కలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 32

Posted on

తనేమో ఆ విగ్రహం తనకు బాగా పరిచయం ఉన్నట్లు దాని దగ్గరకు వెళ్లి కొద్దిగా ఎగా దిగా చూసి దాని వెనుక వైపు వెళ్ళింది. తన వెంట నేను కూడా ఆ విగ్రహం వెనక్కు వెళ్లాను.

ఆ విగ్రహం వెనుక ఓ మనిషి అటు ఇటూ తిరగడానికి వీలుగా ఉంది. వర్షా విగ్రహం వెనక్కు వెళ్లి కొద్దిగా తన చేతికి అందే ఎత్తులో విగ్రహం వెనుక వైపున అరచేత్తో గట్టిగా తట్టింది.

“వర్షా , ఎం చేస్తున్నావు ” అన్నాను తను ఎందుకు అలా చేత్తో తడుతుంది అర్థం కాక.

నా మాట వినకుండా మరో మారు గట్టిగా చేత్తో తట్టింది , ఆ విగ్రహం వెనుక ఎటువంటి మెకా నిజం ఉందొ తెలియలేదు కానీ తను మూడో సారి చేత్తో తట్టే సరికి ఓ చిన్న తలుపు ఓపెన్ అయ్యింది.

వర్షా ఆ తలుపు వెనుక చేతిని పెట్టి లోపల నుంచి గుడ్డలో చుట్టిన ఓ మూటను బయటకు తీసింది. తను ఒక చేత్తో తీయడానికి వీలు కాక రెండు చేతులు ఉపయోగించి ఆ మూటను బయటకు లాగింది.

దాదాపు 7 లేదా 8 కేజీల బరువు ఉన్నట్లు ఉంది , తనకు హెల్ప్ చేస్తూ ఆ మూటను తన చేతుల్లోంచి తీసుకొని కింద పెట్టాను. ఓ సారి లోపలికి తొంగి చూసి అందులో ఎమీ లేవని నిర్ధారణ చేసుకోన్నాక ఆ తలుపు తిరిగి అలానే మూసేసి నా పక్కకు వచ్చింది.
“ఇంతకీ ఎం ఉన్నాయి ఈ మూటలో ” అన్నాను తను వైపు చూసి
“నాకేం తెలుసు , నేను లోపలి ఎలా వచ్చానా కూడా తెలియడం లేదు నాకు , ఎదో శక్తి నన్ను ఇక్కడికి లాక్కొని వచ్చినట్లు వచ్చేశాను”

“విప్పి చూద్దామా , లేకుంటే పైకి వెళదామా”
“పైకి వెళ్ళడం ఎందుకు , ఇక్కడే చూద్దాం ” అంటూ ఆ మూటను విప్పడానికి సాయం చేసింది. ఓ దళసరి గుడ్డలో విడివిడిగా ఇంకో పలుచని బట్టలో చుట్టబడి ఉన్నాయి తాళ పత్ర గ్రంధాలు.

వాటిలో ఒక దాన్ని విప్పి లోపల చూశాము , అందులో ఏవో మనిషి బొమ్మలతో సంస్కృతం లో రాసి ఉన్నాయి , చూస్తుంటే అవి ఎ ఆయుర్వేద గ్రంధాలో ఉన్నట్లు ఉన్నాయి. విప్పిన దాన్ని తిరిగి పలుచని బట్టతో చుట్టెసి అక్కడే పెట్టాము. ఆ గ్రంధాల పక్కన గుండ్రంగా ఉన్న ఇంకో చిన్న మూట కనబడ్డ ది.

దాన్ని విప్పే సరికి అందులోంచి చేతి నిండుగా పెట్టేంత 5 నిగ నిగా మెరిసే రాళ్లు కనిపించాయి.
“ఇవి ఎం రాళ్లు , ఇంతగా మెరిసి పోతున్నాయి”
“సరిగ్గా తెలియదు , కానీ ఇవి ముడి వజ్రాలు అయ్యి ఉండవచ్చు వీటిని సాన పడితే కానీ ఎటువంటి వో తెలియదు, కానీ కచ్చితంగా విలువై నవే అయ్యి ఉంటాయి” అంటూ వాటిని తిరిగి అక్కడే పెట్టాము.

అందులో చూడడానికి ఇంక ఏమీ కనబడలేదు దొంతరలుగా పేర్చిన ఆ గ్రంధాలు తప్ప.
“వీటిని ప్రపంచానికి పరిచయం చేయడానికే నీకు గత జన్మ జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి , ఇందులో ఎదో ముఖ్యమైన విషయాలు ఉండే ఉంటాయి లేకుంటే నిన్ను తమ వైపుకు ఎందుకు ఆకర్షిస్తాయి.”
“ఏమో ఉండ వచ్చునెమో, కానీ నేను కూడా ఈ ప్రదేశం లో ఒకప్పుడు ఉన్నాను అనే ఆలోచనే గొప్పగా ఉంది”
“నిజమే , ఈ రాళ్లు విలువ మన లెక్క పెట్టడానికి వీలు కానంతగా ఉంటుంది, ఇవి చాలు నీ జీవితం టర్న్ కావడానికి.”
“ఇవి నేనే ఉంచుకోవచ్చు , వేరే ఎవరికీ ఇవ్వాల్సిన అవసరం లేదా
లీగల్ గా నీవే అవ్వాలంటే , నీవు ఈ రాజ వంశానికి వారసురాలి వి అని ప్రూవ్ చెయ్యాలి , కానీ నీ పూర్వ జన్మ గురించి చెప్పితే ఎవ్వరు నమ్మరు , ఒక వేల నమ్మినా అది లీగల్ గా వాలీడ్ కాదు.”
“అంటే మరి వీటిని ఎం చేద్దాం”
“ఏమో ప్రస్తుతానికి ఇక్కడ నుంచి బయట పడదాం , ఆ తరువాత వీటిని గురించి కలిసి ఆలోచిద్దాం” అంటూ ఆ మూటను యధా విధిగా కట్టి ఇద్దరం తన బెడ్రుం లోకి వచ్చాము.

“ఇక్కడ కొద్ది సేపు కుచోందాము” అంది వర్షా
“సరే ” అంటూ నా వెంట తెచ్చిన ఆ మూటను ఎంట్రన్సు లో పెట్టి కూచోవడానికి అనువుగా ఉన్న బండ మీద ఉన్న మట్టిని నా వంటి మీదున్న టవల్ తో విదల కొట్టి అక్కడ కుచోన్నాను.

తను నా పక్కనే వచ్చి కూచుని నా వైపు చూస్తూ
“థేంక్స్ , బావా అడగ్గానే నిద్రలో వస్తున్న కళలు గురించి ఎగతాళి చేయకుండా ఇంత దూరం మా వెంట వచ్చి , మా ఇద్దరినీ కాపాడుతూ వచ్చి నందుకు”
“అబ్బో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావే “
“ఎం , ఉన్న మాట చెప్తే వేళాకోళంగా ఉందా నీకు”
“వేళాకోళం కాదు , నీ నోట్లోంచి పెద్ద పెద్ద మాటలు వస్తుంటే ఆశ్చర్యంగా ఉంది అందుకే అలా అన్నా”
“ఇంకో ఆశ్చర్యమైన విషయం చేయనా ” అంటూ నా దగ్గరకు జరిగి నా పెదాల మీద ముద్దు పెట్టుకొంది క్షణం లో

తను చేసిన ఆ చర్య నుంచి తెరుకోంటు “ఏంటి అమ్మాయి గారికి అంత ధైర్యం వచ్చింది ఉన్నట్లు ఉండి “
“నా మొగుణ్ణి నేను ముద్దు పెట్టుకోవడానికి ధైర్యం ఎందుకు “అంటూ నా భుజం మీద తల ఆనించి.
“ఒహో నీ బెడ్రుం లోకి రాగానే ఎక్కడ లేని ధైర్యం , పెద్దరికం మాటలు నువ్వు పూర్తిగా మారి పోయావే”
“నేనేం మారలేదు, కానీ ఏంటో తెలియని ఆనందంగా ఉంది ఇది చుసిన తరువాత” అంటూ ఇంకా నాకు అతుక్కొని పోయింది.
“ఓయ్ , ఇంకా దగ్గరి కి వస్తే ఇక్కడే అన్నీ జరిగి పోతాయి , కొద్దిగా దూరంగా జరుగు.”
“జరగని , తప్పేముంది నా మొగుడితో నా బెడ్రుం లో ” అంటూ ఆ పై మాటల రాక తన మొహాన్ని నా మెడ వంపుల్లో దాపెట్టు కొంది.

152012cookie-checkకలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 32

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *