కలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ aయోధుడు) – పార్ట్ 21

Posted on

“ఏంటే , మీ నాన్ననే ఎదిరించి మాట్లాడుతున్నావు , ఎం చేసినా మీ కోసమే కదా “
“ఇలా , సంపాదించిన దానితో మేము చదివే దాని కంటే , చదవకుండా ఇంట్లో కూచోవడం బెటర్ “
“ఏంటే , నువ్వు చెప్పే ది “
“అమ్మా , మా కాలేజీ లో అందరు నన్ను దొంగను చూపినట్లు చూస్తున్నారు , నాన్న పెద్ద స్మగ్లర్ అని, సిటీ లో డ్రగ్స్ డిస్ట్రిబ్యూషన్ అంతా నాన్న చేతుల మీదుగా నే అని ఎక్కడ చూసినా అనుకుంటున్నారు”
“ఎవ్వరో ఎదో అంటే, నిజం కాదుగా , వాళ్ళ దగ్గర ఎటువంటి సాక్షాలు లేవుగా , అందుకే గవర్నమెంట్ ఏమి చేయ లేక పోతుంది”
“గవర్నమెంట్, కు సాక్షాలు కావలి నాన్నా , మీ మన సాక్షికి సాక్షాలు అవసరం లేదు నాన్నా , మాకు సాక్షాలు అవసరం లేదు, మీకు తెలుసు నిజం ఏంటో”
“సోదే ఆపుతావా , నేను వెళ్లి తమ్ముడ్ని తీసుకొని వస్తాను” అంటూ నేహా వాళ్ళ నాన్న ఇంట్లోంచి వెళ్లి పోయాడు.
“నేను కాలేజికి వెళుతున్నా” అంటూ నేహ ఇంట్లోంచి వెళ్లి పోయింది.

ఆ ఇల్లు ఎవరిదో కాదు , మాజీ అటవీశాఖా మంత్రి వంగ పండు సురేష్, అయన భార్య దేవి ప్రియ వాళ్ళ ఇద్దరి పిల్లలు నేహా , నిరేక్. పిల్లలంటే సురేష్ కి ప్రాణం వాళ్ళ కోసం ఏమైనా చేయడానికి రెడీ గా ఉంటాడు. కూతురు పుట్టినప్పుడు చిన్న మండల స్థాయి అపోజిషన్ కార్య కర్త , తన కూతురు పుట్టిన తరువాత అంచెలు అంచెలుగా ఎదిగి మునుపు అసెంబ్లీలో మంత్రిగా ఉన్నాడు. ఈ సారి అసేబ్లి ఎన్నికల్లో వీళ్ళ పార్టీ ఓడిపోవడం వలన మాజీ అయ్యి కూచున్నాడు. కానీ తను మంత్రి గా ఉన్నప్పుడు మొదలు పెట్టిన తన లాభసాటి బిజినెస్ ను అపలేకున్నాడు.

150522cookie-checkకలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ aయోధుడు) – పార్ట్ 21

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *