జానకిరాముడు

Posted on

అదే సమయంలో నాన్న రెండు వారాలు సెలవు మీదొచ్చి ఇంట్లోనే ఉన్నాడు. చిన్న పిల్లాడితో అమ్మ ఒక్కటే ఉండటం కష్టమని, భయం లేకుండా ఉంటుందని అమ్మా నాన్నా ఇద్దరూ కలిసి దిలీప్ మామయ్యని కూడా మా ఇంట్లోనే ఉండమని బతిమిలాడి ఒప్పించారు.

నాన్న చీఫ్ ఇంజనీర్ కావటం వల్ల ప్రభుత్వం వారిచ్చిన పెద్ద బంగళాలో ఉండేవాళ్లం మేము. అందులో అన్ని వసతులూ ఉండేవి. ఇంటి ముందు భాగంలో చాలా ఖాళీ స్థలం, అందులో ఒక పూల తోట ఉండేవి. తోటలో ఒక మూలన చిన్న కొలను, దాని పక్కనే ఒక ఫౌంటెన్ కూడా ఉండేవి. కొలన్లో ఎప్పుడూ నాలుగైదు బాతులు తిరుగుతూ ఉండేవి. ఆ తోట పని కోసమే ప్రత్యేకంగా ఒక పని వాడు ఉండేవాడు.

ఇక ఇంటి విషయానికొస్తే, అది చాలా పెద్దగా ఉండేది. మొత్తం రెండస్తులుండేవి. కింద భాగంలో విశాలమైన హాల్, రెండు బెడ్ రూములు, ఒక స్టడీ రూం, కిచెన్ ఉండేవి. బెడ్ రూంస్ లో ఒక దానికి అటాచ్డ్ బాత్ రూం ఉండేది. అది అమ్మా నాన్నల మాస్టర్ బెడ్ రూం. రెండో బెడ్ రూం ని గెస్ట్ ల కోసం వాడేవాళ్లం.

స్టడీ రూం నా రూం కింద లెక్క. గెస్ట్ ల కోసం విడిగా ఒక బాత్ రూం ఇంటి వెనుక ఉండేది. పై అంతస్తు పెంట్ హౌస్ లాగా ఉండేది. అందులో ఒక కిచెన్, ఒక పెద్ద హాల్, దానికి అటాచ్ చేసి ఒక బాత్ రూం ఉండేవి. ఇంటికి కుడివైపు నుండి పైకి మెట్లుండేవి.

నాన్న రాజస్థాన్ వెళ్లాక వారం తిరిగేలోపు దిలీప్ మామయ్య మా ఇంటి పైనున్న పెంట్ హౌస్ లో చేరిపోయాడు. అతనొచ్చిన తరువాత అమ్మ దిగులు క్రమంగా తగ్గిపోయింది. దిలీప్ మామయ్య కూడా అమ్మ ఫేవరెట్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ లో పి. జి. చేస్తున్నాడు. దాంతో ఇద్దరూ ఖాళీ దొరికినప్పుడల్లా రక రకాల ఇంగ్లీష్ పుస్తకాలు చదివి వాటి గురించి తెగ డిస్కస్ చేస్తుండే వాళ్లు. నేను మరీ చిన్న పిల్లాడిని కావటం వల్ల నాకు వాళ్ల గోల అసలు అర్ధమయ్యేది కాదు. నాకర్ధమయిందల్లా, అమ్మ ఇప్పుడు ఇంతకు ముందులా పెద్దగా దిగులు పడటం లేదని.

దిలీప్ మామయ్య అమ్మకి ఇంటి పనుల్లో చాలా సహాయం చేస్తుండే వాడు. ఆయనకో మోటార్ బైక్ ఉండేది. దాని మీద నన్ను స్కూల్ కు తీసుకెళ్లి వదిలి పెట్టటం, ఇంటికి తీసుకు రావటం చేస్తుండే వాడు. అప్పట్లో నా క్లాస్ మేట్స్ అంతా స్కూల్ కి నడిచో, వాళ్ల నాన్నల సైకిళ్ల మీదనో వచ్చేవాళ్లు. నేను అలా మోటార్ బైక్ మీద రావటం చూసి వాళ్లు కుళ్లుకునేవాళ్లు. అది నాకు కాస్త గర్వంగా ఉండేది. ఆ కారణంగా దిలీప్ మామయ్యంటే నాక్కూడా ఇష్టం ఏర్పడింది.

మామయ్య మొదట్లో మెస్ లో భోజనం చేసేవాడు. మా ఇంట్లోనే తినమని అమ్మ ఎంత చెప్పినా ఒప్పుకోలేదు. మా ఇంటికొచ్చిన నెల రోజులకనుకుంటా, ఆయనకి ఫుడ్ పాయిజనింగై వారం పాటు మంచాన పడ్డాడు. దాంతో అమ్మ బాగా కోప్పడి అతనితో మెస్ మాన్పించేసింది. అప్పటి నుండి తను కూడా మా ఇంట్లోనే భోజనం చేసేవాడు.

అమ్మా, మామయ్యా ఇంగ్లీష్ లిటరేచర్ గురించి తెగ డిస్కస్ చేసుకుంటుండేవాళ్లని చెప్పానుగదా. అమ్మ ఆయన దగ్గర నుండి చాలా పుస్తకాలు తెచ్చుకుని ఖాళీగా ఉన్నప్పుడు చదువుతూ ఉండేది. వాటిలో ఒకట్రెండు నేను కూడా చదవబోతే నాకొక్క ముక్కా అర్ధం కాలేదు. చాలా లావుగా ఉన్నాయా పుస్తకాలు. ఇంత పెద్ద పుస్తకాలెలా చదువుతారని అమ్మనడిగితే ఆమె నవ్వి నా బుగ్గ మీద ముద్దు పెట్టుకుని ‘పుస్తకాలు చదవటం చాలా మంచి అలవాటు నాన్నా. ఇప్పుడలాగే అనిపిస్తుంది కానీ నాలుగేళ్లు పోతే నీకూ అర్ధమవుతాయిలే’ అనేది.

106506cookie-checkజానకిరాముడు

3 comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *