వారి మధ్య ప్రేమబంధం ద్విగుణీకృతం అయ్యింది!

Posted on

వారికి పెళ్ళయిన తొలి ఏడాదికి, గర్భసంచిలో ఏదో లోపం వండటం వల్ల పవిత్రకి ఇక జన్మలో పిల్లలు పుట్టరని ఆమెను పరీక్షించిన డాక్టర్లు తేల్చి చెప్పేసారు. వంశ వృద్ధి కోసం పెద్దలు ఆమెను వదిలేసి రెండో పెళ్ళి చేసుకోమని శివను ఎంత పోరు పెట్టినా అతను వాళ్ళ మాటలను లక్ష్య పెట్టక తన భార్యని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు.

ఐతే, అతనికి వున్న పెద్ద బలహీనత… (పర)స్త్రీ వ్యామోహం. ఒక్కసారి అతనికి కోరిక పుడితే ఇక అనుభవించి తీరాల్సిందే! తన తృష్ణను తీర్చుకోవటానికి ఏ మార్గాన్నయినా ఎంచుకుంటాడతను.ఇప్పటికే ఎంతోమందిని (పెళ్ళికి పూర్వం… పెళ్ళయిన పిదప కూడ) ఆ విధంగానే అనుభవించాడతను. ఐతే… ఏ ఆడదాని మీదైనా ఒక్కసారే మోజుపడతాడు… ఒక్కసారే తీర్చేసుకుంటాడు. తర్వాత వాళ్ళ మొహం కూడ చూడడు. ‘వన్ నైట్ స్టాండ్’ అంటారే… అలాగన్నమాట!

తన భర్త యెడల గల ప్రేమానురాగాల వల్లనో, భయభక్తుల చేతనో పవిత్ర కూడ అతన్ని ఎన్నడూ ఈ విషయంలో ఆక్షేపించలేదు. దాంతో, అతనికి ఇక ఎదురులేకపోయింది.
★★★
రుక్మిణి ఆ యింట్లో పని ముగించుకుని వెళ్ళిపోతుండగా శివ ఆమెను వీధి గుమ్మం దగ్గర అడ్డగించి, “ఏదో ‘అమ్మగోరితో సెప్తాను…’ అన్నావ్! ఏఁవయింది?” అన్నాడు వ్యంగ్యంగా. రుక్మిణి తలదించుకుంది.

“చూడూ… బయటపడ్డాక ఇంకా ముసుగులో గుద్దులాట అనవసరం. ఇవ్వాళ సాయంత్రంలోగా నువ్వు ఒప్పుకున్నావా సరి! లేదంటే, రేపటికల్లా నీమీద, నీ మొగుడి మీద చోరీ కేసులు బనాయించి ఇద్దర్నీ కటకటాలపాలుజేస్తాను. నాకు పోలీసుల్లో ఉన్న పలుకుబడి నీకు బాగా తెలుసనుకుంటాను!”

నిజమే! శివారెడ్డిని కలవటానికి పలుమార్లు పోలీసులు రావటం ఆమె చూసింది. గవర్నమెంటు వర్క్స్ కాంట్రాక్టులు చాలావరకు శివారెడ్డినే డీల్ చేస్తాడు. దాంతో, పెద్ద పెద్దవాళ్ళతో ఎప్పుడూ కాంటాక్టులో వుంటాడు.

“ఒక్కసారి జైలుకెల్తే… ఇహాతర్వాత ఈమాత్రం పాచీ పనీ కూడ దొరకదు మీ మొహాలకి. ఇక వీధుల్లో పడి ‘అలో లచ్చనా’ అంటూ అడుక్కోవాల్సిందే!” అంటూ వికృతంగా నవ్వాడు శివ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *