జనం మెచ్చిన రాజు – Part 33

Posted on

మిత్రుడి ఘీంకారాలు వినిపించడంతో మిత్రమా మిత్రమా అంటూ పరుగులుతీసాను , మిత్రమా మిత్రమా …… ఏమైంది ? .
ప్రవాహానికి అటువైపుకు సైగలుచేసింది .
అటువైపునుండి ఏదో జంతువు ప్రాణాపాయస్థితిలో ఉన్నట్లు గర్జనతోకూడిన మూలుగులు వినిపిస్తున్నాయి .
మంజరి : ఆ గర్జన ఖచ్చితంగా అడవిరాజుదే అయిఉంటుంది ప్రభూ ….. , మూలుగులు కూడా వినిపిస్తున్నాయి అంటే ఏదో ఆపదలో చిక్కుకున్నట్లుగా ఉంది పాపం …….
అయితే రక్షించాలి అంటూ నడుము లోతున మాత్రమే ఉన్న ప్రవాహం దాటుకుని అటువైపుకు చేరాము .
అప్పటికే మంజరి ఎగురుకుంటూ వెళ్లి వచ్చింది , ప్రభూ …… అడవిరాజే – పాపం వేటగాళ్ళు ఏర్పరిచిన లోతైన గుంతలో పడింది – ఏదో గుచ్చుకున్నట్లు చుట్టూ రక్తం …….
మంజరి వెనుకే వెళ్ళిచూస్తే మనిషి లోతుకన్నా ఎక్కువున్న గుంతలో పడిపోవడం – పడిన జంతువుల ప్రాణాలు పోయేటట్టు గుంత మొత్తం చూపుగా ఉన్న గునపాలు ఏర్పాటు చేసినందువలన గుచ్చుకున్నట్లు చుట్టూ రక్తంతో విలవిలలాడిపోతోంది .

మిత్రమా – మంజరీ …… అలానే వదిలేస్తే ప్రాణాలు పోయేలా ఉన్నాయి అంటూ దగ్గరలో ఉన్న మఱ్ఱిచెట్టు ఊడలను తీసుకొచ్చి మిత్రుడికి చుట్టి నోటికి అందించి ఏమాత్రం ఆలోచించకుండా కిందకుదిగాను .
జాగ్రత్త ప్రభూ అంటూ మంజరి గుంత చుట్టూ ఎగురుతూ కంగారుపడుతోంది – కృష్ణా గట్టిగా పట్టుకో కింద అంతా గునపాలు ఉన్నాయి – ప్రభూ ప్రభూ …… ఎడమవైపుకు కుడివైపుకు అంటూ కిందకు దిగడంలో జాగ్రత్తలు చెబుతోంది .
ఎలాగోలా జాగ్రత్తగా నేలను చేరాను .
నన్ను చూసి భయపెట్టడానికో లేక భయపడో గర్జిస్తూ లేవడానికి తెగ ప్రయత్నిస్తోంది వల్ల కాక విపరీతమైన నొప్పితో విలవిలలాడిపోతోంది – దాని నోరే నా తల అంత ఉంది మరి నాకూ కాస్త భయం వేసింది – నన్ను వేటగాడు అనుకునేమో గింజుకుంటోంది ఎక్కడ ప్రాణాలు తీస్తానో అని – కన్నీళ్లు కార్చడం తెలుస్తోంది .
మిత్రమా …… నిన్ను కాపాడటానికే వచ్చాను శాంతించు శాంతించు అంటూ ధైర్యంగా దగ్గరకువెళ్లి ప్రేమతో సింహం శిరస్సుపై మిత్రుడిని అని తెలిసేలా స్పృశించాను .
ఆప్యాయత తెలిసినట్లు ఒక్కసారిగా ఉపశమనం చెందినట్లు కదలకుండా ఉండిపోయింది .
ఒక పాదానికి మరియు పొత్తి కడుపులో గుచ్చుకున్న గునపాల నొప్పితో విలవిలలాడుతున్న సింహంను కష్టమైనా దుర్గమ్మ తల్లీ అంటూ పైకెత్తి ప్రక్కన ఉంచాను నా అంత పొడవు ఉందిమరి , సింహం కన్నీళ్లను తుడిచి వీటి సహాయంతో పైకి చేరుస్తాను అంటూ ఊడలను జాగ్రత్తగా కట్టి మిత్రుడికి సైగచేసాను కిందనుండి నేనూ ఎత్తుతున్నాను .
అంతటి బరువున్న అడవిరాజును ఎత్తడం చాలా చాలా కష్టమే అయినా ఎలాగోలా పైకి చేర్చాము , భళా మిత్రమా భళా అంటూ మిత్రుడు నోటిద్వారా వదిలిన మరొక ఊడ ద్వారా సునాయాసంగా పైకిచేరాను .

మంజరీ …… ముక్కుతో నువ్వుకూడా లాగావన్నమాట అందుకే సింహం ను పైకెత్తగాలిగాము .
మంజరి : పోండి ప్రభూ అంటూ భుజంపైకి చేరి సిగ్గుపడుతోంది .
మూలికలు మూలికలు ఔషధ మూలికలు అంటూ చంద్రుడి వెన్నెలలో కోసుకొచ్చి బండపై నూరి సింహం గాయాలపై ఉంచి కట్టు కట్టాను .

ఆకులలో నీళ్లు తీసుకొచ్చి త్రాగించాను – మంజరీ …… గాయాలను చూస్తుంటే గుంతలోపడి రెండు రోజులకు పైనే అయినట్లు ఉంది .
మంజరి : అయితే నీటితోపాటు ఆహారం కూడా కావాలి ప్రభూ …… , ఉండండి దగ్గరలో ఏవైనా జంతువుల కళేబరాలు ఉంటే చూస్తాను అంటూ పైకెగిరింది .
జాగ్రత్త మంజరీ …….
సింహం చుట్టూ చుట్టిన ఊడలను వేరుచేసేంతలో మంజరి వచ్చింది , ప్రభూ కాస్త దూరంలో సింహమో పులో తిని వదిలిన జింక కళేబరం ఉంది .
మంజరి వెనుకేవెళ్లి తీసుకొచ్చి సింహం నోటి ముందు ఉంచాను – తెగ ఆకలితో ఉన్నట్లు కష్టంగానే ఆవురావురుమంటూ మొత్తం తినేసింది .
నీటిని త్రాగించి విశ్రాంతి తీసుకోమని ఒక చేతితో స్పృశిస్తూ మేము ముగ్గురం పళ్ళు స్వీకరించాము .
మేము కాపాడటమే కాకుండా చూపిస్తున్న ఆప్యాయతకు మావైపు చూసిన చూపుకు చాలా సంతోషం వేసింది .
అడవిరాజా …… నీకేమీ కాదు హాయిగా నిద్రపో అంటూ తెలియజేసి మేమూ విశ్రాంతి తీసుకున్నాము .
********************

రాత్రీ పగలూ విశ్రమించకుండా ప్రయాణించడం వలన అలసిపోయినట్లు సూర్యకిరణాలు మాపై పడేంతవరకూ ఘాడమైన నిద్రపోయాము .
సూర్యోదయ సమయం అంటూ లేచి ప్రవాహం దగ్గరకువెళ్లి సూర్యవందనం చేసుకుని వచ్చాను .
అప్పటికే ప్రయాణానికి సిద్ధం అన్నట్లు నా భుజంపైకి చేరింది మంజరి – లేచి సిద్ధంగా ఉన్నాడు మిత్రుడు .
మోకాళ్లపై కూర్చుని , మంజరీ …… మన అడవిరాజు ఇప్పటికీ లేవలేని పరిస్థితులలో ఉన్నట్లున్నాడు ఇప్పుడెలా ? .
మంజరి : ఇక్కడే వదిలేస్తే మూడవరోజున తప్పకుండా వచ్చే వేటగాళ్ళు చంపేసినా చంపేస్తారు – మనతోపాటు తీసుకెళదాము .
నాపైకి ఎక్కించు మిత్రమా అంటూ కృష్ణ మోకాళ్లపైకి చేరాడు .
మీరిద్దరూ ఎలా అంటే అలా అంటూ కష్టంగానే మిత్రుడిపైకి చేర్చాను – మిత్రమా బరువుగా ఉందా ? .
లేదన్నట్లు సులువుగా పైకిలేచి నిలబడ్డాడు .
సింహం కళ్ళల్లో కన్నీళ్లు ……. , అడవిరాజా ఏమైంది నొప్పివేస్తోందా ? .
ఊహూ అంటూ తల ఊపడం చూసి , ప్రభూ …… అవి కన్నీళ్లు కాదు ఆనందబాస్పాలు – చూస్తుంటే అడవిరాజు మనకు జీవితాంతం ఋణపడిపోయినట్లే ……..
అవునన్నట్లు తలఊపింది .
అవసరం లేదు అడవిరాజా …… , ఆపదలో ఉన్న ప్రాణిని కాపాడటం మా బాధ్యత అంటూ గాయాల పరిస్థితిని చూసి కొత్తగా మూలికలు రసం పిండి కట్టు కట్టాను .

చూట్టూ చూసి సరైన చెట్టు నుండి ధనస్సు – బాణాలను తయారుచేసుకున్నాను .
మంజరి : ప్రభూ …… మీ ఆయుధాలంటే మీకిష్టం కదా .
అవి గురువుగారు – మన మహి ఇచ్చినవి , వాటిని ఎలా వదులుకుంటాను – ఆ రాజ్యానికి మళ్లీ వెళ్లే రోజు రానే వస్తుంది , ఇక వెళదాము ప్రయాణం సాగిస్తున్న కొద్దీ నదీప్రవాహం కాస్తా పిల్ల కాలువలా మారి రెండు రోజులకు కాస్తా పూర్తిగా మాయమైపోయింది – ఒకప్పుడు నిండుగా ప్రవహించిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి – అరణ్యపు పచ్చదనం ఎప్పుడో మాయమైపోయింది – కొన్నిరోజులుగా కరువు రాజ్యమేలుతున్నట్లుగా ఎటుచూసినా ఎండిపోయిన చెట్లే దర్శనం ఇస్తున్నాయి .
చివరగా కనిపించిన పిల్లకాలవలోని నీరు …… మహి ఆనవాళ్లను ఇటువైపుకే చూయించడంతో ప్రయాణం సాగించాము .

క్రూరమృగాలు వదిలివెళ్లిన కళేబరాలను తింటూ నెమ్మదిగా కోలుకుని మూడవరోజుకు హుషారు వచ్చినట్లు మిత్రుడి నుండి కిందకుదిగి మొదట నెమ్మదిగా కుంటుకుంటూ తరువాతి పూటకు దాదాపు కోలుకున్నట్లు మామీదకు మీదకు ఎగురుతూ కృతజ్ఞతను తెలియజేసి దర్జాగా మా ముందు నడవసాగాడు అడవిరాజు – ఆ ప్రదేశమంతా సుపరిచితమే అన్నట్లు సులువైన దారిలోకి తీసుకెళుతున్నాడు .
మాముగ్గురిలో సంతోషం , అడవిరాజా …… చూస్తుంటే ఈ ప్రదేశమంతా తెలిసినట్లుగా ఉంది – ఇంతకూ ఆ ఉచ్చు గుంతలోకి ఎలా పడ్డావు .
ఎలా చెప్పాలో తెలియక సతమతమైపోతోంది .
మంజరి : అడవిరాజా ….. నాకు తెలియజెయ్యి నేను , మన ప్రభువులకు చెబుతాను , వారికి కూడా నీలాంటి జంతువులతో మాట్లాడించడం వచ్చు – ఇలా అయితే ప్రయాణిస్తూనే తెలుసుకోవచ్చు అంటూ అడవిరాజు మీదకు చేరింది , “అడవికి రాజును నేనైతే ఇక నుండీ మీరే నా రాజు ” …… వింటున్నారా ప్రభూ .
వింటున్నాను వింటున్నాను మంజరీ …… , కానీ ఆ మాటలు అడవిరాజు మనసులోనివా లేక నా ప్రియమైన అందమైన మంజరి మనసులోనివా ? .
నా మనసులోనివే అన్నట్లు అడవిరాజు నామీదకు ఎగబ్రాకాడు .
అలాగే అలాగే అడవిరాజా ……
మంజరి : అంతేలే ప్రభూ , నేను చెబితే నమ్మరు .
మన్నించు మన్నించు మంజరీ అంటూ నవ్వుతూనే గాలిలో ముద్దు వదిలాను .
మంజరి : ధన్యవాదాలు ప్రభూ అంటూ నా భుజం పైకి చేరి ముద్దుపెట్టి వెళ్లి అడవిరాజు పైకి చేరింది . ” ప్రభూ …… నేను పుట్టి పెరిగినది ఈ అడవిలోనే – కొన్నిరోజుల కింద ఈ ప్రదేశం నిండుగా ప్రవాహాలతో ఎటుచూసినా దట్టమైన పచ్చదనంతో కళకళలాడుతూ ఉండేది – ఇలా ఒక్కసారిగా కరువు సంభవించింది – నా పిల్లలకు త్రాగడానికి నీటిని తీసుకురాలేకపోయాను నాలానే అడవిలోని జంతువులన్నింటి పరిస్థితీ ఇదే ……..” ఆగు ఆగు అడవిరాజా ….. నీకు పిల్లలున్నారా ? .
” భార్య – ఇద్దరు బుజ్జి పిల్లలు …. ఒకటి మగ మరొకటి ఆడ ”
మంజరి : వాళ్ళెక్కడ అడవిరాజా …….
” భార్యకు – పిల్లల దాహం తీర్చలేక చాలా బాధపడ్డాను , ఇలా కాదు అనుకుని నీటికోసం భార్య పిల్లలతో చాలాదూరం ప్రయాణించి పిల్ల కాలవ ప్రవాహం చేరుకుని సంతోషంగా దాహం తీర్చుకున్నాము , వెనక్కు తిరిగివెలితే మరలా అదే పరిస్థితి అనుకుని పిల్లలతో ఆడుకుంటూ ప్రవాహం వెంబడి ప్రయాణిస్తూ చీకటిలో గమనించక గుంతలోకి పడిపోయాను , నా కుటుంబానికి ఏమిచెయ్యాలో తెలియక నా రక్తం చూసి తట్టుకోలేక ఒకరోజంతా కన్నీళ్లతో గుంత చుట్టూ తిరుగుతూనే ఉన్నారు , నేనెలాగో వేటగాళ్లకు దొరికిపోతాను నావలన నా భార్య – పిల్లల ప్రాణాలు పోకూడదని ఒట్టు వేసిమరీ అక్కడనుండి పంపించేసాను , పిల్లల ప్రాణాలు ముఖ్యం కాబట్టి అంతులేని బాధతో వెళ్ళిపోయింది , ఆరాత్రి చిన్నగా వర్షం పడింది కాబట్టి వాళ్ళు తప్పకుండా మా అడవికే గుహకే చేరుకుని ఉంటారు ” .
తప్పకుండా తప్పకుండా వారు ఎక్కడ ఉన్నా ప్రాణాలతో ఉంటారు అడవిరాజా …….
” అక్కడక్కడా పచ్చదనం ఉంది అంటే వర్షం పడినట్లు తెలుస్తోంది ” .
అంతలో దాహం తీర్చుకోవడానికన్నట్లు అలా చినుకులు పడి ఆగిపోయింది .
” ఈమాత్రం నీరు పడితే చాలు ఈ అడవిలోని జంతువుల దాహం తీరిపోతుంది ” .
కన్నీళ్లను తుడుచుకున్నాను .
మంజరి : మీ గుహ ఎక్కడ అడవిరాజా …… ? .
” రాజ్యానికి అటువైపు ”
రాజ్యం ఉందా అడవిరాజా అంటూ ఆతృతతో అడిగాను .
” త్రాగడానికి ఏమాత్రం వీలుకాని సముద్రం తీరాన రెండు పెద్ద రాజ్యాలు మూడువైపులా చిన్న చిన్న చాలా రాజ్యాలు ఉన్నాయి ప్రభూ , ఇప్పటికే రెండు చిన్న రాజ్యాలను దాటుకుని వచ్చేసాము అడవి గుండా …….. ” అంటూ అడవిరాజు మనసులోని మాటలను మంజరి పలికింది .

1313840cookie-checkజనం మెచ్చిన రాజు – Part 33

1 comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *