శష్ప విజయము

Posted on

విజయ మను ఈ కావ్యమును రచియించిన వాడు పాండురంగ విభుడగు కవి దిగ్గజము తెనాలి రామ కృష్ణుడు. అతని గూర్చిన గాధలెరుగనివారు ఆంధ్రులలో ఉండరు గదా.
అష్ట దిగ్గజములలో నొకండై పరదేవతానుగ్రహమున పండిత మన్యులకు ప్రక్కలో బల్లెమై రసిక ప్రభుండునగు ఆంధ్ర భోజుని ఆస్తానము ధోరణుల వాణిని నలంకరించిన లాసింపజేయునా మహా కవి ఇట్టి కావ్య చాందసులు సందియం పడక మానరు. కాని రామ కృష్ణుని ఉభయ ధారా నిశితమగు ప్రతిభకు జోహారులిడు కావ్యవినోదులీ రచనను ఏమాత్రము ఏవగింపక అది ఒక అనన్య సామాన్యమును, అనితర సాధ్యంబునగు కావ్య సిద్ధినిగా గణుతించుకొనగలరు.కొంటె కోణంగి యగు నాతడే కాక అన్యుడెవ్వడిట్టి పనికోపగలడు? విజయ రచనమును గూర్చి ఒక యాభాణ క ము ప్రసిద్ధ ముగానున్నది. నెల్లూరి మండల ముంబైనీని మెల్లి యనియెడు మాల సాని కృష్ణరాయలు విద్యానగరమును పరిపాలించుచునుండిన కాలమున నున్నది. అది రసికుల

కడనుండి దోచుకొనిన ధనముతో ముది మికెదిగినపుడు దాన ధర్మములు విరివిగా చేయుచు, నెవ్వడో యనుకూలుని హెచ్చరికను సప్త సంతానములందు నుత్తమమగు కృతినొంది తన నామము చిరస్థాయిగానుండ నిలుపుకొనవలయునని, కవి రాజధానియగు విద్యానగరమునకు బోయి, యచ్చటి కవుల నెల్ల నాశ్రయిం పజొచ్చినది.
కాని పెద్దనాదులామె కోరికను మన్నింపక మీదు మిక్కిలి తిరస్కరించిరి. రామకృష్ణుడు మాత్రమటులగాక యా జగజంత కోరినటులుగా దనకు దోచిన ” శష్ప విజయము “ను రచియించి ఇచ్చెనట. అది యుప్పొంగి పోయి యనభిజ్ఞురాల గుట నందలి యపహాస్యమెఱుంగలేక, అమాయక పు గ ర్వ ముతో, దలచినదానిని సాధించితినన్న మెఱ మెచ్చున కా గ్రంధమును తక్కుంగల కవులకు జూ పింప బోవగా,
వారు చదివి చూచి కడుపుబ్బ నవ్వుచూ ” రామ కృష్ణుడు నీకు తగిన శాస్త్రి యొనరించి తగినటుల బుద్ధి చెప్పినాడు. వెట్టిదానా! ఇంక నామము, కావ్యము దుర్వశ ముతో పాటు కలకాల ము తెలుగునాటను నిలువగలదులే పరిహసింపగా, నామె భిన్నమై మరల రామ కృష్ణుని దర్శించి ” మిమ్మల్ని నమ్మి వచ్చినందులకు, నా బ్రతుకిటులు నాఱడి సేయ నగునా? ” అని విలపించిందట.

వికటకవి చిరునవ్వుతో సా సమాశ్వసించి, అసూయాపరుల వాక్యంబుల నీవు లెక్కగొన రాదు. తమకా గౌరవము దక్కినది కాదు కదా యన్న యుత్ఫ్కశ ముతో నా వంచకులిటుల నిన్ను గలవరపరచినారు. మంచిది. దాని కి తగిన ప్రతి క్రియ నొనర్చెదను. ఇక మీద నెవడేని యేమైన కాని మాటలాడునో, చదివి యభి నందించునో చూతువు కాని ” యని
కం : ఒప్పగ బైసీనెల్లి కి
కప్పన గంధికిని నిత్య ! కల్యాణికి నే జెప్పిన కవితము నిప్పుడు దప్పన్నను దాని సాదు ! దాగిన కొడుకే
୪ పద్యమును జేర్చి భయంబుడి పి పంపెనట. చదివినవాడెవ్వడును గాని నిక నోరెత్తుటకు వీలుపడదు గదా !రామ కృష్ణుని పేరు వ్యాప్తిలోనున్నంత కాల ము వాక్కప్రతిహత ము. అతని శాపము తిరుగు లేనిది.
కావ్యరచనావ్యాజంబున, భూసురుల కంతటి యప్రతిష్టం దెచ్చిన వాడు బ్రాహ్మణేతరుడేమోనని సహృదయులు శంకింతురేమో. కూడదు. తన జాతిని దూయబెట్టు కొనుచునైన ప్రతిష్ట నిలుపుకొనగలిగిన సామర్ధ్యము, ఔదార్యము అగ్రవర్ణుడగు భూసురునికే తెగడేడి గలదు. తక్కువ వారలవలె నాతడన్యుల న్యూనతకు బాల్పడడు. చన వున్నచోట, స్వాతంత్య్రమున్నచోటనే నాతని కావ్య వాణి తీయందనపు చుఱుకు లందగించును.
శష్ప విజయమును రచియించినది తెనాలి రామ కృష్ణుడే! అన్యుడంతకు పూనుకొననోపడు. విజయము అఖండిత కీర్తిని గణించుకొన్నది. ఏతత్కర్తృక ము గానే
దీని గూర్చి వినని వారుండరు. ఒక పద్యమేని కొన్ని పాద ములేని వర్ణించని వారుండరు. కాని, సమగ్ర ము గాజదువనోచినభాగ్యశాలురు సారస్వతోపాసకులలో వేయింటనొక్కరైన యుందురో లేదో ? గ్రంధ ము
నేటి కా దీర్చి అందరకు విజయంబు అందుబాటులోని కి రాగల భాగ్యము మాకీ నాటి కి
దక్కినందులకు ధన్యుల ము.
ఇంకా ఉంది.

755619cookie-checkశష్ప విజయము

1 comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *