కలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 27

Posted on

“వాడు మా అన్న ఫ్రెండ్, పేరు డేవిడ్ వాడు కూడా మా అన్నతో పాటు ఇండియాలో చదువుకోవడానికి వెళ్ళాడు , మా అన్న కంటే ఓ రోజు ముందు ఇండియాకు వచ్చాడు. వాడి గురించి మా అన్నకు తెలుసు”
“నీకో విషయం చెప్పాలి , నేను మీ అన్నకు ఫ్రెండ్ ను కాదు , కానీ మీ అన్న పేరు వాడుకొని ఈ డేవిడ్ ఇండియా లో పెద్ద తప్పు చేసాడు,వాడిని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను, కానీ వాడి పేరు అక్కడ ఉమర్ గా ఉండడం వలన మీ అన్నే ఈ తప్పు చేసాడు అనుకోని నీతో పరిచయం పెంచుకున్నాను “
“మా అన్న పేరు ఎందుకు వాడు కొన్నాడు , ఇంతకు ఎం చేసాడు.”
“చెప్తా , కానీ నీ హెల్ప్ కావాలి వాడిని పట్టుకోవడానికి , వాడి దగ్గర ఓ వస్తువు ఉంది దాన్ని తీసుకొని పోవడానికే నేను ఇక్కడికి వచ్చాను”
“నువ్వు ఇండియా లో పోలీస్ వా ? “
“కాదు , కానీ పోలీస్ వాళ్ళకు హెల్ప్ చేయడానికి వచ్చాను ?”
“ఇంతకూ వాడు ఎం చేసాడో చెప్పలేదు “
“అక్కడ వాడు వేరే వాళ్లతో కలిసి బ్యాంక్ దొంగతనం చేసాడు , అందులో నాకు సంబంధించిన ఓ చిన్న బాక్స్ మాయం అయ్యింది నేను దాని కోసం వచ్చాను”

“నా కంటే మా అన్న నీకు హెల్ప్ చేయగలడు”
“డేవిడ్ మీ అన్న ఫ్రెండ్ కదా , నాకు ఎందుకు హెల్ప్ చేస్తాడు “
“ఉమర్ చాలా రెలిజియస్ , వాడికి ఇలాంటివి అస్సలు నచ్చావు , నువ్వు ఈ విషయం అక్కడే చెప్పి ఉంటే వెంటనే హెల్ప్ చేసే వాడు”
“అప్పుడే ఎలా చెప్పను , ఇప్పుడు నువ్వు చెప్పావు కదా , వీలయితే సాయంత్రం , మీ అన్నని డిన్నర్ కి పిలుద్దాం అక్కడ విషయం చెప్దాం సరేనా “
“సరే అయితే , నువ్వు కాల్ చేసి డిన్నర్ కి రమ్మని చెప్పు ఆ తరువాత నేను సాయంత్రం మాట్లాడి తనతో పాటుగా వస్తా “
“ok డన్ , ఎక్కడ కలుద్దాము నువ్వే చెప్పు , మీ అన్న నెంబర్ ఇవ్వు ” అంటూ డేవిడ్ నెంబర్ ఫోన్ లో save చేసుకున్నా.
దారిలో తను దిగిపోగానే , క్యాబ్ ను డైరెక్ట్ గా స్టేడియం కు వెల్ల మన్నా, కరుణా మ్యాచ్ కి ఇంకో గంట టైం ఉంది . నేను లోపలి వెల్ల గానే వాళ్ళ అమ్మ స్టేడియం లో రింగు కు దగ్గరగా కూచుని ఉంది.
నేను వెళ్లి హాయ్ చెప్పి కరుణా ఎక్కడ అని అడిగాను

“లోపల కోచ్ తో ఉంది”
“నేను ఓ సారి లోపలి కి వెళ్లి వస్తాను ” అని చెప్పి కరుణా ఉన్న చోటుకు వెళ్లాను. నన్ను చూడగానే వచ్చి గట్టిగా పట్టేసుకొని “ఇంకో 40 మినిట్స్ లో మ్యాచ్ స్టార్ట్ అవుతుంది , నువ్వు రావే మో అనుకొన్నాను “
“నీకు వస్తా అని చెప్పా కదా రాకుండా ఎలా ఉంటా “
“థేంక్స్ , అమ్మ ఒక్కతే ఉంది , నువ్వు తోడుగా ఉంటావు గా ఇప్పుడు “
“సరే లే , all ది బెస్ట్ , నీ opposite అమ్మాయి కి ఒక్క పాయింట్ రాకుండా గెలిస్తే , నీకో గిఫ్ట్ ఇస్తా రాత్రికి అన్నా “
“నిజంగా నా , సరే అయితే చూస్తూ ఉండు ” అంటుండగా తన దగ్గర నుంచి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చాను.

“ఏ మంటుంది”
“ఇంకో 40 నిమిషాల్లో మ్యాచ్ స్టార్ట్ అవుతుంది , మీరు లంచ్ తిన్నారా ? ఏమైనా తీసుకొని రానా ” అంటూ తన మాట వినకుండా కాంటీన్ కు వెళ్లి ఇద్దరికీ sandwich తో పాటు నీళ్ళ బాటిల్స్ తో వచ్చాను.

బాగా ఆకలి మీద ఉన్నట్లు ఉంది , ఆవురావురు మంటూ తినేసి తెచ్చిన నీళ్ళు తాగేసింది. నా sandwich తింటూ కరుణా మ్యాచ్ కోసం ఎదురు చూడ సాగాము.

కరుణా మ్యాచ్ స్టార్ట్ అవుతుంది అని అనౌన్సు చేసారు. తన opponent కూడా చాలా పేరున్న ప్లేయర్ అని చెప్పాడు అనౌన్సర్‌. అనౌన్సు చేసిన ఓ 5 నిమిషాలకు మ్యాచ్ స్టార్ట్ అయ్యింది.

మేము ఉత్కంఠం తో మ్యాచ్ చూడసాగాము. మొదటి రౌండ్ లో ఇద్దరు పోటా పోటీ గా నిలబడ్డారు. ఎవ్వరు ఒక్క పాయింట్ కూడా రాలేదు.

రెండో రౌండ్ స్టార్ట్ అయ్యింది ఓ 10 నిమిషాల గ్యాప్ తరువాత, ఇద్దరూ తలపడిన రెండో నిమిషంలో అవతలి అమ్మాయి గాళ్లో పైకి లేచి కరుణా పక్కకు వచ్చి పడ్డది, కరుణా ఆమె ను లేవ నీయకుండా 5 పాయింట్స్ గెలుచు కొంది. జనరల్ గా 5 పాయింట్స్ రావడం చాలా కష్టమని ఆ తరువాత తెలిసింది.

ఆ తరువాత రాండ్ లో కరుణకు మరో రెండు పాయింట్స్ వచ్చాయి. కానీ అవతలి అమ్మాయి సున్నా స్కోర్ తో కరుణా 7 పాయింట్స్ తో గెలిచింది అని అనౌన్సు చేయగా గేమ్ ముగిసింది.

“మీరు వస్తారా లోపలి” అని అడిగాను వాళ్ళ అమ్మని
“నువ్వు వెళ్లి రా శివా , నేను ఇక్కడే ఉంటా లే , నువ్వు పక్కన ఉంటే దానికి ఎక్కువ సంతోషం” అంది
సరే అంటూ లోపలి వెళ్లాను. తనతో వచ్చిన వాళ్ళు , వాళ్ళ కోచ్ అందరూ తనను అభినందిస్తుండగా వెళ్లాను, వాళ్ళ అందరిని వదిలించుకొని నా దగ్గరి కి పరుగెత్తు కొని వచ్చి నన్ను చుట్టే సు కొంది.
“కంగ్రా ట్స్ , నువ్వే గెలిచావు ” అంటూ shake హ్యాండ్ ఇస్తూ తన కోచ్ దగ్గరకు తీసుకెళ్లాను.
” తనలో చాలా improvement వచ్చింది , ఇలాగే కొనసాగిస్తే తన విభాగం లో గోల్డ్ తప్పని సరి ” అన్నాడు వాళ్ళ కోచ్
“ఇంకా ఎన్ని మ్యాచ్ లు ఉన్నాయి final కి చేరుకోవాలంటే”
“తనకి ఇంకా రెండు మ్యాచ్ లు ఉన్నాయి , రేపు , ఎల్లుండి తనకు మ్యాచ్ లేదు ఆ తరువాత రోజు మ్యాచ్ అది గెలిస్తే ఇంక final” అని చెప్పాడు.

151370cookie-checkకలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 27

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *