శృంగార స్టోరీ 272

Posted on

సిస్టర్స్ కంగారుపడుతూ నాదగ్గరికి వచ్చారు . అన్నయ్యా ….. ముహూర్తం దగ్గరపడుతోంది ఏమి జరుగబోతోందో ఏమో …….
ఏమైంది సిస్టర్స్ ……. ముహూర్తానికి ఇంకా రెండు గంటలు ఉందికదా ……
సిస్టర్స్ : అంతలోపు పెళ్లికూతురిని హీరోలా వెళ్లి తీసుకువచ్చేదేవరు ? – పెద్దయ్య ఏమో కదలలేని పరిస్థితి – ఆ మాన్స్టర్ ధైర్యం చేస్తాడో లేడో …….
నాకేమీ అర్థం కావడం లేదు సిస్టర్స్ …….
సిస్టర్స్ : చెప్పానుకదా అన్నయ్యా …… చుట్టుప్రక్కల ఉన్న పాతికకు పై గ్రామాలలో ఒక వింత ఆచారం ఉంది , ఇప్పటికీ తప్పకుండా పాటిస్తున్నారు , ఏమిటంటే …… పెళ్లికి ముందురోజు కానీ ఇలా పెళ్లిరోజు కానీ పెళ్ళికొడుకు ఇంటిలోని మగాడు ….. పెళ్లికూతురు గ్రామానికి ఇంటికి వెళ్లి అడ్డుపడిన వారితో పోరాడి పెళ్లికూతురిని సేఫ్ గా కళ్యాణ మండపానికి తీసుకురావాలి , ఇదీ తరతరాలుగా మన గ్రామాల ఆనవాయితీ ……..
అలా అక్కడ ఎవరైనా అడ్డుపడతారా ? .
సిస్టర్స్ : ఈ ప్రాసెస్ లో ఒకప్పుడు రక్తం ఏరులై పారి జరిగిన పెళ్లిళ్లు కూడా ఉన్నాయి అన్నయ్యా ……. , స్నేహపూర్వకంగా మొదలై మాటా మాటతో అలా జరిగేవట …….

అంకుల్ : అదిగో పెళ్ళికొడుకు బావ వచ్చాడు . బాబూ …… నువ్వు రెడీ కదా ? .
మాన్స్టర్ : ఎక్కడికి రా ……. ? .
సర్పంచ్ గారు : అదే బాబూ …… మీ మావయ్యగారికి ఆక్సిడెంట్ అయ్యిందికదా , పెళ్లికూతురుని తీసుకురావాల్సిన ఆ ఇంటి ఏకైక మగాడివి నువ్వేకదా …….
మాన్స్టర్ : అనుకున్నాను అనుకున్నాను , ఏమిటీ ……. నేను ఒంటరిగా ఆ ఊరుకువెళ్లి , మొరటు నాకొడుకులు అయిన పల్లెటూరి ఆంబోతులతో పొట్లాడి పెళ్లికూతురుని తీసుకురావాలా …… ? , భలే ఫిట్టింగ్ పెట్టారే …… – నేనొచ్చినది టిఫిన్ చెయ్యడానికి అంతే ……. – ఆకలివేస్తోంది కాబట్టి ఇక్కడికి వచ్చాను , ఇలా నన్ను ఇరికిస్తారు అని తెలిసి ఉంటే పెళ్ళికే వచ్చేవాడిని కాదు .
సర్పంచ్ గారు : అల్లుడూ అలా అనకండి , ఇక ఆ ఇంటికి మీరేకదా వారసుడు ……
మాన్స్టర్ : వారసుడు అబ్బో …… ఏదో పెద్ద ఆస్తిని ఇస్తున్నట్లు చెబుతున్నారే ……. , నేను …… నేను అల్లుడు ఏమిటి ముసలోడా …….
ఊరిజనమంతా రేయ్ రేయ్ …… అంటూ కోపంతో ముందుకొచ్చారు .
సర్పంచ్ గారు : ఆగండి ఆగండి ….. ఏదో తెలియక …….
మాన్స్టర్ : తెలిసే అన్నాను , అంత ప్రేమ ఉంటే నువ్వే వెళ్లరా ముసలోడా …….
జనం : మరొక్కసారి ఆ మాట అంటే ……..
సర్పంచ్ గారు : శాంతించండి ……. , చూడు బాబూ …… ఆచారం ఒప్పుకోదు లేకపోతే పెద్దయ్య కోసం కాలేజ్ పిల్లాడు కూడా ముందుకువస్తాడు – అంతటి అదృష్టం నీకు లభిస్తోంది .
అంకుల్ : బాబూ ……. ముందులా కాదు , అన్నీ ఏర్పాట్లూ చేసేసాను , నువ్వు కారులో వెళ్లడం – ఇంటిలోకి దర్జాగా ఎంటర్ అవ్వడం – ఫ్రెండ్లీ గా అడ్డుపడిన మా అల్లుడిని అలా ప్రక్కకు లాగేసి రెడీగా ఉన్న నా కూతురిని తీసుకురావడమే – నాకు తెలిసి నా దూరపు బంధువు అల్లుడు అడ్డుకూడా రాడు ఇదిగో కాల్ చేస్తాను ప్లీజ్ ప్లీజ్ బాబూ ……..
మాన్స్టర్ : ఆహా …… ఏమి యాక్టింగ్ చేస్తున్నారురా ఒక్కొక్కడు ఒకడేమో అల్లుడు అంటాడు మరొకడేమో బాబూ అని , అమ్మవారి గుడిలో పోతుని బలిచ్చేలా పంపిస్తున్నారు , బెంగళూరు నుండి పెళ్లికి రావడమే తప్పు టిఫిన్ వద్దు ఏమీ వద్దు అంటూనే భోజనాల దగ్గరికివెళ్లి టిఫిన్ కట్టుకుని పరుగున వెళ్ళిపోయాడు .
అందరూ ఆశ్చర్యపోయి పిరికిపంద అంటూ గుసగుసలాడుతున్నారు – సర్పంచ్ గారిని ముసలోడు అన్నందుకు కోపంతో ఊగిపోతున్నారు .
దేవత కుటుంబం ఏమీచెయ్యలేక తలదించుకుని బాధపడుతున్నారు . బుజ్జితల్లి అయితే కన్నీళ్ళతో డాడీ డాడీ …… మావయ్య అంటూ బాధపడుతోంది .
సిస్టర్స్ …….. నేను ఒప్పిస్తాను , ఇక్కడ జరిగేది అప్డేట్ ఇవ్వండి అని బుజ్జితల్లితోపాటు వెనుకే వెళ్ళాను .

చూస్తే రోడ్డులో ఎక్కడా కనిపించడం లేదు .
బుజ్జితల్లి : డాడీ …… మాన్స్టర్ ……
ఏకంగా భుజానికి బ్యాగు తగిలించుకుని ఆటో స్టాండ్ వైపుకు వెళుతున్నాడు .
బ్రదర్ బ్రదర్ అంటూ కేకలువేస్తూ పరుగుతీసాను .
బుజ్జితల్లి : ఆ మాన్స్టర్ ను …… మా డాడీ , బ్రదర్ అని పిలవడం నాకు నచ్చలేదు డాడీ …….
మావయ్య పెళ్ళికోసం ఈ ఒక్కసారికి బుజ్జితల్లీ ……. అంటూ నచ్చేజెప్పి , ప్రక్కన చేరుకుని బ్రదర్ బ్రదర్ …….
మాన్స్టర్ : రేయ్ ఏంట్రా పనివాడివి , నన్ను …… బ్రదర్ అని పిలుస్తున్నావు .
బుజ్జితల్లి : కళ్ళల్లో అగ్నిగోళాలతో చూస్తూ , మావయ్యకోసం అని చెప్పిన మాటలు గుర్తొచ్చినట్లు వాడిని చూడటమే ఇష్టం లేనట్లు వెనుకకు తిరిగింది .
మాన్స్టర్ : అయినా ఏంటి ఈ పిల్ల దెయ్యం …… ఎప్పుడూ నీతోనే ఉంటుంది .
బ్రదర్ …… ఇప్పుడు మ్యాటర్ అధికాదు – ప్లీజ్ ప్లీజ్ …… కారులో పిలుచుకునివెళ్లి మీ ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డువేస్తాను రండి వెళదాము – పాపం వాళ్లిద్దరూ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకున్నారు , పెళ్లి ఆగిపోతే తట్టుకోలేరు ……..
మాన్స్టర్ : ఆ ముసలోడిని ముసలోడు అన్నందుకు ఊరంతా ఏకమై నా మీదకు దూసుకొచ్చారుకదా – ఈ పెళ్లి ఆగిపోవాలి అప్పుడు ఊరు ఊరంతా బాధపడాలి – ఇక్కడే ఉండి చూడలేకపోయినా వాళ్ళ ఆర్తనాదాలు నాకు కచ్చితంగా వినిపిస్తాయి.
తప్పు తప్పు బ్రదర్ ……. , అందరూ మంచివాళ్ళు – వాళ్ళను బాధపెట్టడం మంచిదికాదు .
మాన్స్టర్ : ఎంతమందిని బాధపెడితే బెంగళూరులో సెటిల్ అయ్యుంటాను – సొంత అన్నాదమ్ముళ్ల ఆస్థులనే లాక్కుని రోడ్డుకీడ్చాను , వీళ్లేంత ……. అంటూ రాక్షస నవ్వు నవ్వుతున్నాడు .
బ్రదర్ బ్రదర్ ……. రెండు అందమైన జీవితాలు …….
మాన్స్టర్ : అందమైన జీవితాలు అయితే నాకేంటి ……. , పెళ్లికూతురు దగ్గరికి వెళ్లడం అంటే పద్మవ్యూహం లోకి ఎంటర్ అవ్వడమే , వెళ్లడమే కానీ బయటకు రాలేము , ఆటో …… బస్టాండ్ కు పోనివ్వు ……..
బ్రదర్ బ్రదర్ ……. అంటూ ఎంత బ్రతిమిలాడినా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు.

బుజ్జితల్లీ …… అంటూ కన్నీరు కార్చాను .
బుజ్జితల్లి : డాడీ ……. అంటూ బాధపడుతూనే కన్నీళ్లను తుడిచింది .
బుజ్జితల్లీ …… పెళ్లి ఘనంగా జరిపిస్తానని కృష్ణకు – దేవతకు మాటిచ్చాను , బాధ తన్నుకొస్తోంది , ఈ ముఖాన్ని ఎలా చూయించను ……
బుజ్జితల్లి : ఆ మాన్స్టర్ పోతేపోనివ్వు డాడీ …… , మీరు ….. మా ఇంటి దేవుడు కదా అంటే ఇంటిలో ఉన్నట్లే కదా – మనం వెళ్లి అత్తయ్యను తీసుకొద్దాము .
అలా తీసుకురావచ్చా బుజ్జితల్లీ …….
ఎప్పుడు వచ్చాడో సూరి , అవును అన్నయ్యా …… కీర్తి చెప్పినది కరెక్ట్ , పిల్లలు …… దేవుళ్ళతో సమానం అంటారు – ఒక్క క్షణంలో క్యాబ్ తీసుకొస్తాను .
క్యాబ్ కాదు రేంజ్ రోవర్ తీసుకురా సూరీ అంటూ కీస్ విసిరాను . అమ్మా దుర్గమ్మా …… తప్పో ఒప్పో ఎటువంటి అడ్డంకులూ రాకుండా మీరే చూసుకోవాలి అని బయలుదేరాము .

తమ్ముడూ ……. అతడు బస్టాండ్ చేరేలోపు బెంగళూరు బస్సు ఎక్కేలోపు పెళ్లికూతురుని తీసుకురావాలి .
తమ్ముడు సూరి : సరే అన్నయ్యా అంటూ గేర్ మార్చి వేగంగా పోనిచ్చాడు .
బుజ్జితల్లి : డాడీ ……. ఇక ఆ మాన్స్టర్ తో పని ఏముంది ? , వెళితే వెళ్ళనివ్వండి .
అధికాదు బుజ్జితల్లీ ……. తరతరాలుగా ఆచరిస్తున్న సాంప్రదాయం నా వలన ….. , అదికూడా నా ప్రాణమైన వాళ్ళు తలలు దించుకుని సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి రానే కూడదు .
తమ్ముడు : అన్నయ్యా ……. , కీర్తీ చెప్పింది కదా మీరు ఇంటి దేవుడని ఇంటి దేవుడే కాదు ఊరి దేవుడు ……..
బుజ్జితల్లి : అవును డాడీ అంటూ గట్టిగా హత్తుకుంది .
ఈ విషయం తెలిసింది ఊరిలో కొద్దిమందికే కదా తమ్ముడూ …….
తమ్ముడు : అందుకే అన్నయ్యా …… , సర్పంచ్ గారు చెబుతాను అంటే మీరే వద్దన్నారు – ఇప్పుడు చూడండి , ఇప్పటికైనా సమయం మించిపోలేదు తిరిగొచ్చాక నేను చెప్పిస్తానులే సర్పంచ్ గారి ద్వారా ……..
ఒట్టు వేశారు కదా తమ్ముడూ ….. , ఎలా చెబుతారు ? .
తమ్ముడు : అవునుకదా …… , ప్చ్ ఇలా లాక్ చేసేసారన్నమాట …….
నవ్వుకుని , నా ప్రాణమైన బుజ్జితల్లికి ముద్దులుపెడుతూనే మరింత ఫాస్ట్ అన్నాను.

నిమిషాల్లోనే మాన్స్టర్ వెళుతున్న ఆటోను చేజ్ చేసి హైవే దాటుకుని గుంతల రోడ్డులోనే రోవర్ ను డాన్స్ చేయిస్తూ 15 నిమిషాలలో పెళ్లికూతురు గ్రామం చేరుకున్నాడు .
తమ్ముడు : ఈ గ్రామానికి కూడా వీరే పెద్దయ్య అనుకుంటాను అన్నయ్యా …….. , చూసారా ఊరుఊరంతా పెళ్లికి కదిలినట్లు ఇళ్లకు తాళాలు వేసేశారు .
అవును తమ్ముడూ …… మన గ్రామంలోలానే ప్రతీ ఇంటికీ పెళ్లికళ వచ్చినట్లు తోరణాలు – లైట్స్ వేశారు . మరి నా బుజ్జితల్లి మావయ్య – అత్తయ్య పెళ్లినా మాజాకానా ……..
బుజ్జితల్లి : లవ్ యు డాడీ అంటూ సిగుపడుతున్నట్లు నా భుజంపై తలదాచుకుంది.

తమ్ముడు : అన్నయ్యా …… ఏంటి మెయిన్ గేట్ పూర్తిగా క్లోజ్ చేసేసారు అంటూ పెళ్లికూతురు ఇంటిముందు ఆపాడు .
బుజ్జితల్లి : అవును డాడీ , చాలా సైలెంట్ గా ఉంది , భయమేస్తోంది …… అయినా డాడీ ఉండగా నాకు భయమేల ……. అంటూ ముద్దుపెట్టింది .
సూరీ …… కారు తిప్పి ఉంచు , ఇలా లోపలికివెళ్లి అలా పెళ్లికూతురుని తీసుకొచ్చేస్తాము అని బుజ్జితల్లికి ముద్దులుపెడుతూ కిందకుదిగివెళ్లి ఫుల్లీ కవర్డ్ మెయిన్ గేట్ ను తట్టాను .
బుజ్జితల్లి అయితే బుజ్జిబుజ్జినవ్వులు నవ్వి , అత్తయ్యా అత్తయ్యా ……. అంటూ కేకలువేస్తోంది .
నా బుజ్జితల్లికోసం తన అత్తయ్యే స్వయంగా పరుగునవచ్చి మెయిన్ గేట్ ఓపెన్ చేస్తుందేమో ……. అనేంతలో గేట్ తెరుచుకుంది .

ఇంటిలోపలనుండి తలుపులు కొడుతున్న శబ్దాలు వినిపిస్తున్నాయి .
ఎవరు కావాలి అని కొత్తబట్టలు వేసుకున్న వ్యక్తి అడిగాడు . మళ్లీ లోపలనుండి తలుపులుకొడుతున్న శబ్దం ……..
బ్రదర్ …… మీరేనా అంకుల్ అల్లుడుగారు , పెళ్లికూతురుని తీసుకువెళ్లాడానికి ఆ ఇంటి బుజ్జితల్లినే స్వయంగా వచ్చింది అంటూ చేతిని చాపాను .
ఆ వ్యక్తి : అవునా చాలా చాలా సంతోషం …….. , అయితే షేక్ హ్యాండ్ కాదు హగ్ చేసుకోవాలి అంటూ ముందుకువచ్చి కౌగిలించుకున్నారు – ఈసారి మరింత గట్టిగా తలుపులు కొడుతున్న శబ్దం ……..
బ్రదర్ …… లోపల ఎవరో …….. , కసుక్కున కత్తి దిగింది కడుపులో ……..
అమ్మా ……..

అద్దం పగిలిన సౌండ్ – ఫస్ట్ ఫ్లోర్ విండో నుండి అన్నయ్యా అన్నయ్యా ……. రావద్దు వెళ్లిపోండి మిమ్మల్ని చంపేస్తారు అంటూ పెళ్లికూతురు కేకలువేసింది .
అవును రాకుండా ఉండాల్సింది అంటూ కత్తిని బయటకు లాగి మెయిన్ గేట్ బయటకు తోసేశాడు కౌగిలించుకున్న వ్యక్తి …….
బుజ్జితల్లి : ఎగజిమ్మిన రక్తాన్ని చూసి , డాడీ ….. అంతే స్పృహకోల్పోయి నా గుండెలపై చేరింది .
అన్నయ్యా అన్నయ్యా ……. అంటూ ఏడుస్తోంది పెళ్లికూతురు .
బుజ్జితల్లీ బుజ్జితల్లీ …….. , స్స్స్ స్స్స్ ……. అంటూ మరొకచేతితో రక్తం రాకుండా అడ్డుపెట్టుకున్నాను .
అన్నయ్యా అన్నయ్యా ……. అంటూ సూరి పరుగునవచ్చి పడిపోకుండా పట్టుకున్నాడు .

పొడిచిన వ్యక్తి : ఒక పెళ్లి ఆపడానికి ఇంత కష్టపడాల్సి వస్తుందనుకోలేదు – చివరికి ప్రాణాలు కూడా తీయాల్సి వస్తోంది .
పెళ్లికూతురు : మావయ్యా మావయ్యా ……. అన్నయ్యను ఏమీ చెయ్యకండి , మీరు చెప్పినట్లుగానే చేస్తాను ప్లీజ్ ప్లీజ్ …… అంటూ ఏడుస్తూ ప్రాధేయపడుతోంది – అన్నయ్యా ……. వెళ్లిపోండి – అన్నయ్యను వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లండి .
పొడిచిన వ్యక్తి : వీడి ప్రాణాలు పోతేనేగానీ ఈ పెళ్లి ఆగేలా లేదు – ఇక చచ్చినట్లు నిన్ను నాకే ఇచ్చి పెళ్లిచేస్తారు – ఇంత ఆస్తిని ఎవడైనా వధులుకుంటాడా ….. ? . ఇంతకూ ఎవర్రా నువ్వు ఎన్ని ప్లాన్ లు వేసి ఆపడానికి ప్రయత్నించినా పెళ్లికూతురుని తీసుకెళ్లడానికి వచ్చేశావు , ఆ ముసలినాకొడుకుని లారీతో గుడ్ధించాను అయినా బ్రతికిపోయాడు ఒకడు రక్షించడం వలన – నిన్న ఇంటికివచ్చిన ఆ ఇంటి వాళ్ళను రౌడీలతో అటాక్ చేయించాను మళ్లీ ఒకడి వల్లనే నా ప్లాన్ బెడిసికొట్టింది – ఇక లాభం లేదు అనుకుని ఆ ఇంటి నుండి ఇక్కడకు రాగల ఏకైకవ్యక్తి ఆ ఇంటి అల్లుడే అని తెలుసుకుని వివరాలు సేకరించి తెల్లవారుఘామున బస్సు దిగగానే కలిసి వస్తే చంపేస్తాను అని భయపెట్టి పంపించాను అయినా నువ్వు వచ్చావు – నీ ప్రాణాలు తీస్తేనేకానీ పెళ్లి ఆగదు అంటే ఇక తప్పదు అంటూ మళ్లీ పొడవడానికి వచ్చాడు .
బుజ్జితల్లిని హత్తుకుని , ముందుకువచ్చినవాడిని కాలితో ఒక్క తన్ను తన్నాను .
హబ్బా ……. అంటూ అంతదూరం వెళ్లి పడ్డాడు . రేయ్ ……. వీడిని చంపేయ్యండి రా అని కేకవేయ్యడంతో ట్రాక్టర్ – స్తంభాల వెనుకున్నవాళ్ళు వచ్చారు ………
సూరి : అన్నయ్యా ……. , సర్పంచ్ గారికి కాల్ చేస్తాను .
నో …….. , పెళ్లి ఆగిపోతుంది – ఎట్టి పరిస్థితుల్లోనూ …… నా ప్రాణాలు పోయినా సరే తమ్ముడి పెళ్లి అడగకూడదు అని ఆపాను ……….

1299530cookie-checkశృంగార స్టోరీ 272

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *