జానకిరాముడు

Posted on

నాలుగు నెలలు గడిచేసరికి అమ్మకి పుస్తకాల పిచ్చి బాగా ముదిరిపోయింది. ఇంతకు ముందు ఖాళీ సమయంలో మాత్రమే చదివేదా, ఇప్పుడే పొద్దస్తమానం అదే ధ్యాస. రోజూ మామయ్య ఏదో ఒకటి తెచ్చివ్వటం, ఈమె చదవటం. ఒక్కోసారి ఆయనింట్లో లేకపోయినా తనే ఆయనింట్లోకెళ్లి తెచ్చుకునేది. పైభాగం తాళాలు ఎప్పుడూ అమ్మ దగ్గరే ఉండేవి. మామయ్య బయటికెళ్లేటప్పుడు వాటిని అమ్మకిచ్చి వెళ్లేవాడు. నా క్లాసు పుస్తకాలు చదవాలంటేనే నాకు విసుగు. అలాంటిది అమ్మ అన్నన్ని పుస్తకాలెలా చదువుతుందో నాకసలు అర్ధమయ్యేది కాదు. మొదట్లోలా కాకుండా ఇవి చిన్నగా ఉండేవి.

ఇంతకు ముందు పుస్తకాలు ఎక్కడపడితే అక్కడ వదిలేశేది, ఈ మధ్య వాటిని నాక్కూడా భద్రంగా బీరువాలో పెట్టటం మొదలెట్టింది. ఒక సారి నేను దేని కోసమో బీరువా తెరవబోతే కోప్పడింది. అప్పటి నుండి బీరువా తాళాలు తనతో పాటే ఉంచుకోవటం మొదలెట్టింది. పుస్తకాలు బీరువాలో పెట్టి తాళమేస్తున్నావెందుకు అని ఒక సారడిగితే, ‘అవి మామయ్యవి కద నాన్నా. జాగ్రత్తగా తిరిగిచ్చేయాలి కదా. ఇంతకు ముందు ఒకట్రెండు పుస్తకాలు పోయాయి. అందుకే జాగ్రత్త చేస్తున్నా’ అంది. అవును కాబోలనుకున్నా నేను. ఇంకో సారి ఆమె చదువునుకునేటప్పుడు నే వెళ్లి నీతో పాటు నేనూ చదువుతా అనడిగితే చప్పున పుస్తకం మూసేసింది.

ఆనక ముసి ముసిగా నవ్వుతూ, ‘ నాన్నా, నీకిప్పుడే ఈ పుస్తకాలర్ధం కావులే. నువ్వు పెద్దాడివయ్యాక చదువుదువు కానీ ‘ అని బుగ్గ మీద ముద్దు పెట్టింది. అప్పుడెందుకో అమ్మ సిగ్గు పడినట్లనిపించింది నాకు. కానీ ఆ మాట చెప్పటానికి సిగ్గు పడటమెందుకో అర్ధం కాలేదు నాకు. అప్పటి నుండీ అమ్మ నా ఎదురుగా చదవటం తగ్గించేసింది. ఎక్కువగా బెడ్ రూం లో తలుపు వేసుకుని చదువుకుంటుండేది.

మామయ్య మా ఇంట్లో చేరాక ఐదు నెలలకనుకుంటా, నాకు వేసవి కాలం సెలవలు నడుస్తున్నాయప్పుడు. నాన్న సెలవు మీద వచ్చి తిరిగి వెళ్లిపోయి వారమవుతుంది. ఏమయిందో ఏమో కానీ అమ్మ మామయ్యతో మాట్లాడటం మానేసింది. ఆయన పేరెత్తితే కసురుకుంది ఒకట్రెండు సార్లు. మామయ్య కూడా భోజనానికి రావటం మానేశాడు. కానీ అమ్మని ఎలాగోలా మాట్లాడించటానికి ప్రయత్నించేవాడు. ఆమె మాత్రం ముక్తసరిగా సమాధానమివ్వటమో, మౌనంగా ఉండటమో చేసేది.

వీళ్లకేమయిందో నాకర్ధం కాలేదు. సుమారు పదిరోజుల పాటు సాగిందా తంతు. మొదట్లో నాకిది వింతగా అనిపించినా తరువాత పట్టించుకోవటం మానేశాను. వేసవి సెలవలు కదా. పగలంతా ఆడుకోటానికే తీరికుండేది కాదు నాకు. ఇక వీళ్ల గురించి ఆలోచించే టైమేదీ?

పది రోజుల తర్వాత పరిస్థితిలో ఒక్కసారిగా మార్పొచ్చినట్లనిపించింది. ఆ రోజు సాయంత్రం ఆటలు ముగించి ఇంటికెళ్లేసరికి ఇద్దరూ మా హాల్లో సోఫాలో పక్క పక్కనే కూర్చుని నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. అది చూసి కాస్త ఆశ్చర్యపోయాను కానీ, అంతకన్నా ఎక్కువ ఆనందపడ్డాను. నన్ను చూసి కాస్త దూరం జరిగి కూర్చున్నారిద్దరూ. ఆ రాత్రి మామయ్య మళ్లీ మా ఇంటికి భోజనానికొచ్చాడు. అమ్మ ఇంతకు ముందుకన్నా ప్రేమగా కొసరి కొసరి వడ్డించిందాయనకా పూట.

మరునాడు అమ్మ ఉదయం నుండీ చాలా హుషారుగా కనిపించింది. ఆ రోజామె ఎప్పటికన్నా అందంగా కూడా కనిపించింది. బహుశా కొత్త బట్టలు కట్టుకోవటం వల్లనుకుంటా. ఆ రాత్రి భోజనాలయ్యాక నేను నా రూం లో కూర్చుని ఏవో బొమ్మలు గీస్తున్నాను. కధల పుస్తకాల్లోంచి నాకు నచ్చిన బొమ్మలు కాపీ చేయటం అప్పట్లో నాకో సరదా. తొమ్మిది కావస్తుందప్పుడు. హాల్లో అమ్మా మామయ్యా మెల్లిగా ఏదో మాట్లాడుకుంటున్నారు.

కొంచెం సేపయ్యాక అమ్మ మెల్లిగా నా గదిలోకొచ్చింది, ‘ఏం చేస్తున్నావురా నాన్నా?’ అంటూ. నా పక్కన నిలబడి నే గీస్తున్న బొమ్మకేసి చూసింది కాసేపు. తరువాత ‘మొన్న సినిమాకెళ్తానన్నావుగదా. మామయ్య సెకండ్ షోకెళుతున్నాడు. నువ్వూ వెళతావా?’ అనడిగింది. ఎగిరి గంతేశాన్నేను. అమ్మ సినిమాల విషయంలో చాలా స్ట్రిక్ట్. నెలకో సినిమాకన్నా నన్ను పంపించేది కాదు అప్పట్లో. అలాంటిది తనే స్వయంగా సినిమాకెళతావా అనడిగేసరికి వెంటనే చేస్తున్న పని ఆపేసి రెడీ అయిపోయా. కాసేపట్లో మామయ్య బైక్ మీద ఎక్కించుకుని సినిమాకి తీసుకెళ్లాడు.

106506cookie-checkజానకిరాముడు

3 comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *