మా గాయత్రి అక్క – Part 4

Posted on

దేదీప్య కరుణించడంతో సుబ్బారావు కొత్త ఉత్సాహంతో చెలరేగిపోతున్నాడు. తన సహకారంతో అతని ఉత్సాహన్ని రెట్టింపు చేస్తోంది దేదీప్య. తన గుడేల మీదున్న సుబ్బారావు మొహాన్ని రెండు చేతులతో పైకెత్తి,త్త్రిప్తిగా అతని నుదురు చుంబించి,మత్తుగా, మనోహరంగా నవ్వింది దేదీప్య . ఆమె మూడ్ బాగుపడిందని గుర్తించిన సుబ్బారావు క్షణం ఆలస్యం చేయకుండా . ”ప్రామిస్ దేదీప్యా ఆ సువర్చల ఎవరో నాకు తెలియదు ” అన్నాడు ఆమె నెత్తిమీద చేయి వేస్తూ. ”పోనీలెండి?” అతని గొంతులోని నిజాయితీ దేదిప్యాలోని ఆనందం రెట్టింపు చేసింది.

”నేను మిమ్మల్ని నమ్ముతున్నాను.” ”థాంక్స్,దేదిప్యా” పట్టలేని సంతోషంతో దేదీప్యలోని బుగ్గలు చుంబించాడు సుబ్బరావు. ”మెనీ హ్యాపీరిటర్న్ ఆఫ్ దడే. ఇది మన రెండో పెళ్లి రోజు ” హాల్లో గడియారం రెండు గంటలు కొట్టడం విని, ప్రేమగా సుబ్బరావు నుదురును మరోసారి చుంబించింది దేదీప్య. ” సెం టు యు! మ్యారేజ్ డే టైములో నీ అలక చూసి హడాలిపోయాననుకో.ఎంత భయపడ్డానో తెలుసా?” చిన్నపిల్లవాడిలా అన్నాడు సుబ్బారావు. ‘నా చలిమిడి ముద్దా మొగుడా..ఇక నెలలో రెండు ముడు సార్లు ఏదో ఒక వంకన ఇలా అలుగుతూనే వుంటాను. నువ్వు ఈ రోజులాగే వెరైటీగా’ నా అలక తీరుస్తుండాలి.

అలిగిన వేళనే శుంగారం అమితానందం ఇస్తుందని కథల్లో చదివాను. అనుభవించింది లేదు నువ్వు ప్రతి దానికి తల ఊపుతావు,అస్సలు కోపం తెప్పించవు. ఇక నాకు కొంతకాలానికి కష్టం అనిపిస్తుందట. అందుకే సువర్చల పేరు మీద కట్టుకథ అల్లి ,లేనికోపం తెచ్చుకుని అలక నటించాను. నేను ఊహించుకున్న దాని కంటే కూడా ఎంతో థ్రిలింగ్ గా నా అలక తీర్చి, మగధీరుడివి అయ్యావు నా ద్రుష్టిలో. ‘నీ మంచితనం వల్ల మన మధ్య ప్రణయ కలహాలు వుండకపోవచ్చు గానీ నేను శ్రుష్టించే కలహానంతర ప్రణయాలు తప్పవు.

అర్తమైదా సుబ్బారావు ఉంగరాల జుట్టును సవరిస్తూ అలా మనసులో వున్నదంతా చెప్పాలనుకుంది దేదీప్య. కానీ ఎమీ చెప్పలేదు. సుబ్బారావు కి నిద్రవచ్చే వరకు అతని జుట్టును అలా ప్రేమగా సవరిస్తూ వున్నాయి దేదీప్య చేతులు. సూరేపల్లి విజయ…… గారికి థాంక్స్ చెబుతూ…. మీ బుల్లబ్బాయి (రాసిన అసలు రైటర్)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *