పార్టీ మొదటి భాగం

Posted on

పార్టీ మొదటి భాగం

ఈ కధ ఒక పాత మేగజైన్ లోనిది. రవి స్కేన్ చేసి పంపేరు. ఆ కధను తెలుగు లిపి లో పి డి ఫ్ గా మీకు అందిస్తున్నాము.
సిగరెట్ కాలుస్తూ పోర్టికోలో నిలబడి మైన్ గేటు వంక రెప్ప వాల్చకుండా చూస్తున్నాడు నారాయణ . పావుగంటనుంచీ అక్కడే నిల్చున్నాడు తను. టయిము రెండయింది. ఉదయమ్నుండీ ఆకాశం మేఘావృతమైయుంది. అప్పుడప్పుడు నాలుగైదు చినుకులు పడి రోడ్లు తడిచేలోగా మళ్ళీ ఆగి పోతున్నాయి. ఇప్పుడు కూడా సన్నగా జల్లు పడుతోంది. ఇదిప్పుడు ఏమాత్రం చిలికి చిలికి గాలి వాన ఐనా మొత్తం ప్రోగ్రాం అప్ సెట్ అయిపోతుందే మోనన్న ఆందోళన అతని మొహంలో స్పష్టంగా కనిపిస్తోంది.
పావు తక్కువ రెండు కల్లా థియేటర్ దగ్గరికొస్తానన్న సావిత్రి ఇంతవరకూ పత్తా లేదు. ఆఫీసుకి వెళితే మళ్ళీ ఆ టైముకు పర్మిషన్ దొరుకుతుందో దొరకదో అని ఏకంగా రోజంతా మట్టం కొట్టేసాడు తను. ఇప్పుడు సావిత్రి హేండ్

ఇచ్చిందంటే అనవసరంగా ఓ లీవ్ వేస్ట్ అయిపోతుంది. అసలు తన కజువల్ లీవ్ అంతా ఇల్లాంటి ప్రోగ్రాం లతోనే హరించుకు పోతోంది. ఈ సంవత్సరం అప్పుడే పది ఈ తరుగు పట్టేసాయి. ఇంకా నాలుగు నెలలు గడవాలి. వాటీజ్ దేర్, సి ఎల్ కాక పోతే ఇ ఎల్ వుండనే ఉంది. ఇలాంటి చాన్సులు రావాలే గాని లాస్ ఆఫ్ పే అయినా బాధ లేదు.
ఎవరో తనని పేరు పెట్టి పిలుస్తున్నట్టుగా అనిపించి గిరుక్కున తల తిప్పి చూశాడు. నీలమ్మ. బాల్కనీ బుక్కింగ్ అవతల గోడమూల నిలబడి నవ్వుతూ చేయి ఊపింది. గతుక్కుమంది నారాయణ కి . ఈ వేళప్పుడు ఇది తగులుకుందే మిటిరా నాయనా అనుకుంటూ బలవంతాన నవ్వు తెచ్చుకుని దగ్గరకు వెళ్ళాడు.
ఏమిటి ఆఫీసుకు వెళ్ళలేదా నవ్వుతూ అడిగింది నీలమ్మ.
లేదు వంట్లో కొంచెం నలతగా ఉంటే ఆఫీసు మానేసాను. కాని రూం లో ఒంటరిగా కూర్చోవడనాకి బోర్ అని పించి సినిమాకయినా పోదా మని ఇలా వచ్చాను. నువ్వూ
ఒక్కదానివే వచ్చావా అన్నాడు నారాయణ.

అబ్బే మనింటి చుట్టు ఇంకా నలుగురున్నారు. మేము వచ్చి ఐదు ని ముషాలయింది. టిక్కెట్లు తీసుకోడానికి వెళుతూ నిన్ను చూశాను. అప్పుడు కేక వేయడ మెందుకని వాళ్ళతో పాటు లోపలికి వెళ్ళిపోయి మళ్ళా పాసు తీసుకుని బయటకు వచ్చాను అని ఓ సారి అతని వంక ఎగా దిగా చూసి కొంచెం తగ్గు స్వరంతో ఏమిటీ బొత్తిగా కనపడ్డమే మానేసావ్. ఓ సారొచ్చి కనుపించి వెళ్ళమని మూడు నాలుగు సార్లు గంగాధరంతో నీకు కబురు పంపించాను. నువ్వు అటు వైపొచ్చి రెండు నెలలు కావస్తోంది. అన్ని సార్లు కబురు పంపినా జాడా జవాబు లేదంటే నా మొహం చూడ్డం నీకిష్టం లేదేమో అనుకోవాల్సొచ్చింది అంది నీలమ్మ నిష్టూరంగా.
ఛ తల అడ్డంగా ఊపాడు నారాయణ. ఈ మధ్య గంగాధరం చాలా సార్లు కనిపించేడు కాని ఎప్పుడూ ఈ మాట చెప్పలేదే. నువ్వు కబురు పంపించిన తర్వాత నేను రాకుండా వుంటానని ఎలా అనుకున్నావ్. ఎప్పుడైనా సరదాగా ఓ మాటు నీదగ్గర కొద్దామని పది రోజులుగా నేనూ అనుకుంటున్నాను. కాని టైము చిక్కడం లేదు. పనీ లేదు తీరుబడీ లేదు అన్నట్లుగా ఉంది. వ్యవహారం………..అన్నాడు నారాయణ.

రేపు ఆఫీసుకు వెళ్ళకపోతే ఏదో టైములో అలా వచ్చేస్తే సరీ అంది నీల మ్మ.
అబ్బే రేపు ఆఫీసు మానడం కుదరదు. వీలయితే ఆఫీసునుంచి వచ్చేటప్పుడు వస్తాను. ఏమిటో. నేను మాటి మాటి కీ రావడం గంగాధరం భార్య చూసి ఏమనుకుంటుందోనని సందేహిస్తున్నాను గానీ లేకపోతే ఈ పాటికి తొంబై సార్లు వచ్చేవాడిని.
మంచోడివే….అదె వరో ఏదో అనుకుంటుందని నువ్వు రావడం మానెయ్య మేమిటీ అనుకుంటే అనుకోనీ. నాకు లేని భయం నీకెందుకు. అయినా ఆ తంటసం నువ్వు తెచ్చి పెట్టిందే. హాయిగా నువ్వే అందులో ఉండి వాడినే వేరే ఇల్లు చూసుకు పొమ్మంటే ఇప్పుడీ గొడవే ఉండేది కాదు. స్నేహితుడు కష్టపడిపోతాడని నీ అంతట నువ్వే బయట్కు జారుకున్నావ్. ఉండు. ఇంటికి వెళ్ళాకా ఆ గంగాధరం గాది సంగతేమిటో కనుక్కుంటాను. నా కబురు నీతో చెప్పానని ఎప్పటికప్పుడే బొంకేస్తున్నాడు. దొంగ వెధవ. అసలు సంగతి నాకేం తెలుసు. నిజమే కాబోసనుకుని న మ్మేసేదాన్ని….అంది నీలమ్మ.

పోనీలెద్దూ ….ఎవడి ఏడుపు వాడినే తినేస్తుంది. రేపు తప్పకుండా వస్తాగా అన్నాడు నారాయణ.
మరిచి పోకూడదు మరి ….నాలుగ్గంటల నుంచి నీకోసం ఎదురు చూస్తుంటాను… అని ఓ క్షణం ఆగి అతని మొహం లోకి చూస్తూ ఇందాకట్నుంచీ ఆ పచ్చ చీర కట్టుకున్న కుర్రది ఇక్కడిక్కడే తచ్చాడుతోంది. అనడిగింది నీలమ్మ. నీకోసమా
గమ్మున తల తిప్పి ఆ ప్రక్కకి చూశాడు నారాయణ. నిజమే. ఓ పది గజాల దూరంలో నిలబడి ఇటే చూస్తోంది సావిత్రి…….అతనటు చూసీ చూడ్డంతోనే శాస్ర్తీ ఎవరు ఆ అన్నట్టు కళ్ళతోనే ప్రశ్నించింది. వస్తానుండ మని వేయి చూపించి నీలమ్మ వైపు తిరిగాడు. ఆ కను సైగలు కనిపెట్టిన నీలమ్మ మొహం ఆముదం తాగినట్టు పెట్టింది. అసూయనాపుకోలేక పొట్టిగా ఉన్నా పొందికగా బాగానే ఉంది, ఎవరా మని షి అనడిగేసింది నీలమ్మ నారాయణ ని. ని
మా ఇంటి దగ్గరావిడే…. పేరు సావిత్రి. …. మొగుడు కొంచెం జబ్బు మనిషి. ఈ మధ్యనే మా ఇద్దరికీ కలిసింది. సినిమాకి వెడదామని ఉదయం తనే కబురు పంపించింది.

మరీ రేపు సాయంత్రం వచ్చి కలుస్తాను గంగాధరాన్ని ఇంకే మీ అడక్కు గడ గడా చెప్పేశాడు నారాయణ .
సరే…..వస్తాను…. ఓసారి సావిత్రి వంక తేరిపార చూసి ఆడవాళ్ళ గేటు వైపు నడక సాగించింది నీలమ్మ.
ఆమె అలా వెళ్ళడం తోటే సావిత్రి అతనికి దగ్గరగా వస్తూ ఎవరా బొండాం అనడిగింది. నీలమ్మకి వళ్ళున్న మాట నిజమే, కాని ఆ వళ్ళుకు తగ్గ ఎత్తు కూడా వుండటం చేత అంత లావుగా ఏమీ అనిపించదు. సావిత్రి కావాలనే ఆమెన బొండాం అన్నందుకు నారాయణకి నవ్వు వచ్చింది.
ఇదివరకూ నేను ఆవిడ ఇంట్లోనే ఉండే వాడిని. చాలా గా అభి మానం గా చూసేది. ఆ ఇంట్లో గాలీ వెలుతురూ సరిగ్గా వుండక నేనే ఖాళీ చేసి వచ్చేసాను. అప్పట్నుంచి మళ్ళీ ఆ ప్రక్క వెళ్ళలేదు. ఆ ఇంటి దగ్గర వాళ్ళతో తనూ ఈ సినిమాకే వచ్చిందట. నీకోసం నేనిక్కడ నిలబడటం చూసి ఊరికే పలకరించడాని కొచ్చింది అన్నాడు నారాయణ సావిత్రితో.
కను పాపలు గుండ్రం గా తిప్పింది సావిత్రి. విరుచుకు మాటి మాటి కీ ఆ బోర పైట.
.

సవరించుకోవడం మాట్లాడుతున్నంతసేపు నీ వంక అదోలా చూడడం ఇదంతా చూస్తే ఆవిడ వూరికే పలకరించడానికి వచ్చినట్టు లేదు. ఎలా లేదన్నా తనకి నలబై ఏళ్ళుంటాయి. పెద్ద పిట్టనే పట్టావ్ అని వెటకారంగా అంది సావిత్రి నారాయణ తో.
ఛా అదే మీ కాదు అని టాపిక్ మార్చేసాడు నా రాయణ.
నువ్వు రావడం నేను గమనించనే లేదు. రా. హాయిగా హాలులో కూర్చుని మాట్లాడుకుందాం అన్నాడు నారాయణ సావిత్రితో.
జేబులోంచి పర్సు బయటికి తీస్తూ బుకుంగ్ వైపు దారి కి తీసాడు నారాయణ. మాట్లాడకుండా అతన్నను సరించింది సావిత్రి.
ఇంకా ఉంది.

7424910cookie-checkపార్టీ మొదటి భాగం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *