బ్లూ ఫిల్మ్ – Part 2

Posted on

“ఇన్నాళ్ళకి నీ కళ్ళల్లో మెరుపు కనిపించింది. ఎందుకబ్బా అని గమనిస్తే నీ చూపు ఎటువైపు డైవర్ట్ అయ్యిందో చూసి షాక్ అయ్యాను—” అన్నాడు సుభాష్.
“షాక్ అవ్వడానికేముంది? అందమైన ఆడది కనిపించింది. చూస్తూ వుండిపోవాలనిపించింది. చూస్తున్నాను. అంతే!” అన్నాను.
పెదవి విరిచాడు సుభాష్ వ్యంగ్యంగా.
“నీ ఖర్మ!” అన్నాడు.
“దేనికి?”
“నీ కంటికి ఎవరో అదృష్టవంతురాలు నచ్చింది కదా, పెళ్ళి విషయం మాట్లాడేద్దాం అనుకున్నాను. తీరా చూస్తే, అది!” అన్నాడు.
“ఏయ్! అది ఏమిట్రా అది! ఆడదేమైనా పశువనుకున్నావా? అదీ ఇదీ అంటున్నావు? గివ్ రెస్పెక్ట్…” అన్నాను.
“ఓరి నాయనోయ్! యు ఆర్ వెరీ పొసెసివ్! ఆమె గురించి వింటే కళ్ళు తిరిగి పడిపోతావ్?” అన్నాడు సుభాష్.
“పెళ్ళయి పోయిందా?” సింపుల్ గా అన్నాను.

“ఆవిడకు పెళ్ళెందుకు నాయినా? పెళ్ళొక్కటే కాలేదు. మిగతావన్నీ ఐపోయాయి.” అన్నాడు వ్యంగ్యంగా.
“సో వ్యాట్? నీకు కాలేదా? నాకు కాలేదా? మగాడికి పెళ్ళి కాకుండా పరస్త్రీతో సంబంధం వుంటే అదేదో ఘనకార్యం! అదే ఆడదానికి వుంటే తప్పా? ఇడియాటక్! ప్రేమారిడల్. ఎక్సట్రా మారిటల్ రిలేషన్*షిప్స్ గురించి నీలాంటి చదువుకున్న వాళ్ళు కూడా ఇంత పక్షపాత ధోరణిలో ఆలోచించడం….వెరీ బ్యాడ్!” అన్నాను.
ఆశ్చర్యంగా చూశాడు సుభాష్.
“మైగాడ్! నువ్విలా కూడా ఆలోచిస్తావని నాకు తెలీదే! వండ్రఫుల్! ఐతే నీకు ఆమెను ఖచ్చితంగా పరిచయం చెయ్యాల్సిందే! ఆమె మాటలు వింటే నువ్వు ఆమె భక్తుడవైపోతావ్! మహా తెలివైన ఆడది” అంటున్నాడు సుభాష్.
అదే క్షణంలో ఎవరో వాడ్ని పలకరించారు.

టాపిక్ డైవర్ట్* అయిపోయింది.
ఆ తర్వాత కేక్ కట్ చెయ్యటం, అతిధులంతా చప్పట్లు కొట్టటం, జన్మదిన శుభాకాంక్షలు చెప్పటం, కానుకలు ఇవ్వటం ఇవన్నీ జరిగిపోయాయి.
సుభాష్ అన్నమాట ప్రకారం ఆమెను పరిచయం చేసాడు.
గమ్మత్తుగా.
“హలో మిమ్మల్నే…ఒకసారిలా వస్తారా?” అని సడెన్ గా పిలిచాడు సుభాష్ ఆమెను.
ఆమె తలతిప్పి చూసి, కళ్ళు అంతంత చేసుకుని…. “హల్లో మిస్టర్ సుభాష్. హైద్రాబాదులోనే వున్నారా?” అంటూ దగ్గరకొచ్చేసింది.
“ఆఁ…అదిసరే…మీకు ఈ పార్టీలో ఒక అద్భుతమైన వ్యక్తిని పరిచయం చెయ్యాలనుకుంటున్నాను.”
“ఈజిట్? ఎవరబ్బా అది! మీ గర్ల్ ఫ్రెండా? ఉడ్ బీ యా?” అందామె.
నా గుండె వేగంగా కొట్టుకుంది.
కొంతమంది గొంతులు అలా వుంటాయి.
కిక్ ఇచ్చేలా.

కోయిల గొంతులా వుండదు.
ఒక రకమైన కైపు నిండి వుంటుంది.
దానికి తోడు ఆమె మాట్లాడ్తే ఉచ్ఛారణా సౌందర్యం విశేషంగా ఆకట్టుకుంటోంది.
చక్కటి హావభావాలు.
వాయిస్ ఫ్రీక్వెన్సీ.
స్టయిల్ గెస్చర్స్ పంచ్.
నా చూపులు ఆమె గుండెల మీదకి అప్పటికే పది పన్నెండుసార్లు పాకి తప్పుకున్నాయి.
“నా గర్ల్ ఫ్రెండ్ ని మీకెందుకు పరిచయం చేస్తాను? మీకు ఇంట్రెస్టింగ్ గా వుండే బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేస్తాను…” అని నా వైపు తిరిగి…
“ఒరేయ్! ఇలారా?” అని పిలిచాడు.

ఆమె నావైపే చూస్తోంది.
రెప్ప వాల్చకుండా.
అదో గొప్ప కళ.
చూపులతో మనసుని ఉరితీయటం తెలిసిన కళ్ళకు మాత్రమే సాధ్యమైన హంటింగ్ అండ్ హాంటింగ్ ట్రెండ్.
“దిసీజ్ మై ఫ్రెండ్ అభినయ్”
“హాయ్__” అన్నాను.
“షీ ఈజ్ ఉషా…ది అదర్ నేమ్ ఫర్ నిషా!” నవ్వుతూ అన్నాడు సుభాష్.
“యూ సిల్లీ షటప్…” అంది మూతిని సున్నాలా చుట్టి, చిరుకోపంతో. అప్పటికే ఆమె మొహంలో సవాలక్ష భావప్రకటనలు.
అంతలో “హలో మిస్టర్ సుభాష్ కై సే హై” ఎవరో అరిచారు.
“హల్లో” అని చెయ్యి వూపి—ఉష వైపు దిరిగి__
“మీకు మా వాడినెందుకు పరిచయం చేస్తున్నానో తెలుసా? ఒంటరితనం శాపం కాదు వరం అని భావించే మూర్ఖత్వం నుంచి వాడిని బైటకి పడేయగల శక్తి మీకుందని__” అంటూ నవ్వి—
“ఆల్ ద బెస్ట్ అభి…” కొంటెగా నవ్వుతూ అన్నాడు నాతో.
“అరే. మీరెక్కడికెళ్ళిపోతున్నారు…” కంగారుగా అరిచింది ఉష.

అప్పటికే సుభాష్ పార్టీ కలకలంలో కలిసిపోయాడు.
“అయాం సారీ. వాడు లేకుండా ఇక్కడ మీకుండడానికి ఇబ్బందైతే__మనం తర్వాత కలుసులుందాం లెండి” అన్నాను.
ఆమె భృకుటి ముడిపడింది.
“అదేం లేదు లెండి. మొక్కుబడి తీర్చుకున్నట్టు మనని కలిపేసి జారుకుంటుంటే కలవరపడ్డానంతే” అందామె.
నేనేమీ మాట్లాడలేదు.

130311cookie-checkబ్లూ ఫిల్మ్ – Part 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *