కలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 6

Posted on

“అన్నా అంతా కొత్తోల్లు ఈ ఉరి వాళ్ళు కాదు , అంటూ వాళ్లతో పాటు నేను నా కారు దగ్గరికి వెళ్లాను” నా కార్లో ముందు రాజి , వెనుక రమణికి , శాంతా కి మద్యన యశోద కుచోంది. వాళ్ళు వో సారి కార్లోకి వెనుక సీట్లో తొంగి చూసి.

“అన్నా , యశోదా ఈ కార్లో ఉంది అంటూ కారు డోరు దగ్గరకు వెళ్ళాడు”. అంటే వీళ్ళు యశోద కోసం వచ్చారా ? పేరుకూడా చెపుతున్నాడు అంటే తెలిసిన వాళ్ళా అనుకుంటూ.
“ఎవరూ కావాలన్నా ఆ అమ్మాయి ఈ ఉరమ్మాయి, ఎవరిని చూసి ఎవరను కుంటున్నారో ఉండండి మీకు ఎవరు కావాలి” అంటూ తనను డోర్ తీయ కుండా అడ్డు కున్నాను.

“రేయ్ , డ్రైవర్ నాకోడుకువి , నీకెందుకూరా మా గొడవలు ,మా పనేదో మేము చేసుకొని పోతాము నోర్ముసుకొని ఉండు , లేదంటే నిన్ను లేపేసి ఆ తరువాత ఆ పిల్లను తీసుకోని వెళతాము ” అంటూ ఇందాకా జీపు దగ్గర నాతొ మాట్లాడినతను వచ్చాడు అయన వెనుక ఇటువైపు ఓ 5 మంది కారుకు అటు వైపు ఓ నలుగురు వచ్చారు. శాంతా కారు లాక్ చేసుకో అంటూ వాళ్ళ మింది కలబడాను. నేను ఉన్న వైపు చాలా ఇరుకుగా ఉంది వాళ్ళు అందురు గుంపుగా వచ్చి మీద పడ్డారు. నాలుగు ముష్టి ఘాతాలతో ఇద్దరి ముక్కు మొఖం కలిపేశాను. ముక్కుల్లోంచి రక్తం కారు తుండగా తమ దగ్గర కర్రలు ఉన్న సంగతి అప్పుడు గుర్తుకు వచ్చి వాటిని నా మీద ప్రయోగించారు. వాటిని చేతులతో అడ్డుకొంటూ మిగిలిన వాళ్ళను ఎటాక్ చేస్తుంటే, కారుకు అటు వైపు వున్నాఇద్దరు కర్రలతో వచ్చి నేను గమనించే లోపున ఫట్ మంటు నా తలమీద కర్రతో కొట్టారు. తల చిట్లి రక్తం ఏర్రాగా మొహం మీద నుంచి షర్ట్ మీద తడుపుతుండగా తల మీద పడిన కర్రను వాడి చేతుల్లోంచి పీక్కొని , అదే వేగంతో నన్ను కొట్టిన వాని తల మీద కొట్టాను. పక్కనున్నోడు టయానికి వాన్ని పక్కకు పీకాడు నెత్తిన పడాల్సిన కర్ర వాడి బుజం మీద పడింది. ఆ దెబ్బకు వాడి బుజం జాయంట్ వేరయి వేలాడ సాగింది.
“నా కొడుకు , నా బుజం ఇరక్కోట్టాడు రే , నరకండి ” అంటూ పోలి కేక పెట్టాడు. వాడి కేకకు కారులోంచి నా వైపు చుసిన శాంతకు ఎర్రగా తడుస్తున్న నా షర్టు కనబడింది. అది చూసి డోరు ఓపెన్ చేసి బయటకు దూకి నా వైపు రాసాగింది. అటు వైపు అక్కడే ఉన్న మిగిలిన ఇద్దరు , శాంతా బయటకు రాగానే, లోనకు దూరి యశోదాచేయి పట్టుకొని బయటకు పికారు.

నా వైపు ఉన్న నలుగురు తన చేతుల్లోని కర్రలతో , కొడవళ్ళతో నామీదకు రాసాగారు. ఆ ఇరుకులో కర్ర తిప్పడానికి వీలు లేదు, ఎదురుగ్గా ఉన్న వాడి బుర్రను కర్రతో రెండుగా పగిలేతట్లు కొట్టి, వెనుక వాడి చేతి మీద బాదాను ఆ దెబ్బకు వాడి చేతులోని కొడవలి వదిలేసి “నియమ్మా రే , చేయి విరక్కోట్టాడన్నా ” అంటూ వెనకకు జారాడు. కర్రను పైకెత్తి ఎదురుగ్గా ఉన్న వాడిని కోడదామని మనసులో అనుకొంటూ వాడి వైపు కార్రను దింపాను , కాళ్ళ ముందు నక్షత్రాలు కనబడుతుండగా అలాగే నిలువునా పడిపోయాను. లీలగా యశోదాఅరుస్తున్న మాటలు వినబడసాగాయి మామా ఎక్కడి నన్ను తిసుకేలుతున్నావు అంటూ ఆ మాట వెంటే దూరం నుంచి ఆందోళనగా “శివా ……, శివా ..” అంటున్న శాంత గొంతు ఆ తరువాతా అంతా చీకటి అయిపొతుండగా స్ప్రుహ తప్పింది .

“ఏంట్రా నువ్వు పెద్ద పోటుగాడి ననుకొంటున్నావా , మేము ఇంత మంది వుండగా నువ్వు ఆ అమ్మాయిని ఎలా రక్షిస్తావు , అయినా మేము ఆ అమ్మాయిని తీసుక పోదామని వస్తే నువ్వు , నీకు సపోర్ట్ గా ఈ అమ్మాయి వస్తున్నారు ఏందీ కతా లవ్వా ?, ఇప్పుడు నిన్ను ఇక్కడే చంపేసి ఇద్దర్ని ఎత్తుకొని పోతాము చూడు” అంటూ తన వద్ద నున్న కర్రతో నా నెత్తి మీద కొట్టడానికి ఎత్తాడు.

ఆ కర్రకు నా రెండు చేతులు అడ్డ పెట్టి “శాంతా నువ్వు పారిపో , నేను వాళ్ళను అడ్డు కొంటాను ” అంటూ కళ్ళతో వాళ్ళను కిక్ చేస్తూ , చేతులతో వాళ్ళ చేతిలో ఉన్న కర్రను లాక్కోవాలని ప్రయత్నించాను.

“అయ్యే , చేతిలో బ్యాండేజి పికేసుకొన్నాడు , డాక్టర్ , ఇతనికి తెలివి వచ్చింది , త్వరగా రండి ” అంటూ కేకలేస్తున్న నర్స్ అరుపులకు మెలుకవ వచ్చింది. అప్పుడు జ్ఞాపకం వచ్చింది ఒక్కటొక్కటి. పక్కకు చుస్తే , ఏడుస్తున్న శాంతా , రమణి , రాజీ, రాజి వాళ్ళ అమ్మ వున్నారు. ” యశోదాఎక్కడ ? వాళ్ళు తీసికెళ్ళి పోయారా ? ” అంటూ బెడ్ మీద నుంచి లేవబోయాను. తలంతా రోడ్డు రోలర్ కింద పెట్టి క్రష్ చేసినట్లుగా వుంది. చేత్తో అక్కడ తడిమితే పెద్ద బ్యాండేజ్ కట్టి ఉంది.

“నువ్వు లేవకు తలకు 5 కుట్లు పడ్డాయి, ఓ వారం బెడ్డు రెస్టు అన్నాడు డాక్టరు, యశోద వాళ్ళ నాన్న, అన్నా అంతా చూసుకుంటారు. ” అంది శాంతా

“ఇంతకూ ఎవరు వాళ్ళు , ఎందుకు శారదాను ఎత్తుకొని పోయారు ? “
“అదంతా వాళ్ళ ఇంటి గొడవ , ఎత్తుకొని పోయిన వాళ్ళు ఎవరో కాదు , యశోదా వాళ్ళ నాయన చెల్లెలి కొడుకు యశోదాకు మేన మామ. తను శారదాను పెళ్లి చేసుకోవాలంట, యశోదావాళ్ళ ఇంట్లో వప్పుకోలేదు వాడికి వయసు ఎక్కవ అందుకు తీసికెళ్ళి దొంగ పెళ్లి చేసుకోవాలను కొంటున్నాడు. వానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కుడా సపోర్టు”
“ఇప్పుడు భయమంతా శారదాను పెళ్లి చేసుకొంటాడేమో నని”
“ఎత్తుకెళ్ళింది అందుకే గా తప్పకుండా చేసుకొంటాడు “
“చేసుకొంటాడు కాని 3 రోజుల తరువాత ముహూర్తం వుందట ఆ ముహూర్తానికి చేసుకొంటాను అని యశోదావాళ్ళ నాన్నకు ఫోన్ చేసి చెప్పాడు “
“పొలిసు కంప్లైంట్ ఇవ్వచ్చుగా”
“వీల్ల పరువు పోతుంది అని ఊరుకొన్నారు “
“మరి ఇప్పుడు ఎలా ? “
“నువ్వు ఊరుకో , వాళ్ళు వాళ్ళు తేల్చుకొంటారు. అది వాళ్ళ ఇంటి గొడవ”
“అది సరే , కాని శారదాను నా ముందర తీసి కేల్లారుగా , నేను యశోదావాళ్ళ నాన్నతో మాట్లాడాలి రమ్మనవా ?”
“నువ్వు రెస్ట్ తీసుకో నేను రమ్మంటాను ” అని అక్కడికి డాక్టర్ రాగా అందరు బయటకు వెళ్ళారు.

“డాక్టర్ ఎనీ కాంప్లికేషన్స్ ?”
“నథింగ్ యు అరె luckey, వాళ్ళు కొట్టి నప్పుడు కొద్దిగా ఫోర్సు అయినా తగ్గి ఉండాలి లేదా నీ బుర్ర గట్టిదన్నా అయి ఉండాలి , పైన బుర్ర మాత్రమె తగిలింది, కుట్లు మానాలి అంతే”
“నేను నా పనులు మాములుగా చేసుకోవచ్చా”
“ఆ చేకుకోవచ్చు కాని ఎక్కువ స్ట్రైన్ కాకు, ఈ టాబ్లెట్స్ వారం రోజులు రోజుకు 3 వేసుకో వారం తరువాత డ్రెస్సింగ్ విప్పెయచ్చు “
“ok డాక్టర్ , థాంక్స్ “. డాక్టర్ నర్సు వెళ్ళిన తరువాత శాంతా వాళ్ళు లోపలి వచ్చారు.
“మనము సాయంత్రం ఇంటికి వెళ్ళొచ్చు అంట, ఇంటికి వెళ్ళిన తరువాత యశోదావాళ్ళ నాయనతో మాట్లాడదాము ఇక్కడికి వద్దులే ”
“నేను ఇంకా చెప్పలేదులే , నిన్న అయన వచ్చాడు , నువ్వు స్పృహలో లేవు అందుకే తరువాత వస్తానన్నాడు ”
“ఇంతకీ మీరు ఎలా వచ్చారు , నన్ను ఎవరూ తిసికోచ్చారు ఇక్కడికి ?”
“నువ్వు పడిపోగానే వాళ్ళు శారదాను , రాజీ ను తీసికొని వెళ్లి పోయారు, నేను ఇంటికి ఫోన్ చేసి యశోదావాళ్ళ నాయనకు చెప్పను. ఆయన బండి తీసుకొచ్చి నిన్ను ఇక్కడ చెరిపించాడు. రాత్రంతా పెద్దాయనే ఉన్నాడు , మమ్మల్ని పొద్దున్నే రమ్మన్నాడు. అందుకే మేము పొద్దున్న వచ్చాము ” అంటూ జరిగింది చెప్పింది

మేము డిశ్చార్జ్ అయ్యే టయానికి యశోదావాళ్ళ నాయన వచ్చాడు. తన కారులోనే ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళిన తరువాత కొద్ది సేపటికి తను కారు వాళ్ళ ఇంట్లో పెట్టి రాజి వాళ్ళ ఇంటికి వచ్చాడు.
“ఇంతకీ ఏమి చేయాలను కొంటున్నారు పెద్దయ్యా ?, పొలిసు కంప్లైంట్ ఇద్దామా “
“పొలిసు కంప్లైంట్ ఇస్తే ఊర్లో పరువు పోతుంది, అందులోనా వాళ్ళు ఎవ్వరో కాదుగా , నా చెల్లెలి కొడుకు , వాడికి కొద్దిగా వయస్సు ఎక్కువ అయ్యింది, ఎ పనీ పాటా లేకుండా బేవార్స్ గా ఉంటాడు అని శారదాను ఇవ్వను అన్నా అది మనసులో పెట్టుకొని ఎత్తుకెళ్ళాడు, మొన్నాడు పెళ్లి చేసుకొంటాడు అంట నన్ను రమ్మన్నాడు”
“మరి మీకు ఆ పెళ్లి ఇష్టమేనా “
“ఇష్టం లేదు, నేను వెళ్లి వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడుతా , చుద్దాం ఎం జరుగుతుందో “
“వాళ్ళు కుడా పిల్ల గాని వైపే వున్నారు అంట గదా ? మీరు వెళితే మాత్రం ఏమి చేస్తారు , పెళ్లి చేసి వస్తారు అంతే గా , మీరు ఏమి అనుకోను అంటే నాదగ్గర రెండు మార్గాలు ఉన్నాయి “
“ఏంటి అవి చెప్పు “
“పొలిసు కంప్లైంట్ ఇవ్వడం పిల్లను కిడ్నాప్ చేసామని , పోలీసులతో వెళ్లి పిల్లను తెచ్చుకోవడం , రెండు వాళ్ళు ఎలా వచ్చారో అలాగా మనము వాళ్ళ ఇంటి మీద దాడి చేసి పిల్లను ఎత్తుకొని రావాడం”

147564cookie-checkకలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 6

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *