మధనుడి శృంగార ప్రయాణం 115 భాగము

Posted on

శృంగార మధనం: చివరి భాగం…

కీర్తి తో రసరమ్యమైన శృంగారం చేసి వరూధిని కార్యక్రమం కి అడ్డు లేకుండా చేసాను,కీర్తి పొందులో కొంగొత్త సుఖాన్ని అనుభవించిన నాకు కీర్తి ఒక జీవిత భాగ్యస్వామి అన్న భావన బలీయంగా ఏర్పడింది..

పున్నమి రానే వచ్చింది,వరూధిని తో సంగమం ఒక అత్యద్భుత జ్ఞాపకం గా మిగిలిపోయింది.. మహాదీపం యొక్క మహిమాన్వితమైన శక్తులని నా పరం చేసి వరూధిని తన బాధ్యతని నిర్వర్తించింది.. మహాదీపం మరియు సృష్టి ఆవిర్భావం కి కారణమైన వజ్రం యొక్క శక్తులు అన్నీ నాకు అవలీలగా అర్థం అయ్యాయి..అప్పటివరకూ మామూలు మనిషిగా ఉన్న నేను వాటి శక్తుల మూలాన ఒక మహా శక్తివంతమైన శక్తి గా రూపాంతరం చెందాను…

ఇక సింధూ తో నా అనుభవాలు అత్యద్భుతంగా జరిగాయి…ఒక శుభ ముహూర్తాన సింధూ తన కన్యత్వం ని నాకు కానుకగా అప్పగించి తన నిజరూపం అయిన దేవకన్య గా నా ముందు నిలిచి నా బాధ్యత ఇంతటితో తీరిపోయింది అంటూ అతి బాధతో సెలవు తీసుకొని ప్రకృతిలో కలిసిపోయింది..నాకు అనునిత్యం ఒక తోడులా ఉన్న సింధు ఒక్కసారిగా విడిచి వెళ్ళేసరికి బాధలో కూరుకుపోయిన నన్ను అందరూ దగ్గరుండి ధైర్యం చెప్పడంతో కోలుకుని కార్యసిద్ధి పైన మనసు పెట్టి ఆ మహాయుద్దం కోసం కావాల్సిన సరంజామా అంతా సమకూర్చుకున్నాను.

కాలగమనంలో మరో పున్నమి గడిచిపోయింది, నా శ్రేయోభిలాషులు అందరూ నా ప్రేమానురాగాలతో సంతోషంగా జీవించడం మొదలెట్టారు…గుహుడు,జ్యోతిరాదిత్యులు తమ తమ శక్తులని వృద్ధి చేసుకొని అజేయులుగా నిలబడ్డారు..వారిద్దరి ధాటికి సకల లోకాలు గజగజా వణికిపోయాయి… నాగలోకం పైన దండయాత్ర చేసి జయించాలన్న నెపంతో వాడి కార్యానికి అతి ముఖ్యమైన జానకి ఆవాహణం కోసం సర్పయాగం మొదలెట్టారు..అత్యంత ధైర్య సాహసాలతో జానకీ ని వాడి బారి నుండి తప్పించి సరైన సమయం కోసం వేచిచూస్తున్నాను..

ధరణి,ధన్య లు తమ శక్తులని ధారపోసి నాకు మరింత శక్తిని కలుగజేసి మాయమైపోయారు..పవిత్ర,మంజుల,ప్రవీణ లు తమ తమ బాధ్యతలతో సంసిద్దంగా ఉండటం,రాధిక,సువర్ణలు అత్యంత ముఖ్యమైన పని అయిన మహాబిలం యొక్క పనులు చూసుకోవడం ఒక రకంగా నాకు బాధ్యతని తగ్గించినట్లే అనిపించింది.. ఇక నాని గాడు అనునిత్యం అప్రమత్తంగా ఉంటూ కార్యసాధనలో నన్ను ఉత్సాహపరుస్తూ పరిస్థితి ని అంచనా వేస్తున్నాడు.

నాగలోకం పైన పరాజయం గుహుడిలో మరింత పట్టుదలని పెంచింది..వాడు కొలుకునేలోపే వాడి స్థావరం పైన దాడి చేసి కొన్ని ముఖ్యమైన పనులన్నీ నా అదుపులో పెట్టుకున్నాను…జానకీ రోజురోజుకీ తన శక్తి ని పెంచుకుంది వాసుకి సహాయంతో…

సమయం రానే వచ్చింది.వరూధిని నిలయంలో యుద్దానికి ముహూర్తం సిద్ధం అయింది…వరూధిని నిలయం ఆశ్చర్యం గా మాయమై ఒక మహా యుద్దానికి వేదిక అయింది..ఇద్దరు మాయావులు ఉగ్రులై నిలబడ్డారు నా ముందు.. అంతకన్నా ముందు రోజా రాజేశ్వరీలు తమ బాధ్యతగా కోటలో ని బిలం లో ఆత్మార్పణ చేసుకొని సంతోషంగా స్వర్గస్తులు అయ్యారు..
గుహుడు వికట్టహాసంతో జ్యోతిరాదిత్యున్ని జానకీ ని తీసుకురమ్మని ఆదేశించగా వరూధిని అప్రమత్తం అయి వాడి భరతం పట్టింది తన అజేయ శక్తుల సహాయంతో..ఆశ్చర్యం గా జానకి అత్యంత ధైర్య సాహసాలతో జ్యోతిరాదిత్యుడి తలని తెగ నరికింది…

తెలివిగా గుహుడిని కోటలో గల మహత్తర బిలం దగ్గరికి వచ్చేలా చేసి సన్నద్ధం అయ్యాను జానకీ కి సైగ చేసి..గుహుడి సైన్యాన్ని నాని మంజుల,రాధిక,ప్రవీణ లు చీల్చి చెండాడారు..గుహుడి ఆగ్రహం మూలాన కోట ఒక్కసారిగా బద్దలయిపోయింది… అతి ఆవేశంతో జానకీ ని చెర పట్టడానికి బయలుదేరగా మేము ముందుగానే అనుకున్న ప్లాన్ ప్రకారం జానకీ తన నాగకన్య రూపం సంతరించుకుని బుసలు కొట్టింది.ఇక నేనూ ఉత్సాహంగా ముందుకు ఉరికాను.. ఒకవైపు జానకీ,మరోవైపు నేను కలబడటం మూలాన వాడి ఆటలు సాగలేదు…జానకీ ధైర్యంగా తన పాము దేహంతో ఆ గుహుడిని మొత్తం ఆక్రమించి పెనవేసింది తల భాగం మినహా…అంతే ఒక్క ఉదుటున నా ఖడ్గం గుహుడి తలని వేరుచేసింది సరిగ్గా బిలం లో వాడి తలభాగం పడేలా..

జానకీ పట్టు సడలించడంతో వాడి దేహం కూడా బిలంలో పడిపోయి తేజోవంతమైన కాంతి వెదజల్లింది… ఒక మహత్తర కార్యం ముగిసింది.ముక్కోటి దేవతలు ప్రత్యక్షమై నా జన్మ తాలూకు రహస్యాలన్నీ చెప్పారు..నేనూ స్వర్గానికి వెళ్లాల్సిన ఆవశ్యకత ఏర్పడినా నా చిత్తం ప్రకారం మానవుడిగానే ఉంటాను అని చెప్పడంతో అందరూ దీవించి వెళ్లారు…
నాగరాజు అయిన వాసుకి ఆమె బాధ్యత అయిన జానకీ వివాహం ని నాతో జరిపించి కీర్తి ని కూడా నా అర్దాంగి గా చేసి వెళ్ళిపోయింది…

మనసుకి నచ్చిన మగువలతో సంతోషంగా నా శేష జీవితాన్ని మానవుడిగానే గడిపాను…ఇప్పుడు ఎటుచూసినా సుఖసంతోషాలతో ఈ విశ్వం విరజిల్లుతోంది.. నాని గాడు కూడా నాతో పాటు సంతోషంగా జీవితాన్ని గడపటం మొదలెట్టాడు…

శృంగార మధనం విజయవంతం అయింది సుఖసంతోషాలతో… ప్రకృతి ఒడిలో చివరి రోజులని అందరమూ ఆస్వాదించి ఒకే రోజున తనువు చాలించి స్వర్గస్తులం అయ్యాము..

మా ప్రతినిధులు గా మా కుమారులు ఈ విశ్వ సంరక్షణ బాధ్యతని స్వీకరించి కంటికి రెప్పలా కాపాడుతున్నారన్న సంతోషం మా జీవితాల్ని ధన్యం చేసింది…

ముగింపు::

దేవుడున్నాడో లేదో స్పష్టంగా తెలియదు గానీ మన సృష్టి రహస్యాలన్నీ ఈ ఒక్క ప్రకృతి మాతకి మాత్రం తెలుసు..మన జననం,మరణం అన్నీ ఈ ప్రకృతి ఒడిలోనే జరుగుతున్నాయి..కొందరికి గత జన్మ తాలూకు జ్ఞాపకాలు గుర్తుంటాయి అన్న విషయం మనం చూస్తుంటాము అది నిజంగా ఏ మహత్తూ కాదు,అది ఖచ్చితంగా ప్రకృతి ప్రసాదించిన వరం తప్ప…
ప్రకృతి ని ప్రేమించి పూజించిన రోజులన్నీ సుఖసంతోషాలతో ఉండేవి,ఇప్పుడు ప్రకృతి విలయతాండవం బహుశా మన తప్పిదమే అన్నది నా భావన…
ప్రకృతిని ప్రేమిద్దాం,సంరక్షించుకుందాం…

&$స్వస్తి&&&&

799272cookie-checkమధనుడి శృంగార ప్రయాణం 115 భాగము

4 comments

  1. ఓ అద్భుతమైన ధారావాహికాన్ని అందించి, పాఠకులను శృంగార వీధుల్లో విహరింపజేశారు.

    బహుదానందం. అభినందనలు మిత్ర ద్వయానికి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *