బ్లూ ఫిల్మ్ – Part 15

Posted on

నేను ఆమెకు కనిపించకుండా రెండడుగులు వెనక్కి వేసాను.
“అతనితో గడుపుతూంటే ఎలా వుంటుందో తెలుసా?” అంటూ వుండగానే.
“నువ్వెన్ని చెప్పు ఉషా, నాకు నీ ఆలోచన నచ్చలేదు. దయచేసి ఆ టాపిక్ ఎత్తొద్దు… ప్లీజ్…” అంది సంధ్య.

“నా ఇష్టం నేను మాట్లాడతాను. నేను చెప్పేది నువ్వు వినితీరాలి. అసలు పనికి ఒప్పుకుంటావో లేదో అది నీ ఇష్టం. పుస్తకంలో సెక్స్ చదివి, మాటలు విని మనుషులు చెడిపోతారని నేననుకోవటం లేదు సాండీ. భయం పోతే, పాపభీతి పోతే, ఈ కట్టుబాట్ల వల్ల వుండే పిచ్చి భయాలు పోతే___నేను చెప్పేది నీకెంతో నచ్చుతుంది. అబ్బ— నీ పొట్ట, బొడ్డు చూస్తుంటే ఆడదాన్ని నాకే మతిపోతోంది సాండీ. ఒక్కసారి నిన్ను అభినయ్ నగ్నంగా చూస్తూ వుంటే చాలు—వదిలిపెట్టడు. అలాగే యాక్షన్ లో వున్నప్పుడు అభినయ్ ని చూడాలి. సెక్స్ లో అన్నిటికన్నా గొప్ప విషయం ఏమిటో తెలుసా? ఆడదాని శరీరం మీద ఒక టైమింగ్ తో, ఒక రిథమ్ తో, ఒక బీటింగ్ తో కదలటం, అందులో అభినయ్ ఈజ్ గ్రేట్!” అంటోంది ఉష.

నాలో కొన్ని ప్రత్యేకతలున్నాయని నాకు తెలీదు.
కేవలం నా బిగ్ షాట్ యొక్క గడుసుతనాన్ని, నా శరీరపు గట్టితనాన్ని, నా ఒంటిమీద వున్న రోమాలని ఉష ఇష్టపడుతోందని ఇన్నాళ్ళూ అనుకున్నాను గానీ నేనేదో సెక్స్ లో అంత అద్భుతంగా వుంటానని నాకు తెలీదు.
నేను మళ్ళీ నా గదిలోకి నడిచాను.

ఫ్రిజ్ దగ్గరకెళ్ళి మరొక్క లార్జ్ విస్కీ, ఈసారి రెండు ఐస్ క్యూబ్స్ వేసుకుని, వాటిని కొద్దిగా కరగనిచ్చి రెండు గుక్కల్లో తాగేసాను.
కొద్దిగా తల బరువు తగ్గి, రిలీఫ్ గా వుంది.
మెల్లిగా గదిలోంచి బయటికొచ్చాను.
మెట్లు దిగాను.
ఉష, సంధ్య నన్ను చూసారు.
“హాయ్ డాళింగ్! కోపం పోయిందా?” అంది ఉష నవ్వుతూ.

“నాకు దేనికి కోపం. నీ పిచ్చి మాటలని లెక్క చేసేవాళ్ళెవరూ లేరిక్కడ. పట్టించుకోనప్పుడు కోపం ఎందుకొస్తుంది” మెల్లిగా అటు అడుగులు వేస్తూ అన్నాను.
సంధ్య నా వంక చిరునవ్వుతో చూసింది.
“చాలా బాగా చెప్పారు. చూసావా ఉషా! నీకు రవ్వంత పిచ్చి వుందని ఆయన కూడా ఒప్పుకున్నారు” అంది సంధ్య.
“ఎంతయినా మీ ఇద్దరి అభిప్రాయాలు ఒకటేనమ్మా. అసలు ఒకే అభిప్రాయం వుండే ఇద్దరి మనుషులు ఒక్కటయితే ఎంత మజా వస్తుందో?”
మళ్ళీ అదే టాపిక్ దగ్గరకొచ్చింది ఉష.
నేను వెంటనే టాపిక్ మార్చడానికి ప్రయత్నం చేసాను.

“ఉషా! ఇంటికొచ్చిన అతిధి చేత వంట పనులు చేయించటం ఏం బాగోలేదు. ఇంటినిండా నౌఖర్లుండేవారు. అందరినీ అనవసరంగా మాన్పించేసావ్?” అన్నాను డైనింగ్ టేబిల్ ముందు కుర్చీలో కూర్చుంటూ.

“ఏయ్ సాండీ, చూసావా మా ఆయన ఎలా బాధపడిపోతున్నారో. చెప్పానుగా అభినయ్ చూపు నీమీద పడింది. నువ్వెక్కడ కందిపోతావో అని తెగ ఇదై పోతున్నాడు. అభినయ్! నేనేమీ సంధ్యని పని చెయ్యమనలేదు. నీకు కావాలంటే ఆమె చెయ్యి పట్టుకుని ఇక్కడనుంచి తీసుకుపో. పది నిముషాల్లో వంట ముగించి, మీ ఇద్దరినీ భోజనానికి పిలుస్తాను” అంది ఉష అనర్గళంగా.

నా నోట మాట రాలేదు.
“అదేంటి ఇద్దరూ ఏకకాలంలో అలా సైలెంట్ అయిపోయారు?” అంది.
“నీతో ఏం మాట్లాడినా తంటాయే కాబట్టి” అన్నాను.
“ఒట్టి మాటలతో టైం ఎవరు వేస్ట్ చేయమన్నారు? సంధ్య బుగ్గలు చూడు. నాకయితే కొరుక్కుతినేయాలనిపిస్తోంది!!”
“ఏయ్!” గట్టిగా అరిచింది సంధ్య.
ఫకాలున నవ్వేసి అక్కడనుంచి బాత్ రూం వైపు పరుగెత్తింది ఉష.
నేను, సంధ్య ఇద్దరం ఒకరి మొహంలోకి ఒకరు చూసుకున్నాం.
“సారీ సంధ్యాజీ! మీరేమీ అనుకోకండి. ఉష మాటలని మనం సీరియస్‌గా తీసుకోకూడదు” అన్నాను వెంటనే.
నేను పలకరిస్తానని అనుకోలేదో ఏమో.
కొద్దిగా తడబడింది.

“ఆఁ ఆఁ… నేను మీకు అదే చెప్పాలని అనుకుంటున్నాను… మొదటినుంచి ఉష ఆలోచనా విధానం ఇంతే. ఏమాత్రం మొహమాటం వుండదు” అంది సంధ్య.
“యు ఆర్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్‌ జీ. ఇదొక్కటి తప్ప మిగతా అన్నీ విషయాలలోనూ ఉష చాలా మంచి పిల్ల, ఇంత మంచి భార్య దొరకటం నా అదృష్టమే. ఇదిగో ఈ పిచ్చి వాగుడు కట్టిపెట్టి, ఏం చేసినా బాగానే వుంటుంది. నాకేం తక్కువ. ఎన్ని లక్షలు కావాలంటే అన్ని తెచ్చి ఉష ఒళ్ళో పోయగలను. కొండమీద కోతినయినా దింపగలను. ఆమె కోసం ఏమయినా చెయ్యగలను. ఆమెతో గడిపే ఒక్కొక్క క్షణం మరపురానిది. కానీ ఆమెకు ఎప్పుడు ఏ ప్రమాదకరమైన ఆలోచనలు వస్తాయో అని…” అంటూ ఆగిపోయాను.
అందుకు మూడు కారణాలు.

ఒకటి నామీద విస్కీ ప్రభావం చూపిస్తుందేమో, కొద్దిగా ఎక్కువగా మాట్లాడుతున్నానని నా కర్ధం కావటం.
రెండు, సంధ్య ముందు ఉషని అంతగా పొగుడుతూ వుంటే స్త్రీ సహజమైన ఇగో ఆమెలో తలెత్తి ఆమె నా వంక అదోలా చూసిందేమో అనే అనుమానం కలగటం.
మూడు అదే క్షణంలో బాత్ రూంలోంచి ఉష బైటికి రావటం.
మామూలుగా కాదు నగ్నంగా.
చాలా చక్కటి శరీర సౌష్టవం.
దానికితోడు ఆమె మహోన్నత వక్ష శిఖరాలు.
అదిరిపడి లేచి నిల్చున్నాను నేను.
సంధ్య కూడా.

“ఏయ్ ఏమయ్యింది? మీ రిద్దరూ ఏకకాలంలో లేచి నిల్చున్నారు” అంది ఉష ఏమీ ఎరుగని దానిలా.
“నీ అవతారం చూసి…”
“నా అవతారానికేం? నేను నౌఖర్లని మాన్పించింది ఎందుకు? ఈ ఇంట్లో ఇలాగే నగ్నంగా వుండాలని ఎప్పుడయినా అనిపిస్తే అలా వుండడం కోసం!” అంది ఉష.
నా చూపు ఆమె పొట్టమీద, బొడ్డుమీద, పిరుదుల మీద, పుస్సీక్యాట్ మీద పడి, ఏదో వెచ్చటి భావన కలిగిస్తోంది.

“ఓకే ఉషా! మీ ఏకాంతానికి నేను భంగం కలిగించినందుకు సారీ! నేను వెళ్ళొస్తాను” అంది సంధ్య కోపంగా.

130570cookie-checkబ్లూ ఫిల్మ్ – Part 15

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *