బ్లూ ఫిల్మ్ – Part 1

Posted on

నాకు ఇష్టం లేదన్నాను.
ఒకసారి కలిసి బార్లో తాగాం.
తర్వాత చాలాసార్లు బార్ కెళ్ళాం.
నాకు ఆల్కహాల్ ఎందుకో అంతగా నచ్చలేదు.

“వెరీబ్యాడ్ అభినయ్! నీలాంటి వాళ్ళని చూస్తే ఇమోషనల్ ఫూల్స్ అని తిట్టాలనిపిస్తోంది!” అన్నాడు సుభాష్.
నేను నవ్వి ఊరుకున్నాను.
యాపిల్ జ్యూస్ తాగుతూ వాడి మాటలు ఎంజాయ్ చేస్తున్నాను.
“జీవితాన్ని ఎంజాయ్ చెయ్యటం చేతకాని ఇడియట్ వి నువ్వు—” అన్నాడు సుభాష్.
నేనేమీ మాట్లాడలేదు.
“అసలు నువ్వెందుకిలా అయిపోయావో నాకేమీ అర్ధం కావటం లేదు. నా అనాలసిస్ కి అందని సైకాలజీ నీ ఒక్కడిదే. ఇలా లైఫ్ నెందుకు వేస్ట్ చేస్తావో నాకేమీ బోధపడటం లేదు. కమాన్ యార్—ఎంజాయ్. చదయవుకున్న వాడివి, అందగాడివి, ఆజానుబాహుడివీ, బోలెడంత ఆస్తి వుంది ఏకాకివి. అసలు నువ్వేం చెయ్యదల్చుకున్నావ్? జీవితాంతం ఇలా ఒంటరిగానే మడి కట్టుకుని కూర్చుని, వన్ ఫైన్ డే బాల్చీ తన్నేద్దామని నిర్ణయించుకున్నావా?” అన్నాడు సుభాష్.
మందు బాగా తలకెక్కినట్లుంది వాడికి.

“జీవితంలో ఏదో ఒక ముచ్చట, మురిపెం, సరదా లేకపోతే అది జీవితమే కాదు—” అన్నాడు సుభాష్ ఆవేశంగా.
“కరక్టే” అన్నాన్నేను తాపీగా.
“నాకు ముచ్చట్లు, మురిపాలు, సరదాలు అన్నీ వున్నాయి. ఐతే నా సరదాలు నీకు సరదాలు కావు. నీ సరదాలు నాకు సరదాలు కావు” ఖచ్చితంగా అన్నాను.
“ఎవరినైనా ప్రేమించరా? పెళ్ళి చేసుకోరా? ఈ భయంకరమైన ఒంటరితనాన్ని తరిమికొట్టరా?” ఎక్సెంట్రిక్ గా అన్నాడు సుభాష్.
నాకు నవ్వొచ్చింది.
గట్టిగా నవ్వేసాను.
“పెళ్ళి చేసుకోడానికి ప్రేమించి తీరాలని ఏమైనా రూలుందా? నేను ఒంటరితనాన్ని అనుభవిస్తున్నానూ అని నా నుదుటి మీదేమైనా రాసుందా? పెళ్ళయినంత మాత్రాన ఒంటరితనం వుండదు అని ఏమైనా గ్యారంటీ వుందా?”
“మరి పెళ్ళి చేసుకోలేదెందుకు?”
“నాకు సరిపోతుందనుకునే అమ్మాయి కనిపించలేదు. నాకు ఇష్టమైన అమ్మాయి దొరికినప్పుడు బేషరతుగా చేసుకుంటాను. జస్ట్ వెరీ సింపుల్”

ఆ మాటకి సుభాష్ సైలంటైపోయాడు. ఆ తర్వాత వాడెప్పుడూ నాకు గీతోపదేశాలు చెయ్యడానికి ప్రయత్నం చెయ్యలేదు. ఓ వారం తర్వాత నన్ను తనతో సరదాగా బొంబాయికి రమ్మని కోరాడు.

ప్రముఖ పారిశ్రామిక వేత్త, పారిశ్రామిక జగత్తులో విప్లవానికి మారుపేరైన జగన్ మోహన్ దేశాయ్ గారి ఏకైక పుత్రిక టీనా దేశాయ్ పుట్టినరోజు వేడుకకి బొంబాయి ఆహ్వానింపబడ్డాడు సుభాష్. వాడితో వెళ్ళడానికి నిశ్చయించుకున్నాను.

నేను బొంబాయి వెళ్ళడమే నా జీవితంలో ఒక ప్రధానమైన ఘట్టానికి శ్రీకారం ఔతుందని ఆరోజు అనుకోలేదు.

స్త్రీ జాతి గురించి నాకున్న అభిప్రాయాలు,

స్త్రీ జాతి గురించి నేను తెలుసుకున్న నిజాలు,

స్త్రీ జాతి గురించి నేను చదివిన విషయాలు—

అన్నీ తారుమారు చేసే వ్యక్తి నాకు తారస పడబోతోందని… నాకు తెలీదు.

130295cookie-checkబ్లూ ఫిల్మ్ – Part 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *