రన్ – భాగం 1

Posted on

అని అడిగి నవ్వింది అప్పుడు రాజా కీ కోపం ఇంకా ఎక్కువ అయ్యింది అప్పుడు పక్కన ఉన్న బర్త్ డే పార్టీ వాళ్ల వైపు చూసి “రేయ్ ఏంట్రా మీ గొల్ల బర్త్ డే అయితే ఇంట్లో చేసుకొండి అంతే కానీ ఇలా పబ్లిక్ ప్లేస్ లో ఏంటి మీ గొల్ల ఆ చేసుకునేది అయిన సరిగా చేసుకున్నార మొత్తం మోహలకు పూసుకుంటారు తినేదాని తినడానికి పూసుకొవాలి ఏ ఇలా కాఫీ షాప్ లోనే చేసుకోవాలా ఇంట్లో చేసుకుంటే బర్త్ డే కాదా అయిన ఆ బయటకు చూడు అక్కడ ఎంత మంది పిల్లలు తిండి లేక రోడ్డు మీద ఆడుకుంటూ ఉన్నారో మీకు ఎక్కువ అయితే వాళ్ళకి ఇవ్వండి అంతే కానీ వేస్ట్ చేయేదు

” అని అరిచాడు దానికి ఆ బ్యాచ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు అప్పుడు రాజా కొంచెం కూల్ అయ్యాడు ఆ తర్వాత నవ్వుతూ రీతిక వైపు చూసి “ఏమైనా ఆర్డర్ ఇద్దామా ” అని అడిగాడు దానికి రీతిక షాక్ లో రాజా వైపు చూసింది ఇంత సేపు నా పేరు సూర్య లో అల్లు అర్జున్ లా ఉన్న వాడు సడన్ గా ఆర్య 2 లో మిస్టర్ ఫర్ ఫెక్ట్ గా మారిపోవడం చూసి ఆశ్చర్య పోయింది.

రాజా, రీతిక వైపు చూసి “హో సారీ నాకూ కొంచెం కోపం, చిరాకు ఎక్కువ ఎప్పుడు ఎలా ఉంటానో నాకే క్లారీటి లేదు అందుకే లైఫ్ లో పెళ్లి వద్దు అని డిసైడ్ అయ్యా చూశారు కదా పది నిమిషాలు నను భరించలేక పోయారు లైఫ్ లాంగ్ ఎలా భరిస్తారు అసలు నా లాంటి వాడిని ఏ అమ్మాయి ఇష్ట పడుతుంది” అని చెప్పాడు రీతిక అప్పుడే వచ్చిన వేడి వేడి కాఫీ నీ ఒక గుటక లో తాగేసి “పది నిమిషాల్లో పది థ్రిల్లింగ్ సినిమా లు చూపించావు ఏదో మా నాన్న చెప్పాడు కాబట్టి వచ్చాను కానీ నువ్వు ఇంత తిక్కలోడివి అనుకోలేదు ” అని చెప్పింది దానికి రాజా కీ మళ్లీ కోపం వచ్చింది

రాజా : నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా

రీతిక : ఉండేవాడు ఇప్పుడు బ్రేక్ అప్ అయ్యింది

రాజా : ఎందుకు

రీతిక : వాడు అమెరికా వెళ్లి సెటిల్ అవుదాం అన్నాడు కానీ నాకూ మా ఫ్యామిలీ వదిలి వెళ్లడం ఇష్టం లేదు

రాజా : మరి నన్ను ఎందుకు చూడడానికి వచ్చావు

రీతిక : అమెరికా లో ఇప్పుడు అందరూ తిరిగి వస్తూన్నారు కదా నువ్వు ఎలాగో వెళ్లలేవు కాబట్టి ఒక ట్రైల్ వేదాం అని

రాజా : నేను ఏమైన డ్రస్ ఆ ట్రైల్ వేయడానికి

రీతిక : నీకు స్మోకింగ్, డ్రింకింగ్ అలవాటు లేదు అమ్మాయిలను చూడను కూడా చూడవు అంటా మా డాడీ చెప్పారు కాబట్టి నువ్వు మా ఫ్యామిలీ కీ కరెక్ట్ అని

ఫ్యామిలీ అనే పదం వినగానే రాజా కీ మళ్లీ కోపం సర్రున పాకింది దాంతో లేచి తన ఛైర్ నీ కాలితో తన్ని “నీకు ఏమైనా పిచ్చా రేపు పెళ్లి అయితే కాపురం చేసేది నువ్వా నీ ఫ్యామిలీ ఆ ఏదో వీళ్ల నాన్న చెప్పాడు అంట ట్రైల్ వేయడానికి వచ్చింది అంట, మీ బాబు వాడికి స్మోకింగ్, డ్రింకింగ్ అలవాటు లేదు అని చెప్పాడు అని వచ్చావు అంటే నా కారెక్టర్ సర్టిఫికేట్ చెప్పడానికి నీ బాబు చూడాల్సింది నా బ్యాక్ గ్రౌండ్ హిస్టరీ కాదు నా గూగుల్ హిస్టరీ, అబ్బాయి, అమ్మాయి గురించి పక్కింటి వాళ్ళని, చూట్టాలను అడిగే రోజులు పోయాయి అబ్బాయిలను గూగుల్ హిస్టరీ చూసి, అమ్మాయిలను Instagram స్టోరీలు చూసి సెలెక్ట్ చేసుకున్నే రోజులు వచ్చాయి చెప్పు మీ బాబు కీ నాన్న ఇంకో సారి నాకూ మొగుడిని వెతికే ముందు వాడికి ఏదవ అలవాట్లు ఉన్నాయా లేదా అని కాదు ముందు వాడికి బుర్ర సరిగా ఉందా లేదా అని ఎంక్వయిరీ చెయ్యి అని చెప్పు ” అని కోపంగా అరిచి బిల్ కట్టి వెళ్లిపోయాడు.

191220cookie-checkరన్ – భాగం 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *