తమ్ముడూ ……. వైజాగ్ లోనే the best అండ్ ఫేమస్ మ్యారేజ్ ఈవెంట్స్ ఆర్గనైజర్స్ తెలిస్తే తీసుకెళ్లు .
తమ్ముడు : అన్నయ్యా …… చిన్న ఊరిలో ఉన్న నాకెలా తెలుస్తుంది కానీ వైజాగ్ లోనే బిగ్గెస్ట్ ఫంక్షన్ హాల్ లో జరిగేవన్నీ VIP మ్యారేజస్ అన్నయ్యా – వాళ్లకు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది .
ఫంక్షన్ హాల్ ఎక్కడ ? .
తమ్ముడు : దగ్గరలోనే అన్నయ్యా ……. అంటూ తీసుకెళ్లాడు . అన్నయ్యా …… మీరు కారులోనే కూర్చోండి వెళ్లి కనుక్కునివస్తాను అని 5 నిమిషాలలో వచ్చాడు . అన్నయ్యా …… అడ్రస్ – ఇక్కడికి దగ్గరలోనే అని కూర్చున్నాడు .
15 నిమిషాలలో చేరుకున్నాము . బుజ్జితల్లిని ఎత్తుకుని లోపలికివెళ్లి మేనేజర్ ను కలిసి ఎల్లుండి మ్యారేజ్ – అన్నీ ఏర్పాట్లూ మీరే చూసుకోవాలి ఇప్పటివరకూ కనీ వినీ ఎరుగని రీతిలో జరిపించాలి అని కృష్ణ ఇచ్చిన అమౌంట్ ను అడ్వాన్స్ గా ఇచ్చాను – ప్లేస్ చెప్పాను .
మేనేజర్ : సర్ …… రెండు రోజులు అంటే …….
నాతో ఉన్న డబ్బునంతా ఇచ్చి ఇది కేవలం అడ్వాన్స్ మాత్రమే , ఇప్పటివరకూ మీరు మాక్సిమం ఎంత కాస్ట్ లో అయితే ఒక మ్యారేజ్ జరిపించి ఉంటారో అంతకు డబల్ అమౌంట్ ఇస్తాను , సమయం తక్కువ అని ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదు .
మేనేజర్ : ముఖం వెలిగిపోయింది . ఈరోజు – రేపంతా సమయం ఉంది కద సర్ మీరు కోరుకున్నట్లుగానే అయిపోతుంది అని ఏమేమి చేస్తామోనని వివరించారు .
మొత్తం మొత్తం డెకరేషన్ – సెట్టింగ్స్ కావాలి ఎంత ఖర్చైనా పర్లేదు .
మేనేజర్ : డన్ సర్ ….. అంటూ రిజిస్టర్ చేసుకుని , లాప్టాప్ లో పెళ్లి మండపం స్టేజి డెకరేషన్స్ చూయించారు స్క్రోల్ చేస్తూ ……..
నాకు కాదు నా బుజ్జితల్లికి నచ్చాలి , బుజ్జితల్లీ ……. ఫస్ట్ మొత్తం చూడు తరువాత నీ బుజ్జి మనసుకు నచ్చినది సెలెక్ట్ చెయ్యి . మేనేజర్ గారూ …… టాప్ నాచ్ డెకరేషన్స్ చూయించండి .
బుజ్జితల్లీ …… టేబుల్ పై కూర్చుని నెమ్మదిగా చూడు .
బుజ్జితల్లి : ఊహూ …… అంటూ మరింత గట్టిగా హత్తుకుంది .
ఆ ఫీలింగ్ ……. , లవ్ యు లవ్ యు బుజ్జితల్లీ …… లవ్ యు అంటూ ముద్దుపెట్టి గుండెలపై హత్తుకునే చూసేలా చేసాను . అర గంటపాటు మొత్తం చూసి సెకండ్ రౌండ్ లో అద్భుతమైన డెకరేషన్ చూయించింది . పెళ్లి మండపపు స్టేజీకి మూడు వైపులా ఇంద్రలోకం అన్నంతలా ఉంది .
బ్యూటిఫుల్ – wow అంటూ తమ్ముడితోపాటు ఒకేసారి అని నవ్వుకున్నాము .
మేనేజర్ : సర్ …… వన్ డే లో అన్నీ పనులతోపాటు ఈ డెకరేషన్ అంటే – మామూలుగా అయితేనే 4 -5 డేస్ పడుతుంది .
నా బుజ్జితల్లి సెలెక్ట్ చేసింది ఫిక్స్ అంతే …… , డబల్ త్రిబుల్ …… ఎంతమంది కళాకారులనైనా రప్పించండి వారి ఖర్చు మొత్తం మేమే భరిస్తాము ఎంతకావాలో స్వైప్ చేసుకోండి అని కార్డ్ ఇచ్చాను .
మేనేజర్ : అయితే ok సర్ ……. మర్నాడు సూర్యోదయం లోపు డెకరేట్ చేసేస్తాము . వెంటనే మేము ప్లేస్ చూడాలి .
చాలా విశాలమైన స్థలం – తమ్ముడు గోవర్ధన్ పిలుచుకునివెళతాడు . ఇక ఫుడ్ దగ్గరికి వద్దాము – మన రెండు తెలుగు రాష్ట్రాలలోని అన్నీ ఫేమస్ వంటలు ఉండాలి . చెప్పానుకదా ఖర్చుకు ఎక్కడా కాంప్రమైజ్ అయ్యేదిలేదు .
మేనేజర్ : మీరు ఎలా అంటే అలా సర్ ……. మిమ్మల్ని wow అనిపించే బాధ్యత మాది .
Thats గుడ్ మేనేజర్ …….. , తమ్ముడూ ……. డ్రైవింగ్ వచ్చుకదా అని కీస్ ఇవ్వబోతే సిగ్గుపడ్డాడు .
మేనేజర్ : పర్లేదు సర్ మా వెహికల్లో వెళతాము అని నలుగురైదుగురు వెళ్లారు .
బుజ్జితల్లి : పెళ్లి అంటే చాలా పనులుంటాయని మమ్మీ చెప్పింది – మనవల్లనే ఆలస్యం అయ్యాయని మమ్మీ బాధపడుతోంది – అన్నీ పనులను మీరొక్కరే ఎలా పూర్తిచేస్తారని కూడా అనుకున్నాను – ఒక్కదగ్గరే అన్నీ సెట్ చేసేసారు లవ్ యు soooooo మచ్ అంకుల్ …… ఇక ఇంటికే కదా …….
నా బుజ్జితల్లికి ……. మమ్మీని చూడాలనిపిస్తోందన్నమాట , ఇంకా కొన్ని ముఖ్యమైన పనులున్నాయి – నిన్ను …… మమ్మీ దగ్గరికి వదిలేసి వచ్చి పూర్తిచేస్తాను , ఇంటికి వెళదాము .
బుజ్జితల్లి : నో నో నో ……. మిమ్మల్ని వదిలి ఎక్కడికీ వెల్లనంటే వెళ్లను , మమ్మీ దగ్గరికి కూడా వెళ్లను – నేను చెప్పానా …… మమ్మీ గుర్తొచ్చిందని అంటూ తియ్యనికోపంతో వదలనంతలా గట్టిగా పట్టేసుకుంది .
నవ్వుకుని , చాలాసేపయ్యింది కదా బుజ్జితల్లీ …… మమ్మీని – అమ్మమ్మను చూడాలనిపించడం లేదా ? , వాళ్ళు కూడా ఇంత కంగారుపడుతున్నారో ……..
బుజ్జితల్లి : మా అంకుల్ దగ్గర ఉన్నంతసేపు నాకెవ్వరూ గుర్తుకురారు , చివరికి మమ్మీ కూడా …….. , ఇక వాళ్ళ కంగారు అంటారా ……. మీరు ఎలా చూసుకుంటారో మమ్మీకి తెలియదా ? , అందుకే కనీసం నేనెలా ఉన్నానని కాల్ కూడా చేయలేదు – అంత నమ్మకం మీరంటే , ఇక అమ్మమ్మా – తాతయ్యకైతే మీరు దేవుడితో సమానం , నేను …… మా అంకుల్ తోనే ఉంటాను – ఎత్తుకుని ఉండటం కష్టమైతే చెప్పండి మీ చేతిని పట్టుకుని నడుచుకుంటూ వస్తాను అంటూ ముద్దుముద్దుగా ఒక ఉపన్యాసమే ఇవ్వడం చూసి …….
షాక్ చెందినట్లు అలా చూస్తుండిపోయాను , నా ప్రాణం కంటే ఎక్కువైన బుజ్జితల్లిని జీవితాంతం ఎత్తుకోమన్నా సంతోషంగా ఎత్తుకునే ఉంటాను అని ముద్దులుపెట్టాను.
బుజ్జితల్లి : లవ్ యు అంకుల్ – నాకు తెలుసుకదా ……. , మీకు …… మమ్మీని చూడాలనిపిస్తే మావయ్య మొబైల్ కు వీడియో కాల్ చేసి చూసుకోండి .
( చూడాలనిపించడం ఏమిటి ? , మీ మమ్మీని నా దేవతను జీవితాంతం చూస్తూనే ఉండిపోవాలని ఆశ ) .
బుజ్జితల్లికి …… నా మనసులో అనుకున్న మాటలు కూడా వినిపించినట్లు , అయితే కాల్ చేసి చూసుకోండి అని బుజ్జిబుజ్జిగా నవ్వుతోంది .
ఏంటీ ఏంటీ …… లేదు లేదు అంటూ తడబడుతూ ఎత్తుకుని బయటకువచ్చాను . ప్రక్కనే పిజ్జా షాప్ ఉండటం చూసి లోపలికివెళ్లి టేబుల్ పై బుజ్జితల్లిని కూర్చోబెట్టి కూర్చుని మెనూ కార్డ్ అందించాను .
బుజ్జితల్లి : ఏ ఏ పిజ్జా …… తినేంతవరకూ మాత్రమే ఇక్కడ కూర్చుంటాను అంకుల్ అంతే …….
ఉమ్మా ఉమ్మా …… అంటూ బుజ్జిచేతిపై ముద్దులుపెట్టాను – నా బుజ్జితల్లి ఇష్టమే నా ఇష్టం – నచ్చిన పిజ్జా – బర్గర్ – సాండ్ విచ్ – మిల్క్ షేక్ …….. ఆర్డర్ చెయ్యి బుజ్జితల్లీ ……
బుజ్జితల్లి : యాహూ …… అంటూ మెనూ కార్డ్ లోని పిక్స్ చూసి ఆర్డర్ చేసింది .
అంతవరకూ ఈ చాకో బార్ తిను కీర్తీ ……
బుజ్జితల్లి : ఓపెన్ చేసి మీరు కొరికి ఇస్తేనే తింటాను .
ఉమ్మా ఉమ్మా …….
15 నిమిషాలకు ఆర్డర్ చేసినవన్నీ వచ్చాయి . సగం టేబుల్ నిండిపోయాయి .
బుజ్జితల్లి : బుజ్జిబుజ్జినవ్వులతో చూసి , అంకుల్ అంకుల్ …… మావయ్యకు వీడియో కాల్ చేసి ఇవ్వండి .
ఉదయం హాస్పిటల్లో పెద్దయ్య చెప్పిన నెంబర్ కు వీడియో కాల్ చేసి ఇచ్చాను .
కృష్ణ : బుజ్జితల్లీ …….
బుజ్జితల్లి : మావయ్యా …… ముందు మమ్మీ – అమ్మమ్మకు ఇవ్వు .
కృష్ణ : సరే …….
దేవత : బుజ్జితల్లీ …… ఇప్పటికి మమ్మీ గుర్తుకువచ్చిందా ….. ? , ఉమ్మా ఉమ్మా …….
బుజ్జితల్లి : నిజం చెబుతున్నాను మమ్మీ ……. , ఇప్పటికి కూడా గుర్తుకురాలేదు .
దేవత : తియ్యనైన కోపం – నాకు తెలుసులే ……. , మీ అంకుల్ ఉంటే మేమెవ్వరమూ గుర్తుకురాము అని ఇప్పుడే మీ అమ్మమ్మతో మాట్లాడుతున్నాను – ఇంటికివచ్చి మమ్మీ మమ్మీ …… అంటూ కౌగిలింత మరియు రాత్రిపూట హత్తుకుని పడుకుంటావు కదా అప్పుడు చెబుతాను .
బుజ్జితల్లి : అవసరం లేదులే మమ్మీ …… , నేను …… అంకుల్ తోనే ఉంటాను – పడుకుంటాను .
దేవత : విన్నావా అమ్మా , నేనవసరం లేదంట మీ బుజ్జితల్లికి ( పెద్దమ్మ నవ్వులు వినిపించాయి ) , అవసరం లేనప్పుడు ఎందుకు వీడియో కాల్ చేసావే బుజ్జి రాక్షసి ………
బుజ్జితల్లి : ముద్దుముద్దుగా నవ్వుకుని , మమ్మీ – అమ్మమ్మా ……. ఎందుకు చేశానో చూడండి ఇది పిజ్జా – ఇది చీజ్ బర్గర్ – ఇది సాండ్ విచ్ – ఇవి రోల్స్ – నూడిల్స్ – మిల్క్ షేక్స్ – ఐస్ క్రీమ్స్ – కూల్ డ్రింక్స్ అండ్ వాటర్ బాటిల్ ……. నోరూరిపోతోందా మమ్మీ ….. ? . అంకుల్ చూడండి అంటూ మొబైల్ నావైపుకు తిప్పింది .
దేవతకు నోరూరిపోతున్నట్లు లొట్టలేస్తూ పెదాలను తడుముకోవడం చూసి బుజ్జితల్లితోపాటు నవ్వుకున్నాను .
బుజ్జితల్లి : మమ్మీ …… బై బై వేడివేడిగా ఉన్నప్పుడే తినాలి అంటూ మొబైల్ నాకు ఇచ్చింది .
దేవత ఆనందబాస్పాలతో థాంక్స్ చెప్పింది – దేవతనే చూస్తూ ఉండిపోయాను , దేవతకూడా ……..
బుజ్జితల్లి : తింటూనే మమ్మీని ఎంతసేపైనా చూడవచ్చు అంకుల్ …… యమ్మీ యమ్మీ …….
What what …… అంటూ మొబైల్ ను జేబులో పెట్టుకుని , పిజ్జా స్లైస్ అందుకున్నాను . హృదయం పై ముద్దుపెట్టిన ఫీలింగ్ కలగడంతో మొబైల్ తీసిచూసాను అంతే వెంటనే దేవత కట్ చేసేసింది – చివరగా సిగ్గుపడినట్లు కనిపించింది . కానీ కొన్ని క్షణాల ముందు కలిగిన ఫీలింగ్ కు వొళ్ళంతా జివ్వుమంది – ఆ ఫీలింగ్ కు కారణం నేననుకున్నదేనా ……. నోవే అని చిరు నిరాశతో మొబైల్ ను టేబుల్ పై ఉంచి ఇద్దరమూ చిరునవ్వులు చిందిస్తూ పోటీపడుతూ కుమ్మేసాము – మిల్క్ షేక్స్ , కూల్ డ్రింక్ , వాటర్ తాగి చివరగా బేవ్ – బేవ్ అని గ్యాస్ వదిలి నవ్వుకున్నాము . బుజ్జిచేతులను కడుక్కుని మరుక్షణంలో నా గుండెలపైకి చేరింది బుజ్జితల్లి .
బుజ్జిపొట్ట నిండిపోయినట్లుందే అంటూ ముద్దుపెట్టి , బిల్ పే చేసి , మొబైల్ అందుకుని బయటకువచ్చాను.
బుజ్జితల్లి : అంకుల్ ……. నెక్స్ట్ ఎక్కడికి వెళుతున్నాము .
పెళ్లిలో మా బుజ్జితల్లి అందరికంటే బ్యూటిఫుల్ గా కనిపించాలికదా షాపింగ్ ……. , అవును బుజ్జితల్లీ …… మమ్మీని చూశాక కూడా మమ్మీ దగ్గరికి వెళ్లాలనిపించడం లేదా ? – ఇంటికి తీసుకెళ్లనా …… ? .
బుజ్జితల్లి : నో ……. , పెళ్ళిపనులు పూర్తయ్యేదాకా మా అంకుల్ కు తోడుగా ఉంటాను – వదిలి వెళ్లను అని మమ్మీ – అమ్మమ్మ – తాతయ్యకు ఇంటిదగ్గరే చెప్పేసాను అంతే …….
నా గుండెలపైననే ఉన్నావుకదా ఎప్పుడు చెప్పావు బుజ్జితల్లీ …… అని నవ్వుతున్నాను .
బుజ్జితల్లి : కళ్ళతోనే సైగలు చేసాను , మీరు గమనించలేదు అని బుజ్జికోపంతో చూస్తోంది .
Sorry లవ్ యు లవ్ యు …… అంటూ బుజ్జికోపం తగ్గేవరకూ ముద్దులుపెడుతూనే కారులో షాపింగ్ మాల్ చేరుకున్నాము .
కారు పార్క్ చేసి , బుజ్జితల్లిని ఎత్తుకుని నేరుగా kiids wear కు చేరుకున్నాము . సిస్టర్ …… పట్టు డ్రెస్ – బార్బీ డ్రెస్ – గౌన్ ……. ఇలా ఎన్నిరకాలుంటే అన్నీ చూయించండి , లేటెస్ట్ డిజైన్స్ అయి ఉండాలి ……. బుజ్జితల్లీ …… సెలెక్ట్ చెయ్యి అంటూ టేబుల్ పై కూర్చోబెట్టాను .
బుజ్జితల్లి : ఊహూ …… మా అంకుల్ సెలెక్ట్ చెయ్యాలి అని చేతులుకట్టుకుని బుద్ధిగా కూర్చుంది .
ఉమ్మా లవ్ యు అంటూ కురులపై ముద్దుపెట్టి , మోడల్ – డిజైన్ కు ఒకటి చెప్పున పాతిక డ్రెస్ లకు పైనే తీసుకున్నాను . ఇంకా సెలెక్ట్ చేయబోతే అంకుల్ అంకుల్ ……. please please చాలు చాలు – చాలు అన్నా మీరు వినరని నాకు తెలుసు కానీ వాటిని రోజుకొకటి వేసుకునేలోపు హైట్ పెరిగిపోతాను సరిపోవు .
నవ్వుకుని , నా బుజ్జితల్లి tooo ఇంటెలిజెంట్ అని ముద్దుపెట్టాను .
సిస్టర్ ……. సెలెక్ట్ చేసినవన్నింటినీ కౌంటర్ కు పంపించండి అనిచెప్పి Mens wear దగ్గరికి వెళ్ళాము .
బుజ్జితల్లీ ……. ఉదయం మీ మావయ్య ఇష్టంతో తెచ్చుకున్న కొత్త డ్రెస్ లు నేను వేసుకున్నాను కదా కాబట్టి 20 అయినా సెలెక్ట్ చెయ్యాలి , నా బుజ్జితల్లే సెలెక్ట్ చెయ్యాలి .
లవ్ టు అంకుల్ ……. , ప్రతీ డ్రెస్ రెండు రెండు సెలెక్ట్ చేసి వేరువేరుగా ఉంచమని ఆర్డర్ వేస్తోంది బుజ్జితల్లి – అలా ఎందుకు అని అడిగాను .
బుజ్జితల్లి : మరి మా అంకుల్ కు , ఇవి మావయ్యకు – ఇవి మా అంకుల్ కు …….
లవ్ యు లవ్ యు sooooo మచ్ అంటూ మురిసిపోతున్నాను . మరి తాతయ్యకు ? .
బుజ్జితల్లి : అయ్యో …… మరిచేపోయాను అంటూ వైట్ షర్ట్స్ – వైట్ పంచెలు తీసుకుంది .
వాటన్నింటినీ కౌంటర్ కు పంపించి పట్టుచీరల సెక్షన్ కు చేరుకున్నాము .
బుజ్జితల్లి : ఇక్కడకు ఎందుకు అంకుల్ ……..
మనం ( నువ్వు , నేను , మీ మావయ్య , మీ తాతయ్య ) తీసుకుని , మమ్మీకు …… అదే అదే మీ మమ్మీకు – అమ్మమ్మకు తీసుకోకపోతే బాగోదు .
బుజ్జితల్లి : Ok ok అంటూ ముసిముసి బుజ్జినవ్వులు నవ్వుకుంది – అంకుల్ …… చీరలు అంటే ఆలస్యం అవుతుంది కాబట్టి నేను …… అమ్మమ్మకు సెలెక్ట్ చేస్తాను – మీరు ……. మమ్మీకి సెలెక్ట్ చెయ్యండి .
లోలోపలే పులకించిపోతున్నాను – దేవతకు ……. నేను అంటూ డ్రీమ్స్ లోకి వెళ్ళిపోయి గుండెపై చేతినివేసుకున్నాను .
బుజ్జితల్లి : అంకుల్ …… హార్ట్ ఉండేది ఎడమవైపు – ఆత్రంలో కుడివైపు పెట్టుకున్నారు . ఇలా అయితే మరింత ఆలస్యం అవుతుంది .
నవ్వుకుని , సిస్టర్స్ …… ఒక దేవతకు – దేవత అమ్మకు ఇక్కడున్నవాటిలో అద్భుతమైన – costliest పట్టుచీరలను చూయించండి .
బుజ్జితల్లి : అంకుల్ ……. ఆ దేవత మమ్మీనేకదా …….
నోరు జారేశానా ……. ? , ఇప్పుడెలా ……. దేవతకు తెలిసిపోతే అంటూ కంగారుపడుతున్నాను – AC లోకూడా చెమటలు పట్టేస్తున్నాయి .
బుజ్జితల్లి : నవ్వుతూనే బుజ్జిచేతులతో చెమటను తుడిచి , మా అంకుల్ గుండెల్లో మమ్మీ దేవత అన్నమాట ఉమ్మా ……. ముద్దుపెట్టి నా మీద నుండే టేబుల్ మీదకు చేరి , దేవత కోసం చీరలను మా దేవు ……. మా అంకుల్ కు చూయించండి – దేవత అమ్మకోసం ….. నాకు చూయించండి . అంకుల్ …… ఏంటి కదలకుండా ఉండిపోయారు త్వరగా సెలెక్ట్ చెయ్యండి ఇంకా చాలా పనులున్నాయి కదా ……. అంటూ నవ్వుతూనే ఉంది .
బుజ్జితల్లి నవ్వులు చూసికానీ కంగారు తగ్గలేదు . బుజ్జితల్లివైపు ఓర కంటితో చూస్తూనే దేవతకోసం షాప్ లోనే అత్యంత ఖరీదైన మనసుకు నచ్చిన పట్టుచీరలను ప్రేమతో సెలెక్ట్ చేసాను . ప్రతీ చీరనూ స్పృశించిన ప్రతీసారీ …… ఆ చీరలలో దేవత ఎలా ఉంటారోనని ఊహించుకునే వాడిని …….
బుజ్జితల్లి నావైపు చూసి ముసిముసినవ్వులు నవ్వుకుని , అంకుల్ ……. మీలానే 20 చీరలే కదా ….. ? .
అంతేకదా …….. , మాబుజ్జితల్లి ఆర్డర్ చేస్తే అంతకంటే ఎక్కువ సెలెక్ట్ చేస్తాను .
బుజ్జితల్లి : నో నో నో ……. , నా అంకుల్ …… నాకోసం సెలెక్ట్ చేసినవే ఎక్కువ ఉండాలి – నావే ఎక్కువ ఉండాలి .
అవునవును నా బుజ్జితల్లివే ఎక్కువ ఉండాలి అని తియ్యదనంతో ఫ్లైయింగ్ కిస్ వదిలాను .
సిస్టర్స్ ……. మొత్తం కౌంటర్ కు పంపించండి .
సిస్టర్ : సర్ …… ఇంత costly చీరలు తీసుకుంటున్నారు పెళ్ళికోసమే కదా …….
అవును సిస్టర్స్ తమ్ముడి పెళ్లి …… , బుజ్జితల్లీ …… పెళ్లికి సిస్టర్స్ ను ఆహ్వానిద్దామా ….. ? . మంచి పట్టుచీరలను చూయించారు .
బుజ్జితల్లి : అక్కయ్యలూ ……. మా మావయ్య పెళ్లికి తప్పకుండా రావాలి .
నేను అడ్రస్ చెప్పాను .
సిస్టర్స్ : థాంక్యూ సర్ – పాపా …….. , సర్ పెళ్ళికోసం అంటున్నారు కాబట్టి , పెళ్లికి వచ్చిన ముత్తైదువులకు – అమ్మాయిలకు ఇవ్వడానికి తక్కువ కాస్ట్ లో మంచి చీరలు కొత్తగా వచ్చాయి చూయించమంటారా ? .
Sorry సిస్టర్స్ పెళ్లి గురించి నాకు తెలియదు – పెళ్లికి వచ్చిన వారికి ఇవ్వడం …….
సిస్టర్స్ : సంప్రదాయం సర్ …….
అయితే తక్కువ కాస్ట్ కాదు పట్టుచీరలే ఇవ్వండి . ఊరిలో 200 ఇల్లు ఉంటాయి – ఇంటిలో ఇద్దరు చొప్పున 400 చీరలు మరియు పెళ్లికూతురి తరుపున 400 చీరలు ……. మొత్తం 800 ……. ఇక 200 కలిపి 1000 చీరలు గిఫ్ట్స్ లా ప్యాక్ చేసేసి రెడీ అయిన తరువాత ఈ నెంబర్ కు కాల్ చెయ్యండి వచ్చేస్తాము .
సిస్టర్స్ : 1000 పట్టుచీరలా …… ? , మా షాప్ లో కూడా అన్ని లేవు సర్ – గోడౌన్ నుండి తెప్పించాలి .
తెప్పించండి , అంతలోపు మరొక షాపింగ్ పూర్తిచేసుకునివస్తాము . బుజ్జితల్లీ …….. లెట్స్ గో అంటూ కౌంటర్ లో 50 లక్షలు ట్రాన్స్ఫర్ చేసి దగ్గరలోని జ్యూవెలరీ షాప్ కు వెళ్ళాము .
బుజ్జితల్లి : అంకుల్ ……. ఇప్పటికే చాలా …….
బుజ్జితల్లీ ……. మావయ్య ఇచ్చిన డబ్బుతోనేకదా ……
బుజ్జితల్లి : మావయ్య ఇచ్చిన డబ్బు ఈవెంట్ ఆర్గనైజర్ కు ఇచ్చేసారు కదా – మావయ్య ఇచ్చిన డబ్బుతో అంట , నేనేమైనా బుజ్జిపాపాయి అనుకున్నారా …… ?.
అమ్మో …… మా బుజ్జితల్లి toooo ఇంటెలిజెంట్ , ఆ సంగతే మరిచిపోయాను – నా బుజ్జితల్లికోసం తీసుకుంటున్నాను , అయినా అడగటానికి నువ్వెవరు అని ముద్దుపెట్టి , సిస్టర్ …… నా బుజ్జితల్లికి టాప్ టు బాటమ్ జ్యూవెలరీ చూయించండి – బుజ్జితల్లీ ……. సెలెక్ట్ చెయ్యి , బుజ్జితల్లి తియ్యనైన బుజ్జికోపం చూసి ok ok నేనే సెలెక్ట్ చెయ్యాలికదా అని బుజ్జి బుజ్జి కమ్మలు – బుజ్జి బుజ్జి చైన్స్ – బుజ్జి బుజ్జి గాజులు – బుజ్జి వడ్డాణం – బుజ్జి బుజ్జి పట్టీలు ……. రెండు రెండు మూడు మూడు తీసుకున్నాను .