స్పృహకోల్పోయి నా గుండెలపై వాలిన బుజ్జితల్లిని ఒకచేతితో – తమ్ముడు సూరి చేతిని మరొకచేతితో పట్టుకుని బయట కారువైపు పరుగులుతీసాను .
పొడిచిన వ్యక్తి : రేయ్ మీ అందరినీ చూడగానే వీడి గుండెలు జారిపోయినట్లున్నాయి జారుకుంటున్నాడు అంటూ రాక్షస నవ్వు నవ్వుతున్నారు .
సూరీ ……. కారు స్టార్ట్ చెయ్యి అనిచెప్పి , బుజ్జితల్లిని వెనుక సీట్లో జాగ్రత్తగా పడుకోబెట్టి కదలకుండా సీట్ బెల్ట్ సెట్ చేసాను . సూరీ …… ఇక్కడ ఉండటం మీకు సేఫ్ కాదు మీరు వెళ్లిపోండి – నేనెలాగైనా పెళ్లికూతురుని మండపానికి తీసుకొస్తాను – సూరీ ……. ఇక్కడ జరిగింది జరగబోతోంది అక్కడ ఏమాత్రం చెపాపకు ప్రామిస్ , పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ అడగకూడదు .
సూరి : అన్నయ్యా …… రక్తం కారిపోతోంది , నేను ఉంటాను అంటూ ఏడుస్తూ చెబుతున్నాడు .
సూరీ …… వెళ్లు అంటూ బుజ్జితల్లికి ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టి డోర్ ను నెమ్మదిగా వేసి రైట్ రైట్ అన్నాను .
సూరి : అన్నయ్యా అన్నయ్యా జాగ్రత్త కీర్తీ తల్లిని వదిలి వచ్చేస్తాను అని ఏడుస్తూనే వేగంగా వెళ్ళాడు .
లవ్ యు బుజ్జితల్లీ ……. అంటూ కనుచూపుమేరవరకూ చూసి , స్స్స్ …… అంటూనే పెదాలపై చిరునవ్వులతో షర్ట్ బటన్స్ విప్పుతూ మెయిన్ గేట్ లోపలికి ఎంటర్ అయ్యాను . షర్ట్ విప్పేసి పొడిచిన దగ్గర నడుముకు గట్టిగా కట్టుకుని ఇప్పుడు రండి రా ఎవరొస్తారో అంటూ పొడిచిన వాడివైపు సవాల్ విసిరాను .
బన్యన్ సగభాగం రక్తంతో ఎర్రగా మారిపోయినా సవాల్ విసరడం చూసి భయంతో ఒక అడుగు వెనుకకు వేసాడు .
హ హ హ ……. అంటూ నవ్వుకున్నాను .
అన్నయ్యా అన్నయ్యా …… వెళ్లిపోండి నాకోసం మీ ప్రాణాలమీదకు తెచ్చుకోకండి – మీకేమైనా అయితే బుజ్జితల్లి – అక్కయ్య – నేను తట్టుకోలేము .
నా దేవత కూడా అన్నమాట అంటూ హృదయం పై ముద్దుపెట్టుకున్నాను – మనం ఒక్కసారైనా కలవకపోయినా అన్నయ్యా …… అంటూ ఆప్యాయంగా పిలిచినప్పుడే మనం తోబుట్టువులం అయిపోయాము చెల్లెమ్మా …… , చెల్లిగా …… ఈ అన్నయ్య గురించి ఎంతలా కంగారుపడుతున్నావో – నా చెల్లి పెళ్లి అనుకున్న సమయానికి ఇష్టపడిన వ్యక్తితో జరిపించకపోతే ఈ అన్నయ్య ప్రాణాలతో ఉన్నా లేనట్లే ….
, 5 మినిట్స్ చెల్లెమ్మా ……. సాంప్రదాయబద్ధంగా సేఫ్ గా నిన్ను తీసుకెళ్లే బాధ్యత ఈ అన్నయ్యది …….
చెల్లెమ్మ : అన్నయ్యా …….
5 మినిట్స్ అంతే చెల్లెమ్మా ……. , కంగారుపడకుండా హ్యాపీగా ఎంజాయ్ చెయ్యి .
పొడిచిన వాడు : రేయ్ …… వీడిని ముక్కలు ముక్కలు చేసి …….
కాకులూ గద్ధలకూ వెయ్యాలా ……. అప్డేట్ అవ్వండ్రా అంటూ కత్తిపట్టుకుని వచ్చినవాడి చేతిని పట్టుకుని చేతితో బలంగా ఒక్క గుద్దు గుద్దాను . గాలిలోవెళ్లి మెయిన్ డోర్ బద్ధలుకొట్టుకుని లోపలికివెళ్ళిపడ్డాడు .
పొడిచారు భయంతో పారిపోయాడు అన్నారు కదరా …… , హమ్మా హమ్మా అంటూ నువ్వొచ్చి ఇక్కడ పడ్డావు ఏందిరా ……. ఇంతకు కొట్టిన మగాడు ఎవడు – ఈదెబ్బలు ఖచ్చితంగా వాడు కొట్టినవే అయ్యుంటాయి అంటూ లోపలనుండి చూసి పైప్రాణాలు పైకే పోయినట్లు షాక్ లో చూస్తున్నాడు .
రేయ్ ……. నిన్న తప్పించుకుని ఇక్కడ తేలావా …… ? , నిన్న రెండు ఊళ్లకూ దొరికి ఉంటే ……..
అన్నా అన్నా అన్నా ……. అంటూ ఆ ఐదుగురూ లోపలినుండి కట్లతో వణుకుతూ వచ్చారు – అన్నా అన్నా ……. క్షమించండి వచ్చింది మీరని తెలియదు , ఈసారి దెబ్బలు తింటే మా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి , రేయ్ ……. నీకు దండం రా బాబూ మేము వెళ్లిపోతున్నాము – మీకూ ప్రాణాలపై ఆశ ఉంటే ఇక్కడనుండి వెళ్లిపోండి , నెత్తురు చిందించారు ఇక ఎలా కొడతాడో మీ ఇష్టం వాడు చూడు కిలోమీటర్ దూరం వచ్చి లోపడ్డాడు అంటూ పొడిచిన వ్యక్తికి అందరికీ వార్నింగ్ ఇచ్చి , అన్నా …… ఒక్క క్షణం టైం ఇవ్వండి ఇక ఈ ఊరిలోనే కానీ ఈ జిల్లాలోనే కనిపించము .
ఆగండి ……..
ఐదుగురూ : అన్నా అన్నా ……. మరొక్క దెబ్బ తినే ఓపిక కూడా లేదు వొళ్ళంతా హూనమైపోయింది అంటూ కాళ్ళమీదపడ్డారు .
రేయ్ …… మిమ్మల్ని కొట్టను కానీ , మీఐదుగురూ ఇక్కడే ఉండండి – ప్రాణాలకోసం గిలగిలాకొట్టుకోబోయే వీళ్ళందరినీ మీరే తీసుకెళ్లాలి , ఎంత దూరానికో తెలుసుకదా ………
ఐదుగురూ : తెలుసు తెలుసు అన్నా అంటూ మూవీ చూడటం వచ్చినవాళ్ళల్లా ప్రక్కన కూర్చున్నారు .
రేయ్ సన్నాసుల్లారా కత్తిదిగిన వీడికి భయపడుతున్నారు అంటూ ఒకేసారి ఇద్దరు వచ్చారు .
ఐదుగురూ : అయిపోయారు …… , చెవుల్లో నుండి రక్తం – కాదు కాదు నోటిలో నుండి రక్తం , బెట్ బెట్ అంటూ కాస్తున్నారు .
వాళ్ళిద్దరి ముచ్చటా తీర్చాలని రాడ్స్ తో వచ్చి కొట్టబోతున్న ఇద్దరినుండి తప్పించుకుని , ఒకడి చెవిపై మరొకడి డొక్కలో ఒక్కొక్క గుద్దు గుద్దాను .
హమ్ హమ్ ……. హమ్మా అని నోటి నుండి కేక వచ్చేలోపు చెవినుండి – నోటిలోనుండి రక్తం చిందిస్తూ నేలకు అతుక్కుపోయారు .
ఐదుగురు : టై టై …… ప్చ్ , అన్నా …… ఇదేమీ బాగోలేదు .
Sorry రౌడీస్ …… అంటూ నవ్వుకున్నాను .
పొడిచినవాడు మరొక అడుగువేశాడు .
ఐదుగురు : ఈసారి ఏకంగా నలుగురు రావడం చూసి , 5 అడుగులు – 10 అడుగులు ….. అంటూ బెట్ కాస్తున్నారు .
రౌడీస్ …… 5 – 10 ఏమిటి ? .
ఐదుగురు : మీరు కొడితే హమ్మా …… అంటూ కేకలువేస్తూ గాలిలో ఎగిరివెళ్లే దూరం అన్నా ……..
10 అడుగులు మరీ కష్టం రౌడీస్ ……..
ఐదుగురు : మొదటివాడు 15 అడుగుల దూరంలో ఏకంగా ఇంటి డోర్ బద్ధలుకొట్టుకుని లోపల పడ్డాడు కదా అన్నా ……. , మేమైతే ఫుల్ కాన్ఫిడెంట్ ……
వచ్చిన నలుగురి మధ్యలోకి చేరి ఐదుగురు బెట్ వేసినట్లుగానే కుళ్లబోడిచి చివరగా ఒక్కొక్కగుద్దు గుద్దడంతో ఒక్కొక్కడూ కాంపాండ్ గోడలవరకూ ఎగిరిపడ్డారు .
ఐదుగురు : చస్ ……. 5 కాదు 10 కాదు ఏకంగా 15 అడుగులు …….
స్స్స్ ……. రేయ్ చాలా నొప్పిపుట్టేలా పొడిచావురా ……..
చెల్లెమ్మ : అన్నయ్యా అన్నయ్యా …….. అంటూ ఏడుస్తోంది .
లేదు లేదు చెల్లెమ్మా ……. , రేయ్ కొద్దిసేపట్లో పీఠలపై కూర్చునే నా చెల్లెమ్మ కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించావు – నిన్ను ఇలా దెబ్బలతో అయితే వదలనురా ……. ధబ్బిడి దిబ్బిడే ……..
పొడిచిన వాడు : రేయ్ …… మిగిలినవారంతా మీదపడి చంపేయ్యండి …….
ఐదుగురు : కిందపడిన వీళ్ళను చూసైనా బుద్ధిరాలేదు వీళ్లకు – రేయ్ మిమ్మల్ని ఎలా కొడతాడో కూడా బెట్ కట్టలేకపోతున్నాము ధబ్బిడి దిబ్బిడి అంట అంటూ ఉత్సాహంతో లేచి నిలబడ్డారు .
ఐదారుగురు ఒకేసారి నావైపు రావడంతో , కిందపడిన రాడ్డు అందుకుని నేనే వాళ్ళవైపు వెళ్లి మొదట వచ్చిన వాడి మోకాళ్లపై కొట్టడంతో , పైకి గింగిరాలు తిరుగుతూ పడ్డాడు .
వెనకున్న మిగతావాళ్ళు అక్కడికక్కడే ఆగిపోయారు – ఇలాంటి కొట్టుడు ఎప్పుడూ చూడలేదు – ఈ దెబ్బలు తిన్నాక కోలుకున్నా దేనికీ పనికిరాము – బ్రతికి ఉంటే వైజాగ్ బీచ్ లో బఠాణీలు అయినా అమ్ముకుని బ్రతకొచ్చు – అన్నా ……. కాలేజ్ పిల్లలకు డబ్బు అవసరమై వీడి మాటలు విని వచ్చాము క్షమించండి – మీరు దయతలచి కనికరిస్తే వెళ్లిపోతాము ప్లీజ్ ప్లీజ్ సర్ అంటూ దండాలు పెట్టి పరుగుతీశారు .
ఆగండి , పిల్లల కాలేజ్ ఫీజ్ అన్నది ఎవరు ? .
నేనే అన్నా ….. అంటూ భయపడుతూ వచ్చాడు .
ఎంత అంటూ పర్సు తీసాను .
ఐదు వేలు అన్నా ……..
ఐదు వేలు కాలేజ్ ఫీజ్ కట్టి మరొక ఐదువేలతో యూనిఫార్మ్ – కాలేజ్ బ్యాగ్ బుక్స్ కొనివ్వు …….. , ఇలాంటి పనులు కాకుండా మీ పిల్లలు గర్వపడేలా కూలీ పనులైనా చేసుకోండి .
సర్ అంటూ దండం పెట్టాడు .
అన్నా అన్నా అన్నా ……. మాధికూడా అదే పరిస్థితి డబ్బులతో ఇంటికి వెళ్లకపోతే మా ఇల్లాళ్ళు చీపుర్లు తిరగేస్తారు – ఈనాకొడుకు పని పూర్తయ్యాకనే డబ్బు అన్నాడు .
పర్సులోని మొత్తాన్ని ఇచ్చేసి పంచుకోమని చెప్పాను .
సర్ సర్ సర్ …… కొట్టడానికి వచ్చి సహాయం చేస్తున్నారు మీరు దేవుడు సర్ అంటూ పాదాలను మొక్కారు .
ఇక ఇలాంటి పనులు కాకుండా మంచి పనులు చేసుకుని బ్రతకండి .
అలాగే సర్ అంటూ దండాలు పెట్టి వెళ్లిపోయారు .
ఐదుగురు : ఇక మిగిలింది ఒక్కడే …… , వాన్నైతే ఊరికే వదిలిపెట్టరురా …….., అన్నా ……. పారిపోతున్నాడు .
ఎక్కడకు వెళతాడు అంటూ చేతిలోని రాడ్ ను విసిరాను – హమ్మా ……. అంటూ ఎగిరిపడ్డాడు – లేచి మళ్లీ పరిగెత్తబోతే వెళ్లి కాలు విరిచేసాను – కుయ్యో మొర్రో అంటూ గింజుకుంటున్నాడు .
చెల్లెమ్మా ……. వీడే కదా కన్నీళ్లు పెట్టించినది అంటూ చేతిని విరిచేసాను – వాడి కేకలు ఊరుమొత్తం వినిపించాయి . చెల్లెమ్మా …… చూస్తున్నావా ….. ? , పెదాలపై చిరునవ్వు వచ్చిందా …… ? – ఇంకా రాలేదా అంటూ మరొక చేతిని అందుకున్నాను.
చెల్లెమ్మ : అన్నయ్యా అన్నయ్యా …… వదిలెయ్యండి .
రేయ్ …… ఇప్పుడు నీ ప్రాణాలు కాపాడినది కూడా చెల్లెమ్మనే , పోయి ఎక్కడైనా బ్రతుకు ఈ జిల్లాలో కనిపించావో ప్రాణాలుండవు …….
రౌడీస్ ……. నేను పైకివెళ్లి చెల్లెమ్మను తీయసుకొచ్చేలోపు ఒక్కడు కూడా ఉండకూడదు .
డాడీ డాడీ ……. అంటూ నా బుజ్జితల్లి పిలుపు – బయట నుండి పరుగునవచ్చి నా గుండెలపైకి చేరింది .
స్స్స్ …….
డాడీ డాడీ …… నొప్పివేస్తోందా అంటూ వెంటనే కిందకుదిగింది – డాడీ …… బనీను మొత్తం రక్తం , డాక్టర్ దగ్గరికి వెళదాము రండి అంటూ ఏడుస్తోంది .
సూరి పరుగునవచ్చి చుట్టూ దెబ్బలతో విలవిలలాడుతున్న రౌడీలను చూసి , అన్నయ్యా అన్నయ్యా …… మీకేమీ కాలేదు కదా …….
లేదు తమ్ముడూ ……. , బుజ్జితల్లిని …… తన మమ్మీ దగ్గరికి చేర్చమని చెప్పానుకదా తమ్ముడూ …….
సూరి : సరిగ్గా మన గ్రామానికి చేరుకునే సమయానికి , కీర్తి తల్లి స్పృహలోకివచ్చి డాడీ డాడీ ……. అంకుల్ డాడీ దగ్గరికి తీసుకెళ్లండి అంటూ ఏడవటంతో రాక తప్పలేదు అన్నయ్యా …….
డాడీ డాడీ …… ముందు డాక్టర్ దగ్గరికి వెళదాము , అంకుల్ …… కారు ఇక్కడికే తీసుకురండి .
సూరి : అలాగే కీర్తి తల్లీ ……..
బుజ్జితల్లీ …… నాకేమీ కాలేదు బంగారూ అంటూ కన్నీళ్లను తుడిచి ఎత్తుకోబోతే …….
నో నో నో డాడీ నొప్పివేస్తుంది – నేను నడుస్తాను .
ఉమ్మా ఉమ్మా …… నా బుజ్జితల్లి బంగారం – బుజ్జితల్లీ ……. మీ అత్తయ్యదగ్గరికి వెళదాము అంటూ పైకివెళ్లి డోర్ ఓపెన్ చేసాను .
అన్నయ్యా – బుజ్జితల్లీ ……. అంటూ ఏడుస్తూ నా గుండెలపైకి చేరబోయారు .
నో నో నో చెల్లెమ్మా ……. , పట్టుచీరకు రక్తం అంటుకుంటుంది అని ఆపాను .
చెల్లెమ్మ : పర్లేదు అన్నయ్యా …… , ముందు మనం డాక్టర్ దగ్గరికి వెళదాము రండి .
చెల్లెమ్మా ……. అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరిపిస్తానని నా దేవతకు – బుజ్జితల్లికి – నీ ప్రియుడికి మాటిచ్చాను . అలాంటిది ఈ అన్నయ్య వల్లనే పెళ్లి అడగకూడదు , I am perfectly alright …… ఇక్కడ జరిగినది ఎవ్వరికీ చెప్పను అని మాటివ్వు చెల్లెమ్మా – పెళ్లి జరిగితే నాకంటే సంతోషించే అన్నయ్య మరొకరు ఉండరు – నా కోరిక తీరుస్తావా చెల్లీ ……. అంటూ కన్నీళ్లను తుడిచాను .
చెల్లెమ్మ : అన్నయ్యా ……. అంటూ మళ్లీ గుండెలపైకి చేరబోతే …….
వెనక్కువెళ్లి అరచేతిని చూయించాను – ప్లీజ్ చెల్లెమ్మా …… అయినా మీ ప్రేమ ఉండగా నాకేమవుతుంది చెప్పు – ప్రామిస్ చెయ్యి చెల్లెమ్మా …….
చెల్లెమ్మ : కన్నీళ్లతోనే ప్రామిస్ చేసి , అయితే తొందరగా పదండి అన్నయ్యా ……. , అన్నయ్యా …… ఒక్క నిమిషం – బుజ్జితల్లి డ్రెస్ కు రక్తం అంటుకుంది అని లోపలికివెళ్లి బోలెడన్ని బుజ్జి డ్రెస్సులు తీసుకొచ్చింది .
చెల్లెమ్మా …… అన్నీ మన బుజ్జితల్లి కోసమే …….
చెల్లెమ్మ : అవును అన్నయ్యా ……. , నా సారీస్ కంటే ఎక్కువగా తీసుకొచ్చాను అంటూ బ్యూటిఫుల్ డ్రెస్ వేసి ముద్దుపెట్టి ఎత్తుకుంది .
బుజ్జితల్లీ …… సూపర్ .
బుజ్జితల్లి : అత్తయ్యా …… త్వరగా పదండి .
చెల్లెమ్మ : అలాగే బుజ్జితల్లీ అని మరొకచేతితో నా చేతిని అందుకుని , నొప్పివేస్తోందా అన్నయ్యా నొప్పివేస్తోందా అని అడుగుతూనే కిందకు తీసుకెళ్లింది .
రౌడీలందరినీ ట్రాక్టర్ లోకి చేర్చినట్లు , అన్నా అన్నా ……. మాపిల్లలకు కూడా కాలేజ్ ఫీజ్ …… అంటూ అడిగారు .
పర్సులో డబ్బు లేకపోవడంతో ……. , ఉంగరం – చైన్ అందించి ఇక కనపడకూడదు అని వార్నింగ్ ఇచ్చాను . కారు దగ్గరికివెళ్లి వెనుక డోర్ ఓపెన్ చేసాను .
చెల్లెమ్మ : అన్నయ్యా …… ముందు మీరు జాగ్రత్తగా కూర్చోండి .
చెల్లెమ్మ …… బుజ్జితల్లిని ఒడిలో కూర్చోబెట్టుకుని ఓదారుస్తూ వెనుక కూర్చున్నాక డోర్ వేసి ముందు కూర్చున్నాను – సూరీ …… వేగంగా పోనివ్వు …..
సూరి : అలాగే అన్నయ్యా …… అంటూ బాధ – కంగారుపడుతూనే గేర్ మార్చి పోనిచ్చాడు . 10 నిమిషాలలో మెయిన్ రోడ్ చేరుకున్నాడు .
మా గ్రామం వైపు పోనివ్వబోతే …… , తమ్ముడూ …… లెఫ్ట్ సైడ్ ఫాస్ట్ అని చూయించాను .
సూరి : సరే అన్నయ్యా అంటూ లెఫ్ట్ సైడ్ టర్న్ చేసి హైవే పై వేగంగాపోనిచ్చాడు .
చెల్లెమ్మ : అన్నయ్యా …… సిటీ అటువైపు – ఇటువైపు హాస్పిటల్స్ ఏమీ లేవు .
ఒక్క ముఖ్యమైన పని ఉంది చెల్లెమ్మా ……. , బుజ్జితల్లీ …… ఎందుకురా ఆ కన్నీళ్లు – నీ అంతులేని ప్రేమ ఉండగా నాకేమి అవుతుంది అంటూ వెనక్కుతిరిగి కన్నీళ్లు తుడిచాను . తమ్ముడూ …… అదిగో బెంగళూరు బస్సు , మీ బస్టాండ్ నుండి వెళ్లిపోతోంది తొందరగా వెళ్లు దానిని ఆపాలి .
సూరి : సరే అన్నయ్యా …… అంటూ మరింత వేగంగా పోనిచ్చి , బస్సు డ్రైవర్ కు స్టాప్ స్టాప్ అని కేకలువేసినా ప్రయోజనం లేకపోవడంతో ముందుకువెళ్లి బస్సుకు అడ్డుగా కారుని ఆపాడు .
బస్సు ఆగడంతో థాంక్స్ తమ్ముడూ కారుని సైడ్ కు ఆపు అనిచెప్పి , బుజ్జితల్లీ – చెల్లెమ్మా …… ఒక్క నిమిషంలో వచ్చేస్తాను అని కారు దిగి బస్సువైపు వెళ్ళాను .
బుజ్జితల్లి : డాడీ డాడీ నేనూ వస్తాను అని దిగబోతే …… , చెల్లెమ్మ ఎత్తుకుని కారు దిగి నావెనుకే బస్సు ఎక్కారు .
ప్రయాణీకులందరికీ so sorry …… – భయపడకండి ఇది నా రక్తమే ……- కొద్దిసేపు అంతే దిగిపోతాను అంటూ నేరుగా మాన్స్టర్ దగ్గరికి వెళ్ళాను . అన్నయ్యా ….. పెళ్లికూతురుని తీసుకొచ్చేసాను ఇక మీరు చెయ్యాల్సినదల్లా పెళ్లి మండపానికి తీసుకెళ్లడమే – అక్కడ అందరూ ఎదురుచూస్తున్నారు , బయట కారు ఉంది రండి అన్నయ్యా …….
బుజ్జితల్లి : డాడీ ….. నో …..
ఒక్కనిమిషం బుజ్జితల్లీ ఓకేఒక్కనిమిషం – సాంప్రదాయం ప్రకారం …….
మాన్స్టర్ : డాడీ …… , ఒసేయ్ బుజ్జి రాక్షసి నువ్వు బెంగళూరుకు వస్తావుకదా అప్పుడు నీ సంగతి చూస్తాను – వాతలు పెడతాను .
అంతే కోపం వచ్చేసి మాన్స్టర్ ముఖంపై గుద్దు గుద్దాను .
మాన్స్టర్ మైండ్ బ్లాక్ అయినట్లు గింగిరాలు తిరుగుతున్నాడు .
భలే భలే డాడీ అంటూ నా బుజ్జితల్లి చప్పట్లు కొడుతోంది .
లవ్ యు బుజ్జితల్లీ – నా బుజ్జితల్లి నవ్వింది అని బుజ్జి పెదాలపై చేతితో ముద్దుపెట్టి , sorry sorry అన్నయ్యా …… ప్లీజ్ ప్లీజ్ ముహూర్తం సమయం దగ్గరపడుతోంది అని బ్రతిమాలుతున్నాను .
చెల్లెమ్మ : అన్నయ్యా ……. వాడిని బ్రతిమాలడం బుజ్జితల్లికి – నాకు ఏమాత్రం ఇష్టం లేదు .
బుజ్జితల్లి : అవును డాడీ …….
ఒక్క నిమిషం ఓకేఒక్కనిమిషం చెల్లెమ్మా ……. , ప్లీజ్ ప్లీజ్ అన్నయ్యా ……
మాన్స్టర్ : రేయ్ నన్నే కొడతావా అంటూ కొట్టబోతే …….
మాన్స్టర్ చేతులు చుట్టేసి కూర్చోబెట్టాను .
నా బుజ్జితల్లి – చెల్లెమ్మతోపాటు బస్సులోని ప్రయాణీకులంతా నవ్వుతున్నారు .
మాన్స్టర్ : మరింత కోపంతో , రేయ్ …… నువ్వు ఎంత బ్రతిమాలినా రాను , ఉదయం వాడొచ్చి భయపెడితేనే భయపడ్డాను – ఇప్పుడు నీ వొళ్ళంతా రక్తం చూసి ఎలా వస్తాను అనుకున్నావు – ఇక నుండీ ఈ బుజ్జిరాక్షసితో ఈ గ్రామంతో నాకు సంబంధమే లేదు వెళ్లిపోండి .
అన్నయ్యా …….
డాడీ – అన్నయ్యా …… , ఈ మాన్స్టర్ తో వెళ్లడం మాకు ఇష్టమే లేదు – మీరు ….. మా ఇంటి దేవుడు , మీతో వెళ్లినా అది ఊరి సాంప్రదాయమే అవుతుంది .
సూరి : అన్నయ్యా …… అప్పుడే చెప్పానుకదా , ముహూర్తం సమయం అవుతోంది రండి వెళదాము – వాడు మనిషే కాదు …….