కలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 3

Posted on

“ఎవరు రానిచ్చారు నిన్ను లోపలికి ” అంటూ నన్ను ఎగా దిగా చూసి.

“నీ యబ్బా రే శివా నువ్వారా, ఎక్కడ చచ్చావుభే , ఎంత మందిని అడిగానని నిగురించి , వారానికి ఓ సారైనా నేను రవీంద్ర గాడు నీ గురించే మాట్లాడు కొంటాము. హటాత్తుగా ఎంటిరా ని ఎంట్రి ఎక్కడో బెంగుళూరులో ఉండాల్సిన వాడివి , ఇక్కడ ఎలా ? , ఏమి తాగుతావు ?” అంటూ హడావిడి చేసి చాయ్ తెప్పిచ్చాడు. అప్పుడు , ఇప్పుడు ఏమి మారలేదు. తెలుగు సినిమాలో రాణా లాగా ఉంటాడు. మనిసి నలుపు కాని, మనసు మాత్రం వెన్న. ఎప్పుడూ ఫ్రెండ్స్ అంటే పడి చస్తాడు. వాడికి సెల్ఫ్ కన్ఫిడెంట్ చాలా ఎక్కువ, అలాగే దేశభక్తి అంటే కుడా. ఇక్కడో చిన్న ఇన్సిడెంట్ చెప్పక తప్పదు.

మేము ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ లో ఉండగా జరిగింది , అప్పటికి మాకు NCC- Army wing లో C-సర్టిఫికేట్ తో పాటు , షూటింగ్ లో గోల్డ్ మెడల్స్ వచ్చాయి. యూనివర్సిటీ ఆడిటోరియం లో ప్రముఖ హిప్నోటిస్ట్ తో ప్రదర్సన ఏర్పాటు చేసారు, ఆ విషయం తెలిసేటప్పటికి అందరు గ్రౌండ్ లో ఉన్నాము. అక్కడ నుంచి డైరెక్ట్ గా అలాగే స్పోర్ట్స్ డ్రెస్ తో ఆడిటోరియం కు వెళ్ళాము , దారిలో హిప్నోటిసమ్ మీద మాట్లాడుతుంటే వాడు అన్నాడు “అంతా హంబక్ రా , నీ మైండ్ కంట్రోల్ లో ఉంటే హిప్నోటిస్ట్ ఏమి చేయలేడు ” అంటూ ఓ పెద్ద statement వదిలాడు. మేము వెళ్ళేటప్పటికి ప్రోగ్రాం స్టార్ట్ అయ్యింది. స్టేజి మీదకు విద్యర్తులను పిలిపించి రకరకాలుగా హిప్నోటైజ్ చేశాడు. చివరి అంశంగా గ్రూప్ హిప్నోటైజ్ అంటూ అనౌన్సు చేయగానే , మేము అందరం కలసి మా కర్రోన్ని స్టేజి పైకి పంపాము. అక్కడ దాదాపు 10 మంది ఉన్నారు. అందులో ఇద్దరు ప్రొఫెసర్స్ కుడా ఉన్నారు. అక్కడున్న అందరికంటే మనోడు పొడుగ్గా వున్నాడు. పాపం ఆ హిప్నోటిస్ట్ రక రకాల అంశాలతో అందర్నీ హిప్నోటైజ్ చేసాడు , కాని మా కర్రోడు జండా కట్టేలా నిలబడ్డాడు అయన కమాండ్స్ కి వులక లేదు కదల లేదు. మిగిలిన 9 మంది ని చిన్న పిల్లల లాగా స్టేజి మీద దోగాడిచ్చాడు కాని మా వాన్ని కోచో పెట్ట లేక పోయాడు. అయన మా వాన్ని చాలెంజి గా తీసుకోని మా వాడు నిలుచున్నా తీరు గమనించి ( అప్పుడు మా వాడు మిలిటరీ లో సిపాయి at-ease పోసిషన్ లో ఎలా ఉంటారో అలా ఉన్నాడు రెండు చేతులు వెనుకకు పెట్టి , దులాలులా ఉన్న తన కళ్ళు స్టేజి కేసి తొక్కి పట్టి ) అయన మొహం లో ఓ చిరునవ్వు. మా కనిపించింది వీడి weekness ఎదో ఆయనకు దొరికింది అని. ఆయన స్టేజి మీద ఓ కథ చెప్పాడు తన కమాండ్స్ అందులో మిక్స్ చేస్తూ .
“అప్పుడు మీరంతా బోర్డర్ దగ్గర సైనికులు , మీ అందరి చేతుల్లో మేచిన్ గన్స్ ఉన్నాయి. అప్పుడే పక్క దేశం మన మీద ఎటాక్ చేయడానికి వచ్చారు” అంటూ కమాండర్ లాగా అరుస్తూ “attention” అన్నాడు.
అంతవరకూ గుండ్రాయి లాగా నిలబడ్డ మా వాడు స్టేజి అడిరేటట్టు కాలును కొట్టి ఆ position లోకి వచ్చాడు. ఈ సంభాసన అంతా అక్కడ హిందీ లో జరిగింది నేను ఇక్కడ అంగ్లంలో ఇస్తున్నా అర్తం కావడానికి సులువుగా ఉంటుంది అని.
“Now Aim your guns at enimies” they are our enimies and they want to capture or military posts. we fight until we die but we never allow them to capture a single post. “koyi shak” అని ఆయన టాప్ వాయిస్ లో కమాండ్ చేసాడు. అక్కడున్న మిగిలిన వారికి ఏమి చేయాలో తెలియదు , కాని మా వాడు.
“No Sir ” అంటూ అరిచాడు .
“they are approching us now , lets save our country, టేక్ యువర్ position”. ఆ కమాండ్ వినగానే మా వాడు చేతిలో A.K 47 ఉన్నదని వుహిస్తూ ఓ కాలు ముందుకు పెట్టి గన్ పోసిషన్ తీసికొన్నాడు
“FIRE” అనగానే , మా వోడు ముందుకు చూస్తూ చేతులో గన్ తో స్టేజి మీద బుల్లెట్స్ స్ప్రే చేస్తూ నోటితో
“జ్ ………జ్………………జ్…. ” అంటూ చిన్న పిల్లలో ఆటల్లో గన్స్ తో ఎలా కలుస్తారో అలా కాల్చాడు. కింద కూచొన్న మాకు నవ్వు ఆగలేదు.
ఆ తరువాత వాడు ఆయనకి ప్రియ శిష్యుడై హిప్నోటిసమ్ నేర్చుకొన్నాడు.

అప్పుడప్పుడు వాణ్ణి ఏడిపించాలంటే చేతిలో గన్ ఉన్నట్లు ఉహిస్తూ, నోటితో గన్ సౌండ్స్ చేస్తూ బుల్లోట్స్ స్ప్రెడ్ చేస్తుంటాము.
“ఇప్పుడు చెప్పరా ఏంటి సంగతులు , పద ఇంటికి వెళ్లి భోంచేస్తూ మాట్లాడు కొందాము”
“నాకు అర్జెంటు గా ఓ హెల్ప్ కావాలిరా”
“అడుగు భే , ఎం కావాలో ”
“ఓ చిన్న అడ్రస్ ఇక్కడుందొ కావాలి ” అంటూ ఓ చిన్న పేపర్ లో అడ్రస్ రాసి తన కిచ్చాను . వెంటనే ఓ పొలిసు ని పిలిచి ఆ స్లిప్ ఇచ్చి ఎక్కడుందొ కనుక్కొని రమ్మన్నాడు. నా కారు అక్కడే పార్క్ చేసి వాడి కారులో ఇంటికి వెళ్ళాము. వాళ్ళ ఆవిడని పరిచయం చేసాడు. రాణి వాడు ఎంత నల్లగున్నాడో ఆమె అంత తెల్లగుంది. మనస్పూర్తిగా వాడిని అభినందిస్తూ. అక్కడికి వచ్చిన కారణం చెప్పాను. ( నేను మా బందువుల ఇంటికి వచ్చాను అని మాత్రమే చెప్పాను , వాళ్ళు కుడా నాతొ పాటు వచ్చారు అని చెప్పాను )

వాడు వెంటనే , “ఆ మాట అక్కడే చెప్పాల్సిందిగా మనమే వెళ్ళే వాళ్ళంగా”.
“బాబు నాకు తెలుసు అందుకే నీకు అక్కడ చెప్పలేదు. నాకు అవసరం అయితే తప్పకుండా ని హెల్ప్ తీసికొంటాను అంత వరకు నన్ను వదిలై” .

రాణికి వీడ్కోలు చెప్పి , స్టేషన్ కు వచ్చాము. మేము వచ్చేసరికి తను పంపిన పొలీసు వచ్చాడు , సార్ ఆ అడ్రస్ ఫేక్ అట్లాంటి ఇంటి నంబరు లేదు అన్నాడు. ఉన్నదార్లల్లో ఒక్క దారి ముసుక పోయింది. మిగిలిన దార్లు ఇంటా అని ఆలోచిస్తుండగా . నా ఫోన్ లో మెసేజ్ వచ్చింది పల్లవి నుంచి తన ఫ్రెండ్ ఇచ్చిన నంబరు ఈ నంబరు ఒకటి కాదు , వాళ్ళ షాపింగ్ అయిపొయింది వచ్చి పికప్ చేసుకోమని.

“రేయ్ , నీకు కావాలంటే చెప్పు నా డ్రైవర్ ను పంపుతాను , నీ పని అయ్యంత వరకు నీతోనే ఉంటాడు , అందులోనా పోలీసులు ఉంటే నీకు పనులు తొందరగా జరుగుతాయి ” అన్నాడు.
” uniform లో ఉంటే వద్దు , సివిల్ దుస్తుల్లో అయితే పంపు ”
“అందేంత సేపు , మా వాడు ఎప్పుడూ ఓ జత ఆఫీస్ లో పెట్టి ఉంటాడు , ఉండు మార్చుకొమ్మని చెప్తా ” అంటూ తన డ్రైవర్ కు విషయం చెప్పి నాతో ఉండమన్నాడు అవసరం ఉన్నంతవరకు.
వలి “విడు నా జిగిరి దోస్త్ , నేను ఏంతో వాడు అంతో , మన ఊరికి కొత్త , వాళ్ళ మరదలు చిన్న ప్రాబ్లం లో ఉంది. నువ్వు కొద్దిగా హెల్ప్ చేయి అది సాల్వ్ చేయడానికి ” అంటూ వాడిని నాకు పరిచయం చేసి, మేము అక్కడ నుంచి వెళ్ళేంత వరకు వుంది లోనకు వెళ్ళాడు.

మేము షాపింగ్ మాల్ కు వెళ్లి వాళ్ళను పిక్ చేసుకొని , మంచి హోటల్ కు వెళ్లి వాళ్ళు ముగ్గురు బొంచేసిస్తుండగా ఆ తరువాత ఏమి చెయాల అని ఆలోచించాము. అక్కడ నుండి హమీద్ డ్రైవ్ చేస్తుండగా ఫోటో స్టూడియోకు వెళ్ళాము. అక్కడికి మాములుగా వెళ్లి అడిగాము అక్కడున్నపుడే నా ఫోన్ నుంచి మెసేజ్ వచ్చిన నంబరుకు కాల్ చేసాను అది అక్కడ రింగ్ అవుతుందేమోనని. ఫోన్ రింగ్ అవుతుంది కాని , ఎక్కోడో ఉన్నట్లు ఉంది ఎవ్వరు తీయలేదు. ఇంకో ఆప్షన్ పల్లవి వాళ్ల ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. తను అక్కడ లేదు , ఫోన్ రింగ్ అవుతుంది కాని ఎవరూ .ఎత్తలేదు . వాళ్ళ అమ్మ చెప్పింది నూర్ వాళ్ళ relatives ఇంటికి వెళ్ళింది పొద్దున్న ఈవెనింగ్ వస్తా అని చెప్పి వెళ్ళింది అంట. పల్లవి అర్జెంటు గా కలవాలి అని వాళ్ళ అమ్మను బతిమలాడితే వాళ్ళ relativies అడ్రస్ ఇచ్చింది.

1475010cookie-checkకలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *