాను నవ్వుకున్నాను ) ఉద్యానవనంలోకి చేరాను .
నా అలికిడికి అటువైపుగా వెళుతున్న ఒక అమ్మాయి నన్ను చూసేసింది . ఎవరు ఎవరు …… భటులారా ఇక్కడ ఎవరో ఉన్నారు అంటూ కేకలువేస్తూనే చేతిలోని దీపంతో నా ముఖాన్ని చూసి , వీరా వీరాధివీరా …… మీరా మీరు మీరు బ్రతికే ఉన్నారు చాలా చాలా సంతోషం నేనెవరో గుర్తుపట్టారా ? అంటూ ఉబ్బితబ్బిబ్బైపోతోంది .

అంతలో ఎవరు ఎవరు మమ్మల్ని పిలిచినది – ఎవరు ఉన్నారు అంటూ ఐదారుగురు భటులు మావైపుకు వస్తున్నారు .
అమ్మాయి : వీరాధివీరా …… ఇటురండి చెట్టువెనుక దాక్కోండి , మీరు ఎంతమందినైనా ఎదుర్కోగలరు కానీ ఈ ఒక్కసారికి మహికోసం అంటూ చెప్పడంతో చెట్టువెనుక దాక్కున్నాను .
భటులు : చెలికత్తె చామంతి …… ఏమైంది ? ఎందుకు కేకలువేశావు ? .
అమ్మాయి : అలికిడి అయితే అరిచాను – చూస్తే పిల్లి …… వెళ్ళిపోయింది మీరు వెళ్ళండి వెళ్ళండి అంటూ దూరం వరకూ వెళ్లి పంపించేసి పరిగునవచ్చింది – వీరాధివీరా మీకేమీ కాలేదు చాలా చాలా సంతోషం అంటూ ప్రార్థిస్తోంది .
అమ్మవారి దయవలన నీళ్ళల్లోకి పడటం వలన అపాయం తప్పింది .
అమ్మాయి : కానీ మహికి క్షణక్షణ గండంగా గడుస్తోంది , మీకు జరగరానిది జరిగిందేమోనని ఆ క్షణం నుండీ ఏడుస్తూనే బాధపడుతోంది – నిద్రాహారాలు మాని మిమ్మల్నే కలవరిస్తోంది – తీవ్రమైన జ్వరం వచ్చినప్పటికీ ఒక్కమందుకూడా వేసుకోవడానికి ఇష్టపడటం లేదు .
జ్వరం భారినపడినది యువరాణి కదా …… , జాతరలో ముసుగు – అనుక్షణం పదులసంఖ్యలో చుట్టూ సైనికులు – నా మిత్రుడు రాజ్యం ఉద్యానవనంలో ఉండటం ……. అంటే మహినే యువరాణినా ? .
అమ్మాయి : అవును వీరాధివీరా ……. మేమంతా మహి చెలికత్తెలం , అక్కడ మా ప్రియమైన యువరాణి మీకోసం ప్రాణాపాయస్థితిలో ఉంది , మీరు వచ్చారని తెలిస్తే …… నా వెనుకే రండి వీరా అంటూ ఇంద్రభవనం వైపుకు మహి మహి …… అంటూ కేకలువేస్తూ వేగంగా పరుగులుతీసింది .

నేను దగ్గరలోనే ఉన్నానని తెలిసిపోయినట్లు కృష్ణ …… నావైపుకు వేగంగా వస్తున్నాడు .
మిత్రమా …… అంటూ తనవైపుకు పరుగులుతీసి ఈతకొలను ప్రక్కన మెడను చుట్టేసాను .
మిత్రమా …… కత్తి గాయం అన్నట్లు పై వస్త్రాన్ని ఎత్తి నోటితో ఎత్తిచూస్తోంది .
బాధపడకు మిత్రమా …… లోయలో పడినది ఎక్కడో నీకు తెలుసుకదా , నదీ దేవత అమ్మ ప్రాణంలా చూసుకుందిలే …… , కానీ నువ్వుమాత్రం ఇక్కడ విలాసాలు ఆనందిస్తున్నావు కదూ …… లేదు అనకు ఆ కొండ పైనుండి ఉదయం నుండీ చూస్తూనే ఉన్నానులే ………
గంగమ్మ ఒడిలోకి చేరావని తెలిసి …… అంటూ సిగ్గుపడుతున్నాడు .
చాలా ఆనందం వేసిందిలే అంటూ మళ్లీ చుట్టేసాను .

వీరాధివీరా అంటూ కాస్త దూరం నుండి వినిపించడంతో అటువైపుకు చూసాను .
ఒక అమ్మాయిని ….. ఇద్దరు అమ్మాయిలు జాగ్రత్తగా నడిపిస్తున్నారు . అదిగో మీ దే …… వు …… డు …… మహీ …… అనేంతలో ……
మహి …… నన్ను చూడగానే దేవుడా అంటూ పరుగున నావైపుకు వస్తోంది .
చీకటిలో కనిపించడం లేదు . మాకు అతిదగ్గరగా రాగానే కాగడాల వెలుగులలో మహి ముఖారవిందం తారసపడింది .
అంతే మహి అందానికి ముగ్ధుడినై నాకు తెలియకుండానే చేతిని గుండెలపైకి పోనిచ్చి , మహికి తెలిసేలా వెలిగిపోతున్న కళ్ళతో ఆఅహ్హ్ ……. అంటూ వెనక్కుపడిపోయాను .
వీరాధివీరా ……. అంటూనే కంగారుపడి , ఈతకొలనులోని నీళ్ళల్లోకి పడిపోవడంతో మహి అందంగా నవ్వుతోంది – మహి నవ్వడంతో చుట్టూ అమ్మాయిలందరూ నవ్వుకుంటున్నారు .
వీరాధివీరా – దేవుడా అంటూ ఏమాత్రం ముందూ వెనుకా ఆలోచించకుండా నీళ్ళల్లోకి దూకేసి , కంగారుపడుతున్న నన్ను అమాంతం కౌగిలించుకుంది .

అంతే ఆఅహ్హ్హ్ ……. అంటూ నన్ను నేను మైమరిచిపోయి , మహితోపాటుగా నీళ్ళల్లోకి చేరిపోయాను .
నీళ్ళల్లో మహి అందాన్ని కన్నార్పకుండా చూస్తూ హృదయమంతా నింపుకోవడం గమనించి మరింత తియ్యదనంతో నవ్వుతోంది మహి …….. , ఆ అందమైన అందాలను జీవితాంతం చూస్తూ – మహి స్పర్శ మాధుర్యం ఆస్వాదిస్తూ ఉండిపోవాలనిపించింది .

1308450cookie-checkజనం మెచ్చిన రాజు – Part 5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *