కలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 4

Posted on

“పొద్దున్నే , జోకు లేంది భే ” అంటూ తీసి పారేయాలని చూసాడు.
“సార్ కేం పట్టింది పొద్దున్నే జోక్ లేయడానికి , రాత్రంతా ప్రాణాలకు తెగించి సాంపిల్స్ తెస్తే ఆ లా తిసేస్తారెంటి సార్ ” అంటూ గట్టిగా అన్నాడు హమీద్
ఆ సౌండ్ చూసి రవీంద్ర నవ్వు ఆపేసి “ఇప్పుడు ఎం చేద్దాం” సేరియస్ గా సాంపిల్స్ చూడ సాగాడు.
“వాళ్ళకు డౌట్ వచ్చే లోపు మనము ఎటాక్ చేయాలి” అంటూ ముగ్గారిని కట్టి పడేసిన సంగతి చెప్పాము ( చివరి వాడి సంగతి చెప్పలేదు )
“అది స్కూలు అందులోనా సెన్సిటివ్ ఏరియా , ఎలారా “
“సరకు దొరికితే ఎట్లాంటి ఏరియా అయినా పరవాలేదు , నేను మేనేజ్ చేస్తాను , దొరక్క పోతేనే గొడవ ” అన్నాడు ప్రతాప్
“సార్ , మనం ఇక్కడే వుంటే , వాళ్ళకు ఓ గంట చాలు సరుకు ట్రాన్స్ఫర్ చేయడానికి ” అన్నాడు హమీద్
“పదరా అక్కడకి వెళ్లి మాట్లాడు కుందాము ” అంటూ మూడు జీపుల్లో 15 మంది వెపన్స్ తో వెళ్ళాము . జిప్ లు కొద్ది దూరంలో ఆపి
అందరు అలెర్ట్ గా వెళ్ళాము.
మెయిన్ గేటు దగ్గరకి హమీద్ వెళ్లి తలుపు తట్టాడు , అటు ఇటు ఇద్దరు పోలీసులు గన్స్ తో రెడీగా ఉన్నారు.
“కోన్ హాయ్ భే ఇత్నా శుభే “
“దూద్ వాలా హు , తోడా జల్దీ జనా హాయ్ ఆజ్ “
“సాలా తెరేకో నింద్ నహి ఆతా హాయ్ క్యా ” అంటూ తలుపు తీసి తల బయట పెట్టాడు

పక్క నున్న ఇద్దరు పోలీసులు వాడి నోట్లోంచి ఇంకో మాట రాకుండా బయటకు లాగేసి , వాడి నోటికి ప్లాస్టర్ వేసి వ్యాన్లో వేసారు. తలుపు దగ్గర ఒక్కన్ని వుంచి అందరం లోపలి వెళ్లాం. ఎటువంటి గొడవ లేకుండా ఎక్కడ పడుకున్నవాల్లను అక్కడే కట్టి పడేసి , గోడౌన్స్ ఓపెన్ చేసి లైట్స్ వేసాము. ఆ వెలుగులో ఆ సరకు చూసి రావింద్ర కైతే నోట్లో మాట రాలేదు. ప్రతాప్ వెంటనే ఆక్షన్ లోకి దిగిపోయి , వాళ్ళ పై ఆఫీసర్స్ కి విషయం చెప్పి , వెంటనే మీడియా ను పిలిపించాడు. కడప నుంచి ఓ బెటాలియన్ CRPF బయలుదేరారు , హైదరాబాదు నుంచి హోం మినిస్టర్ , IG హెలికాప్టర్ లో ఇంకో గంటలో అక్కడ ఉంటామన్నరంట.

లోపల ముగ్గరిని కట్టి పడేసిన విషయం ప్రతాప్ కి చెప్పాను, వాడు నేను మేనేజ్ చేస్తాలే , యు డోంట్ వర్రీ అంటూ మాట ఇచ్చాడు. పెన్ డ్రైవ్ లో దొరికిన అడ్రస్ లన్నింటి మీదా దాడి చేయమని ఇమ్మిడియట్ ఆర్డర్స్ పాస్ చేసాడు. ఉదయం ఆరు గంటలికి స్టేట్ మొత్తం లైవ్ టెలికాస్ట్ అవసాగింది ప్రోగ్రాం. దేశంలో ఎప్పుడూ ఇంత పెద్ద మొత్తం అయుధాలు దొరకలేదని. ఆ క్రెడిట్ అంతా హమీద్, ప్రతాప్ , రవింద్ర దే అంటూ వాళ్ళకు అక్కడే ప్రమోషన్స్ ఇచ్చేసాడు హోం మినిస్టర్.

అక్కడున్న పిల్లలను ఒక్కరోక్కరిని ఇంటర్వు చేస్తూ , ఆ స్కుల్లల్లో వాళ్ళును ఎలా సూసైడ్ స్క్వాడ్ గా తయారు చేస్తారో చెప్పించారు. T.V వాళ్లకు ఓ వారం రోజులకు కావాల్సిన మేత దొరికింది.

11 గంటలకు ప్రెస్ మీట్ తరువాత హోం మినిస్టర్ , IG వెళ్లి పోయారు , కడప నుంచి వచ్చిన బేటాలియాన్ స్కూలు మొత్తం హ్యాండ్ఓవర్ చేసుకుంది. 12 గంటలకు నేను , ప్రతాపు, రవీంద్ర , హమీద్ ప్రతాప్ వాళ్ళ ఇంటికి వచ్చాము. మేము అక్కడికి వచ్చేసరికి , ఓ రెండు ట్రాక్టర్స్ నిండా జనాలు వున్నారు అక్కడ , ఏంటి అంతా ప్రతాప్ ఇంటి మీద దాడికి వచ్చారేమో నని బయపడ్డాము. కాని ముందు ట్రాకర్ లో పల్లవి వాళ్ళ అన్నా , అంగిడి ఓబులేసు , నల్లప్ప , మల్లిగాడు అంతా పల్లె వాళ్ళే నన్ను చూస్తూనే
“ఏమప్పా ? నీకేం కాలేదు గదా , మా ఆడది నా చెల్లెలు ఇంటికొచ్చి ఇక్కడ నువ్వు గడ్డ మోల్లతో గొడవ పెట్టుకున్నవని చెప్పినారు , ఉక్కడే నువ్వు ఎం అగచాట్లు పడతాన్దావోనని నేను బయలు దేరితే , నా యనకే అందరు బయలు దేరితే , సరే అని వచ్చేస్తిమి ” అంటూ గబా గబా వాళ్ళు అక్కడికి వచ్చిన కారనాన్ని చెప్పాడు. వాళ్ళ అబిమానానికి నాకైతే నోట్లో మాట రాలేదు. దాదాపు 50 మంది వచ్చివుంటారు , ప్రతాప్ కు చెప్పి వాళ్ళ అందరికి అక్కడే భోజనాలు ఏర్పాటు చేసి , సాయంత్రం వాళ్లతో పాటు నేను పల్లెకు వెళ్లాను.

ఇంటి కెల్లంగానే పెద్దాయన అడిగాడు ఏంది గొడవ అని , సంక్షిప్తంగా చెప్పాను పల్లవిని ఎవడో ఏడిపిస్తుంటే వాడిని దండించడానికి పొతే వాడి వెనుక పెద్ద గ్యాంగు వుంది ఆళ్ళ దగ్గర ఓ చిన్న టౌన్ పెల్చేసెంత మందు గుండు ఓ 200 మందికి సరిపోయే తుపాకులు వున్నాయి. అవన్నీ పోలీసులకు పట్టిచ్చాము అంతే.
” పెద్దయ్యా ఇంతకీ శైలజమ్మ కాలు ఎలా వుంది. “
“ఇప్పుడు బాగానే ఉంది నడుస్తుంది, ఇంట్లోనే వుంది వెళ్లి పలక రించు”. లోనకేలితే మంచం మీద కూచొని వుంది , నన్ను చూస్తూనే
“హిరో గారికి రాచ కార్యాలు అయిపోయాయ, ఇప్పుడు తీరిక దొరికిందా “
“మీకు నా మింద కోపంగా ఉన్నట్లు ఉంది , తాతను అడిగే కదా వెళ్ళింది “
“నువ్వు వెళ్లి నందుకు కాదు , అక్కడ నీకు ఏమైనా జరిగుంటే “
“నాకేమి కాదు “
“ఆ పల్లవికి నివే దొరికావా , ఇంకెవరు లేరా తన బాధలు చెప్పుకోవడానికి “
“టయానికి నేను అక్కడ ఉన్నాను , చూస్తూ వురుకోలేనుగా “
“అదే గదా వచ్చిన తిప్పడ ” అంటూ ఎదో గోనిగింది కాని నాకు వినబడలేదు , ఆ ఆడవాళ్ళు ఏమి మాట్లాడతారో అర్థం చేసుకోవాలంటే ఓ బుర్ర చాలదు రావణాసురిడి లాగా పది బుర్రలు వుండాలి అనుకుంటూ .
“మందులు వేసుకున్నవా ?”
“ఆ వేసుకున్నా, పద అన్నం తిందాం ” అంటూ వెళ్లి బొం చేసి పైకి వెళ్లి పడుకున్నా . రాత్రి నిద్ర లేక పగలంతా అలసి పోవడం వలన వెంటనే నిద్ర పట్టేసింది. పొద్దున్న వేడిగా సూర్య కిరణాలు పడుతుంటే మెలుకవ వచ్చింది.

లేచి , టిఫిన్ చేస్తుంటే ఓ మూడు పొలిసు జీపులు పెద్దాయన కాంపౌండ్ లోపలి కి వచ్చాయి. ఓబులేసు వాళ్ళకు ఇల్లు చూపిచ్చి వెళ్ళాడు. చుస్తే , ప్రతాప్ , హమీద్ , రవీంద్ర వాళ్ళ ఫామిలీస్, పెద్దాయనను పరిచయం చేసాను, నేను , ప్రతాప్ , రవీంద్ర కలిసి పదవ తరగతి చదువు కున్నామని చెప్పాను. వాళ్ళ చేతుల్లో ఆ రోజు అన్ని న్యూస్ పేపర్స్, మెయిన్ పేపర్ లో పెద్ద పెద్ద హెడింగ్స్, “గుర్తు తెలియని వ్యక్తి సహాయంతో రాయచోటి పోలీసులు , అతి పెద్ద టెర్రరిస్ట్ ల ఆయుద గిడ్డంగి పట్టివేత ” అంటూ. వాటి కింద వీళ్ళ ముగ్గారికి ఇ చ్చిన ప్రమోషన్స్. వాటి పక్కనే ఆ ఆపరేషన్స్ లో చనిపోయిన గడ్డపొడి ఫోటో( వాడిని ప్రాణం తోగాని , చచ్చినాక వాడి శవాన్ని తెచ్చిన వారికి 10 లక్షలు బహుమానం వుంది ) . ఆ విషయాలు అన్ని వాళ్ళు పెద్దాయనకు వివరించారు. ఈ లోపుల సర్పంచ్ , పల్లవి , శైలజా , వాళ్ళ ఆయన వచ్చారు . అందర్నీ పరిచయం చేసాను.

మీ శివా సార్ వళ్ళ నాకు రెండు ప్రమోషన్ లు వచ్చాయి అంటూ హమీద్ అందరికి స్వీట్స్ పంచి ఇచ్చాడు, ముగ్గరు కలిపి దాదాపు ఓ పది కిలోలు స్వీట్స్ తెచ్చారు. నేను ఎక్కడ కష్టాలలో ఉన్నానో అని వూరు అందరూ కలిసి నా కోసం రావడం , మా రవీంద్ర గాడికి బాగా నచ్చింది. అందుకే అందర్నీ పోగుచేసుకొని వచ్చాడు.

మిగిలిన స్వీట్స్ అన్నిటిని మల్లన్న చేత పంపించి , ఓబులేసు తో పాటు పల్లెలో మనకోసం వచ్చిన వాళ్ళ అందరికి పంచమని రవీంద్ర ఇచ్చి పంపాడు. వాళ్ళు వెలతా మంటే పెద్దాయన మద్యానం భోంచేసుకొని వేళ్ళమన్నాడు. నల్లప్పకు చెప్పి ఊర్లో కెళ్ళి 4 కోళ్ళు పట్టుకొని రమ్మని , సర్పంచ్ వాళ్ళ ఫ్యామిలిని కుడా అక్కడే భోంచేయమని చెప్పి, ఇక్కడ వంట అయ్యే లోపల వాళ్ళకు మన గుడి చుపిచ్చుకొని రాపో రా అని రామి రెడ్డికి చెప్పాడు.

రామి రెడ్డి తోడు రాగా అందరం గుడి కి వచ్చాము , అక్కడ పూజారి గుడికి సంబందించి న విషయాలు చెప్పసాగాడు. విజయ నగర సామ్రాజ్య కాలంలో వీల్ల వంశం వారు రాజుల దగ్గర పాలెగాళ్ళు గా చేసేవారట, అప్పుడు ఆ పలేగాల్లలో ఒకరు రాజు వెంట అనేక యుద్దాలకు వెళ్లి ఆయనకు బోలెడన్ని విజయాలు చేకుర్చారట ఆ విజయాలకు చిహ్నం గా ఈ అమ్మవారు ఆలయాన్ని కట్టించీ ఇచ్చాడట.

ఓ యుద్ధం లో గెలిచి ఆ సంపదనంతా ఎక్కడో ఈ చుట్టు పక్కల ప్రాంతాలలో దాచి ఆ రహస్యాన్ని మా పెద్దలకు ఎవరికో చెప్పారంట ,ఆ సంపద ఇప్పుడు ఎక్కడ వుందో ఏమో ఎవరికీ తెలిదు. వంశ పారంపర్యంగా వచ్చే వస్తువులల్లో ఆ సంపద రహస్యం దాచి ఉంచారట అని మాతాతలు ఎప్పుడో మేము చిన్నగా వున్నప్పుడు చెబుతుంటే విన్నాము. మీ పెద్దాయన పొలానికి పక్కన గుట్ట వుంది చూసారా ఆ గుట్ట మీద ఒకప్పుడు కోట వుండేది అంట , ఇప్పుడు ఒట్టి రాళ్ళు మాత్రమే ఉన్నాయి గోడలు కుడా లేవు. అక్కడ సంపద వుంది అని చాలా మంది గుంతలు గుంతలు తవ్వినారు , కానీ ఎవ్వరికి పిసరంత కుడా దొరక లేదు. అంటూ ఆ గుడి చరిత్ర , వీళ్ళ వంశ చరిత్ర , ఆ నిధి గురించి చెప్పాడు. అక్కడ పూజ చేసి , ప్రసాదం తీసికొని వెనుకకు బయలు దేరుతుంతే , పూజారి పిలిచి అందరికి బండారు ఇచ్చాడు.
“మరి ఈ గుడికి ఆదాయం ఎలాగా , మీకు జీతాలు ఎవరూ ఇస్తారు ? ” అంటూ ప్రతాప్ అడిగాడు.
“దేవుడి మన్యం అని ఓ 20 ఎకరాల పొలం వుంది అది ఊరిలో కౌలుకు వేలం వేస్తాం , ఆ ఏడాది ఎవరూ ఎక్కవ కౌలు ఇస్తారో వారికి కౌలుకు ఇస్తాం ఆడబ్బే బోలెడు ఉంది, ఇక పూజ లంటారా రోజంతా ఇక్కడ ఎవ్వరు వుండరు , పొద్దున్నే , సాయంత్రం మాత్రమె దీపం వెలిగిస్తాం, మా వంశస్తులు మాత్రమె ఇక్కడ పూజలు చేస్తారు మేము జీతాలు తీసుకోము , ఇది మాకు ఆ అమ్మోరు ఇచ్చిన వరం అనుకుంటాము. ఈ నగలు అన్ని చుట్ట పక్కల వుల్లో వాళ్ళు చేపిచ్చినవే , ఇదిగో ఈ పాపిటి బిళ్ళ మా ఇంట్లో పడుంటే నేను ఎత్తుకొచ్చి అమ్మోరు తల్లో పెట్టినా , ఈ వడ్డాణం వెండిది , మీ పెద్దాయన M.L.A గెలిచినప్పుడు చేయించాడు, ఇదిగో ఈ హారం వీళ్ళ నాయన సర్పంచ్ గా గెలిచి నప్పుడు చేయించాడు ” అంటూ వాటి పుట్టు పూర్వోత్తరాలు చెప్పా సాగాడు. అది మా వాళ్ళకు బోర్ కొట్టి నట్లు ఉంది , ఒక్కరొక్కరే చల్లగా బయటకు జారు కున్నారు నేను ఒక్కడే అక్కడ మిగిలాను.

“ఆ పాపిటి బిళ్ళ ఒకసారి చూడొచ్చా పూజారి గారు” అది పుర్య కాలం డిజైను లాగా వుంది అన్నాను.

147526cookie-checkకలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 4

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *