కలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 4

Posted on

“మనకు సరియైన ప్లేస్ కావాలి రాత్రికి వాళ్ళను గమనించడానికి , వీలైతే లోనకు వెళ్లి వో సారి చెక్ చేద్దాము” నువ్వు వుండు నేను ఓ రౌండ్ వేసుకోస్తాను అంటూ ఆ స్కూలు వైపుకు వెళ్లాను.
“స్కూలు మొత్తం పైన రేకులు వేసి కంపౌండు మాత్రమే గోడ వుంది, వెనుక వైపున గోడకు అనుకోని మునిసిపాలిటి కాలువ ఆ కాలువకు అటువైపున ఇల్లు లేవు . లోనకు వెళ్ళా లంటే ఆ మురిక్కాలవ దాటుకొని , గోడ దూకి వెళ్ళాలి , లేదంటే ముందు గేటు నుంచి వెళ్ళాలి అనుకుంటూ ఓ పూర్తీ రౌండ్ వేసుకొచ్చాను. ”
“ఏంటి సార్ ఏమైనా ఛాన్స్ ఉందా లోనకు వెళ్ళడానికి ? ”
“ఎనక పక్క గోడ ఎక్కి వెళ్ళాల్సిందే ” ఈ లోగా చీకటి పడింది మేము చూస్తుండగానే రాత్రి పది ఆయింది. రాత్రి మేము చుసిన వాడు వచ్చాడు అక్కడ స్కూలు లోకి. మేము హమీద్ బండి దూరంగా పార్క్ చేసి అక్కడున్న కాక హోటల్ లో చాయ్ తాగుతూ కుచోన్నాము , ఈ లోపుల స్కూలు నుంచి ఓ గద్దపోడు మాదగ్గరకు వచ్చాడు. లారీలు లోంచి సరుకు దించాలి కొద్దిగా పని చేస్తారా డబ్బు లిస్తాము అన్నాడు. మేము ఒకరి మొహాలు ఒకరం చూసుకున్నాము. గమనించలేదు పొద్దునుంచి తిరుగుతూ వుండడం వలన మేము హమాలీలకు ఈ మాత్రం తీసిపోలేదు. అందులోనా మా బండి అక్కడ లేదు. అన్నింటికీ మించి అది రాత్రి . ” ఇద్దరికీ 200 రూపాయలు ఇస్తే వస్తాం” అన్నాడు హమీద్. చలో ఫిర్ , క్యా నాం హాయ్
“మై హు షామీర్ , యే హాయ్ , ఇస్మాయిల్ ” అంటూ నన్ను పరిచయం చేసాడు. వాడి వెంబడి లారి దగ్గరకు వెళ్ళాము , మాతో పాటు ఇంకో ఇద్దరు హమాలీ లు వచ్చారు, పైన వున్నా టార్పాలిన్ తీసి , లోపలున్న సరుకులు దించ సాగాము , అందు లో పిల్లలకు బట్టలు బుక్కులు ఇంకా రోజు వారి సరుకులు , మేము తప్పుగా అంచనా వేసామా అని డౌట్ రాసాగింది. సగం దించిన తరువాత , కొనే సంచుల్లో ఉన్నవాటిని దించాల్సి వచ్చింది అవన్నీ పొడుగ్గా నీట్ గా ప్యాక్ చేయబడ్డాయి , వాటి తరువాత , అట్ట పెట్టెలు బరువుగా ఉన్న వాటిని దించాల్సి వచ్చింది. ఏమైనా వుంటే ఆ సంచుల్లోను లేక అట్ట పెట్టెల్లో నే ఉంటాయి.కాని వాటిని చూడడం ఎలా అని ఆలోచిస్తూ ఉండగానే , లారీ ఖాలీ అయి పోయింది. ఈ సరుకులు వేర్వేరు గదుల్లో స్టోర్ చేసారు.
గోనెసంచులు , అట్ట పెట్టెలు వుండే చోట మాత్రం ఇద్దరు గడ్డ పోల్లు వస్తూ పొతూ హమాలీల లను గమనించ సాగారు. దానిని బట్టి మాకు confirm అయ్యింది ఏమంటే , వుంటే ఏమైనా ఆ సంచులు బాక్స్ ల లోనే కాని వాటిని ఎలా తెలుసు కోవాలి అనుకుంటుం డగానే అదరని బాటకు పిలిచి డబ్బు లిచ్చి పంపించారు అప్పటికే రాత్రి 12 అవుతుంది. మేము లోపాలకి వెళ్ళాలంటే ఇంకో గంట , లేదా రెండు గంటలు ఆగాలి అప్పుడే సరైన టైం లోనకు వెళ్ళడానికి అన్నట్లు , దగ్గర జంక్షన్ లో ఉన్న సినిమా ధియేటర్ దగ్గరకు వెళ్లి టి తాగి అక్కడే కొద్ది సేపు గడిపి వెనుకకు వచ్చాము. పని అయిపోగానే వెల్లడానికి వీలుగా హమీద్ బైక్ ని స్కూల్ వెనుకకు తెచ్చి పెట్టాము.

సరుకులు మోసేటప్పుడు ఎక్కడ గోడ దూకడానికి వీలుగా వుంటుందో లోపల నుంచి చూసుకోవడం వలన, సరిగ్గా 2.30 కి ఇద్దరం వెనుక వైపు నుంచి గోడ దగ్గరకు వెళ్లి కోన్ని రాళ్ళు ఎత్తుగా వేసుకొని , మొదట నేను పైకి ఎక్కి ఆ తరువాత హమీద్ ను పైకి లాక్కొని అటు వైపుకు దుకేసాము. దూకిన వెంటనే పక్కనే చీకటిగా ఉన్న రూమ్ లోకి వెళ్ళాము. ఎక్కడ నుంచో మాటలు విన బడుతున్నాయి.
“క్యా హాయ్ రే ఓ సౌండ్ , కుచ్ కుద్నేకా అవాజ్ ఆయా ”
“కోయి బిల్లి ఆయె హుంగా మురిగి హడ్డి యొంకే లియే , ఫిర్ భి మై జాకే దేఖతా హు ” అడుగల చప్పుడు మేమున్న రూము వైపు రాసాగాయి.
చీకట్లో రూమ్ లో చుస్తే , అక్కడ పిల్లలు పడుకొని వున్నారు , ఆలోచించే టైం లేదు హమీద్ ను వెంటనే పక్కనున్న పిల్ల వాడి వైపుకు తోసి ఆ పిల్లాడి రగ్గు తనకు కుడా కప్పి డోర్ కు అనుకొని పడుకున్న పిల్లోడి రగ్గు నేను కప్పేసు కొని ఉపిరి బిగపట్టి ఆ అడుగుల చప్పుడుల కోసం ఎదురు చూడ సాగాను. కొద్ది దూరం వచ్చి ఆగిపోయాయి “కుచ్ బి నహి ఇదర్ , తు ఖాలీ ఫిలి పరేషాన్ హో రహా హై ” అడుగుల చప్పుడు మా నుంచి దూరంగా వేళ్ళ సాగింది. చిన్నగా హమీద్ రగ్గు పికి తనకు సైగ చేసాను వచ్చేయమని. మేము బయటకు వెళదామని కొనే లోపు నా పక్కనే పడుకున్న ఉన్న పిల్లోడు నిద్రలో కలవరిస్తూ ఏడుస్తున్నాడు “వద్దు నన్ను కొట్టొద్దు , నేను పోను , భయ్యా నన్ను కొట్టొద్దు ” అంటూ అటు ఇటు పోర్ల సాగాడు, ఫోన్ టార్చ్ on చేసి బయటకు లైట్ రాకుండా చేతులు అడ్డం పెట్టి ఆ పిల్లోడి వీపు చూసాము , అక్కడ విపంతా వాతలు రక్తాలు ఎండిపోయి అట్టలు కట్టాయి , డౌట్ వచ్చి పక్కనే ఉన్న ఇద్దరి , ముగ్గరిని చెక్ చేసాను , అందరికి అలాగే వాతలు తేలాయి. 8 నుంచి 10 లోపు పిల్లలు, వాళ్ళను ఆ విదంగా చూడగానే కళ్ళవెంట నీల్లు వాటంతట అవే కార సాగాయి. హమీద్ లెట్స్ మూవ్ అంటూ బయటకు వచ్చాము.

ఈ దాగుడు మూతలు చాలు అనుకుంటూ , మేము బాక్స్ లు పెట్టిన రూమ్ వైపు వెళ్ళాము , ఆ రూమ్ ముందు ఇద్దరు గడ్డపొల్లు స్టుల్స్ మీద కూచొని నిద్ర పోతున్నారు. వాళ్ళ పక్కనే పెద్ద వసి తేలిన కర్రలున్నాయి, హమీద్ వైపు చూస్తూ, లోపలికి వెళ్ళాలంటే వీళ్ళను ఇక్కడి నుంచి తప్పించాలీ , నాకు ఒకడు, నీకు ఒకడు సౌండ్ బయటకు రానీ కు అని చెప్పి నా వంతు వచ్చిన వాని వెనక్కు చేరుకొని ఓ చేత్తో వాడి నోరు మూస్తూ రెండో చేయి వాడి మెడ చుట్టూ వేసి శరీరంలోని ఉపిరి బిగపట్టాను, రెండో నిమిషంలో నా చేతుల్లో వెలాడి పడి పోయాడు. ఎదురుగ్గా చూస్తూ హమీద్ తన పొలిసు పద్దతి ఉపయోగించి వాడిని స్ప్రుహ తప్పించాడు. ఒకరి తరువాత ఒకరిని బాట్టలు మోసిన రూములోకి మోసుకెల్లి అక్కడున్న చెత్త గుడ్డలు వాళ్ళ నోట్లో కుక్కి గట్టిగా వున్నా ఇంకో రెండు గుడ్డలు తీసికొని వాళ్ళ కళ్ళు చేతులు కదలడానికి విలు లేకుండా కట్టేసి , నాలుగు బట్టల మూటలు తీసి వాళ్ళను అక్కడ తోసి వాళ్ళ పైన ఆ మూటలు వేసాము. మరీ బట్టల మూటలు తీస్తే తప్ప వాళ్ళు కనబడరు. ఓ 4 గంటల దాకా గ్యారెంటిగా లెవరు ఈ లోపల మా పని కుడా అయిపోతుంది అనుకుంటూ పక్క రూమ్ లోకి వెళ్ళాము.

ఆ రూమ్ కు తాళం వేసి వుంది , “హమీద్ ఇప్పుడేలాగా ?” పగల కొడితే సౌండ్ వస్తుంది సౌండ్ రాకుండా ఎలా ఓపెన్ చేయడం ? ఆ రూమ్ కు ఓ కిటికీ వున్నట్లు గుర్తు , అది పక్కరూంలోకి ఓపెన్ అయి వుంది. అక్కడకి వెళ్లి చూస్తూ , పల్లవి ని black మెయిల్ చేసిన వాడు అప్పుడే లేస్తూ వున్నాడు. నన్ను చూసి “కొంన్ హాయ్ తు అందర్ కైసా ఆయా”అంటూ నా వైపు రాసాగాడు. వాడు ఎక్కువ సౌండ్ చేస్తే అంతా లేస్తారు సారూ , ఎదో ఒకటి చేయండి అంటూ హమీద్ వెనుక నుంచి గుస గుస లాడాడు. పిల్లల మీద వాతలు చూసిన దగ్గర నుండి దాచుకున్న కోపమంతా వాడిని చూస్తూనే కట్టలు తెంచుకొని సైడ్ కిక్ రూపంలో బయటికి వచ్చింది. ఫట్ మంటూ నా కుడి కాలు వాడి గడ్డం కింద తగిలించి , వాడికి అరిచే టైం కుడా లేకుండా వాడి దవడ ఎముక విరిగి పోయింది. వాడెల్లి నాలుగు అడుగుల దూరంలో పడ్డాడు. వెళ్లి వాడి చేబులు చెక్ చేస్తే , వాడి ఫోన్ ,పర్సు దొరికింది వాటితో పాటు తాళం చెవి గుత్తి దొరికింది , వాటిని నా జేబులోకి తోస్తూ, ” వీడిని నేను దాపెడతాను నీవు వీటితో ఆ తలుపులు తెరుచు కుంటాయేమో చూడు ” అంటూ వాడిని ఈడ్చుకొంటు గుడ్డలు వేసి వున్నా రూమ్ లోకి వెళ్ళాము , ఇంకో మూడు మూటలు పక్కకు పికి , ఇట్లాంటి వాళ్ళు బ్రతకడం భూమికి భారం అని చెప్పి వాడి మెడ చుట్టూ చేతిని వేసి పక్కకు వంచాను , పచ్చి కొమ్మ విరిగినట్లు సౌండ్ చేస్తూ స్పుహలోనే ప్రాణాలు వదిలేసాడు మూలకు తోసి వాడి మీద మూటలు కప్పి హమీద్ ను కలిసాను.

ఎలాగో తంటాలు పడి తలుపు తీసి లోపలికి వెళ్ళాడు. అక్కడున్న రెండు పెట్టలు కిందకు దింపి మూడో పెట్టెను తన దగ్గర ఉన్న కీస్ తో నిలువునా ప్యాకింగ్ వెంట గిసి ఓపెన్ చేసాడు. లోపల RDX కొద్దిగా సాంపిల్ పెపర్ లో పొట్లం కట్టి జేబులో వేసుకొన్నాడు. ఆ పెట్టెలు అనుమానం క్లోజ్ చేసి వాటి మీద ఇందాక దించిన రెండు పెట్టెలు పెట్టేసాడు. ఇంకో ముల నున్న గొనె సంచుల ప్యాక్ లోంచి ఓ దానిని బయటకు లాగి. దీనిని ఓపెన్ చేయద్దు అలాగే తీసుకోని వెళదాం పద అని చెప్పి మేము వచ్చిన దారినే గోడ దూకి మా బైక్ దగ్గరకు వచ్చి ప్రతాప్ ఇంటి కి వెళ్ళాము. దారిలోనే వాడికి ఫోన్ చేసి లేపి మేము వస్తున్నాము అర్జెంటు గా మాట్లాడాలి బయటకు రమ్మన్నాను.

మేము ఇంటికి వెళ్ళేగానే గేటు లోనే ఎదురోచ్చాడు
“ఏమైందిరా ఇంత రాత్రప్పుడు” అంటూ ఎదురోచ్చాడు,
“ఇంతకీ రవింద్ర ఎక్కడున్నాడురా “
” సాయంత్రమే ఫోన్ చేసాడు ఇక్కడే టౌన్ లో ఉన్నాడంట, మా వాళ్లకు దొరికిన ఇన్ఫర్మేషన్ ఏమో గాని వాడు ఏడుస్తున్నాడు ఎక్కడెక్కడికో చెకింగ్ కు పంపుతున్నారని “
“వాడిని వెంటనే ఫోన్ చేసి , కంట్రోల్ రూమ్ కు వచ్చేయమను , మీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ కరెక్టే , సరుకు మొత్తం గోడౌన్లో వుంది , వెంటనే రైడ్ చేస్తే మొత్తం దొరుకుతుంది ” అంటూ మేము తెచ్చిన పేపర్ పొట్లం , గొనె సంచి ప్యాక్ వాడి ముందు పెట్టాము. గబా గబా ఆ గోనే సంచి ప్యాక్ చించి చూస్తూ , AK.47 అది చూస్తూనే మా ప్రతాప్ గాడికి నోట్లో మాట రాలేదు. రెండు నిమిసాలు తేరుకొని వెంటనే రవీంద్రకు ఫోన్ చేసి , 15 నిమిషాలలో ఆఫీస్ కు రమ్మన్నాడు. రెండు నిమిషాల్లో వాడు డ్రెస్ చేసుకొని, అందరం కంట్రోల్ రూమ్ కు వచ్చాము. మేము అక్కడు ఉండగానే హమీద్ ఆఫీస్ కు ఫోన్ చేసి , ఇక్కడున్న పెట్రోలిం వ్యాన్స్ అన్నిటిని కంట్రోల్ రూమ్ కు రమ్మని చెప్పేసాడు.’

మేము వచ్చేసరికి రవీంద్ర , 4 జీపులు అక్కడ రడిగా ఉన్నాయి
“ఏమైందిరా ఇప్పుడు పిలిపించావు , విడేంది ఇక్కడ “
“నువ్వు కష్టపడుతున్నావు అని , నీకు బరువు తగ్గిచ్చడానికి ఈ రోజు నీ డ్యూటీ వాడు , మా హమీద్ కలిసి చేసారు ” అంటూ మేము తెచ్చిన గన్, పౌడరు వాడి ముందు పెట్టాడు.
“ఇవి సాంపిల్ అంట ఓ లారి సరుకు చూసి వచ్చారు ఇద్దరు” అంటూ నా వైపు చూసాడు.

147526cookie-checkకలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 4

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *