బ్లూ ఫిల్మ్ – Part 1

Posted on

పదాల గారడీలో అశ్లీలాన్ని దాచుకుని ఇంటింటా రేడియోల్లో టేప్ రికార్డర్స్ లో మోగుతున్నాయి. జాలాది అని నేనెంతో ఇష్టపడే కవి� ఈమధ్య ఓ చిత్రంలో చాకచక్యంగా రాసిన పాటలో “చుమ్మా చుమ్మా కొమ్మా రెమ్మల్లో దున్నేవాడే ఓయమ్మలో� గుచ్చీ గుచ్చీ కన్నె గుండెలో గుమ్మెత్తించే ఓయమ్మలో� జుంటి తేనెకై చంటి పూవుతో సరసమాడుతుంటే� ఆ రేకు విప్పుకుని సోకులాడి మళ్ళీ మళ్ళీ పడుతుంటే” అంటాడు. ఎంతటి భాషాచాతుర్యం భావసౌందర్యం కదం దొక్కుదోంతో ఆ పాటలో రసజ్ఞులు గ్రహించకపోలేదు.

సినిమాల సంగతి వదిలేయండి. మన పత్రికల భోగట్టా ఎలా వుంది? నేను చెబుతుంది మామూలు కుటుంబ పత్రికలు. సెక్స్ ఎడ్యుకేషన్ ముసుగులో ఎంత విజృంభిస్తున్నాయో మనం గ్రహించటం లేదనా? హస్త ప్రయోగం గురించి, రతి జరిపే విధానం గురించి, అంగ చూషణం గురించి, లింగ స్థంభన గురించి, కన్నెపొర గురించి, అవయవ పరిణామాల గురించి, ప్రశ్నలు-జవాబుల రూపంలో చెప్పిందే చెప్పి, రాసిందే రాసి, కుతిదీరా కసిదీరా ఎడా పెడా ప్రచురిస్తోంటే ఎంత హాయిగా చదువుకోవటం లేదు మనం. జనం. మనజనం.

కుటుంబ నియంత్రణ ప్రకటనలు ఎంత బాహాటంగా అంతా విడమర్చి చెప్పటంలేదూ? ఈ నిరోధ్ ఏంటి తాతయ్యా, కామసూత్ర కాండోమ్స్ అంటే ఏంటి తాతయ్యా అని మా మనవడే నన్నడిగాడంటే అది కాలమహిమ కాదనగలరా? శృంగారం, సెక్స్, బూతు…. ఏదైతెన్నే కథల్లో స్పష్టంగా చోటు చేసుకుంటోంది. బ్లూఫిలింలు విచ్చల విడిగా ఎక్కడపడితే అక్కడ లభ్యమవుతున్నాయి. ఇంటర్ మీడియేట్ చదువుకుంటోన్న ఏడుగురు అబ్బాయిలు (మా ప్రాంతంలోనే) వారానికి కనీసం ఒక్కసారైనా అందరూ కలిసి నీలిచిత్రం చూస్తుంటారని ఈమధ్యనే బైటపడి నానా గొడవ అయ్యింది.

ఇదంతా నేరమనీ, ఘోరమనీ నిందించటం లేదు నేను. సమాజం చెడిపోతోందనీ వాపోవటం లేదు నేను. SEX AWARENESS మనిషికి అవసరం. పరదాల చాటు సరదాగా, గుప్పిట్లో గుట్టుగా ఉంచే ప్రయత్నం చేస్తున్న కొలదీ బహిరంగంగా రహస్యంగా వర్ధిల్లుతూంటుంది. అదేం దురదృష్టమో, ఈ దేశంలో సెక్స్ అనేది ఒక హిపోక్రసీ. తాను చదివి, చూసి, అనుభవించి, ఆనందించి, పరవశించి, తన్మయత్వం చెంది బైటకొచ్చి పదిమంది ముందు� “ఛ ఛ సెక్స్ండీ, వెధవ సెక్సు, మరీ టూమచ్ అయిపోతోందీ మధ్య….” అని కబుర్లు చెప్పే హిపోక్రాట్స్ ఎన్ని లక్షలమంది లేరు?
సెక్స్ జుగుప్సాకరంగా కాకుండా అందంగా వేటూరి సుందర్రామ్మూర్తి పాటంత ఆహ్లాదంగా చతురంగా రాయగల సత్తా వున్న నవలా రచయితలు లేరు అని ఘంటాపధంగా చెప్పొచ్చు. కానీ….

తెన్నేటి దగ్గర శైలి వుంది. అతని రచనల్లో ఆ చాతుర్యం తొంగి చూస్తూంటుంది. మోతాదు మించకుండా ఆరోగ్యవంతమైన ముచ్చటైన సెక్స్ అద్భుతంగా రాయగల దమ్ము అతనికుంది.
‘సంధ్యావందనం’ చదవమని అడిగాడు తెన్నేటి. ముద్రణ అయ్యాక చదువుతానులే అన్నాను. అలాకాదు, దీనికి మీరే ముందుమాట రాయాలి, మీరు బావులేదు అంటే వ్రాతప్రతిని చింపి పారేస్తాను, అని రిక్వెస్ట్ చేసాడు. ఐతే చదివి వినిపించమన్నాను.

నవల ఎత్తుకోవడంలోనే అర్ధమయ్యింది. సంధ్యావందనం చవకబారు సెక్సు నవల కాదని. యాభై పేజీలు చదివేసరికి నాకు బోలెడంత ఆశ్చర్యం వేసింది. అలా రాయటం అందరికీ సాధ్యం కాదు. నవల సగం దాటాక నాక్కొంచెం భయం వేసింది. నవల క్లయిమాక్స్ కి చేరుకుంటూ వుంటే నేను పట్టరాని ఆనందంతో “శభాష్ తెన్నేటి” అని అభినందించకుండా వుండలేకపోయాను. నవల నామకరణం చెయ్యటమే ఎంతో గొప్పగా చేసాడనిపించింది.
I loved the frankness, the straight and bold way of expression, the Anonymous style of putting it into sentences and sequences.
చిరంజీవి ‘తెన్నేటి’ భవిష్యత్తులో మరింత పదునైన, ఆలోచనాత్మక, సంచలన రచనలు చెయ్యాలని ఆశీర్వదిస్తూ�

సెక్స్…
ఛి….పాడు…బూతు…
సెక్స్…
ష్…రహస్యం…హిపోక్రసీ…
సెక్స్…
నిషేధింపబడిన స్వప్నం…నిక్షేపించబడిన స్వర్గం.
సెక్స్…
రెండు నగ్న శరీరాల మధ్య…
స్త్రీ పురుషుల మధ్య…
కొన్ని నిముషాల రాపిడి…

అది ఒక రంగుల చిత్రం. అది ఒక అద్భుతం. అది ఒక పునాది. అనాదిగా సకల చరాచర సృష్టికీ మూలాధారం. ఆడమ్ అండ్ ఈవ్ లతో మొదలయ్యిందది.

ఊహలు. స్పందనలు. ప్రతిస్పందనలు. భిన్నత్వంలో ఏకత్వం. ఏకత్వంలో భిన్నత్వం. సరసం. మధురసం. ఆహ్లాదం. ఆనందం. తాదాత్మ్యలు పరవశం రిలాక్స్
పెర్వెర్షన్.
పశుత్వం.
రాక్షసత్వం.
పైశాచికం.
సరళం.
కఠినం.

అపారం. ఆనందం. అద్వితీయం. అపూర్వం. అఖండం. అజరామరం. అనిర్వచనీయం. నిశ్శబ్దం. మౌనం. రభస. తపన. ఆరాటం. పోరాటం. గెలుపు. ఓటమి, సర్వస్వం.
సెక్స్…సెక్స్…సెక్స్…

ఆడది…మగాడికోసం సృష్టించబడిన విలాసవస్తువు

అఫ్కోర్స్!
మగాడు కూడా… ఆడదానికోసం సృష్టించబడిన విలాసవస్తువే.

పొరపాటు ఆడదే చేస్తోంది.
మగాడికి పెద్దపీట వేసి, మగాడికి అనవసరమైన ఆధిక్యతనిచ్చి, తనని తాను పరోక్షంగా కించపరుచుకుంటోంది.

130295cookie-checkబ్లూ ఫిల్మ్ – Part 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *