మంజరి : అదిగో మహారాణీ – రాణులు – యువరాణీ వంటలు కూడా సిద్ధం , మీకోసం ప్రేమతో …… అదే అదే స్వయంగా తీసుకొస్తున్నారు ప్రభూ అంటూ ఎగురుకుంటూ వెళ్లి మహారాణీ గారి భుజంపైకి చేరింది .
అంతలోనే మహారాణీ చెంతకు చేరిపోయావా మంజరీ అన్నట్లు చిరుకోపంతో చూస్తున్నాను .
మహారాణీ – రాణులంతా చిరునవ్వులు చిందిస్తూ తమ తమ చేతుల్లోని వంట పాత్రలను మాచుట్టూ ఉంచారు , ఆకలివేస్తోంది అన్నారుకదా ప్ర …..భూ …. మహారాజా …… మీకోసం ప్రేమతో మేమే వండాము స్వీకరించండి అంటూ ముఖాలను చెంగులతో కప్పుకునే మాట్లాడారు .
ప్రేమతోనా ……. ? .
మాహారాణి : అంతులేని ప్రేమతో …… అంటూ ముసిముసినవ్వులు నవ్వుకున్నారు .
మంజరి : ( మా ముద్దుల మహిలా కాకుండా భలేగా మాట్లాడుతున్నావు మహీ ) అంటూ మహారాణీ బుగ్గపై ముద్దుపెట్టింది .
బుజ్జాయిలు : ముద్దులుకూడా అమ్మకే పెడుతోంది , అమ్మ – పిన్నమ్మలు – అత్తయ్య ……. వంట చెయ్యడం మెమెప్పుడూ చూడనేలేదు – చివరికి మాకోసం కూడా వండనేలేదు – ప్రాణంలా తినిపించేవాళ్ళు అంతే , ఘుమఘుమలాడిపోతున్నాయి ……. మీరంటే ఎంత ప్రేమో అర్థమౌతోందా నాన్నా – నాన్నా …….
ష్ ష్ బుజ్జాయిలూ ……. , మీ అమ్మగారు వింటే బాధపడతారు అంటూ సున్నితంగా బుజ్జి నోళ్ళకు చేతులను అడ్డుపెడుతున్నాను .
మాహారాణి: నాన్న – నాన్న ……..
బుజ్జాయిలు : మహి హృదయంపై చేతినివేసుకుని పరవసించిపోతుండటం చూసి అంతులేని ఆనందంతో మహారాణీవైపు గాలిలో ముద్దులు వదిలారు , మరింత సంతోషపెట్టడానికన్నట్లు నాన్నా నాన్నా నాన్నా నాన్నా ……. అంటూ ప్రాణంలా పిలుస్తూనే ఉన్నారు నేను ఎంత వారించడానికి ప్రయత్నిస్తున్నా …….
మహారాణి : అఅహ్హ్ …… అంటూ రాణుల గుండెలపైకి చేరారు .
బుజ్జాయిలు : మహి సంతోషాన్ని ఆస్వాదిస్తూనే నాన్నా – నాన్నా అంటూ నా బుగ్గలపై ముద్దుల వర్షమే కురిపిస్తున్నారు .
అఅహ్హ్ …… మీ ముద్దులతో నన్ను మంత్ర ముగ్ధుడిని చేసేస్తున్నారు తెలుసా అంటూ అంటూ ఆప్యాయంగా గుండెలతో హత్తుకుని అంతే ప్రాణంలా ముద్దులుపెట్టాను .
మాహారాణి గారి సంతోషమైన మూలుగుకు స్పృహలోకొచ్చి , బుజ్జాయిలూ బుజ్జాయిలూ …… అలా పిలవకూడదు – మీ అమ్మగారు బాధపడతారు అంటూ తలదించుకుని వారిస్తున్నాను .
ఏంటి బాధపడటమా ……. , మాకైతే అలా అనిపించడం లేదు అన్నయ్యా అంటూ నాప్రక్కన చేరి బుజ్జితల్లికి ముద్దులుకురిపించింది చెల్లి , ఏంటి వదినమ్మా ….. బాధపడుతున్నారా లేక లేక ……. సిగ్గుపడుతున్నారా ? అంటూ బుజ్జాయిలతోపాటు ఆనందిస్తోంది .
చెల్లీ చెల్లీ ……. నువ్వుకూడానా ? .
యువరాణి : నన్నేమి చేయమంటారు అన్నయ్యా …… , ఎదురుగా జరుగుతున్నదే చెబుతున్నాను .
బుజ్జాయిలు : అవునవును నాన్నా నాన్నా …….
ష్ ష్ ష్ …….
బుజ్జాయిలు : అమ్మ బాధపడితే అమ్మను అమ్మ అని కాకుండా మహారాణీ అని పిలుస్తాము – మా నాన్నను …. నాన్న అని పిలవకుండా ఉండలేము .
బుజ్జాయిలూ …… అంటూ కళ్ళల్లో బాస్పాలు .
యువరాణి : మీ నాన్న కళ్ళల్లో ఆనందబాస్పాలు చూస్తేనే తెలియడం లేదూ …… , మీరంటే ఎంత ప్రాణమో …….
బుజ్జాయిలు : నాన్నంటే నాన్నే అంటూ గట్టిగా ముద్దులుపెట్టారు .
మాహారాణి : ముద్దులు మాత్రమేనా బుజ్జాయిలూ లేక ఆకలివేస్తోంది అన్న మీ నాన్నకు తినిపించడం ఏమైనా ఉందా ? .
అమ్మో అమ్మో అమ్మో ఇంత ప్రేమ – ఇంత ప్రాణమా అంటూ గిలిగింతలు పెట్టి ఆటపట్టించారు రాణులు .
లేదు లేదు లేదు …….
రాణులు : ఆ విషయం మీరు కాదు మా అక్కయ్య చెప్పాలి , ప్రాణం పోయినా చెప్పరు , మీరంటే ప్రాణం కంటే ఎక్కువేమో …….
లేదు లేదు నా ప్రాణం కంటే ఎక్కువ నా దేవకన్య మహి మాత్రమే అంటూ హృదయంపై చేతినివేసుకుని వెనక్కు పచ్చని గడ్డిపైకి వాలిపోయాను బుజ్జాయిలతోపాటు తియ్యనైన అనుభూతితో ……. , చూసారా …… తలుచుకుంటేనే ఎంత ఆనందమో …… , మహీ ….. ఎక్కడ ఉన్నావురా – తెల్లవారగానే నా ప్రయాణాన్ని మొదలుపెట్టి నిన్ను ఎలాగైనా చేరుకుంటాము , ఈ మంజరి ఉందే నువ్వే సర్వస్వమని చెప్పి ఇప్పుడేమో మరొక మాహారాణి చెంతకు చేరిపోయింది , తెల్లారాక మా వెంట వస్తుందో లేదో …….
మహారాణీ గారు నాకంటే ఎక్కువగా పులకించిపోతున్నట్లు మంజరిని సున్నితంగా చేతుల్లోకి తీసుకుని ముద్దులుపెడుతూ మురిసిపోతుండటం చూసి ఆశ్చర్యపోయాను .
యువరాణి : మీ హృదయంలో మీ దేవకన్య ఉన్నా మీరంటే ఇంత ప్రాణం అన్నమాట వదినమ్మకు , ఉమ్మా వదినమ్మా …….
బుజ్జాయిలు : భలే భలే మహారాణీ మహారాణీ ……
మాహారాణి : ఉమ్మ్ …….
బుజ్జాయిలు : అలాగే అలాగే అమ్మా అమ్మా ……. , భలే భలే …….
చిరుకోపంతో లేచి కూర్చున్నాను .
యువరాణి : మీ నాన్నగారికి కోపం వచ్చినట్లుంది – ఆకలిలో మరింత కోపం రాకముందే తినిపించండి బుజ్జాయిలూ …….
బుజ్జాయిలు : కోపంలో కూడా మా నాన్న ముద్దొచ్చేస్తున్నారు అంటూ ముద్దులుపెట్టి నవ్వుతున్నారు .
ఆ ముద్దులకే కోపం మొత్తం ఎగిరిపోవడం తెలిసి నాకే ఆశ్చర్యం వేసింది .
బుజ్జాయిలు : నాన్న నవ్వారు నాన్న నవ్వారు …….
మాహారాణి : మా బంగారుకొండలు అంటూ బుజ్జాయిలతోపాటు నావైపుకు కూడా ముద్దులు వదిలి సిగ్గుపడుతున్నారు .
మహారాణీ గారూ ………
యువరాణి : అన్నయ్యా …… మీ దేవకన్య అంత అందంగా ఉంటుందా ? .
స్వయంగా దివి నుండి భువికి దిగివచ్చిన విశ్వ సుందరి సుగుణాల రాశి , అందంతోపాటు అనకువ – నేనంటే అంతులేని ప్రేమ అంటూ నాకు తెలియకుండానే అనుభూతిలో బుజ్జాయిల బుగ్గలపై ప్రాణమైన ముద్దులుపెట్టాను .
యువరాణి : ఒక్కసారి వదినమ్మను చూశారంటే …… , వదినమ్మా ……
లేదు లేదు లేదు అంటూ బుజ్జాయిలతోపాటు అటువైపుకు తిరిగేసాను .
యువరాణి : అంటే వదినమ్మ అందం చూస్తేనే దాసోహం అయిపోతారని అటువైపుకు తిరిగారన్నమాట .
లేదు లేదు లేదు , నా దేవకన్యను మించిన సౌందర్యారాశి ఈ భువిపై లెనేలేదు అంటూ మహారాణీ వైపుకు తిరిగాను .
యువరాణి : అందరితోపాటు నవ్వుకుని , అయితే ఒకసారి ……
ఆకలి అమ్మో ఆకలి …… బుజ్జాయిలూ ఆకలి ……
మాహారాణి : నవ్వుకుని , బుజ్జాయిలూ …… మీ నాన్నకు ప్రాణంలా తినిపించండి .
బుజ్జాయిలు : అలాగే అమ్మా …… , నాన్నా నాన్నా …… మీ ముందు ఉన్నవాటిలో ముందు ఏమి తినిపించాలి ? .
అన్నీ చూసి మధ్యలో ఉన్న వంట పాత్రవైపు చూయించాను .
అమ్మో అమ్మో అంటూ అందరూ ఆశ్చర్యపోయి ఆనందిస్తున్నారు .
మంజరి అయితే చుట్టూ సంతోషంతో ఎగురుతోంది .
ఏమైంది ఏమైంది ?
బుజ్జాయిలు : అంతులేని ఆనందంతో ముద్దులుపెట్టి , ఆ పాత్రను అందుకుని ప్రేమతో నోటికి అందించారు .
బుజ్జాయిలూ …… ముందు మీరు ? .
బుజ్జాయిలు : మాకు మాకు …….
ఓహో …… మీ అమ్మ గోరుముద్దలు తినాలని ఉందా వెళ్ళండి .
బుజ్జాయిలు : ఊహూ ఊహూ …… మా నాన్నను వదిలి ఆ మాహారాణి …… లేదు లేదు అమ్మ దగ్గరికి వెళ్లాడమా ? అంటూ నవ్వుకుంటున్నారు .
మరి ……..
బుజ్జాయిలు : అమ్మ గోరుముద్దలను నాన్న చేతులతో తినాలని ఆశగా ఉంది .
మీ అమ్మగారు బాధపడతారేమో …….
యువరాణి : బాధపడటమా …… ? , ఇప్పటివరకూ జరిగినది చూశాక కూడా మా అన్నయ్య లాంటి వీరాధివీరులు అడిగాల్సిన ప్రశ్నలేనా అవి అంటూ నవ్వుకుంటున్నారు .
నిజమేకదా అంటూ ఇద్దరినీ తొడలపై కూర్చోబెట్టుకుని ప్రాణంలా నోటికి అందించాను .
మాహారాణి : బుజ్జాయిలూ ముద్దులతో ……..
బుజ్జాయిలు : అవునవును నాన్నా నాన్నా ….. , ముద్దులతో మా అమ్మ గోరుముద్దలను మీ చేతులతో తినిపించండి .
మాహారాణి : సంతోషంతో చప్పట్లు కొడుతున్నారు .
చెల్లీ …… నాకేమీ అర్థం కావడం లేదు .
యువరాణి : పోను పోను అర్థమవుతాయిలే అన్నయ్యా …… , దేవదేవుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారుకదా …….
బుజ్జాయిలు : నాన్నా నాన్నా ఆకలి ఆకలి అంటూ ముద్దుముద్దుగా …….
చెల్లెమ్మా …… ఇదిమాత్రం నిజం , బుజ్జాయిల పిలుపులు మాత్రం నేరుగా హృదయానికే చేరుతున్నట్లు ఏదో తెలియని మాధుర్యం అంటూ ఎవ్వరికీ వినిపించకుండా చెవిలో గుసగుసలాడాను .
యువరాణి : వదినమ్మా …….
చెల్లెమ్మా చెల్లెమ్మా …….
యువరాణి : పో అన్నయ్యా …… , ఈ మాటలను వినాల్సిన వాళ్ళు వింటే మరింత ఆనందం …….
ష్ ష్ ష్ చెల్లీ ……. , బుజ్జాయిలకు ముద్దులతో తినిపించాను .
బుజ్జాయిలు : నా వేళ్ళతో సహా జుర్రుకుని మ్మ్ మ్మ్ …….
అంత రుచిగా ఉందా బుజ్జాయిలూ …… , మిమ్మల్ని చూస్తుంటేనే నోరూరిపోతోంది అంటూ మళ్లీ ముద్దులుపెట్టాను .
బుజ్జాయిలు : ఎంత బాగుందో తింటే మీరే చెబుతారు , నాన్నా – నాన్నా …… అంటూ నోటికి అందించారు .
మిత్రమా – అడవిరాజా ……. అంటూ వాళ్ళవైపు చూసాను .
యువరాణి : వాళ్లంటే ఎంత ఇష్టమో తెలిసే ముందు వాటికి ఆహారం అందించింది వదినమ్మ , మీరు సంతోషంగా తినవచ్చు ……
కుమ్మేస్తున్నారన్నమాట తినండి తినండి , మంజరీ …….. రా తినిపిస్తాను .
ఎగురుకుంటూ వచ్చి నా భుజంపైకి చేరి నాతోపాటు బుజ్జాయిలకు ముద్దులుపెట్టి అంతలోనే మళ్లీ మహారాణీ భుజంపైకి చేరి , మహారాణీ చేతినుండి గింజలను తింటోంది .
మంజరీ …….
అందరితోపాటు బుజ్జాయిలు – మహారాణీగారు కూడా నవ్వేశారు , నాన్నా – నాన్నా ……. తినండి .
మహారాణీ గారూ – చెల్లీ – రాణులూ ……. వెళ్లి మీరూ తినండి .
మాహారాణి : తినడం కోసం వెళ్లడం దేనికి ఇక్కడే తింటాము .
ఇక్కడే తింటారా కానివ్వండి , బుజ్జాయిలూ ….. ఆకలి .
మహారాణీ చిరునవ్వులు …….
బుజ్జాయిలు : చిరునవ్వులు చిందిస్తూ నాన్నా నాన్నా అంటూ ముద్దులుపెట్టి బుజ్జి బుజ్జి చేతులతో ఒకేసారి తినిపించారు .
ముద్దలతోపాటు బుజ్జాయిల బుజ్జివేళ్ళను చప్పరించాను .
బుజ్జాయిలు : సంతోషంతో మళ్లీ ముద్దులుపెట్టి మురిసిపోతున్నారు .
మ్మ్ మ్మ్ …… మీరు చెప్పినట్లుగానే అమృతంలా ఉంది – మొత్తం తినేయ్యాలని ఉంది .
యువరాణి : ఆ వంట వండినది మా దేవత వదినమ్మ కాబట్టి అంత రుచి …….
అవునా …… , అదేమీకాదు మన బుజ్జాయిలు తినిపించారు కాబట్టి అంత రుచి .
యువరాణి : బాగుంది అన్నయ్యా …… , ఏదో సామెత ఉంది కానీ గుర్తుకురావడంలేదు , సరిగ్గా వదినమ్మ వండిన వంటను ఎంచుకుంది మీరు – అమృతం అంటూ పొగిడింది మీరు – మొత్తం తినేయ్యాలని అన్నది మీరే కదా ……
నేనే ……. , అదంతా మన బుజ్జాయిల బుజ్జి గోరుముద్దలు మహిమ అంటూ తినిపించి తిని బుజ్జిచేతులపై ముద్దులుపెట్టాను .
బుజ్జాయిలు : లేదులే నాన్నా నాన్నా …… , అమ్మ చేతి గొప్పతనం అది అంటూ బుజ్జిబుజ్జినవ్వులు నవ్వుకుంటున్నారు .
సరేసరే బుజ్జాయిలూ ష్ ష్ ……. , చెల్లీ …… వదినమ్మ అంటూ ప్రాణంలా పిలుస్తున్నావు .
యువరాణి : వదిన నిజంగా అమ్మనే దేవతనే , చిన్నప్పుడే అమ్మను కోల్పోయాను – అమ్మ ప్రేమ తెలియకుండా పెరిగాను , ఎప్పుడైతే వదిన వచ్చారో అమ్మలా చూసుకున్నారు అంటూ మహారాణీ చెంతకు చేరబోతే …….
మహారాణీ గారు ఆపారు .
యువరాణి : అన్నయ్యతో ఈ సంతోషాన్ని పంచుకోవడమే మా వదినమ్మకు మరింత సంతోషం అన్నమాట అంటూ బుజ్జితల్లి బుగ్గను వదలడం లేదు .
మహారాణీ సంతోషం మనసుకు తెలుస్తోంది .
చాలా సంతోషం చెల్లీ ……. , ఎక్కువ చెబుతున్నాను అనుకోకండి మహారాణీ గారిని మించిన గొప్ప యువరాణి నా దేవకన్య అంటూ బుజ్జితల్లికి ముద్దుపెట్టి అనుభూతి చెందుతున్నాను .
మహారాణి : తెగ పులకరించిపోతూనే చాలు చాలు భోజనం చెయ్యండి – బుజ్జాయిలూ …… ముద్దులతో తినిపించండి , మీ అత్తయ్య – పిన్నమ్మలు నాకంటే రుచిగా వండారు .
చెల్లీ …… అసూయ చెందుతున్నారా ? లేక ఆనందిస్తున్నారా ? , నాకు నవ్వులు కూడా వినిపిస్తున్నాయి .
యువరాణి : ప్రాణ నాథుడే అంతలా పొగిడితే వొళ్ళంతా సీతాకోకచిలుకలే …….
చెల్లీ …… నేను పొగిడినది నాదేవకన్యను కదా …….
యువరాణి : మనసు గెలిచిన వీరాధివీరుడు ఎవ్వరిని పొగిడినా …… తనే పరవసించిపోతుంది .
అర్థం కానట్లు ఆలోచనలో పడ్డాను .
యువరాణి : అన్నయ్యా …… పోను పోను మీకే అర్థమవుతుందిలే తినండి .
బుజ్జి గోరుముద్దలు అందుకుని , ఆడువారిమాటలకు అర్థాలే వేరు అంటూ తృప్తిగా తిని బుజ్జాయిలకు తినిపించాను .
మాహారాణి : ప్చ్ ……. నాకూ తినిపించొచ్చుకదా ప్రభూ ……
అంతే ఒక్కసారిగా వెక్కిళ్ళు వచ్చేసాయి .
మహారాణీ గారితోపాటు అందరూ నీళ్లు అందించి నవ్వుకుంటున్నారు .
బుజ్జాయిలు ఎవరి గ్లాస్ అయితే అందుకోకూడదు అనుకున్నానో వారిదే అందుకుని నోటికి అందించారు – వెక్కిళ్ళు ఎక్కువ అవ్వడంతో తప్పక త్రాగి బుజ్జాయిల నుదుటిపై సున్నితంగా తాకించాను .
బుజ్జాయిలు : స్స్స్ స్స్స్ …..
నొప్పివేసిందా బుజ్జాయిలూ ……. , నన్నూ ……
బుజ్జాయిలు : లేదు లేదు నాన్నా …… హాయిగా ఉంది అన్నారు .
మా మంచి బుజ్జాయిలు అంటూ ముద్దులుపెట్టాను .
మాహారాణి : అలా మళ్లీ నన్నెప్పుడు కొడతారు – మళ్లీ ఇప్పుడు ముద్దులుపెడతారు ? .
లేదు లేదు లేదు ……. , బుజ్జాయిలూ …… కొండపైనున్న అందమైన ఉద్యానవనాన్ని చూయిస్తాను అన్నారుకదా తీసుకెళ్లండి అంటూ పైకిలేచాను .
మహారాణీ నవ్వులు ఆగడంలేదు .
బుజ్జాయిలు : ఆ ఉద్యానవనం అమ్మ – అత్తయ్య – పిన్నమ్మలది ….. నాన్నా , ఎంత అందంగా …….
ఈ మాటలను వినడం కంటే అక్కడకు వెళ్లడమే ఉత్తమం పదండి .