పీచు మిఠాయి రెండవ భాగ ము

Posted on

“నేను పంపిన కుర్రాడు ఆడదానికే వుత్తరం అందచేసానని అన్నాడు. ఆమె తన పేరు గౌరి అని కూడా అన్నదట. బహుశ మీ హాస్టల్ కు వచ్చే ఆడవాళ్ళలోనే ఈ పని జరిగి ఉండాలి. నీవు జాగ్రత్తగా ఆలోచించు. మీ హాస్టల్ కు పిల్లల్ని చూసేందుకు వచ్చే ఆడదెవరు? ” అని అడిగాడు వెంకట్.
గౌరికి వెంటనే శారద గుర్తుకు వచ్చింది. ఎక్కువగా అక్కడికి వచ్చే మనిషి ఆమే విషయం వెంకట్ తెలుసుకున్నాడు శారద అడ్ర సు కూడా తెలుసుకున్నాడు. “నీవు ఓ పని చేయి” అన్నాడు వెంకట్ గౌరితో
“ఏ మిటది?” అడిగింది గౌరి
“అతన్ని నీ దగ్గరకు రమ్మని వ్రాయి” అన్నాడు వెంకట్.
“영…”

“నేనతని భార్యను కలుసుకుంటాను. అతడు వ్రాసినట్లు బ్లాక్ మెయిలింగ్ లెటర్ చూపిస్తాను. భార్యా భర్తలు ఇరువురూ కలిసి బ్లాక్ మెయిలింగ్ లెటర్ వ్రాసారా లేక ఆమె భర్త మాత్రమే వ్రాశాడో మనకి తెలుస్తుంది. ఆ తరవాత నేను అతగాడికి తగిన బుద్ధి చెబుతాను అన్నాడు వెంకట్. అలాగే శారద భర్తకు తనను కలుసుకోవలసిందిగా లెటర్ వ్రాసింది. ఎక్కడ

కలుసుకోవాలో కూడా సూచించింది. ఆ రాత్రి శారద భర్త బయటకు వెళ్ళేవరకూ వెంకట్ ఆగి, రవి బయటకు వెళ్ళగానే తలుపు తట్టాడు.
శారద తలుపు తెరిచింది.
ఎదురుగా ఎవరో అపరిచిత యువకుడు కనిపించే సరికి క్షణ కాలం బెదరింది.
“ఎవరు నీవు? ” అని అడిగింది శారద వెంకట్ ని.
వెంకట్ అసలు విషయం చెప్పి, ఆమెభర్త గౌరి కి వ్రాసిన ఉత్తరం చూపించాడు.

“మేము తప్పు చేస్తున్నాము. బాగానే ఉన్నది. మీ ఆయన చేస్తున్నది న్యాయంగా ఉందా?” అనడిగాడు వెంకట్.
దీపం వెలుతురులో అతని ముఖం చక్కగా కనిపిస్తోంది. ఇరవై రెండేళ్ళ కుర్రాడు. చురుకైన కళ్ళు! చక్కటి ముక్కు. తడిదేరిన పెదాలు.
శారద వెంటనే చూపు దింపుకుని ” ఆయన ఆఫీసులో నైట్ డ్యూటీ ఉన్నట్టు చెప్పి వెళ్ళారు. ఇంటికి తిరిగి వచ్చాకా నేను ఆయన్ని మందలిస్తాను. మీరు వెళ్ళండి ” అంది.
వెంకట్ వెళ్ళిపోయాడు. అర్థ రాత్రి ఒంటి గంతకు శారద భర్త రవి ఇంటికి తిరిగి వచ్చాడు. శారద వెంకట్ వచ్చినట్టు చెప్పకుండా “ఇంతసేపూ ఆఫీసు పనేనా? ” అని అడిగింది.
“ఏం? ఎందు కొచ్చిందా అనుమానం? ” అన్నాడు రవి.
“ఎందుకు వచ్చిందో వచ్చింది. ఇంక దయ ఉంచి రాత్రుళ్ళు బయటకు వెళ్ళవద్దు ” అంది శారద.

ఆ మాటలు విన్న రవికి రోషం వచ్చింది.
“ఏం, నేను తిరుగుతున్నాననా? ” అన్నాడు రెట్టించి.
“ఏమో నేను మిమ్మల్ని రాత్రుళ్ళు వెళ్ళవద్దంటున్నానంతే. ” అంది శారద. బయట కు
“నోర్ముయ్. నువ్వు ఎవరివి నన్ను శాసించడానికి. నేను వెళతాను ” అన్నాడు రవి.
నిజానికి ఆ రాత్రి అతణ్ణి పది గంటలకు ఫలానా చోటికి రమ్మని గౌరి ఉత్తరం వ్రాసి ఒంటిగంట అయినా రాలేదు. ఆమెనుండి శారద భర్తకు ఒక ఉత్తరం అందింది.
“సారీ, రాత్రంతా మా ఆయన మెళకువగా ఉన్నాడు. బయలుదేరి వచ్చేందుకు వీలు కాలేదు. ఈ రాత్రికి తప్పకుండా వస్తాను. నీవు రా ” అని ఉంది.
అతడిలో మార్పు వచ్చిందో లేదో తెలుసుకునేందుకు గౌరి, వెంకట్ లు కలిసి తిరిగి ఆ ఉత్తరం వ్రాశారు. ఆ ఉత్తరాన్ని చూసుకుని రవి మహదానంద పడి పోయాడు.

శారద వద్దంటున్నా లెక్క చేయకుండా గౌరి కోసం వెళ్ళాడు.
అతడటు వెళ్ళగానే వెంకట్ శారదని కలుసుకుని ” ఇది మీకు న్యాయమా? మీ భర్తని ఆపుతామన్నారు గా అని ” అడిగాడు.
“చెప్పి చూశాను. మాట వినలేదు. అయినా మరోసారి చెప్పి చూస్తాను. నా మాట వింటారని అనుకుంటున్నాను. రేపు రాత్రి వచ్చి చూడండి. ఆయన మళ్ళీ వెళితే నన్ను కలవండి ” అంది శారద.
ఆ రాత్రి మళ్ళీ గౌరి రాలేదు సరికదా ఆ మర్నాడు మరో
ఉత్తరం పంపించింది. శారద భర్తకు “సారీ” అని, ఆ
రాత్రికి తప్పకుండా వస్తానని. రవి ఆ రాత్రి బాగా ముస్తాబై
బయలుదేరబోయాడు. శారద అతనిని ఆపింది. శతవిధాల
బ్రతిమిలాడింది. కాళ్ళమీద పడి వేడుకుంది. చివరకు
బెదరించి చూసింది. అయినా భార్యను లక్ష్య పెట్టకుండా
రవి వెళ్ళిపోయాడు.
ఇంకా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *