ప్రేమ, స్నేహం, వ్యామోహం… మూడింటికి స్పష్టమైన నిర్వచనాలున్నాయి. ఒక్కో అనుబంధానికి గిరిగీసిన హద్దులున్నాయి. మరి ఆ నైతిక విలువల లక్ష్మణరేఖను దాటితే… ఏమవుతుంది? ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి? ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అనుకున్నంత సులువు కాదు. నేనా విషయంలో విజయం సాధించాను.
ప్రియతో నా ప్రేమాయణానికి ఆరేళ్ల వయసు. ఇద్దరివీ మధ్యతరగతి కుటుంబాలు కావడంతో ఉద్యోగం వచ్చాకనే పెళ్లి చేసుకోవాలనుకున్నాం. మొదట తనకి టీచర్ జాబ్ వచ్చింది. ఇంకా ఆగడం అనవసరం.
పెళ్లి చేసుకుందాం అనుకొన్నాక పెద్దలకు చెప్పి ఒప్పించాం. వివాహం అయింది. కాపురం పెట్టాం. అప్పటికి నా ఎమ్మే పూర్తయింది. బీఈడీ చదవాలన్న ఉద్దేశంతో మా రు వదిలి గుంటూరు వచ్చా.
రూం తీసుకొని కోచింగ్ సెంటర్ లో శిక్షణ తీసుకోవడం ఆరంభించా. ఫిబ్రవరి 14, 2005…. రూంలో కూర్చొని చదువుకుంటున్నా. అంతలో సెల్ మోగింది. లేచి వెళ్లాను. మిన్స్డ్ కాల్. తెలి సిన నంబరు కాదు.
పోనీ చేసి చూద్దామని డయల్ చేశా. అవతల ఓ అమ్మాయి. ఎందుకు చేశారని అడిగా. ‘ఫ్రెండ్కి చేయబోయి మీకు చేశాను సారీ’ అంది. ‘నన్నూ ఫ్రెండ్ అనుకోండి. మళ్లీ ఫోన్ చేస్తే తప్పు పట్టుకోరుగా’ అన్నా.
మొహ మాటంగా సరేనంది. రెండ్రోజులాగి ఫోన్ చేశా. లిఫ్ట్ చేసింది. చాలాసేపు మాట్లాడింది. అభిప్రాయాలు పంచుకున్నాం. ఇక అప్పట్నుంచి సుమతో తరచూ మాట్లాడటం అలవాటుగా మారింది.
చిత్రమేమంటే, తనూ నేనుండే రికి దగ్గర్లోనే ఉంటోంది. నాలాగే రూం తీసుకొని బీఈడీకి సన్నద్ధమవుతోంది. నాకు పెళ్ల యిన విషయం చెప్పేశాను. “నాకూ బావంటే ఇష్టం. మా నిశ్చితార్థం జరిగింది” అని ఆమె చెప్పింది.
ఆ తరవాత అటూఇ టూ ఫోన్లు కలిశాయి. గంటల సేపు మాటలు దొర్లాయి. చదువు కాస్తా కొండెక్కింది. ఇద్దరికీ బీఈడీ సీట్లు రాలేదు. ఏడాది గడిచింది. ఇద్దరం మొదటిసారి ముఖాముఖి కలవడానికి ఏర్పాట్లు చేసుకున్నాం.
దొనకొండ స్టేషన్. ఎన్నాళ్లో వేచిన క్షణాలు రానే వచ్చాయి. చీర కట్టులో హుందాగా ఉన్న సుమ హలో అంటూ ఎదురు పడింది. నా ఆనందానికి అవధుల్లేవు. మాటల్లో పడ్డాం. సాయంత్రం నాలుగింటికి మహానందికి చేరుకునేదాకా ఒకటే కబుర్లు.
శంకరుని దర్శనం అయింది. తిరుగు ప్రయాణానికి ట్రైన్లు లేవు. అక్కడే ఓ సత్రంలో రూం తీసుకున్నాం. ఏంటో, ఆ రోజు రాత్రి, ఒకరికొకరం బాగా దగ్గరి వాళ్లమన్న ఫీలింగ్తో శారీరకంగా ఒక్కటయ్యాం.
ఎటువంటి తిరస్కారాలు, శష భిషలు అడ్డుపడలేదు. వేరే వాళ్లతో అనుబంధం ఉన్నాక్కూడా ఇలా చేశామేమిటన్న బాధ కలగలేదు. సంతోషంగా ఇళ్లకు వెళ్లాం. కానీ అది తాత్కాలికమే అని తరువాత అర్థమైంది.
తరవాత మా సాన్నిహిత్యం కొనసాగింది. అంతలో మళ్లీ బీఈడీ ప్రకటన వచ్చింది. మళ్లీ దండయాత్రకు ఉపక్రమించాం, ఈసారి విడివిడిగా కాదు. ఒకే రిలో, ఒకే ఇంట్లో భార్యాభర్తలుగా మకాం పెట్టాం.
రెండు నెలలుండి పరీక్షలయ్యాక తిరిగి ఇంటికెళ్లాం. ఇంటికెళ్లిన నెలకే సుమకీ, ఆమె బావకీ పెళ్లి జరిగింది. మా బంధానికి బ్రేక్ పడింది. కానీ నన్నెంతగానో ప్రేమించిన సుమ భర్తతో సక్రమంగా ఉండలేక నరకయాతన అనుభవించింది.
సరిగ్గా ఆ పరిస్థితుల్లోనే మేం కలిసి జీవించిన విషయం మా ఆవిడకు తెలిసిపోయింది. నేను, సుమ తీయించుకున్న ఫొటోలు తను చూసి ఉన్మాదిలా మారింది. ‘ఇంత నమ్మకద్రోహమా?’ అంటూ నిలదీసింది.
పెద్దల ముందు దోషిగా నిలబెట్టింది. సుమ భర్తని పిలిపించి సంగతంతా చెప్పే సింది. అప్పటికి వారి పెళ్లయ్యి 15 రోజులే. సన్నిహితంగా ఉన్న మా ఫొటోలు చూసి అవాక్కయ్యాడు.
‘ప్రేమకు అర్ధం లేదండీ’ అని కన్నీళ్లు పెట్టుకుని అయిన వారికి మొహం చూపించలేనంటూ భార్యతో కలిసి ఎక్కడికో వెళ్లిపోయాడు. మళ్లీ కనిపించలేదు. వ్యామోహంలో పడి కొద్దికాలం ఆనంద డోలికల్లో తేలియాడిన నాకూ జీవితానికి సరిపడిన శిక్ష పడింది.
భార్య విడాకుల నోటీసులిచ్చింది. ‘నేను చేసింది తప్పే. క్షమించండి’ అన్నా ఇప్పుడెవరూ వినిపించుకోవట్లేదు. సరికదా హీనంగా చూస్తు న్నారు. కానీ ఏం చేయగలను? చేసిన పాపానికి తగిన శిక్ష పడిందని విచారించడం తప్ప