కలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 29

Posted on

“నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తు ఉంటా లే అవ్వా , ఆదివారం అంతా ఇక్కడే ఉంటా లే, నేను ఈవెనింగ్ కాలేజీ కి వెళ్ళాలి అనుకోంటు ఉన్నా , అక్కడైతే వీలుగా ఉంటుంది”
“సరే అలాగే కానీ, కానీ ఆదివారం తప్పకుండా ఇంటికి రా”
“తప్పకుండా వస్తాలే అవ్వా , రాకుండా ఎలా ఉంటా” అంటూ నా వైపు చిలిపిగా చూసింది.
“సరే నేను కొద్దిగా బైటికి వెళ్లి వస్తా , లంచ్ టైం కు వస్తాలే” అంటూ ఇంట్లోంచి బైట పడ్డాను.
కొద్ది దూరం వెళ్ళగానే జేబులోని ఫోన్ అదేపనిగా మొగ సాగింది. ఎవరో చూద్దాం అని బైక్ ను పక్కన ఆపి మొబైల్ తీశాను. తెలియని నెంబర్ నుంచి కాల్
“హలో “
“ఏంటి సార్ చాల బిజీ గా ఉన్నట్లు ఉన్నారు , ఇంతసేపైంది పోనే తీయడానికి “
“ఎవరండీ , డ్రైవింగ్ లో ఉన్నా చెప్పండి”
“డ్రైవింగ్ లో ఫోన్ మాట్లాడ కూడదు అని తెలియదా ఏంటి ? డ్రైవర్ చేస్తూ ఫోన్ మాట్లాడు తున్నావు “
“హలో , మీరు నాకు క్లాసు పీకడానికి ఫోన్ చేసారా ఏంటి , డ్రైవింగ్ లో ఉన్నా కానీ ఇప్పుడు మీ కాల్ కోసం స్టాప్ చేసి మాట్లాడుతున్నా”
“గుడ్ బాయ్ “
“నాకు కండక్ట్ సర్టిఫికేట్ తరువాత ఇద్దురు గానీ ముందు మీరు ఎవరో ఎందుకు కాల్ చేశారో చెప్తారా , లేక కట్ చేసేయనా “
“కట్ చేస్తే మల్లి చేయలేనా “
“అమ్మా తల్లీ , లంచ్ కి ఏమైనా తినండి అంతే గానీ ఇలా తెలియని వాళ్ళను తినకండి “
“తెలియని వాళ్ళకు ఎందుకు ఫోన్ చేస్తాము, మీరు నాకు బాగా తెలుసు “
“నాకు మీరు ఎవరో తెలియ దే , ఇంతకీ ఎందుకు ఫోన్ చేసారు చెప్పండి”
“తొందరెందుకు సుందర వదనా , కాసింత ఓపిక పట్టండి “
“నీ సినిమా డైలాగులు తరువాత , ముందు ఎవ్వరు ఎందుకు ఫోన్ చేశారో చెప్పండి”
“చూస్తుంటే నువ్వు 7 నెలల్లోనే పుట్టినట్లు ఉన్నావే , అన్నింటి కి ఆత్రం అబ్బాయి గారికి “
“మీతో సరస సంభాషణ లాడే టైం లేదు , కావాలంటే రాత్రికి ఫోన్ చేయండి ప్రస్తుతానికి పెట్టేస్తున్నా”
“హే శివా , ఫోన్ పెట్టకు నీతో కొద్దిగా పని పడింది , ప్లీజ్ నువ్వు తప్ప వేరే ఎవ్వరు లేరు హెల్ప్ చేయడానికి అందుకే నీకు కాల్ చేస్తున్నా”
“హెల్ప్ కావల్సిన దానవు , ఇలా సుత్తి వేయకుండా డైరెక్ట్ గా పాయింట్ కి రావచ్చు గా, ఇంతకీ ఎవ్వరు నువ్వు ఎం హెల్ప్ కావాలి “
“ఓ రెండు మూడు సార్లు కలుసుకున్నాము లే , కానీ మనిద్దరికీ పెద్ద పరిచయం లేదు , కానీ నీ హెల్పింగ్ నేచర్ నాకు తెలుసు అందుకే నిన్ను అడుగుతున్నా “
“ఇంతకూ ఏంటి problem అది చెప్పు “
“ఇలా ఫోన్ లో చెప్పేది కాదులే , నువ్వు చెప్పు ఎప్పుడు ఫ్రీ గా ఉంటావు అప్పుడు డైరెక్ట్ గా కలుద్దాము “
“ఇంతకీ నీ పేరు చెప్పలేదు”
“ప్రస్తుతానికి అనామిక అని save చేసుకో కలిసినప్పుడు చెప్తాను అసలు పేరు “
“సరే అయితే సాయంత్రం ఏదైనా మాల్ లో కలుద్దాము” అంటూ ఫోన్ పెట్టేసి బైక్ ను ముందుకు పోనిచ్చాను.

ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు ఓ గమ్యం లేకుండా వచ్చాను, కానీ ఈ ఫోన్ కాల్ తరువాత బుర్ర వేడెక్కి ఫ్రెండ్స్ అంతా కలిసే అడ్డా వైపు తిప్పాను బైక్ ను.
ఆ టైం లో అక్కడ ఎవరన్నా ఉంటారని అనుకోవడం పొరపాటు, జనరల్ గా ఈవెనింగ్ 5.30 లేదా 6 మద్య అక్కడ గుమి కుడతాము. ఎలాగూ వచ్చాను కదా ఓ సిగరెట్ నుసి చేద్దాము అని చెప్పి దిగి టి ఆర్డర్ చేసి ఓ సిగరెట్ తీసుకొని వెలిగించాను.

“ఏంటి శివా , సర్ ఈ మద్య కనబడడం లేదే చాలా రోజులయ్యిందో మిమ్మల్ని ఇక్కడ చూసి ,మీ ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు శివా రాలేదా అని “
“కొద్దిగా బిజినెస్ పనుల్లో బిజీ గా ఉన్నా యాదన్నా”
“ఉద్యోగం మానేసి బిజినెస్ పెట్టారని షబ్బీర్ చెప్పాడు, నా చెల్లెలు B.Com చదివింది , ఖాలిగా ఉంది మీ దగ్గర ఏదైనా చిన్న కొలువైనా పర్లే , ఉంటే చెప్పండి సర్ “
“చూద్దాం లే యాదన్నా , రమ్మని చెప్పు వచ్చే బుధవారం , షబ్బీర్ వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పు వాడు తీసుకొని వస్తాడు ఆఫీస్ కు “
“తప్పకుండా శివా సర్ ” అంటూ నేనిచ్చిన నోటు తీసుకొని మిగిలిన చిల్లర ఇచ్చాడు.

“కలుద్దాం యాదన్నా , ఉంటా మరి “
“మంచిది సారూ , నా చెల్లి పేరు భవాని సర్ , షబ్బీర్ అన్నతో పంపిస్తా , థేంక్స్ సర్ “

సరే అంటూ బైక్ ని ఇంటి వైపుకు తిప్పాను , కొద్దిగా రి లాక్స్ అవుదామని బైటకి వచ్చాను , కానీ ఆ అమ్మాయి ఫోన్ కాల్ చికాకు పెట్టింది అనుకొంటూ ఉండగా మరో ఫోన్ కాల్ వచ్చింది. బైక్ ని పక్కకు ఆపి ఫోన్ చూస్తే శాంతా నుంచి.

“ఎక్కడున్నా వు”
“ఊర్లో నే ఉన్నా ఇంటికి వెళుతున్నా , అమ్మకు భోజనానికి ఇంటికి వస్తాను అని చెప్పా “
“రోజూ ఇంట్లో ఎం తింటావు లే , ఈ రోజు ఇక్కడికి వచ్చేయి”
“ఏంటి హుషారుగా ఉన్నావు , ఒక్క దాని వే ఉన్నావా ఏంటి ?”
“అర్థం చేసుకో , ఇంటికి ఫోన్ సాయంత్రం వస్తా అని చెప్పు “
“సరే అయితే బండిని మీ ఇంటి వైపు తిప్పుతున్నా ” అంటూ తన కాల్ కట్ చేసి అమ్మకు ఫోన్ చేసి మీరు బొమ్చేయండి నేను సాయంత్రం వస్తా కొద్దిగా బైట పని ఉంది అని చెప్పి బండిని శాంతా వాళ్ళ ఇంటి వైపు తిప్పాను.

151952cookie-checkకలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 29

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *