ఖర్కోటఖుడు – Part 9

Posted on

ఫ్లయిట్ లో కూర్చున్న తర్వాత టూటూ బిగిసిపోయి ఉండటం చూసి “టూటూ..?” అని పిలిచాడు హార్ధిక్.

“దొరా..?” అన్నాడు టూటూ ఉలిక్కిపడుతూ.

“ఏం ఆలోచిస్తున్నావ్? ” అన్నాడు హార్ధిక్.

“అక్కడ ఏం జరిగిందో అసలేం అర్థం కాలేదు దొరా. ఆ తుపాకులేంటి దొరా అలా ఉన్నాయి? మేము చాలా సార్లు పోలీసుల దగ్గర చూసినం గానీ ఇట్లాంటివి నా జీవితంలో చూడలేదు దొరా” అన్నాడు ఆశ్చర్యంగా.

ఇంకా టూటూ నోరు అలాగే తెరుచుకుని ఉంది. హార్ధిక్ చిన్నగా నవ్వి “ఇప్పుడు చూడనివి చూశావ్ కదా. తర్వాత ఇంకా చూద్దుగాని. కొంచెం వెయిట్ చెయ్” అన్నాడు.

“అది సరే కానీ దొరా. ఇంత మార్బలం ఎందుకు దొరా?” అన్నాడు ఆశ్చర్యంగా.

“ఏంటి టూటూ. నన్ను చూస్తుంటే పిచ్చి వాడిలా కనిపిస్తున్నానా? ఈ ప్రశ్నకు సమాధానం నీకు ముందు ముందు తెలుస్తుందిలే. ఇంతకీ నీ బాక్స్ లో ఏముందో చూడు?” అన్నాడు హార్ధిక్.

టూటూ కూడా బాక్స్ విషయం మర్చిపోయాడు. గుర్తు రాగానే గబగబా బాక్స్ ఓపెన్ చేసాడు. అందులో తన కత్తిని పోలిన కత్తులు ఒక పది ఉన్నాయి.

అందులో ఒకటి తీసాడు చూడటానికి. పొరపాటున అంచు తగిలి చెయ్యి తెగింది.

తెగిన వేలు నోట్లో పెట్టుకుంటూ ” చాలా పదునుగా ఉంది దొరా” అన్నాడు.

“సరే నేను కొంచెం సేపు పడుకుంటాను. నీకు బోర్ కొడితే స్టేసీని పిలుచుకో ” అని నిద్రకు ఉపక్రమించాడు.

ఎందుకో కొంచెం సేపట్లో దిగిపోతాను అన్న బాధతో టూటూకి స్టేసీని పిలవాలనిపించలేదు.

అలాగే కూర్చుని టూటూ కూడా అనుకోకుండా నిద్రపోయాడు.

ఆస్ట్రేలియాకి మనకి టైం జోన్ ఐదున్నర గంటల తేడా వల్ల 8.30 గంటలు విమాన ప్రయాణం చేసినా 3గంటలు ముందుగానే ఇండియా చేరుకున్నారు.

మధ్యాహ్నం ఒంటిగంటకు ఎయిర్పోర్ట్ లో దిగే సమయానికి హాథీ సకల ఏర్పాట్లు పూర్తి చేసేసి సిద్ధంగా ఉన్నాడు.

హాథీ పక్కనే పూజా కట్లతో కట్టేసి, నోటికి ప్లాస్టర్ అంటించుకుని నిలబడి ఉంది.

$$$$$$$$$$

రిచర్డ్స్ ఇండియాలో తను స్టే చేస్తున్న సీక్రెట్ ప్లేస్ లో తన 20మంది స్టాఫ్ తో సమావేశం అయ్యాడు.

అందరూ అతని చుట్టూ కూర్చున్నారు.

171131cookie-checkఖర్కోటఖుడు – Part 9

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *