బ్లూ ఫిల్మ్ – Part 2

Posted on

“రండి అలా సోఫాలో కూర్చుందాం.” అందామె వెంటనే.
“నాకు ఈ పార్టీ వాతావరణం బాగా డిస్టర్బ్ చేస్తోంది. బయట లాన్ లో కాస్త ప్రశాంతంగా వుంటుందేమో.”
“పార్టీ డిస్టర్బ్ చేస్తోందా? ఓ చిన్న సలహా ఇవ్వనా?” అందామె కనుబొమ్మలు గమ్మత్తుగా పైకెత్తి.
ఆమె దగ్గరనుంచి చూస్తుంటే ఇంతకు ముందు ఆమెలో కనిపించని మరెన్నో ప్రత్యేకతలు కనిపిస్తున్నాయి.
మంచి వర్ఛస్సు వున్న మొహం.
“చెప్పండి___” అన్నాను.

“అదిగో ఒక లార్జ్ బ్రాందీ అందుకోండి. పెగ్ లోపలికి వెళ్ళగానే ఈ కోలాహలం ఇన్*స్పిరేషన్ కలిగిస్తుంది.”
“మందొద్దులెండి.”
“ఏం మీరు తాగరా?”
“ఐడోంట్ ఎంజాయ్ ఆల్కహాల్.”
“అన్న ప్రాశన రోజు ఆవకాయ పెట్టారనుకోండి. ఎంజాయ్ చేస్తారా? అంతే. దేనికైనా సమయం, సందర్భం, నియమం, స్టయిల్ వుండాలి. నా కంపెనీలో ఒక్క పెగ్ తీసుకోండి. యువిల్ లవ్ ఆల్కహాల్.”
“నోనో___”
ఆమె భుజాలెగరేసింది.

“మీ ఇష్టం అభినయ్ గారూ. మీరు ఆల్కహాల్ ని ఎంజాయ్ చెయ్యలేదు అంటే మీకు ఎంజాయ్ చేసే విధానం తెలీదనుకోవాలిగానీ, తప్ప ఆల్కహాల్ ది కాదు. అసలు జీవితంలో ఏదైనా మనం ఎంజాయ్ చెయ్యలేకపోతున్నాం అంటే తప్పు మనలోనే వుంటుంది.” ఉష మాట్లాడుతోంది.
నేను పూర్తిగా ఆమె మాటల మీద దృష్టి కేంద్రీకరించలేక పోతున్నాను.
ఆమె ముఖ కవలికలు నన్నెంతో ప్రభావితుడ్ని చేస్తున్నాయి.
ఆమె మొహంలో ఒక రకమైన గ్రేస్ వుంది.
బహుశా సెక్స్ అపీల్ అయ్యుండొచ్చు.
అందుకు కారణం ఆమె పెదవులు.
పై పెదవి కన్నా కింద పెదవి ఒకింత పెద్దది. అయినా నిండుగా చెక్కినట్లు వున్నాయి. పెదవుల చివర గమ్మత్తుగా ఒంపు తిరిగివుంది.
ఆమె నవ్వకపోయినా నవ్వినట్లు అనిపిస్తుంది.

అదీకాక ఆ పెదవుల విగింపులో రవ్వంత నిర్లక్ష్యం, కించిత్ డామినేషన్ కనిపిస్తోంది.
న్యాచురల్ షైన్ లిపిస్టిక్ అంటీ అంటనట్లు అద్దుకోవటంతో, చూపులు వేలుతో పెదవులపై సుతారంగా నిమిరి, సున్నితంగా ద్రాక్ష పండు నొక్కినట్లు నొక్కి స్లోగా నా పెదవులు ఆన్చి, చప్పరించాలని అనిపిస్తూంది.
ఐ బ్రోస్ షేప్ కూడా ఆ పెదవుల ఫార్మేషన్ కి తగినట్లు ఏదో ఆశ్చర్యాన్ని ప్రకటిస్తున్నట్లు ఆర్కే షేపుల్లో వున్నాయి.
హైచీక్ బోన్స్ వలన చెంపలు యాపిల్ ఆకారాన్ని పోలివున్నాయి.
బాగా లోనెక్ జాకెట్ కావటంతో, నాకెంతో ఇష్టమైన వృత్తాకారాలు సహానికి పైగా పలుచటి చీర మాటునుంచి స్పష్టంగా బ్రిస్క్ గా కనిపిస్తున్నాయి.
“పోనీ చిన్న పిల్లల్లా ఐస్ క్రీమ్ తిందామా?” అడిగిందామె.
“ఒద్దు. బ్రాందీ తెస్తాను…” అన్నాను వెంటనే.
ఆమె విస్మయంగా చూసి “చా…!” అంది.
నేను లేవబోయాను. ఆమె నా చెయ్యి పట్టుకుని కూర్చోపెట్టి, నేనున్నానుగా అని కళ్ళతోనే ప్రకటించి, లయబద్ధంగా నృత్య గమనంతో వెళ్ళి కాక్*టెయిల్ టేబిల్ దగ్గరికి చేరుకుంది.
ఆ హాల్లో ఎవరూ ఎవరినీ గమనించే స్థితిలో లేరు.
ప్రముఖుల పరిచయాలు వాటిని పటిష్ట పరుచుకునే హిపోక్రసీలు, డిప్లమసీలు, కోలాహలం, సందడి.

“తీసుకోండి�” అంది ఉష, ఒక గ్లాసును నాకు అందిస్తూ.
“అదేమిటి మీరు థమ్స్ అప్ తీసుకుంటున్నారా?”
“ష్…ఇది రమ్…చూసేవాళ్ళకి కూల్ డ్రింక్ లా వుంటుంది. ఇందులో థమ్స్ అప్ కలిపాను. మీకు బ్రాందీలో సోడా అలవాటేగా!” అందామె ప్రక్కన కూర్చుంటూ.
ఈసారి బాగా దగ్గరికి కూర్చుంది.
“అలవాటేం లేదు జస్ట్ ఎనీథింగ్…” అంటూ దిగబోయాను.
“ఆగండాగండి. ఛీర్స్…” తన గ్లాసు నా గ్లాసుకి తగిలించింది.
“చీర్స్” అన్నాను.

“చూడండి. కొంచెం కొంచెం సిప్ చేయండి. మాట్లాడుతూ వుండండి. లేదా నేను మాట్లాడేది శ్రద్ధగా వినండి. ఆత్రంగా అందుకునేదేదయినా రుచిగా వుండదు. స్లో. స్టెప్ బై స్టెప్. డ్రాప్ బై డ్రాప్…” నవ్విందామె.
ఆమె ఎన్నో రకాలుగా నవ్వగలదని అర్ధమయ్యింది.
సిప్ చేయకముందే కిక్ ఇస్తున్నట్లుంది ఆమె నవ్వు.
సిప్ చేసాను.
“మీరేం చేస్తుంటారు?”
“ఏమీ చెయ్యను…”
“అబద్ధం! నేను చెప్పనా మీరేం చేస్తుంటారో!” అందామె.
“చెప్పండి�”

“చూపులతో అందాల పరదాలు తొలగించి, తాకకుండానే శృంగార తాండవం చేస్తుంటారు” అందామె గోముగా.
శరీరంలో అతి సున్నితమైన భాగాన్ని నాలుక కొనతో టికిల్ చేసినట్లు ఒళ్ళంతా ఝల్లుమంది.
“నా మీద నిందలేస్తున్నారు” అన్నాను.
“నిందకీ, అభినందనకీ తేడా తెలీదని అనుకుంటానని అనుకుంటున్నారా?”
నా నోట మాట రాలేదు.
“మీరూ హైద్రాబాదేనా?”
“ఆఁ�”
“మద్రాస్ వచ్చేయకూడదూ?”
“మీది మద్రాసా?”
“కాదు. ప్రస్తుతం అదీ నా అడ్రస్. ఈ క్షణం బొంబాయిలో వున్నాను. మళ్ళీ మద్రాసు వెళ్ళిపోతాను.”

“మీరేం చేస్తుంటారు?”
“సినిమాల్లో నటించే భాష రాని అమ్మాయిలకి నా గొంతు అరువు ఇస్తుంటాను…”
“డబ్బింగ్ ఆర్టిస్టా?” ఆశ్చర్యపోయాను.
“ఔదామని ప్రయత్నం. చాలా కాంపిటేషన్ వుంది. చిన్న చిన్న పాత్రలకు చేస్తుంటాను…”
“అదే మీ సంపాదనా?”
“కాదు…”
“మరి?”
“మీలాంటి వాళ్ళెవరయినా నాలో ఏదో ఉందని ఆశపడితే____వాళ్ళనుంచి గిఫ్ట్ గా డబ్బు తీసుకుని, కంపెనీ ఇస్తుంటాను.”
“ఇదే విషయాన్ని కాస్త మొరటుగా చెప్పండి” అన్నాను వెంటనే.
“కాల్ గర్ల్ అనుకుంటున్నారు కదూ? కాదు. నేను నా శరీరాన్ని అంత సులభంగా అందరికీ అందించను! అందినట్లు అంది, అందబోతున్నట్లు భ్రమ కలిగించి�”
“ఛీ…” అప్రయత్నంగా నా నోట ఆ పదం వెలువడింది.
అమె ఉలిక్కిపడి చూసింది నా వైపు.
నేనూ ఉలిక్కిపడ్డాను.

130311cookie-checkబ్లూ ఫిల్మ్ – Part 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *