కలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ aయోధుడు) – పార్ట్ 21

Posted on

తనతో మాటలు ఎలా కలపాలా అని ఆలోచిస్తుంటే , అదృష్టం అందలం ఎక్కినట్లు వాళ్ళు కూచున్న టేబుల్ పక్కనే ఇంకో టేబుల్ లోకి అప్పుడే వచ్చిన అబ్బాయిల బాచ్ సెటిల్ అయ్యింది.

వచ్చిన అబ్బాయిలు కాలేజి బాచ్ కాదు , అది డామే జి బాచ్, చూస్తుంటే ఎదో మెకానిక్ షెడ్ లోంచి వచ్చి నట్లు ఉన్నారు , వచ్చి రాగానే కాలేజీ అమ్మాయిలను చూసి కామెంట్స్ పాస్ చేయడం మొదలు పెట్టారు.
రెస్టారెంటు చిన్నది కావడం వలన , అందులో నాతొ పాటు ఇంకో జంట మాత్రమే ఉండడం వలన వాళ్ళ కి బలం చేకూరి నట్లు అయ్యింది. దానితో వాళ్ళ గోల కామెంట్స్ నుంచి వెనక్కి తిరిగి అమ్మాయిల బాగ్లను టచ్ చేస్తూ ఎకి లి చేష్టలు చేయడం మొదలు పెట్టారు , వాళ్లను ఎవ్వరు ఎ మీ చేయలేరనే ఉద్దేశం తో.

వాళ్ళు ఆర్డర్ చేసిన ఫుడ్ రావడం వలన అది వదిలి వెల్ల లేక , వీళ్ళ కామెంట్స్ భరించ లేక ఇబ్బంది పడ సాగారు, చూస్తుంటే వచ్చిన వాళ్ళు ఎదో ట్రాన్స్ లో ఉన్నట్లు అల్లరి చేయసాగారు , వాళ్ళ చేసే చేష్టలు శ్రుతి మించు తుండగా , లాస్ట్ సిప్ టి కంప్లీట్ చేసి వాళ్ళు ఉన్న టేబుల్ దగ్గరకు వెళ్లి

“చేసిన అల్లరి చాలు , ఇక్కడ నుండి దొబ్బెయండి ” అన్నాను గట్టిగా . నా వాయిస్ కి రెస్టారెంటు లోని అందరూ ఉత్సాహంగా నా వైపు చూడ సాగారు , వాళ్ళ మొహాల్లో ఓ రకమైన సంతోషం తోనికిస లాడింది.

“ఇదే మన్నా నీ బాబు హోటలా, పెద్ద రు బాబుగా వెల్ల మంటున్నావు” అన్నాడు వాళ్ళల్లో బాగా దిట్టంగా ఉన్న వాడు
“మీరు మర్యాదగా అందరి లాగా ఉంటే , మిమ్మల్ని ఎవ్వరు వెల్ల మనే వాళ్ళు కాదు , కానీ మీరు చేసే చేష్టలకు మీరు ఇక్కడ సరిపోరు , నేను చూపిస్తా మీకు సరియైన ప్లేస్ “

“అయినా వాడితో మాటలు ఏంటి భయ్యా , బయటికి ఈడ్చేయక ” అన్నాడు దట్టంగా గడ్డం పెంచు కొన్న వాడు
“నువ్వు రా బాసు , వాడు ఎందుకు లే , నువ్వు ఈడ్చేస్తావు రా ” అంటూ అక్కడున్న కుర్చీ కొద్దిగా పక్కకు జరిపాను వాడు అక్కడ నుంచి లేవడానికి వీలుగా
“సాలే , నువ్వు మాటలతో చెపితే వినే ట్లు లేవు ” అంటూ వాడు తన కుర్చీ లోంచి లేచి తూలు కొంటూ నా వైపు రాసాగాడు. వాడు ఉగే ఊగటాలకు అక్కడే పడి పోతాడేమో అని పించింది. వస్తూనే “తేరి మాకి ” అంటూ నా మీద తన చేతిని విసిరాడు. ఆ చేతిని కుడిచేతితో బ్లాక్ చేస్తూ, ఎడం చేత్తో వాడి మొహం మీద ఓ పిడి గుద్దు గుద్ది , వాడి నడుం మీద ఓ సైడ్ కిక్ అప్లై చేసాను. ఎంట్రన్సు కు దగ్గరగా ఉండడం వలన ఆ సైడ్ కిక్ వేగానికి తలుపు లోంచి బయటకు వెళ్లి పడ్డాడు.

హోటల్ రోడ్డు కంటే కొద్దిగా ఎత్తులో కట్టారు, హోటల్ లోకి రావాలంటే 3 మెట్ల ఎక్కి రావాలి.

వాడు తలుపు లోంచి మెట్ల మీద పడి బాలన్స్ నిలబెట్టు కోలేక దొర్లు కొంటూ రోడ్డు మీద కు వెళ్లి సెటిల్ అయ్యాడు , ముక్కు మీద పడ్డ గుద్దు కు ముక్కు మొహం ఏకం కాగా , ముక్కులోంచి రక్తం కారి వాడి షర్టు అంతా తడి పెయ్య సాగింది.

అది చూసి వాడి పక్కనే కూచున్న వాడు “సాలే మేర దోస్త్ కు మారెగా ” అంటూ వాడు కూచున్న కుర్చీ ని పైకి లేపి నా మీద కు వచ్చాడు విసురుగా, వాడి చేతిలోని కుర్చీ నుంచి తప్పించు కొని కింద కు వంగి , కుడి కాలుని వాడి మోకాలు జాయింటు దగ్గర ప్రయోగించాను, ఎదో పచ్చి కొమ్మ విరిగిన శబ్దం తో పాటు “యా అల్లా , మరగయా రే ” అంటూ రోడ్డు మీ దున్న తన ఫ్రెండ్ ను చేరుకున్నాడు.

వాళ్ళు మొత్తం 5 మంది , మిగిలిన ముగ్గురు తమ మిత్రులకు పట్టిన స్థితి చూసి కోపంగా తమ కుర్చీ ల లోంచి బయటకు వచ్చారు , అక్కడే ఎటాక్ చేస్తే లోపల ఉన్న వాళ్ళకు దెబ్బలు తగులుతాయి అని , వాళ్ళ దోస్తులు సెటిల్ అయిన చోటుకు ఒక్క గెంతు లో చేరు కొన్నాను , నేను పారి పోతున్నాను అనుకోని “పకుడో సాలెకు ” అంటూ నా వెనుకే వచ్చారు.

స్టెప్స్ సన్నగా ఉండడం వలన ఒకడు తరువాత ఒకడు మన తెలుగు సినిమాలో హీరో తో ఫైట్ చేసే విలన్ బాచ్ లా వచ్చారు. ముగ్గురు వస్తే బరువు కానీ ఒకడు తరువాత ఒకడు రావడం వలన , వాళ్ళు కింద కు వచ్చి రాగానే వాళ్ళ ఫ్రెండ్స్ ని చేరుకున్నారు , ఒకడికి చెయ్యి భుజం నుంచి జారి పోయి , ఇంకొకరు పళ్ళు ఉడి పోయి , మూడో వాడు కి మని కట్టు దగ్గర విరిగి.

అక్కడున్న ఆటో వాడికి డబ్బు ఇచ్చి అందరినీ హాస్పిటల్ కు చేర్చు అని చెప్పి రెస్టారెంట్ లోకి వచ్చాను , నా బిల్ పే చేయడానికి.

“థేంక్స్ సర్ , యు హవె saved అస్ టుడే ” ఆ గుంపు లోని ఓ అమ్మాయి. ఆమెకు వంత పాడి నట్లు మిగిలిన వాళ్ళు కూడా థేంక్స్ చెప్పారు.
“వాళ్ళ తప్పే మీ లేదు సారు , వాళ్ళు మాములుగా రోజు వచ్చే వాళ్ళు , కానీ వాళ్ళు ఈరోజు ఎందుకో డిఫరెంట్ గా ఉన్నారు ” అన్నాడు కాష్ కౌంటర్ లో కూచున్న ఓ 50 ఏళ్ల వయసున్న వ్యక్తీ .
“వాళ్ళు మాములుగా లేరు , ఫుల్ గా ఎదో డ్రగ్స్ లో ఉన్నారు , అందుకే పూర్తిగా నిషా లో ఉన్నారు, ఈ డ్రగ్స్ తయారు చేస్తున్న వాళ్లను నిలువుగా రోడ్డు మీద నిలబెట్టి నరకాలి ” అన్నాను ,

“వాళ్ళు మా హోటల్ , కు ఎప్పుడు వస్తూ ఉంటారు సర్ , ఎప్పుడు ఇలా జరగ లేదు, మీరన్నట్లు ఎదో ట్రాన్స్ లో ఉన్నారు , అందుకే ” అంటూ క్యాషియర్.

“డ్రగ్స్ లో ఉంటే వాళ్ళు ఎం చేస్తున్నారో వాళ్ళకు తెలియదు , నిజమే ” అంటూ అక్కడ కూచున్న అమ్మాయిల్లో ఒకరు

అక్కడున్న వాళ్ళల్లో ఆ డ్రగ్స్ తయారు చేసే వాళ్ళ మీద ఓ రకమైన ఏహ్య భావం కలిగే ట్లు ఓ చిన్న లెక్చర్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్లి పోయాను.

మధ్యలో రుపాలి కి ఫోన్ చేసి , ఆ రోజు జరిగిన సన్నివేశం చెప్పాను. గుడ్ ఇలాంటి ఛాన్స్ ఇంకో టి దొరికితే , నెక్స్ట్ స్టెప్ మనకు ఈజీ అవుతుంది అంది. తన ఫోన్ పెట్టిన కొద్ది సేపటికి దీపాలి నుంచి ఫోన్ వచ్చింది. నేను ఫ్రీ గా ఉంటే సాయంత్రం తనతో షాపింగ్ కు రమ్మంది. నాకూ పెద్దగా పనులు లేక పోవడం వలన తనకు ok చెప్పాను.

సాయంత్రం 5.30 తనను ఫలానా ప్లేస్ లో పిక్ చేసుకోమనగా , వెళ్లి ఇద్దరం బైక్ మీద తన చెప్పిన మాల్ కు వెళ్ళాము , మేము బైక్ పార్క్ చేస్తుండగా మా పక్కనే ఆగిన కారును సైడ్ మిర్రరు ను బ్రేక్ చేస్తూ ఇంకో కారు వచ్చి డాస్ ఇచ్చి కంట్రోల్ కాక వెళ్లి పక్కనున్న గోడను గుద్దుకొని ఆగి పోయింది.

బైక్ ని పార్క్ చేసి వెళ్లి చూస్తే , ఆ ఆక్సిడెంట్ అయిన కారు లోంచి ఓ 25 వయసున్న కుర్రాడు దిగాడు తూలుతూ. పక్కనే ఉన్న ట్రాఫిక్ constable రాగా , అంతా ok గా ఉండడం తో మాల్ లోకి బయలు దేరాను.

ఇందాకా వాడు డాష్ ఇచ్చిన కారు లోంచి ఓ అబ్బాయి , పొద్దున్నే ఫైట్ చేసిన సమయం లో అక్కడున్న అమ్మాయిలలో ఒకరు దిగారు , నన్ను , రు పాలిని చూసి ఆ అమ్మాయి మా దగ్గరకు వచ్చింది.
“హలో సర్ , హాయ్ అక్కా ” అంటూ పలకరించింది

“ఏంటి నేహా తను నీకు ముందే తెలుసా ? అంది దీపాలి “
“ఈ రోజు పొద్దున్నే మమ్మల్ని హోటల్ లో కొందరు ఏడిపిస్తుంటే , సార్ వాళ్ళకు బాగా బుద్ది చెప్పారు “
“మంత్రి కూతురు , నీకు కూడా ఈ తిప్పలు తప్పవా ” అంది దీపాలి
“వాళ్ళు ఏవో డ్రగ్స్ తీసుకున్నారు, ఆ టైం లో అక్కడ ఎవ్వరున్నా వాళ్ళకు తేడా ఉండదు , వాళ్ళు కాదు మమ్మల్ని ఏడిపించింది , వాళ్ళు తీసుకొన్న డ్రగ్స్ ” అంది నేహా
“ఇప్పుడు మీ కారుకు ఆక్సిడెంట్ చేసిన వాడు కూడా డ్రగ్స్ మీద ఉన్నాడు , ఈ సిటి లో ఈ డ్రగ్స్ తయారు చేసే వాళ్ళు దొరకాలి వాళ్లను నిలువునా నరకాలని పిస్తుంది ” అన్నాను ఆవేశం గా

“నేహా, He is శివ నీకు చెప్పాను చూడు , నన్ను కిడ్నాపర్స్ భారి నుంచి రక్షించాడు , ఇతనే ఆ హీరో ” అంది నా చేతిని పట్టుకొని తనకు పరిచయం చేస్తూ.
“శివా ఈ అమ్మాయి, నేహా మా కాలేజిలో చదువుతుంది , మొదటి సంవత్సరం MBBS”
“మీ లాంటి వాళ్ళ వల్లే , ఈ డ్రగ్స్ సప్లై చేసేవాళ్ళను ఏమైనా చేయగలరు సర్ ” అంటూ తన పక్కన ఉన్న తన తమ్ముడ్ని పరిచయం చేసింది.

ఆ అబ్బాయి పేరు నిరేక్ , ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు హాస్టల్ లో ఉంటూ అని తను చదివే కాలేజి , హాస్టల్ పేరు చెప్పింది.

“నా ఒక్కడి వల్ల కాదు , మీ లాంటి వాళ్ళు కూడా ఓ చెయ్యి వెయ్యా లి ” అన్నాను అక్కా తమ్ముడి వైపు చూస్తూ

150522cookie-checkకలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ aయోధుడు) – పార్ట్ 21

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *