ఎవడే నీ అందాలను సొంతం చేసుకునే అదృష్టవంతుడు – ఎపిసోడ్ 12

Posted on

మూడు రోజులు అక్క, బావ లతో గడిపి బెంగుళూరు లో కొత్త ఉద్యోగం ట్రైనింగ్ కి జాయిన్ అయ్యేట్టు ప్లాన్ చేసుకొని, సౌమ్య తో పాటు జానకి, రాజారావు లు హైదరాబాద్ వచ్చారు. కావ్యకు సహాయం చేయడానికి మనిషి దొరకక పోవడంతో సీతను కూడా తీసుకు వచ్చింది జానకి. కొంచెం విచార వదనంతో వీడ్కోలు పలికిన చెల్లిని మళ్ళీ మాములుగా చూడటంతో సంతోషించింది కావ్య. రాగానే బాబుని ఆడిస్తూ, బావతో మునుపటి లాగే చలాకీగా మాట్లాడటంతో ఇక వాళ్ళ మధ్య ఏమి జరిగిందా అన్న విషయం గురించి మరచిపోయింది.

మరుసటి రోజు ఆఫీస్ నుంచి చాలా ఉత్సాహంగా వచ్చాడు శ్రీరామ్. స్నానం చేసి, బెడ్ రూమ్ లో బట్టలు మార్చుకుని కావ్యను పిలిచి అసలు విషయం చెప్పాడు. ఆనందంతో ముద్దులు పెట్టి తర్వాత అందరికి చెపుదాము అని నిర్ణయించుకున్నారు. శ్రీరామ్ తో స్వీట్స్ తెప్పించింది కావ్య. రాత్రి భోజనాలు తర్వాత అందరూ కూర్చున్నారు. అందరి మధ్య శ్రీరామ్ అసలు విషయం చెప్పాడు. అమెరికాలో తమ కంపెనీ IPO కి వెళ్ళబోతున్నట్టు, కంపెనీ ప్రాధమిక అంచనా ప్రకారం శ్రీరామ్ స్టాక్ ఆప్షన్స్ విలువ దాదాపు ఒకటిన్నర మిలియన్ డాలర్స్ పైనే ఉన్నట్టు. రూపాయలలోకి మారిస్తే పది కోట్ల పైమాటే. అందరు అభినందనలు తెలుపుతుంటే కావ్య స్వీట్స్ పంచింది. రాజారావు, జానకి లు కూడా చాలా ఆనంద పడ్డారు. అంత త్వరలోనే అల్లుడు పైకి ఎదుగుతాడనే ఆలోచన లేదు, వాళ్ళిద్దరికీ.

“ఈ స్వీట్ సరిపట్టేస్తే సరిపోదు బావ. ఇంకా చాలా పెద్ద పార్టీ ఇవ్వాలి”, అంది సౌమ్య బావ చేయి షేక్ హ్యాండ్ ఇస్తూ ఊపేస్తూ.

“అలాగే డబ్బులు వచ్చిన తరువాత. మేమంతా ఎంప్లాయిస్ కంపెనీ పబ్లిక్ వెళ్లిన ఆరు నెలల వరకు అమ్మటానికి లేదు. డబ్బులు వచ్చాక చూద్దాం”.

“అలా తప్పించుకుంటే కాదు. ఇప్పుడు ఒక పార్టీ. తరువాత డబ్బులు వచ్చాక ఇంకో పెద్ద పార్టీ లేకపోతె మీ ఇంట్లోంచి కదిలేది లేదు. ఇంతకీ ఆ డబ్బుతో ఏమి చేస్తావు బావ?” అంది తన పక్కనే చనువుగా కూర్చుంటూ. కావ్య ఓరకంట కనిపెడుతూనే ఉంది. చెల్లి పూర్వంలా ఉన్నందుకు ఆనంద పడింది. ఏమి మాట్లాడకుంటా వాళ్ళ మాటలు వింటుంది.

“మీ అక్కకి ఇండిపెండెంట్ ఇల్లు అంటె ఇష్టమని చెప్పింది. డబ్బులు వచ్చాకా ఏదైనా గేటెడ్ కమ్యూనిటీ లో చూస్తాము. డౌన్ పేమెంట్ చాలా ఉంటుంది బుక్ చేయటానికి. చూద్దాం. చాలా రోజుల మాట. ”

రాజారావు అందు కున్నాడు,”ఏమి అనుకోకు బాబు. ఇలా చెబుతున్నందుకు. ఈ లోపులే మీరు వెదకండి. ఏదైనా నచ్చితే డౌన్ పేమెంట్ నేను కడతాను. మీకు డబ్బులు వచ్చినప్పుడే ఇద్దురు కాని.” అల్లుడు ఏమంటాడా అని ఎదురు చూసాడు.

ఒక సారి కావ్య కేసి చూసాడు శ్రీరామ్. ఆమె నవ్వుతో భార్య మనోగతం అర్ధం అయ్యింది. “అలాగే మామయ్యా, కనీసం బ్యాంకు వడ్డీ అయినా తీసుకోవాలి.”

అదే మంచి సమయం అని జానకి కూడా అందుకుంది.”కావ్య! ఉద్యోగంలో చేరి సంవత్సరం అవుతోంది. నేర్చుకోవలసింది ఈపాటికే నేర్చుకొని ఉంటావు. నీకు ఇంకా చేయాలనీ ఉంటె నాన్నకే సహాయం చేయొచ్చు కదా?”

నిజానికి కావ్య మనసులో ఆ ఆలోచన ఉంది. బాబు పుట్టిన తరువాత ఎవరితోనో వాడిని వదిలి వెళ్ళటం అంత ఇష్టం లేదు. తను చొరవ తీసుకోకుండా తల్లి తండ్రుల దగ్గర నుంచి ఆ ప్రతిపాదన వస్తే బాగుంటుందని ఎదురు చూస్తోంది.

భర్త వేపు ఒక సారి చూసి, “అలాగే అమ్మ. నోటీసు ఇచ్చి ఇంకో నెలలో రిలీవ్ అయిన తరువాత చూద్దాం. నాన్న నాకు కనీసం ఇరవై శాతం ఎక్కువ ఇస్తేనే”, అంది నవ్వుతూ.
“నీవు వస్తానంటే నా కదే ఆనందం. ఎంత కావాలో నువ్వే డిసైడ్ చేయి” అన్నాడు తండ్రి ఆనందంతో.

సరదాగా మాటలు నడుస్తున్నాయి. సౌమ్య ఎప్పటిలాగే బావను కెలికింది అందరి ముందూ. “బావా నువ్వు ప్రేమ వివాహం ఎందుకు చేసుకోలేదు?”

బాబుకి పాలు పడుతున్న కావ్య అందరితో పాటు మౌనంగా భర్త ఏమి చెబుతాడా అని ఒక చెవి అటు పడేసింది.

“ప్రేమ అనేది కాలేజీలో లేక పని చేసే చోట ఎవరితోనైనా పరిచయం అయితే, వారు నచ్చితే ఆ స్నేహం ప్రేమగా రూపాంతరం చెందుతుంది. నేను కాలేజీలో ఉన్నప్పుడు పూర్తిగా చదువు, తరువాత ఫ్యూచర్ మీదే ధ్యాస పెట్టేవాడిని. నిజం చెప్పాలంటే ఆ రోజుల్లో నాన్న గారు నాకు పంపించేది జాగ్రత్తగా ఉంటేనే సరిపోయేది. ఎవరినైనా రెస్టారెంట్ కు తీసుకు వెళ్ళటానికి కూడా డబ్బులు ఉండేవి కావు. అమెరికాలో MS చేస్తున్నప్పుడు కూడా అంతే. అక్కడ జాబ్ లో జాయిన్ అయిన తరువాత అమెరికా చదువు కోసం ఇండియాలో తీసుకున్న లోన్లు తీర్చేదానిమీదే దృష్టి. వారాంతాల్లో డ్రైవ్ చేసుకుంటూ అమెరికా చూడటం అలా గడిచి పోయింది. ఇండియా వచ్చి సెటిల్ అయ్యాకా మా పేరెంట్స్ పెళ్లి అంటె ఒప్పుకున్నాను. మొదటి సంభందమే మీది. ఆ తరువాత నీకు తెలిసిందే.”

కాలేజీలో తన భర్త ఆర్ధిక పరిస్థితి విని కొంచెం చివుక్కుమన్నా నిజాయితీగా చెప్పడం, కష్టపడి స్వశక్తితో పైకి రావడంతో కొంచెం గర్వపడింది మనసులోనే.

సౌమ్య అంతటితో ఆపెయ్యకుండా, “ఇక్కడ కొచ్చి సెటిల్ అయిన తరువాత అయినా ప్రేమ వివాహం ప్రయతించలేదా? మీ పేరెంట్స్ ఒప్పుకోరనా?” అంటూ రెట్టించింది.

“లేదు. పెళ్లి విషయంలో నాకు పూర్తి స్వేచ్ఛ నిచ్చారు. వాళ్ళు సంభందం చూసినా అంతిమ నిర్ణయం నాదే. అందరికి నచ్చితే బాగుంటుందని వాళ్లనే చూడమన్నాను, అంతే.”

“అయితే ప్రేమ వివాహం అయితే అందరికి నచ్చదంటావు.” కూతురి మాటలతో తనలో ఏమయినా ఆ ఆలోచన ఉందా అన్న అనుమానం కలిగింది తల్లి తండ్రులకు.

“నేను అలా అని చెప్పలేదు. ఎవరికీ ఏ పద్దతి నచ్చితే అదే. నీ అక్క నేను సంతోషంగా ఉన్నాము కదా. కాకపొతే పెద్దవాళ్లకు అనుభవంతో అన్ని కోణాల్లో ఆలోచిస్తారు. తెలిసిన వాళ్ళతో వాకబు చేయించి మంచి చెడులు తెలుసుకుంటారు. నీ మాటను గౌరవించే తల్లితండ్రులు వున్నారు. నీకు ఎవరైనా దృష్టిలో ఉంటె పేరెంట్స్ తో కాని, లేకపోతె నీతో అతి సన్నిహితంగా ఉండే నీ అక్కతో కాని చర్చించి నిర్ణయం తీసుకో. మేమందరం నీ ఆనందాన్నే కోరుకొనేది.”

తమ మనసులో ఉన్న అనుమానం లాంటిందే అల్లుడికి కలిగిందా అని ఆశ్చర్యం పోయారు. కాని అల్లుడు చెప్పిన తీరు బాగా నచ్చింది.

“నీ మనసులో ఎవరైనా ఉంటె బావ చెప్పినట్టు మాతో నైనా చెప్పు, అక్కతోనైనా డిస్కస్ చేయి. మా సహకారం నీకు ఎప్పుడు ఉంటుంది.”అన్నాడు రాజారావు.

“అదేమీ లేదు నాన్న. బావ ఏమంటాడో అని పరీక్ష చేస్తున్న.”

“ఉద్యోగంలో జాయిన్ అవుతున్నావు. నీకు పెళ్లి సంభందాలు చూడ మంటావా?”అంది జానకి, ఆ వేడి మీదే కూతురి సమ్మతం తీసుకుందామని.

“బావ లాంటి వాడు దొరికితే నేను రెడీ”, అంది శ్రీరామ్ కేసి ఆరాధనగా చూస్తూ.
“మొదలు పెట్టండి నాన్న. ఎలాగూ సమయం పడుతుందిగా”, అంది అప్పటి వరకు మౌనంగా ఉన్న కావ్య.

నిద్ర వస్తుందని తమ గదిలోకి వెళ్లిపోయారు రాజారావు, జానకి. శ్రీరామ్ కూడా వెళ్ళిపోయాడు నిద్ర వస్తుందని.

“బావకు బోల్డంత డబ్బు వస్తుంది కదా! అక్కా ఏమిటీ స్పెషల్?” అని అడిగింది సౌమ్య.
“చెప్పు. నీకు ఏది కావాలంటే అది”
“నేనడుగుతుంది నా గురించి కాదు. ఈ రాత్రి బావకి స్పెషల్ ఏమిటి అని” అంది కొంటెగా నవ్వుతూ తగ్గు స్వరంలో.
“ఏయ్ నీకు బాగా బలిసిందే”, అంది చిరు కోపంతో వీపుపై చిన్నగా చరుస్తూ.
“నేను వెళ్తా. బావ ఎదురు చూస్తుంటాడు. నువ్వు కూడా పడుకో.”
“నీకేమిటే. బావతో ఫుల్ ఎంజాయ్ చేసి హాయిగా నిద్రపోతావు. నాకు ఎప్పటికి నిద్ర పట్టెను?”
“తొందరగా పెళ్లి చేసుకో. నీవు ఎంజాయ్ చేయొచ్చు.”
“ఎవరో ఎందుకు? బావనే చేసుకుంటే పోలా.”
“ఆ ఆశలు పెట్టుకోకు. నేను ఒప్పుకున్నా, నీ బావ ఒప్పుకునే రకం కాదు.” ఆ సంభాషణను అక్కడితో ఆపేస్తూ బెడ్ రూంలోకి వెళ్ళిపోయింది కావ్య.

*********************

176142cookie-checkఎవడే నీ అందాలను సొంతం చేసుకునే అదృష్టవంతుడు – ఎపిసోడ్ 12

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *